సాక్షి, కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు.
కాగా రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment