
నూజివీడు(కృష్ణా జిల్లా): జాతక దోష నివారణ కోసమంటూ నూజివీడుకు చెందిన ఒక యువకుడు మేకను వివాహం చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఆ యువకుడికి జన్మజాతక రీత్యా రెండు వివాహాలు జరుగుతాయని ఉంది.
దీంతో దోష నివారణ నిమిత్తం పట్టణ పరిధిలోని విస్సన్నపేట రోడ్డులో ఉన్న నవగ్రహ ఆలయ ఆవరణలో అర్చకులు ఆ యువకుడితో మేకకు తాళి కట్టించి వివాహం జరిపించారు. ఈ తంతులో యువకుడు, అతని తల్లిదండ్రులు, అర్చకుడు మాత్రమే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment