Condolense
-
శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: దూరదర్శన్ మొదటి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్ మార్గదర్శక ప్రయత్నం చాలా మంది వార్తా ప్రసారకులకు స్పూర్తినిచ్చిందని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా శాంతి స్వరూప్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇది కూడా చదవండి: దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత -
న్యూజెర్సీలో తెలంగాణ ఉద్యమ నేత కడియం రాజుకు ఘనంగా నివాళులు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ డాక్టర్ కడియం రాజు గారి శ్రద్ధాంజలి సభ అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలో ఏబీవీపీ పూర్వ కార్యకర్తల మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి బండి సంజయ్ తోపాటు, ఏబీవీపీ పూర్వ విద్యార్థులు విలాస్ జంబుల, అమర్ జునూతుల, సంతోష్ మైకా, రాజేష్ రెడ్డి, సమరసింహా రెడ్డి బొక్క, కిరణ్, మధుసుధన్ రెడ్డి, ప్రదీప్ కట్ట, సుధీర్ గుత్తికొండ , సురేష్ సోమిశెట్టి, ప్రీతం , ప్రేమ్ కాట్రగడ్డ, పూర్వ కార్యకర్తలు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్వర్గీయ డా కడియం రాజన్న ఆత్మీయ మిత్రులు పెద్ద ఎత్తున హాజరై కడియం రాజన్న గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. బండి సంజయ్ కూడా గతంలో అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పని చేశారు. ఉస్మానియా పూర్వ విద్యార్థి, అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ,తన ఉద్యమాల ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలిచిన జాతీయ స్థాయి లీడర్, కడియం రాజు మాకు (విలాస్ రెడ్డి జంబుల, శ్రీకాంత్ తుమ్మల ) సహచరుడు కావడం మా పూర్వ జన్మ సుకృతం. విలాస్ రెడ్డి జంబుల అనే వ్యక్తి ఈ రోజు అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే దానికి కారణం మనం అందరం ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా దిక్సూచి కడియం రాజు అని సగర్వంగా చెబుతాను. ఒక సిద్ధాంతం కోసం , తనని నమ్ముకున్న వారి కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టైనా పోరాడే యోధుడితో కలిసి చదివే అవకాశం వచ్చినందుకు, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. దేశ భక్తి , సేవాభావం ,ఉద్యమస్ఫూర్తి ,నాయకత్వ లక్షణాలు, పోరాడేతత్వం ఇవన్నీ కలగలిపిన ఆదర్శ వ్యక్తి కడియం రాజు. అసలు ఎవరు ఈ "రారాజు", అయన గురించి, ప్రజలను చైతన్య పరిచిన అయన విధానాలు గురించి, ఒక్క మాటలో చెప్పాలంటే అయన ప్రయాణం గురించి మా మాటల్లో.....,కాదు కాదు ,మాలాగా అభిమానించే ఎంతోమంది కోసం ఆయన ప్రయాణం గురించి వారి మాటల్లో దేశాన్ని ప్రేమించే జాతీయ భావాలు కలిగిన విద్యార్థి.. ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన ఉద్యమ నేత.. సమాజాన్ని ప్రేమించే నవతరం నాయకుడు.. ఎంతో భవిష్యత్ ఉన్న ఆ డైనమిక్ లీడర్‌ను విధి కాటేసింది.. సమాజం చిన్నబోయేలా ఒక నాయకుడిని కోల్పోయింది.. ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన ఆదర్శ వ్యక్తిత్వం గుర్తు తెచ్చుకుని తల్లడిల్లుతున్నారు ఎంతో మంది.. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ చరిత్రలో 108 రోజుల జైలు జీవితం గడిపి, అన్న, బాబాయ్, మామగా విద్యార్థులచే ముద్దుగా పిలుచుకునే ఉస్మానియా యూనివర్సిటీ దిక్సూచి డాక్టర్ కడియం రాజు ఇటీవల మార్చి 20న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన నల్లగొండ జిల్లాలోని కొత్తగూడెం గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. తన పాఠశాల విద్య కొండ్రపోల్ గ్రామంలో, ఇంటర్ నాగార్జున జూనియర్ కళాశాల, మిర్యాలగూడ కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. పేదరికం వెక్కిరిస్తున్నా ఆ తర్వాత ఎంఏ హిస్టరీ విభాగంలో ఎంఫిల్, పీహెచ్డీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశారు. ఆయనకు ఇంటర్ నుంచే దేశభక్తి, జాతీయ భావాలు కలిగిన విద్యార్థిగా ఏబీవీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ డిగ్రీలో కళాశాల ఎబీవీపీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2002 సంవత్సరం నుండి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ సైద్ధాంతిక పోరులో ముందుండి క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ చేపట్టిన ఎన్నో విద్యారంగ సమస్యలపై ముందుండి పోరాడి, ఎన్నో లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి 108 రోజులు జైలు పాలయ్యారు. కుట్రలను, అవినీతిని సహించని వ్యక్తిత్వం ఆయనది. ఏబీవీపీ చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణ ఉద్యమంలో ముందుండి, అనేక ఆక్రమణ భూముల విషయంలో కోర్టులలో కేసులు వేశారు, నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు మెస్ బిల్లులు, స్కాలర్షిప్పులు, మౌలిక వసతులు, నూతన హాస్టళ్ల నిర్మాణం కోసం పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఏబీవీపీలో డాక్టర్ కడియం రాజు తన సుదీర్ఘ ప్రయాణంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంచార్జ్‌గా, సిటీ సెక్రెటరీగా, స్టేట్ సెక్రెటరీగా, నేషనల్ సెక్రెటరీగా, సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా అనేక విద్యార్థి ఉద్యమాలకు నేతృత్వం వహించారు. అలాగే జాతీయ ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల విద్యా నియంత్రణ కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ చేపట్టిన అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఏబీవీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన లక్ష మందితో ‘తెలంగాణ రణభేరి’లో సుష్మాస్వరాజ్ ఆహ్వానించిన సభకు సభాధ్యక్షత వహించారు. అలాగే ఏబీవీపీ తెలంగాణ సాధనకై మహా పాదయాత్రలో కోదాడ నుండి హైదరాబాద్ వరకు నేతృత్వం వహించారు. నా రక్తం- నా తెలంగాణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల నిరాహార దీక్షలు... ఇలా తెలంగాణ సాధనలో అనేక ఉద్యమాలలో క్రియాశీలకంగా పోరాడారు. జాతీయ భావాలు కలిగిన దేశభక్తుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దిన డాక్టర్ కడియం రాజు మరణం విద్యార్థి లోకానికి, దేశానికి తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల కోసం ఆయన చేసిన ఉద్యమాలను ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం, మరెంతో మందికి స్పూర్తి. (చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర) -
గద్దర్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: తెలంగాణలో ఉద్యమ గళం, ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో గద్దర్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్..‘బడుగు, బలహీనవర్గా విప్లవ స్పూర్తి గద్దర్. ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణ పాటే. గద్దర్ నిరంతరం సామాజిక న్యాయం కోసమే బ్రతికారు. గద్దర్ మరణం ఊహించలేనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్‌కు తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. గద్దర్ కుటుంబ సభ్యులకు మనమంతా బాసటగా ఉందాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత.. ఆయన ప్రస్తానం ఇదే.. -
షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్
వాషింగ్టన్: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు జరపడంతో తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఈ క్రమంలో జపాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి అబేకు సంతాపం తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ విషాద సంఘటనపై తన సానుభూతిని వ్యక్తం చేస్తూ.. జపాన్ అంబాసిడర్ కోజి టొమితాకు భావోద్వేగ నోట్‌ను అందజేశారు. షింజో అబే అంటే శాంతి, తీర్పు అంటూ అందులో రాసుకొచ్చారు బైడెన్. 'షింజో అబే కుటుంబం, జపాన్ ప్రజలకు బైడన్ కుటుంబం, అమెరికా ప్రజల తరుపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గతంలో ఉపాధ్యక్షుడి నివాసంలో ఆథిత్యమిచ్చినప్పుడు, జపాన్ పర్యటనలో ఆయనను కలుసుకోవటం నాకు గర్వకారణం. షింజో మరణం ఆయన భార్య, కుటుంబం, జపాన్ ప్రజలకు మాత్రమే లోటు కాదు.. యావత్ ప్రపంచానికి తీరని లోటు. శాంతి, సామరస్యానికి అబే ప్రతిరూపం.' అని పేర్కొన్నారు జో బైడెన్. అంతకు ముందు.. దుండగుడి కాల్పుల్లో షింజో అబే మరణించారన్న వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అధ్యక్షుడు బైడెన్. ఇది జపాన్ తోపాటు ఆయన గురించి తెలిసిన వారందరికీ ఓ విషాద సంఘటన అని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండోపసిఫిక్ కోసం ఆయన విజన్ కొనసాగుతుందన్నారు. ఆయన జీవితాన్ని జపాన్ ప్రజలకు సేవ చేసేందుకే అంకితం చేశారని గుర్తు చేసుకున్నారు. -
పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'
‘ఎద లోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్ర లేస్తున్నాయి’... ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’లో ఇంత మధురంగా పాడిన కృష్ణకుమార్ కున్నత్ (కెకె) 53 ఏళ్ల వయసులో తన అభిమానులను దిగ్భ్రమ పరిచి ఇక పై తన పాటల్నే జ్ఞాపకాలుగా చేసుకోమన్నాడు. పాట పాడటానికి పుట్టిన కెకె కోల్‌కతాలో మంగళవారం రాత్రి పాడుతూనే తుదిశ్వాస విడిచాడు. సుందరమైన స్వరం గల ఆ గాయకుడికి నివాళి. కృష్ణకుమార్ కున్నత్ అను కెకె మామూలుగా బయట కనపడడు. ఇంటర్వ్యూలు ఇవ్వడు. సినిమా ఫంక్షన్స్‌లో పాల్గొనడు. అందుకని అతని పాట చెప్తే తప్ప అతణ్ణి నేరుగా గుర్తు పట్టేవారు తక్కువ. ‘ప్రేమదేశం’ లో ‘క..క..క... కాలేజీ స్టైలే’ పాడింది కేకేనే. ‘హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే’ పాడి కుర్రకారు హార్ట్ మిస్సయ్యేలా చేసింది అతడే. తెలుగులో ఒక కాలంలో కెకె ఎన్నో హిట్స్ పాడాడు. ఖుషీలో ‘ఏ మేరా జహా... ఏ మేరి ఆషియా’ పెద్ద హిట్టు. వెంకటేష్ ‘వాసు’లో ‘పాటకు ప్రాణం పల్లవి అయితే’ నేటికీ వింటున్నారు. ‘ఘర్షణ’లో ‘చెలియ.. చెలియా’ కూడా. కెకె మాతృభాష మలయాళం. కాని పుట్టి పెరిగిందంతా ఢిల్లీలో. సంగీతం శాస్త్రీయంగా నేర్చుకో లేదు. అమ్మమ్మ దగ్గర తప్ప. కాని బాగా పాడేవాడు. బ్యాండ్స్‌లో పని చేయాలని ఉండేది. చదువు పూర్తి కాగానే 1991లో జ్యోతికృష్ణను వివాహం చేసుకున్నాడు. ఢిల్లీలో మొదట అతను జింగిల్స్ పాడేవాడు. అలాగే హోటల్స్‌లో బ్యాండ్స్‌లో పెర్ఫార్మ్ చేసేవాడు. ఆ సమయంలోనే ఢిల్లీకి వచ్చిన హరిహరన్ అతడు పాడుతున్న హోటల్లో అతడి పాట విని ‘ఇక్కడేం చేస్తున్నావ్. నువ్వు ఉండాల్సింది ముంబైలో’ అని చెప్పాడు. అయినా కూడా కెకెకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. పాప్ సింగర్‌గానే ఉండాలని, ఆల్బమ్ రిలీజ్ చేయాలని ఉండేది. కాని భార్య అతణ్ణి ప్రోత్సహించింది. ఢిల్లీలో ఎంతకాలం ఉన్నా ఇంతే.. మనం ముంబై వెళ్దాం అంటే 1994లో ముంబైకి వచ్చాడు. అప్పటికే అతనికి విశాల్–శేఖర్ ద్వయంలోని విశాల్‌తో పరిచయం ఉంది. విశాల్ ‘మేచిస్’కు సంగీతం ఇస్తూ అందులో పెద్ద హిట్ అయిన ‘ఛోడ్ ఆయే హమ్ ఓ గలియా’ పాటలో ఒకటి రెండు లైన్లు ఇచ్చాడు. ఆ పాట హిట్ అయ్యింది. ఆ తర్వాత జింగిల్స్ పాడటం మొదలు పెట్టి జింగిల్స్ సింగర్‌గా చాలా బిజీ అయ్యాడు. 1994 నుంచి 1998 వరకూ నాలుగేళ్లలో 11 భాషల్లో 3,500 జింగిల్స్ పాడాటంటే అది అతని గొంతు మహిమ. ఏఆర్. రహెమాన్ కూడా జింగిల్స్ చేసేవాడు కాబట్టి వెంటనే కెకెను పాటల్లోకి తెచ్చాడు. ‘ప్రేమదేశం’, ‘మెరుపుకలలు’ (తమిళం) సినిమాల్లో పాడించాడు. 1999లో ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో ‘తడప్ తడప్ కే’... పాట సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. సల్మాన్‌ఖాన్‌కు పాడటంతో కెకెకు ఇక తిరుగు లేకుండాపోయింది. 1999లోనే సోనీ అతనితో ‘పల్’ అనే ఆల్బన్ తెచ్చింది. ఆ ఆల్బమ్ కూడా హిట్. కెకె మొత్తం పది భారతీయ భాషల్లో 700 పాటలు పాడాడు. వందల సంగీత ప్రదర్శనలు చేశాడు. అతడు అయితే స్టూడియోలో ఉంటాడు. లేదంటే ఇంట్లో. ఎక్కడా తిరగడానికి ఇష్టపడడు. కొడుకు నకుల్ కృష్ణ, కూతురు తామ్రకృష్ణ అతడి లోకం తెలుగులో చిరంజీవికి ‘దాయి దాయి దామ్మా’, తరుణ్‌కు ‘అయామ్ వెరీ సారీ’, పవన్ కల్యాణ్‌కు ‘మై హార్ట్ ఈజ్ బీటింగ్’, అల్లు అర్జున్‌కు ‘ఫీల్ మై లవ్’– ‘ఉప్పెనంత ఈ ప్రేమకు’, మహేశ్ బాబుకు ‘అవును నిజం’... ఎన్నో హిట్స్ కెకె ఖాతాలో ఉన్నాయి. సెవన్బైజి బృందావన్ కాలనీలో పాడిన ‘తలచి తలచి చూస్తే’ పాటకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఇక ‘గుర్తుకొస్తున్నాయి’ పాటకు కూడా. ఒక మంచి గాయకుడు దూరమయ్యాడు. పాడుతూ పాడుతూ నేలకొరిగిపోయాడు. అతని గొంతు మాత్రమే గడ్డ కట్టింది. పాడిన పల్లవి చరణాలు ప్రవహిస్తూనే ఉంటాయి. -
సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: తనకు ఆతీ్మయుడైన మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత విషాదకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. గౌతమ్‌రెడ్డి తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడని గుర్తు చేసుకున్నారు. ఈమేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే హైదరాబాద్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, సీఎం కార్యదర్శులు సాల్మన్ ఆరోఖ్యరాజ్, రేవు ముత్యాలరాజు, ధనుంజయ్‌రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. చిన్ననాటి నేస్తం.. చిన్ననాటి నుంచే గౌతమ్‌రెడ్డి తనకు బాగా పరిచయమని, ఒక స్నేహితుడినే కాకుండా సమర్థుడైన మంత్రి, విద్యాధికుడ్ని కోల్పోయానని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణంలో తోడుగా నిలిచారంటూ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం, వాణిజ్యం, ఐటీ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, పారదర్శక విధానాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చారని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు కలిగిన నాయకుడిని కోల్పోయానని చెప్పారు. ఆయన మృతి చెందడం వ్యక్తిగతంగా తనకే కాకుండా రాష్ట్రానికి తీరని లోటన్నారు. చదవండి: తండ్రికి తగ్గ తనయుడు.. ఒకే ఒక్కడు.. రెండు రోజులు సంతాప దినాలు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. సోమ, మంగళ వారాలు సంతాప దినాలుగా పాటించాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సంతాప దినాల సమయంలో ఎలాంటి ప్రజా వినోద కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అధికార లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. జీర్ణించుకోలేకపోతున్నాం పదేళ్ల ప్రయాణంలో సొంత తమ్ముడిలా, కుటుంబ సభ్యుడిలా ఉండే గౌతమ్‌రెడ్డి అకాలమరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. నాలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని వారందరూ తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు బాధపడుతున్నారు. రాజమోహన్‌రెడ్డి పారీ్టకి పెద్దదిక్కుగా ఉంటూ, తన బిడ్డను పారీ్టకి అప్పగించారు. బిజినెస్‌లో ఎంతో విజయవంతమైన వ్యక్తి రాజకీయాల్లోనూ అంతే ఉన్నతంగా ప్రభుత్వానికి గర్వకారణంగా నిలిచారు. సీఎంకు గౌతంరెడ్డి చిన్ననాటి నుంచీ అత్యంత సన్నిహితుడు. బుధవారం బ్రాహ్మణపల్లెలో జరిగే గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం హాజరవుతారు. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సోదరుడిని కోల్పోయాం సోదరుడిని కోల్పోయిన బాధ నన్ను కలచివేస్తోంది. గౌతమ్‌రెడ్డితో నాకు 12 ఏళ్ల పరిచయం ఉంది. ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాం. ఆయన చిన్న వయసులో వెళ్లిపోయారనే వార్త వినగానే షాక్‌కు గురయ్యాను. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుడు. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విషాద పరిస్థితుల్లో వారి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. – కల్వకుంట్ల తారకరామారావు, తెలంగాణ ఐటీశాఖ మంత్రి ఎంతో సౌమ్యుడు గౌతమ్‌రెడ్డి సౌమ్యుడు, సంస్కారవంతుడు. నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన చిన్న వయసులోనే దూరం కావడం బాధాకరం. గౌతమ్ తాతగారి కాలం నుంచి నాకు వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా. – ట్వీట్లో వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి చిన్న వయసులో మరణించడం బాధాకరం యువ, డైనమిక్ మంత్రిగా గౌతమ్‌రెడ్డి తన బాధ్యతను విధిగా నిర్వర్తించారు. అటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో మరణించడం చాలా బాధాకరం. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. – విశ్వభూషణ్ హరిచందన్, గవర్నర్ ఎదిగినా ఒదిగి ఉండే మనిషి మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణాన్ని జీరి్ణంచుకోలేకున్నాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ఆయన సొంతం. యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ తీవ్రంగా కలచి వేసింది మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం తీవ్రంగా కలచివేస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధికి సమర్థంగా కృషిచేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు తెచి్చపెట్టారు. – ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం అందరితో ఆప్యాయంగా.. ఎంతో సౌమ్యంగా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. ఎంతో దృఢంగా ఉండే ఆయన చిన్నవయసులో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి నిగర్వి, స్నేహశీలి నిగరి్వ, స్నేహశీలి. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా అన్నా అంటూ పలకరిస్తూ ఉండేవారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడు దూరమవడం చాలా బాధాకరం. – అంజాద్‌బాషా, ఉప ముఖ్యమంత్రి ఎంతో పరిశ్రమించారు.. ఏపీలో పెట్టుబడుల కోసం పరిశ్రమలు, ఐటీ మంత్రిగా గౌతమ్‌రెడ్డి ఎంతో శ్రమించారు. నిన్నటివరకు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం దుబాయ్‌లో అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. – ఆళ్ల కాళీకృష్ణశ్రీనివాస్, ఉప ముఖ్యమంత్రి రాజకీయాలకే వన్నె తెచ్చారు.. నీతిమంతుడు.. నిజాయితీపరుడు మా గౌతమ్‌రెడ్డి. సీఎం ఆయనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించడానికి నిరంతరం శ్రమించారు. గౌతమ్ రాజకీయానికే వన్నె తెచి్చన నాయకుడు. – నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి ఆయన మృతి తీరని లోటు.. ఎంతో ఆరోగ్యంగా ఉండే మంత్రి గౌతమ్‌రెడ్డి అకస్మాత్తుగా చనిపోవటం అత్యంత బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. – మేకతోటి సుచరిత, హోంశాఖ మంత్రి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు.. చిన్న వయస్సులోనే గౌతమ్‌రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా చాలా చురుగ్గా పనిచేశారు. నిన్నటివరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు. ఆయన హఠాన్మరణం బాధిస్తోంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అన్నలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం మా అందరి జీవితంలో అత్యంత విషాదకర రోజు. సొంత అన్నలాంటి గౌతమ్‌రెడ్డిని కోల్పోవడం జీరి్ణంచుకోలేకపోతున్నాం. 2009 నుంచి గౌతం అన్నతో ప్రయాణం చేస్తున్నాం. పార్టీలతో సంబంధం లేకుండా, చిన్న వివాదం రాకుండా అందరితో సన్నిహితంగా, నవ్వుతూ ఉండేవారు. – అనిల్‌కుమార్‌యాదవ్, జలవనరులశాఖ మంత్రి అత్యంత సమర్థులు గౌతమ్‌రెడ్డి లేని లోటు తీరనిది. పరిశ్రమలశాఖను అత్యంత సమర్థంగా నిర్వహించారు. వారి కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెపుతున్నాం. – ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారు వివాదరహితుడు.. విద్యావంతుడైన పారిశ్రామికవేత్త గౌతమ్‌రెడ్డి. రాష్ట్రంలో పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పని చేశారు. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహనిర్మాణశాఖ మంత్రి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి.. విదేశాల్లో ఎంఎస్ చేసి ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడగల ఉన్నత విద్యావంతుడు గౌతమ్‌రెడ్డి. రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకువెళ్లడంలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అకాలమరణం షాక్‌కు గురిచేసింది. – పినిపే విశ్వరూప్, సాంఘికసంక్షేమశాఖ మంత్రి జీర్ణించుకోలేకపోతున్నా.. సహచరుడు, మిత్రుడు మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. వారి మృతికి నా వినమ్ర శ్రద్ధాంజలి. – చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి నమ్మలేకపోతున్నా.. సహచర మంత్రిగా, స్నేహితుడిగా ఆయనతో చాలా జ్ఞాపకాలున్నాయి. ఆయన మృతి వార్తను నమ్మలేకపోతున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటకశాఖ మంత్రి -
సోదరుడి మృతిపై మహేశ్‌బాబు తీవ్ర భావోద్వేగం.. ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu pens an emotional note mourning the demise of his elder brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు(56)మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఇక అన్నయ్య మృతిపై తొలిసారి స్పందించిన మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. 'మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాగా కోవిడ్ కారణంగా ప్రస్తుతం మహేశ్ బాబు హోంక్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
ఒక శకం ముగిసింది.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు
Megastar Chiranjeevi Condolence On Konijeti Rosaiah Death: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం (డిసెంబర్ 4) ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధాప్యం కారణంగా రోశయ్య చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేతగా చిరంజీవి అభివర్ణించారు. రాజకీయ విలువలు, అత్యున్నత సాంప్రదాయాలు కాపాడడంలో ఒక యోగిలా సేవ చేశారన్నారు. 'రోశయ్య మరణంతో రాజకీయాలలో ఒక శకం ముగిసింది. రోశయ్య కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. నన్ను రాజకీయాల్లోకి రావాలని ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. వివాదరహితులుగా, నిష్కళంకితులుగా ప్రజా మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య' అని చిరంజీవి పేర్కొన్నారు. Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ — Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021 ఇదీ చదవండి: రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.. -
