nuzividu
-
నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు ఈ నెల 22 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ నేతృత్వంలో కౌన్సెలింగ్ జరగనుంది.ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లోను, 24, 25 తేదీల్లో ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోను, 26, 27 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ జరగనుంది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. -
నూజివీడులో పోలీసుల సమక్షంలో పట్టపగలే దారుణం
ఏలూరు, సాక్షి: రాష్ట్రంలో టీడీపీ అరాచక పాలన ఆరంభం కాకమునుపే.. దమనకాండకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులపై, సానుభూతిపరులపై రాజకీయ ప్రతీకార చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు కొనసాగుతుండగా.. తాజాగా నూజివీడులో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. గెలుపు మదంతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు నూజివీడు టౌన్ పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో కత్తులతో వైఎస్సార్సీపీ నేత మీద దాడికి దిగారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ నడకుదుటి గిరీష్‌పై దాడి చేశారు. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొందరు ధైర్యం చేసి ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ ఘటనలో గిరీష్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. అడ్డుకునే ప్రయత్నాలేవీ చేయకపోవడం ఘోరం. పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: టీడీపీ వేధింపులకువైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బలి -
టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై
సాక్షి, ఏలూరు జిల్లా: టీడీపీకీ ముద్రబోయిన వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారు. నూజివీడు టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ పోస్టర్లను ముద్రబోయిన పీకిపడేశారు. టీడీపీ తనను దారుణంగా మోసం చేసిందని, చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా. చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బతికించా. పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా. కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా.. నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు. పార్టీ కష్ట కాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు. నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు. ఈ రోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు’’ అని ముద్రబోయిన ధ్వజమెత్తారు. నేను ఏం తప్పుచేశానో చెప్పమంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, యనమల సమాధానం చెప్పలేకపోయారు. నాలుగైదు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెల్లడించారు. -
17న నూజివీడుకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న నూజివీడుకు వెళ్లనున్నారు. అసైన్మెంట్భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారాయన. ఈ కార్యక్రమంలో 2003కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడంతో పాటు కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ జరగనుంది. ఇదీ చదవండి: బాబు– దత్తపుత్రుడికి సిగ్గు లేదు: సీఎం జగన్ -
సీన్ రివర్స్.. చంద్రబాబుకు వార్నింగ్.. అలా చేయకపోతే తోకలు కత్తిరిస్తాం..
తోకలు కత్తిరిస్తానంటూ అందరినీ బెదిరించడం చంద్రబాబుకు బాగా అలవాటు. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పచ్చ పార్టీ పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. తమ ఇన్‌చార్జ్‌ను మార్చకపోతే మేమే తోకలు కత్తిరిస్తామంటూ అక్కడి నాయకులు చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారట. బయటినుంచి తమ మీద పెత్తనం చేస్తున్న వ్యక్తికి కాకుండా లోకల్ లీడర్‌కే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉండగానే టీడీపీ బాస్ చంద్రబాబుకు ఏలూరు జిల్లా నూజివీడు తమ్ముళ్లు చుక్కలు చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ సీటు స్థానికులకే ఇవ్వాలన్న డిమాండే దీనికి కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం నూజివీడు ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్టీలోను.. ఇటు ప్రజల్లోనూ ఆదరణ లేక ఓటమిని తనఖాతాలో వేసుకోవాల్సివచ్చిందని టాక్. రెండుసార్లు ఓడిపోయిన నేత మూడోసారైనా గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉండగా.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్‌ను, నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పట్నుంచో నూజివీడు టీడీపీకి ఆయువుపట్టుగా ఉన్న క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారట. ముఖ్యంగా నూజివీడు పార్టీలో సీనియర్ నేత కాపా శ్రీనివాసరావుకు.. ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో కాపా వర్గాన్ని ముద్రబోయిన తరచూ టార్గెట్ చేస్తున్నారట. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్రకు మద్దతుగా కాపా శ్రీనివాసారావు వర్గం పాదయాత్ర చేపట్టింది. నియోజకవర్గ ఇంఛార్జి ముద్రబోయిన లేకుండానే పాదయాత్ర చేపట్టినందుకు కాపా వర్గానికి చెందిన నూజివీడు మండల నేతలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ పరిణామాలతో కాపా శ్రీనివాసరావు వర్గం ముద్రబోయినపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాపా వర్గం తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి నేరుగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పంచాయతీ పెట్టిందట. ఆ సమయంలో చంద్రబాబు తన సహజధోరణితో.. మీ సంగతి చూస్తా...అంతు తేలుస్తా..అంటూ హెచ్చరించడంతో వెళ్లినవారంతా షాక్ తిన్నారట. సమస్య చెప్పుకోవడానికి వెళితే బెదిరిస్తారా అంటూ రగిలిపోతున్న కాపా వర్గం ముద్రబోయిన కావాలో తాము కావాలో తేల్చుకోవాలంటూ, అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చేందుకు ఓ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలియగానే మొన్నటి వరకూ డోంట్ కేర్ అన్న అధిష్టానం బుజ్జగింపుల కోసం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుని రంగంలోకి దించింది. ఓ మూడు గంటలు పాటు బ్రతిమిలాడిన తర్వాత.. మూడు రోజులు గడువిస్తామని.. ఈలోగా తమ డిమాండ్లకు సానుకూల నిర్ణయాలు రాకపోతే..తమ నిర్ణయం ఏంటో ప్రకటిస్తామని కాపా శ్రీనివాసరావు పార్టీ నాయకత్వానికే డెడ్ లైన్ పెట్టారట. చదవండి: పాదయాత్రలో లోకేష్‌కు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ ఇదిలా ఉంటే నూజివీడు ఇన్చార్జ్గా అధిష్టానం ఎవరిని సూచించినా ఆ నేతకు మద్దతిస్తామని.. కానీ ఆ వ్యక్తి ముద్రబోయిన కాకుండా స్థానికుడే అయిఉండాలని పట్టుబడుతున్నారట కాపా వర్గం నేతలు. ఏ సామాజిక వర్గానికి చెందిన నేత అయినా స్థానికుడైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ముద్రబోయిన కాకుండా ఎవరైనా ఓకే అని స్పష్టం చేస్తున్నారట. తమ డిమాండ్‌ను కాదని ముద్రబోయినకు టిక్కెట్టిస్తే మాత్రం తేడాలొచ్చేస్తాయనే బలమైన సంకేతాన్ని పంపించారట. ఇప్పుడు నూజివీడులో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పసుపు పార్టీలో తీవ్రస్థాయి చర్చకు దారితీసాయి. వారి డిమాండ్‌కు తలవొగ్గితే అన్ని చోట్ల నుంచి అటువంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మరో రకంగా సమస్య వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా సమస్యగానే కనిపిస్తోందంటూ చంద్రబాబు తల బాదుకుంటున్నారని టాక్. -
నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత బీ.టెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఆయన అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైనవారి జాబితాను జూలై 13న విడుదల చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోటాను 3 నుంచి 5 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు చేపడతామన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారు మాత్రమే ఈ కోటాలో అర్హులని చాన్సలర్ తెలిపారు. పీహెచ్సీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ తదితర ప్రత్యేక కేటగిరీ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను నూజివీడు ట్రిపుల్ ఐటీలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. ఒక్కో క్యాంపస్‌లో ఉన్న వెయ్యి సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో వంద సీట్లు కూడా భర్తీ చేస్తామన్నారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తామని తెలిపారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ కోటాలో చేరినవారు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైనవారికి జూలై 21, 22 తేదీల్లో, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్‌కు కన్వీనర్‌గా ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజును నియమించినట్లు తెలిపారు. -
చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి.. మహిళలకు విద్యుత్ షాక్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాబు సభకు వచ్చిన మహిళలకు విద్యుత్ షాక్ తగిలింది. చంద్రబాబు రాగానే జెండాలు పైకెత్తమని టీడీపీ నేతలు వీరికి సూచించారు. అయితే ఆ జెండాలు విద్యుత్ తీగలకు తగలడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో 9 మంది మహిళలు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. బాబు సభలో జనం కన్పించేందుకు ఒక్కో మహిళకు రూ.300 ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు వీరిని తీసుకొచ్చారు. మహిళలు విద్యుత్ షాక్‌కు గురయ్యారని తెలిసి కూడా చంద్రబాబు వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో డబ్బులు ఇస్తామని ఆశ చూపి తమను పట్టించుకోకుండా వదిలేశారంటూ బాధిత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: దగాకోరు డ్రామాలు! -
Eluru: లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడు.. గర్భం విషయం తెలియగానే..
నూజివీడు: మండలంలోని రావిచర్లకు చెందిన దేవరపల్లి సురేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి రూరల్ పోలీస్‌స్టేషన్ శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడని.. తనకు గర్భం విషయం తెలిపి పెళ్లి చేసుకోమని అడగగా, పథకం ప్రకారం జ్యూస్‌లో మందు కలిపి తాగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి గర్భస్రావం అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని సురేష్ పెద్దవాళ్ల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు ఆమెను అవమానించి, గ్రామమంతా చెప్పి అల్లరిపాలు చేస్తామని బెదిరించారంటూ బాధితురాలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తలారి రామకృష్ణ తెలిపారు. చదవండి: (పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య) -
ప్రాణం తీసిన కోళ్ల చోరీ
నూజివీడు: కోడి పుంజులను దొంగిలించడానికి వచ్చాడనుకుని ఓ యువకుడిని చితకబాదడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతిచెందాడు. ఏలూరు జిల్లా నూజివీడులో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. నూజివీడులోని పాతపేటకు చెందిన సయ్యద్ గయాజుద్దీన్ ఎమ్మార్ అప్పారావు కాలనీ వద్ద కోడి పుంజులను పెంచుతున్నాడు. అక్కడికి అదే కాలనీకి చెందిన లాకే అవినాష్ (22) శనివారం అర్ధరాత్రి వెళ్లాడు. దీంతో అతను కోడి పుంజులను దొంగిలించడానికి వచ్చాడనుకుని గయాజుద్దీన్ పట్టుకుని చెట్టుకు కట్టేశాడు. ఆ తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేయగా, 10 మంది వచ్చారు. అందరూ కలిసి అవినాష్‌పై దాడి చేయగా అతడు స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం వారు అతని అన్నకు ఫోన్ చేసి.. మీ తమ్ముడిని తీసుకువెళ్లాలని చెప్పారు. అవినాష్ అన్న అఖిలేష్ ఘటనాస్థలానికి చేరుకుని తమ్ముడిని నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు పరీక్షించి అవినాష్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. అఖిలేష్ ఫిర్యాదు మేరకు సీఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గయాజుద్దీన్,మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడిపై టీడీపీ కార్యకర్తల హత్యాయత్నం
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పోలిమెట్ల శివను హత్య చేసేందుకు అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. గాయపడిన శివను స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలిమెట్ల శివకు, మరికొందరికి పొలాల వద్ద గతంలో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరుగంటల సమయంలో కొందరు వ్యక్తులు శివపై దాడిచేసి హత్యచేసేందుకు ఆయన ఇంటివద్దకు కత్తులు, ఇనుపరాడ్లు తీసుకుని వెళ్లారు. అక్కడే ఉన్న పలువురు వారిని అడ్డగించి పంపించేశారు. తరువాత ఇంటిబయట మళ్లీ గొడవపడి శివ మీద దాడిచేశారు. గాయపడిన శివ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన అట్లూరి హనుమంతరావు, అట్లూరి బ్రహ్మంచౌదరి, కొక్కెరపాటి వెంకటేశ్వరరావు, మరో ఐదుగురు తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు శివ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ చెప్పారు. -
ప్రతిభావంతులు.. పల్లెటూరి పిల్లలు
నూజివీడు: పల్లెటూరి పేద పిల్లలు.. పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిన వారికి తీసిపోని రీతిలో ప్రతిభ కనబరుస్తున్నారు. బడా కంపెనీలకు ఎంపికవుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ ఇది. పల్లెటూళ్లలో పేద కుటుంబాల్లో పుట్టిన వీరంతా పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. సన్నకారు రైతులు, కూలీలు, గుమాస్తాలు వంటి చిరుద్యోగుల పిల్లలైన వీరు పదో తరగతిలో ప్రతిభ కనబరిచి, ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. తామేమిటో నిరూపించుకుని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 2016–22 బ్యాచ్ విద్యార్థులు 699 మంది ఇలా పెద్ద పెద్ద ఐటీ సంస్థలకు ఎంపికయ్యారు. గ్రామీణ పేద వర్గాల పిల్లలకు ప్రపంచస్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్థాపించిన ట్రిపుల్ ఐటీల ఆశయాన్ని నెరవేర్చారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో క్యాంపస్ సెలక్షన్స్ విద్యార్థులకు ప్లేస్మెంట్లు కల్పించేందుకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కెరీర్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ సెల్ (సీడీపీసీ) ప్రత్యేక కృషి చేస్తోంది. విద్యార్థులకు నిరంతరం మాక్ టెస్ట్‌లు, ఇంటర్వూ లు నిర్వహిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో మాట్లాడి ప్లేస్మెంట్లు నిర్వహిస్తోంది. ఈ ఏడాది 61 ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ప్లేస్మెంట్లు నిర్వహించాయి. ఏడాదికి కనిష్టంగా రూ.3.60 లక్షల నుంచి రూ.27 లక్షల వరకు ప్యాకేజీతో విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. బెంగళూరుకు చెందిన జస్పే టెక్నాలజీస్ రూ.27 లక్షలు, డిమాండ్ వర్క్ టెక్నాలజీస్ రూ.24 లక్షలు, అన్‌లాగ్ డివైసెస్ రూ.20 లక్షలు, అమెజాన్ రూ.18 లక్షలు, ముంబైకి చెందిన గప్‌చుప్ టెక్నాలజీస్ రూ.15 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన థాట్ వర్క్స్ రూ.11.10 లక్షలు, శాన్ డిస్క్ రూ.9.10 లక్షల వేతనాలతో పలువురు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి. అత్యధికంగా విప్రోకు 192 మంది, క్యాప్ జెమినీకి 109 మంది, ఇన్ఫోసిస్‌కు 78 మంది, టీసీఎస్‌కు 76 మంది, టెక్ మహీంద్రాకు 49 మంది ఎంపికయ్యారు. 243 మందికి ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్ 243 మంది విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌తో కూడిన ప్లేస్‌మెంట్స్‌కు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ఇంటర్న్‌షిప్‌లో స్టైఫండ్ రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు అందుకోనున్నారు. ఇంటర్న్‌షిప్ ముగియగానే అదే కంపెనీలో ఉద్యోగంలో చేరతారు. బ్రాంచిల ప్లేస్‌మెంట్స్ శాతాలు ఈసీఈలో 95.10 శాతం, సీఎస్ఈలో 90.7 శాతం, కెమికల్ ఇంజినీరింగ్‌లో 61 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 57.5 శాతం విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించారు. కెమికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు కోర్ గ్రూపునకు సంబంధించి ఉన్నత చదువులు చదివేందుకు ప్రాధాన్యతనివ్వడంతో ఆ గ్రూపుల్లో ప్లేస్మెంట్లు తక్కువగా ఉన్నాయి. అమ్మ, నాన్న కష్టపడకుండా చూసుకుంటా మాది అమలాపురం. ఇద్దరు అక్కలున్నారు. నాన్న సాయి ప్రసాద్ షాపు షాపునకు తిరిగి అగర్బత్తీలు అమ్ముతారు. అమ్మ రామలక్ష్మి టైలరింగ్ చేస్తుంది. తొలి ప్రయత్నంలోనే ఏడాదికి రూ.27 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. అమ్మా, నాన్న కష్టపడకుండా చూసుకుంటా. ట్రిపుల్ ఐటీ నాలాంటి వందలాది మంది జీవితంలో వెలుగులు నింపింది. – కూనపరెడ్డి అజయ్‌శంకర్, అమలాపురం, కోనసీమ జిల్లా అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందిస్తున్నాం ట్రిపుల్ ఐటీలో చేరే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తున్నాం. ఇక్కడ ఉన్న ల్యాబ్‌లు దేశంలో ఏ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలోనూ లేవు. ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు నిర్వహిస్తూ ప్లేస్మెంట్లకు సిద్ధం చేస్తాం. ప్రముఖ కంపెనీలన్నీ క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించేలా చూస్తున్నాం. – ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, నూజివీడు ట్రిపుల్ ఐటీ -
జాతక దోషం.. మేకతో వివాహం
నూజివీడు(కృష్ణా జిల్లా): జాతక దోష నివారణ కోసమంటూ నూజివీడుకు చెందిన ఒక యువకుడు మేకను వివాహం చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఆ యువకుడికి జన్మజాతక రీత్యా రెండు వివాహాలు జరుగుతాయని ఉంది. దీంతో దోష నివారణ నిమిత్తం పట్టణ పరిధిలోని విస్సన్నపేట రోడ్డులో ఉన్న నవగ్రహ ఆలయ ఆవరణలో అర్చకులు ఆ యువకుడితో మేకకు తాళి కట్టించి వివాహం జరిపించారు. ఈ తంతులో యువకుడు, అతని తల్లిదండ్రులు, అర్చకుడు మాత్రమే పాల్గొన్నారు. -
930 మద్యం సీసాలు స్వాధీనం
హనుమాన్ జంక్షన్ రూరల్: ప్రభుత్వ వైన్ షాపు ఉద్యోగి అక్రమార్కులతో చేతులు కలిపి భారీ మొత్తంలో మద్యం సీసాలు తరలిస్తుండగా హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు చెప్పారు. స్థానిక గుడివాడ రోడ్డులోని వేగిరెడ్డి థియేటర్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్‌షాపు నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను కారులో తరలిస్తున్నట్లుగా సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలిలో సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గుడివాడ నుంచి నూజివీడు వైపు వెళ్తున్న మారుతీ కారులో రూ.1,39,500 విలువ చేసే 930 మద్యం బాటిళ్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించటంతో సరైన సమాచారం చెప్పకుండా వారు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైన్‌షాపులో సూపర్వైజర్గా పనిచేస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడు గ్రామానికి చెందిన మద్దాల రమేష్ కొంతకాలంగా హనుమాన్జంక్షన్కు చెందిన మొవ్వ ప్రసాద్‌తో చేతులు కలిపి అడ్డదారిలో మద్యం సీసాలు తరలిస్తున్నట్లు నిర్థారించారు. వీరి నుంచి 930 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటంతో పాటుగా నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం నూజివీడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్‌కుమార్, కార్తిక ఉషారాణి, సహకరించిన కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు అందించేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. -
మత్తు ఇచ్చి నగలు దోపిడీ
‘మేడమ్.. నాకు ప్రమోషన్ వచ్చింది.. స్వీట్ తీసుకోండి’ అంటూ ఇంటి యజమానితో మాట కలిపాడు. ఆమె తిరస్కరించడంతో.. కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగండి అంటూ ఆఫర్ చేశాడు. మత్తు మందు కలిపిన ఆ కూల్‌డ్రింక్ తాగిన వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇంకేముంది.. మన వాడు చేతి వాటం చూపించి ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల బంగారు గొలుసు తెంపుకుని చక్కాపోయాడు. నూజివీడు: కొత్త ప్రదేశాలకు వెళ్లడం, అద్దె ఇంట్లో దిగటం, ఆ ఇంటి యజమానులతో పరిచయం పెంచుకోవడం, సమయం చూసి వారికి మత్తు మందు ఇచ్చి నగలు దోచుకెళ్లడం. కొన్నేళ్లుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను నూజివీడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ కె.వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరానికి చెందిన పబ్బరాజు యుగంధర్ (33) కృష్ణా జిల్లా నూజివీడు మండలం యనమదలలోని గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఝాన్సీరాణి దంపతులకు చెందిన ఇంట్లో జూలై నెలలో అద్దెకు దిగాడు. జూలై 18న తనకు ప్రమోషన్ వచ్చిందని, స్వీటు తినమంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడు. వెంకటేశ్వరరావు తినగా, ఝాన్సీలక్ష్మీ తనకు డయాబెటిస్ ఉండటంతో తిరస్కరించింది. దీంతో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దీంతో దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ తర్వాత యుగంధర్ ఆమె మెడలో ఉన్న ఐదు కాసుల నానుతాడును దోచుకొని వెళ్లిపోయాడు. దీనిపై సచివాలయానికి చెందిన మహిళా సంరక్షణ కార్యదర్శి స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్, రూరల్ స్టేషన్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడు యుగంధర్‌ను వెతికి పట్టుకుని మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 8 కాసుల రెండు నానుతాడులను స్వాధీనం చేసుకున్నారు. 2006 నుంచే దొంగతనాలు యుగంధర్‌ను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గుంటూరు జిల్లా తెనాలి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, విజయవాడ, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, అన్నవరం, కృష్ణా జిల్లాలోని తిరువూరు ప్రాంతాల్లో ఇలాంటి దోపీడీలే చేసినట్లు తేలింది. 2006 నుంచి దొంగతనాలకు అలవాటైన యుగంధర్‌పై దాదాపు 15 కేసులు ఉన్నాయి. గతంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో వృద్ధ దంపతులకు మత్తు మందు ఇవ్వగా డోసు ఎక్కువై వృద్ధుడు చనిపోయాడు. యుగంధర్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. -
ఖండాంతరాలకు నూజివీడు మామిడి
సాక్షి, అమరావతి బ్యూరో: రుచి, నాణ్యతలో నూజివీడు మామిడి పెట్టింది పేరు. అందుకే మామిడి ప్రియులు నూజివీడు మామిడి తినాల్సిందేనంటారు. ఇప్పుడు నూజివీడు మామిడి ఖండాంతరాలకు వెళ్లి అక్కడి వారికి తన రుచి చూపిస్తోంది. దీంతో ఎగుమతిదారులు వీటి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల నుంచి నాణ్యమైన బంగినపల్లి మామిడిని కొనుగోలు చేసి సింగపూర్, సౌత్ కొరియా, ఒమన్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతికి పనికొచ్చేలా వీటి నాణ్యత ఉండటంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తోంది. ప్రస్తుతం కోవిడ్ ఉధృత రూపం దాలుస్తుండడంతో మార్కెట్లో మామిడి ధర క్షీణించింది. నెలరోజుల కిందటివరకు టన్ను రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలికిన బంగినపల్లి రకం ఇప్పుడు స్థానిక మార్కెట్లో రూ.10 వేల నుంచి రూ.15 వేలకు మించడం లేదు. ఫిబ్రవరి ఆఖరులో టన్ను తోతాపురి రకం రూ.80 వేల ధర ఉండగా ఇప్పుడు రూ.10 వేలలోపే పలుకుతోంది. అయితే విదేశాలకు ఎగుమతి చేసేవారు నాణ్యమైన బంగినపల్లిని టన్ను రూ.50 వేల వంతున కొనుగోలు చేస్తున్నారు. 10 రోజుల కిందట అర టన్ను బంగినపల్లి మామిడిని టన్ను రూ.30 వేలకు కొనుగోలు చేసి ఎగుమతిదార్లు సింగపూర్‌కు పంపారు. 5 రోజుల కిందట కృష్ణాజిల్లా పామర్రులోని ప్యాక్‌హౌస్ నుంచి 12 టన్నుల మామిడిని ఒమన్ దేశానికి ఎగుమతి చేశారు. అలాగే శనివారం మరో 15 టన్నుల బంగినపల్లి మామిడిని దుబాయ్‌కి పంపనున్నారు. తాజాగా నూజివీడు మండలం హనుమంతునిగూడెం నుంచి రాఘవులు అనే రైతు వద్ద 2 టన్నుల బంగినపల్లి మామిడిని టన్ను రూ.50 వేల చొప్పున కొనుగోలు చేశారు. వీటిని తిరుపతిలోని ప్యాక్‌హౌస్‌లో ప్రాసెస్ చేసి దక్షిణ కొరియాకు ఎగుమతి చేయనున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసేలా ఎగుమతిదారులను ఉద్యానశాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఎగుమతిదార్లతో గతనెలలో విజయవాడలో మ్యాంగో బయ్యర్స్, సెల్లర్స్ మీట్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా)తో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూజివీడు మామిడి రుచి, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం తదితర ప్రాంతాల ఎగుమతిదార్లు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. 100 టన్నుల ఎగుమతి దిశగా.. గత ఏడాది కృష్ణా జిల్లా నుంచి విదేశాలకు నూజివీడు మామిడి సుమారు 60 టన్నులు ఎగుమతి చేశారు. ఈ సీజనులో ఇప్పటివరకు 12.5 టన్నుల బంగినపల్లి మామిడి సింగపూర్, ఒమన్ దేశాలకు ఎగుమతి అయింది. ఒకటి రెండు రోజుల్లో మరో 17 టన్నులు దుబాయ్, దక్షిణ కొరియాలకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని నూజివీడు ఉద్యానశాఖ ఏడీ శ్రీనివాసులు ‘సాక్షి’కి చెప్పారు. ఈ ఏడాది దాదాపు 100 టన్నుల వరకు నూజివీడు మామిడిని ఇతర దేశాలకు ఎగుమతికి అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. -
India Book Of Records: శభాష్ తోషిత్!
నూజివీడు: అపార జ్ఞాపకశక్తితో రెండేళ్ల రెండు నెలల వయస్సులోనే అబ్బురపరుస్తున్నాడు నూజివీడుకి చెందిన కలపాల తోషిత్‌రామ్. తన ఐక్యూతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. గతంలో ఈ రికార్డులో 2 ఏళ్ల నాలుగు నెలల వయస్సు బాలుడు ఉండగా, ఇప్పుడు తోషిత్‌రామ్ దాన్ని బ్రేక్ చేశాడు. ఇంగ్లిష్ లో ఏ నుంచి జడ్ వరకు ఉన్న అక్షరాలు, 12 నెలలు, ఒకటి నుంచి 21 వరకు అంకెలు ఇంగ్లిష్ లో, ఒకటి నుంచి 33 వరకు హిందీలో, ఒకటి నుంచి 10 వరకు తెలుగులో, 20 పెంపుడు జంతువులను గుర్తించి వాటి పేర్లు చెప్పడం, 20 వన్య మృగాల పేర్లు చెప్పడం, 15 పక్షుల పేర్లు, 15 పండ్ల పేర్లు, ఐదు కూరగాయల పేర్లు, 14 రకాల వాహనాల పేర్లు, ఐదు జాతీయ గుర్తుల పేర్లు, 16 శరీర భాగాల పేర్లు, ఆరు ఆకారాలు, 11 రంగుల పేర్లు, ఐదు జంతువుల శబ్దాలు, 15 యాక్షన్ పదాలు చెప్పి ఈ ఘనతను సాధించాడు. బాలుడి తండ్రి కలపాల శ్రీరామ్ ప్రసాద్ ఏపీ అసెంబ్లీలో మెంబర్ సర్వీస్ సెక్షన్లో లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తల్లి అట్లూరి భవ్యశ్రీ ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. తోషిత్ ప్రతిభ గురించి ఫిబ్రవరిలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి తెలియపర్చగా, మార్చిలో పరీక్షించి, రెండురోజుల కిందట సర్టిఫికెట్, మెడల్ పంపారని వివరించారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థిని మాధురి ఆత్మహత్య
సాక్షి, నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న మొల్లి మాధురి (20) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. హోలీ కావడంతో తరగతులు లేకపోవడంతో విద్యార్థులందరూ హాస్టల్లోనే ఉన్నారు. ఐ3 హాస్టల్ భవనంలోని మూడో అంతస్తులో తన రూమ్‌లోనే మాధురి ఉండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో తోటి విద్యార్థినులు భోజనానికి రమ్మని పిలవగా తాను తరువాత తింటానని, మీరు తినేసి రమ్మని బదులిచ్చి రూమ్‌లోనే ఉండిపోయింది. దీంతో వారు మెస్‌కు వెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చిన తరువాత రూమ్ తలుపులు ఎంత కొట్టినా తీయకపోవడంతో కేర్‌టేకర్‌కు చెప్పారు. దీంతో కేర్‌టేకర్ సెక్యూరిటీ వాళ్లకు తెలపగా వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఉరివేసుకుని ఉంది. ఆమెను కిందకు దించి చూడగా చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే సెమిస్టర్ పరీక్షలు ముగిశాయి. ఈమె స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని గాంధీనగర్. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలుసుకుని నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఐ ఎం.వెంకటనారాయణ, ఎస్ఐ అప్పారి గణేష్‌కుమార్‌లు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్ గదిని పరిశీలించారు. రూమ్‌లోని తోటి విద్యార్థులను పోలీసులు విచారించగా, ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పినట్లు సమాచారం. -
ఘోర రోడ్డు ప్రమాదం; మంత్రి ఆళ్ల నాని దిగ్ర్బాంతి
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. కాగా రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. -
బాలికను సైకిల్‌పై తీసుకువెళ్లి..