వైఎస్సార్సీపీ నేత రెహమాన్ మృతి..
-
వైఎస్సార్సీపీ నేత రెహ్మాన్ మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, సుల్తాన్‌బజార్: వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ హెచ్ఏ రెహమాన్ గుండెపోటుతో కన్నుమూశారు. రంజాన్ ఉపవాస దీక్ష లో ఉన్న రెహమాన్ శుక్రవారం ఒంట్లో నలత గా ఉందంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమ యంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయా రని కుటుంబసభ్యులు చెప్పారు. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో నివాసముంటున్న ఆయనకు గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉండే రెహమాన్ ఆకస్మికంగా మరణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం రాత్రి బార్కాస్ శ్మశాన వాటికలో నిర్వహించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రెహమాన్‌కు పార్టీతో కల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. వైఎస్ జగన్‌కు వీరాభిమాని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెహమాన్ వీరాభిమాని. ఆయన పార్టీ అగ్ర నేతలతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవా రు. రెహమాన్‌కు సంబంధించిన శుభ కార్యా ల్లో, ఇఫ్తార్ విందుల్లో జగన్ పాల్గొనేవారు. రెహమాన్ మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్సీ హెచ్ఏ రెహమాన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రెహమాన్‌కు పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. -
కృష్ణా రోడ్డు ప్రమాదం; సీఎం జగన్ దిగ్బ్రాంతి
అమరావతి: కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎం అధికారులతో తెలిపారు. కాగా ఆదివారం ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతిచెందినవారంతా నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతకముందు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రమాద ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం; మంత్రి ఆళ్ల నాని దిగ్ర్బాంతి -
ఘోర రోడ్డు ప్రమాదం; మంత్రి ఆళ్ల నాని దిగ్ర్బాంతి
సాక్షి, కృష్ణా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాత పడగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. కాగా రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. -
ప్రముఖ మలయాళ గాయకుడు మృతి
తిరువనంతపురం: ప్రముఖ మలయాళ గాయకుడు ఎంఎస్ నసీమ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(బుధవారం)తుదిశ్వాస వదిలారు. దూరదర్శన్, ఆకాశవాణి, ఇతర స్టేజ్ ప్రోగ్రామ్‌లలో మొత్తం వెయ్యికి పైగా పాటలు పాడి తన శ్రావ్యమైన గొంతుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు.పలు స్టేజ్ షోలతో పాటు టెలివిజన్ షోలు కూడా నిర్వహించేవారు. రెండు సినిమాల్లో నసీమ్ పాడిన పాటలు ఎంతో ప్రజాధరణ పొందాయి. (మెరిల్ స్ట్రీవ్, గాల్ గాడోట్‌లతో పోల్చుకున్న కంగనా..) 1992,93,95,1997లో నసీమ్ ఉత్తమ గాయకుడిగా కేరళ సంగీత అకాడమీ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా వరుసగా ఉత్తమ మినీ స్క్రీన్ సింగర్ అవార్డును సంపాదించుకున్నారు. అయితే నసీమ్‌కు 16 ఏళ్లు ఉన్నప్పుడే మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నసీమ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేరళలో నసీమ్ గాత్రానికి చాలామంది అభిమానులు ఉన్నారు. కాగా నసీమ్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. (సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు) -
ఘోర రోడ్డు ప్రమాదం: సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి/కొండమల్లేపల్లి: వారంతా రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందినవారు. ఒకే గ్రామానికి చెందిన రోజు వారీ కూలీలు. రోజులాగే గురువారం కూడా కూలి పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నారు. కొద్ది సేపట్లో ఇంటికి వెళ్లేవారు.. కానీ లారీ, బొలెరో రూపంలో తొమ్మిది మందిని మృత్యువు కబళించింది. బొలొరో వాహనాన్ని దాటే ప్రయత్నంలో ఎదురుగా వస్తు న్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా.. తీవ్ర గాయాల పాలైన వారిలో ముగ్గురు మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం వరకు వరినాట్లు వేశారు. పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. పెదఅడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్‌రోడ్ సమీపంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది. రక్తసిక్తమైన రోడ్డు.. అతి వేగంగా ఆటోను లారీ ఢీకొనడంతో అందులో ఉన్న కూలీలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారిలో కొందరు మృతి చెందారు. మిగిలిన వారు తీవ్రగాయాలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేశారు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలసి ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. ప్రమాదంలో ఆటోడ్రైవర్ కొట్టం మల్లేశం (40)తో పాటు నోముల పెద్దమ్మ(51), నోముల సైదమ్మ (28), గొడుగు ఇద్దమ్మ (45), కొట్టం పెద్దమ్మ (42), నోముల అంజమ్మ (46)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాల పాలైన కొట్టం చంద్రమ్మ (68), గొడుగు లింగమ్మ, నోముల అలివేలును హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను మొదట దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సంఘటనా స్థ«లాన్ని గురువారం నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్, డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుంచి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మద్యం సేవించిన లారీడ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించామని, మద్యం సేవించినట్లు తేలిందని చెప్పారు. మద్యం సేవించి ఉండటం, అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఓవర్‌లోడ్‌పై చర్యలు కరోనా నేపథ్యంలో బస్సులు ఎక్కువగా తిరగకపోవడంతో ప్రయాణికులు ఆటోలపై ఆధారపడుతున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఓవర్‌లోడ్‌పై ప్రజలకు అవగాహన ఉండాలని, తాము వాహనాలపై తనిఖీలు చేస్తూ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూలీలంతా గ్రామం నుంచి ఆటో మాట్లాడుకుని పనులకు వెళ్లారని, అదే ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారు వెంకటమ్మ, లింగమ్మ, అనిత, యాదమ్మ, అంజమ్మ, వెంకటమ్మ, రామంజ, నర్సమ్మ, నర్సమ్మ, యాదమ్మ, అంజమ్మ. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి ఈ విషాదకర సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిలో ఆటోడ్రైవర్ కొట్టం మల్లేశ్, అతడి భార్య కొట్టం చంద్రమ్మ, తల్లి కొట్టం పెద్దమ్మలు ఉన్నారు. మల్లేశ్ రోజూ ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తుంటే.. భార్య చంద్రమ్మ, తల్లి పెద్దమ్మలు కూలీకి వెళ్లి చేదోడుగా ఉండేవారు. తల్లిదండ్రుల మృతితో మల్లేష్ పిల్లలు అరవింద్, హరీష్ అనాథలయ్యారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి అంగడిపేట రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. -
వెన్నెలకంటికి తానా అశ్రు నివాళి
పాటల రచయిత వెన్నలకంటి మృతి పట్ల తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా వెన్నెలకంటి కుటుంబ సభ్యులకు తానా ప్రగాడ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు అయన ఆత్మకు శాంతి చేకూరాలని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రకటించారు. డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలలో గత వారం డిసెంబర్ 27 న జరిగిన “సినిమా పాటల్లో సాహిత్యం” అనే 8వ సమావేశంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, డా. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌తో పాటు అతిధిగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న వెన్నెలకంటి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, తరచూ సంభాషించే ఒక మంచి రచయిత అకస్మాత్తుగా కనుమరుగై పోవడం అత్యంత విషాదకరం అన్నారు. తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది సినీగీత రచయితలు అద్భుతమైన పాటలు రాసినప్పటికీ వాటిని జాతీయ స్థాయిలో గుర్తించకపోవడం శోచనీయమని.. ఈ పరిస్థితి మారాలని అన్నారు. -