-
అర్థరాత్రి బాలికపై అత్యాచారం
సాక్షి, కృష్ణా : జిల్లాలోని నూజివీడులో దారుణం చోటు చేసుకుంది. తండ్రి రాకకోసం ఎదురు చూస్తున్న ఓ మైనర్ బాలికపై అర్థరాత్రి వేళ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. నాన్న ఎక్కడ ఉన్నాడో చూపుతానని మాయమాటలు చెప్పి అభంశుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన తాపీ మేస్త్రి సరిపల్లి శేషుబాబు బుధవారం రాత్రి 9:30 ప్రాంతం వరకు ఇంటికి చేరుకోలేదు. ఆ సమయంలో శేషు బాబు కుమార్తె, మూడవ తరగతి చదువుతున్న బాలిక, తండ్రి కోసం రోడ్డుపైకి చేరుకుంది. శేషు బాబు తనకు తెలుసునని ఎక్కడ ఉన్నాడో చూపుతానని మాయమాటలు చెప్పిన ఓ అగంతకుడు బాలికను సైకిల్‌పై తీసుకువెళ్లి త్రిబుల్ ఐటీ సమీపంలో అత్యాచారం చేశాడు. అనంతరం సంఘటన స్థలంలోనే బాలికను వదిలేసి పరారయ్యాడు. భరించలేని నొప్పితో బాధపడుతున్న బాలిక కేకలు వేడయం ప్రారంభించింది. రాత్రిపూట పెట్రోలింగ్‌లో ఉన్న నూజివీడు సీఐ పి. రామచంద్రారావుకు కేకలు వినిపించడంతో సంఘటన స్థలానికి వెళ్లి బాలికను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
గుండె గూటిలో పదిలం
వైఎస్సార్... ఈ పేరు వింటే చాలు.. పేదవాడి మోములో చిరునవ్వు కనిపిస్తుంది.. తమ ఆత్మబంధువును తలుచుకున్నంతగా మది పులకిస్తుంది. ఆయన దూరమై పదేళ్లు గడిచినా.. నేటికీ ప్రతి హృదీ, ప్రతి మదీ ఆ నిలువెత్తు రాజసాన్ని తలుచుకోకుండా ఉండలేదు.. ఆయన ప్రతి అడుగు బడుగుల ఉన్నతి వైపే.. జలయజ్ఞంతో అపర భగీరథుడిగా మారి, గంగమ్మను ఒడిసిపట్టి రైతన్నకు అందించాడు. ఒక పంటే ఎక్కువన్న చోటు మూడు పంటలు పండాయి.. అన్నదాతల లోగిళ్లు సిరులతో నిండాయి. ఆరోగ్యశ్రీతో గుండె గుండెల్లో దేవుడుగా మారారు..పేదల ఊహకైనా అందని కార్పొరేట్ హాస్పటల్స్‌ను వారి ముంగిటకే తెచ్చి మహానుభావుడయ్యారు. అన్నివర్గాల గుండెల్లో కొలువైన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమై పదేళ్లు గడిచినా.. ఆ చెరగని చిరునవ్వు.. నిలువెత్తు రాజసం.. మాట ఇస్తే మడమతిప్పని నైజంతో ప్రతి గుండె గుడిలో నేటికీ కొలువైఉన్నాడు.. నేడు మహానేత వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. ‘కృష్ణా’ అభివృద్ధికి తపించిన మహానేత సాక్షి, అమరావతి బ్యూరో : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన సేవల ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కృష్ణా డెల్టాకు వరదలు వచ్చినప్పుడు జిల్లా రైతులు పడుతున్న కష్టాలను చూసి వైఎస్ చలించిపోయారు. అన్నపూర్ణగా పేరుగాంచిన కృష్ణా డెల్టా ముంపునకు గురవుతోందని భావించి 2008 జూన్ 6న మోపిదేవి వార్పు సర్ అర్ధర్ కాటన్ విగ్రహం వద్ద డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. కృష్ణా డెల్టా పరిధిలో 13.06 లక్షల ఎకరాలు ఉండగా, రూ.4,573 కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. ఇందులో 40 శాతం పనులు ఆయన హయాంలోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు 25 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది 1994 నుంచి బందరు పోర్టు డిమాండ్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినిపించినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. తూర్పు కృష్ణా ప్రజలు దాదాపుగా 25 ఏళ్లుగా బందరు పోర్టు డిమాండ్‌తో ఉద్యమించారు. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సాధ్యాసాధ్యాలను పరిశీలించి బందరు పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. 2008 ఏప్రిల్ 23వ తేదీ రూ.1,500 కోట్లతో పోర్టు ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. తదనంతరం దివంగత వైఎస్సార్ మరణించడంతో మళ్లీ బందరు పోర్టు వ్యవహారం మరుగునపడింది. బందరు ప్రజల ఆందోళన ఫలితంగా మళ్లీ 2012 మే 12న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు 5,324 ఎకరాల భూమిని సేకరించేందుకు జీవో ఇచ్చింది. కానీ ఉత్తర్వులు అమలు కాలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బందరు పోర్టును నిర్మిస్తామని గొప్పగా ప్రకటించారు. అయితే పోర్టు పేరుతో 1.05 లక్షల ఎకరాల రైతుల భూములు తీసుకొని కార్పొరేట్, విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో బందరు పోర్టు కోసం 28 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి పోర్టు నిర్మాణానికి 4,800 వేల ఎకరాలు సరిపోతుంది. కానీ వేల ఎకరాల భూమిని తీసుకోవడానికి యత్నిస్తూ రైతుల జీవితాలతో టీడీపీ సర్కారు చెలగాటమాడటంపై రైతన్నలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివి ఆపద్బాంధవుడు వైఎస్ అవనిగడ్డ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దివిసీమకు ఆపద్బాంధవునిగా చెప్పవచ్చు. కోట్లాది రూపాయల ఆధునికీకరణ పనులకు నియోజకవర్గంలోని పులిగడ్డలో శ్రీకారం చుట్టారు. అడగకుండానే విజయవాడ – పులిగడ్డ డబుల్‌లైన్ నిర్మాణం చేపట్టారు. భావదేవరపల్లిలో రాష్ట్రంలోనే తొలి మత్స్యకార పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. రూ.40కోట్లతో దివితీర ప్రాంత సముద్ర కరకట్ట అభివృద్ధి పనులతో పాటు వైఎస్ హయాంలో నియోజకవర్గంలో రూ.317.89 కోట్లు అభివృద్ధి పనులు చేపట్టిన రాజశేఖరరెడ్డి దివిసీమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నూజివీడు అభివృద్ధిలో ‘వైఎస్’ మార్కు నూజివీడు: నూజివీడు అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మార్కు’ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో నూజివీడులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మూడుసార్లు పర్యటించారంటే, జిల్లాలోని నూజివీడు నియోజకవర్గంతో వైఎస్‌కు ఉన్న అనుబంధానికి తార్కాణంగా నిలుస్తోంది. నూజివీడులో ‘వైఎస్ మార్కు’ అభివృద్ధిని ప్రతిపక్షాలు సైతం ఒప్పుకుంటాయి. ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు కృషితో పాటు, ఆయనపై ఉన్న ప్రత్యేక అభిమానంతో ఎమ్మార్ అప్పారావు కాలనీని ఏర్పాటు చేసి నాలుగు వేలమందికి నివేశన స్థలాలే కాకుండా నాలుగు వేల ఇళ్లు మంజూరు చేశారు. పట్టణ ప్రాంత ప్రజల దాహార్తిని శాశ్వతంగా పరిష్కరించేందుకు అపర భగీరథుడిలా కృష్ణాజలాల ప్రాజెక్టును రూ.66 కోట్లతో మంజూరు చేశారు. స్థానిక ఎస్ఆర్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.1.5 కోట్లతో సమీకృత వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్)ను ఏర్పాటుచేశారు. ట్రిపుల్ఐటీతో మారిన నూజివీడు రూపురేఖలు నూజివీడులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ఐటీని స్థాపించి పట్టణానికి దేశపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. వేలాది మంది పేదవర్గాల, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నతమైన సాంకేతిక విద్య లభిస్తోంది. ట్రిపుల్‌ఐటీలు నా మానసపుత్రికలని పలుమార్లు వైఎస్ చెప్పేవారు. సెప్టెంబర్ 29న, 2008న ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముచ్చటించేందుకు వైఎస్ ఇక్కడకు వచ్చారు. అరగంటకు పైగా విద్యార్థులతో గడిపారు. అదేవిధంగా నూజివీడు ప్రాంతంలో మామిడి పరిశోధనా స్థానం, ఉద్యానవనపంటల చీడపీడల నియంత్రణకేంద్రాన్ని రూ.12కోట్లతో ఏర్పాటు చేశారు. పులిగడ్డలోనే ఆధునికీకరణ పనులకు అంకురార్పణ 2006లో ఓగ్ని తుపాను వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దివిసీమలో పర్యటించారు. 45 ఏళ్ల దివి చరిత్రలో అప్పడు అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకూ కురిసిన వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డెల్టాను ఆధునీకీకరిస్తానని వైఎస్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.4,576 కోట్లతో డెల్టా ఆధునీకీకరణ పనులు చేపట్టారు. ఈ బృహత్తర పథకానికి 2008 జూన్ 6న అవనిగడ్డ మండలం పులిగడ్డవార్పు వద్ద శంకుస్థాపన చేశారు. ఈ పనుల వల్ల జిల్లాలో రూ.2,180కోట్లు, నియోజకవర్గంలో రూ547.93 కోట్లు పనులు జరిగాయి. దీనివల్ల నియోజకవర్గంలో 13 భారీ వంతెనలు, యూటీలు ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ మా ఆశాదీపాన్ని కాపాడింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా ఇంటి ఆశాదీపాన్ని కాపాడింది. మా కుమార్తెకు గుండెలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వైద్యులకు చూపిస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చిరుద్యోగినైన నాకు అంత ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులమంతా బాధపడేవాళ్లం. అప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడం, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా పాపను కాపాడింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా పాపకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. మాలాంటి ఎన్నో కుటుంబాలకు వైఎస్ పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వైఎస్‌కు మా కుటుంబ సభ్యులం ఎంతో రుణపడి ఉన్నాము. – వై. రామకృష్ణ దంపతులు, మైలవరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా ఇంటి ఆశాదీపాన్ని కాపాడింది. మా కుమార్తెకు గుండెలో రంధ్రాలు ఏర్పడ్డాయి. వైద్యులకు చూపిస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. చిరుద్యోగినైన నాకు అంత ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించే స్తోమత లేకపోవడంతో కుటుంబ సభ్యులమంతా బాధపడేవాళ్లం. అప్పుడే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడం, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా పాపను కాపాడింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మా పాపకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. మాలాంటి ఎన్నో కుటుంబాలకు వైఎస్ పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయి. వైఎస్‌కు మా కుటుంబ సభ్యులం ఎంతో రుణపడి ఉన్నాము. – వై. రామకృష్ణ దంపతులు, మైలవరం మత్స్య పరిశ్రమలో సాంకేతిక విప్లవం తీసుకురావాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. ఈ రంగంలో మంచి నిపుణులను తయారు చేయాలన్న సంకల్పంతో వైఎస్ దేశంలోనే తొలి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. 2007 సెప్టెంబర్ 7వ తేదీన అవనిగడ్డ గాంధీక్షేత్రంలో ఈ కళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయగా, అనంతరం భావదేవరపల్లిలో 8.58 ఎకరాల విస్తీర్ణంలో రూ.2కోట్లతో నిర్మించిన నూతన భవనాల్లోకి ఈ కళాశాలను మార్చారు. ఈ కళాశాల నుంచి వందలాది మంది మత్స్య నిపుణులు తయారయ్యారు. ప్రాణభిక్ష పెట్టిన దేవుడు కూలి పనులకు వెళితేనే పూటగడిచే నాకు గుండె సంబంధ వ్యాధి రావడంతో మా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పైసా చేతిలో లేకుండా గుండె ఆపరేషన్ చేయించడమెలాగని మధనపడుతున్న సమయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నా ప్రాణాలు కాపాడింది. 2006లో విజయవాడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో నేను శస్త్రచికిత్స చేయించుకుని, నెలరోజుల పాటు ఆసుపత్రిలోనే ఇన్‌పేషెంటుగా ఉన్నాను. ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా ప్రభుత్వమే పూర్తిస్థాయిలో భరించింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చేటపుడు మా ప్రయాణఖర్చులు కూడా అధికారులు చెల్లించారు. రుణమాఫీతో అంతా హ్యాపీ మహనీయుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రుణ మాఫీ పథకంతో నాకు ఒకేసారి పూర్తిగా రుణ మాఫీ జరిగింది. మైలవరం మండలం వెల్వడం గ్రామం భాస్కరనగర్‌లో నివాసం ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు. 2004లో బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి వ్యవసాయానికి రుణం తీసుకున్నాను. వ్యవసాయంలో బాగా నష్టం వచ్చింది. ఆ రుణం ఎలా తీర్చాలా అని బాధపడేవాడిని, బంగారం స్టేట్ బ్యాంకులో పెట్టి రూ. 60వేలు రుణం తీసుకుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాను, ఆ ఏడాది పంటలు సరిగా పండక వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయాను. ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా అని మథనపడేవాడిని. రాత్రిళ్లు నిద్ర కూడాపట్టేది కాదు. భగవంతుడిలా వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడం ముఖ్యమంత్రి కావడం తొలి సంతకం రుణ మాఫీ ఫైల్‌పై సంతకం చేయడంతో నా రుణం ఒక్కసారిగా మాఫీ జరిగింది. బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి రుణ మాఫీ జరిగిందని చెప్పిన తరువాత నాకు ఉపశమనం కలిగింది. మా కుటుంబం మొత్తం వైఎస్‌కు రుణపడి ఉన్నాం. – అవులూరి ప్రతాపరెడ్డి, వెల్వడం, మైలవరం మండలం -
బంగారం అలా వేసుకు తిరిగితే ఎలా?..
సాక్షి, నూజివీడు: పోలీసులమని చెప్పి ముగ్గురు ఆగంతుకులు వృద్ధురాలి నగలు దోచుకెళ్లిన ఘటన నూజివీడు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి బాధితురాలు చెప్పిన వివరాలు.. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి కోవెల వెనుక భాగాన ఉన్న సాయితేజ అపార్ట్మెంట్లోని 301 ప్లాట్‌లో రిటైర్డ్ ఏఓ ప్రత్తిపాటి రాజకుమారి(68) నివసిస్తున్నారు. ఆమె కూరగాయల నిమిత్తం రైతు బజారుకెళ్లి తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 12.40గంటల సమయంలో వెంకటేశ్వరస్వామి కోవెల వద్దకు రాగానే ముగ్గురు సివిల్ డ్రెస్‌లలోనే ఉండి ‘మేము పోలీసులమని, బంగారు గొలుసులు వేసుకుని తిరిగితే ఎలాగని.. వాటిని తీసి సంచిలో వేసుకుని వెళ్లమని’ సూచించారు. దీంతో ఆమె మెడలోని రెండు పేటల తాడును తీయగా, దానిని కాగితంలో పొట్లం కట్టి ఇస్తామని చెప్పి, చేతులకున్న రెండు గాజులు కూడా తీసివ్వమని కోరగా వాటిని తీసిచ్చింది. ఆభరణాలను కాగితంలో పొట్లం కట్టినట్లే కట్టి పొట్లంను ఆమె బ్యాగ్‌లో వేశారు. ఆ తరువాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తరువాత వృద్ధురాలు బ్యాగ్‌లో పొట్లం కోసం వెతకగా అది లేదు. దీంతో తాను మోసపోయాయని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు పది కాసులు ఉంటాయని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. సీఐ పీ రామచంద్రరావు, ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. అలాగే రైతుబజారు నుంచి ఘటన జరిగిన ప్రాంతం వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఈయూ ఫెలోషిప్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని షేక్ నజ్మాసుల్తానా చదువులో ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ యూనియన్ ఫెలోషిప్‌కు ఎంపికైంది. ఈ ఫెలోషిప్ కింద ఎంఎస్ చేయడానికి నజ్మాసుల్తానాకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున రెండేళ్లపాటు ప్రోత్సాహకంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌కు ఇద్దరు మాత్రమే ఎంపిక కాగా.. అందులో నజ్మాసుల్తానా ఒకరు కావడం విశేషం. చదువులో మేటి గుంటూరు నగరం నల్లపాడుకు చెందిన షేక్ నజ్మాసుల్తానా చదువులో చిన్ననాటి నుంచి ప్రతిభ కనబరిచేది. తండ్రి అమీర్‌బాషా మిలటరీలో కెప్టెన్‌గా పనిచేయగా, తల్లి ముజాహిదా సుల్తానా గృహిణి. నజ్మాసుల్తానా 2013లో ట్రిపుల్ ఐటీలో పీయూసీలో చేరి, ఆ తరువాత ఇంజనీరింగ్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ బ్రాంచి తీసుకుంది. అందులోనూ ప్రతిభ కనబరిచింది. ఇంజినీరింగ్‌లో 9.1 సీజీపీఏతో ఉత్తీర్ణురాలైన నజ్మాసుల్తానా ఐఐటీ మద్రాస్‌లో సిరామిక్ టెక్నాలజీలో ఇంటర్న్‌షిప్ చేసింది. బయో మెటీరియల్స్‌పై అంతర్జాతీయ రీసెర్చ్ పేపర్స్‌ను సైన్స్ జర్నల్స్‌కు సమర్పించింది. ఆగస్టులో ఫ్రాన్స్‌కు.. నజ్మాసుల్తానా యూరప్‌లోని ఫ్రాన్స్‌లో గల గ్రెనోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రథమ సంవత్సరం, జర్మనీలోని డామ్స్ట్రాడ్లో ఉన్న టెక్నికల్ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదవనుంది. యూరప్‌లోని నాలుగు దేశాల (ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోర్చుగల్)కు చెందిన ఏడు యూనివర్సిటీలు కలసి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించి రెండేళ్ల ఎంఎస్ కోర్సును అభివృద్ధి చేశాయి. ఈ కోర్సులో చేరేందుకు ప్రతిభావంతులైన యూరోపియన్ విద్యార్థులకు, యూరోపియనేతర విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నాయి. నజ్మాసుల్తానా ఆగస్టు మూడో వారంలో ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. నజ్మా సుల్తానాను, ఆమె తల్లిదండ్రులు అమీర్‌బాషా, ముజాహిదా సుల్తానాలను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు సన్మానించారు. -
చంద్రగ్రహణం..క్షుద్రపూజలు కలకలం
-
చంద్రగ్రహణం.. నరబలికి యత్నం..
సాక్షి, నూజివీడు (కృష్ణా జిల్లా) : నూజివీడు మండలం యలమందలో శుక్రవారం క్షుద్రపూజలు కలకలం రేపాయి. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన అతి సుదీర్ఘమైన చంద్రగ్రహణం నాడు నరబలి ఇస్తే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకం ఉంది. దీంతో యనమదలకు చెందిన ఏడుగురు వ్యక్తులు క్షుద్రపూజలు చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ ప్రాంతంలో ఇందుకు తగిన ఏర్పాటు పూర్తి చేశారు. నరబలి అనంతరం మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యిని సైతం తవ్వించాడు. చిన్నం ప్రవీణ్ అనే వ్యక్తిని బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకోగా, విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురి అరెస్టు చేశారు. క్షుద్రపూజలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.