బిహార్ మంత్రిని కబళించిన కరోనా
పాట్నా : కరోనా మహమ్మారి ఇప్పటికే ఎందరో రాజకీయ నేతల ప్రాణాలను బలితీసుకుంది. తాజాగా జనతాదళ్ (JDU) సీనియర్ నాయకుడు, బిహార్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్ (69) ను కబలించింది. కొన్ని రోజులు క్రితం ఆయనకు కరోనా సోకడంతో పాట్నాలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు. అయితే అంతకుముందు ఆయనకు కిడ్నీ సహా అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి కామత్ మరణించినట్లు ఎయ్‌మ్స్ వైద్యులు శుక్రవారం దృవీకరించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఆయన పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపారు. కామత్ మృతిపట్ల జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ట్వీట్ చేశారు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం కామత్‌ది అంటూ పేర్కొన్నారు. ఆయన మరణం రాజకీయ రంగానికే తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సీఎం ట్వీట్ చేశారు. -
పాశ్వాన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి : కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో ఉన్న దళిత నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్ఎస్పి) చీఫ్ అణగారిన వర్గాలవారిపట్ల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలలో తీరని లోటుగా మిగిలిపోనుందన్నారు.ఈ సందర్భంగా పాశ్వాన్ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు. (చదవండి : కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత) హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ మృతి పట్ల పార్టీ కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
‘దాదా లేని ఢిల్లీని ఊహించలేం’
కోల్‌కతా : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మనల్ని వీడి వెళ్లడం బాధాకరమని, ఆయన మరణంతో ఓ శకం ముగిసిందని అన్నారు. దశాబ్ధాలుగా ప్రణబ్ ముఖర్జీ తనను తండ్రి మాదిరిగా ఆదరించారని చెప్పారు. ఎంపీగా తాను తొలిసారి గెలిచినప్పటి నుంచి ప్రణబ్ ముఖర్జీ తన సీనియర్ కేబినెట్ సహచరుడిగా ఆపై తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అయ్యేవరకూ ఆయనతో అనుబంధం మరువలేనిదని మమతా పేర్కొన్నారు. దివంగత నేతతో ఎన్నో జ్ఞాపకాలున్నాయని, ప్రణబ్ దాదా లేకుండా ఢిల్లీ పర్యటన ఊహించలేనిదని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ అన్ని అంశాల్లోనూ ఆయన లెజెండ్ అని కొనియాడారు. ప్రణబ్ లేని లోటు పూడ్చలేనిదని ఆయన కుమారుడు అభిజిత్, కుమార్తె శర్మిష్ట ముఖర్జీలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి : ‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’ It is with deep sorrow I write this. Bharat Ratna Pranab Mukherjee has left us. An era has ended. For decades he was a father figure. From my first win as MP, to being my senior Cabinet colleague, to his becoming President while I was CM...(1/2) — Mamata Banerjee (@MamataOfficial) August 31, 2020 -
‘శ్రీశైలం మృతుల కుటుంబాలకు 2 కోట్లు ఇవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ప్లాంట్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నివాళులు అర్పించింది. కొవ్వొత్తులు వెలిగించి, మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ మాట్లాడుతూ.. ‘తెలంగాణ జెన్కోలో 20వ తేదీన అనుకోకుండా జరిగిన షార్ట్ సర్క్యూట్‌తో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి ప్లాంట్ కాపాడాలని చూశారు. యువ ఇంజనీర్లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు 2 కోట్ల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎండిని కోరుతున్నాం. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం సీఎండీని కలిసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరాం. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని మా ఉద్యోగులు చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎమర్జెన్సీ కండిషన్లో కూడా మా విద్యుత్ ఉద్యోగులు నిరంతరం పని చేస్తున్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరుగకూడదు అని కోరుకుంటున్నాం. ఆగస్టు 21వ తేదీని విద్యుత్ ఉద్యోగుల అమరుల వీరుల దినోత్సవం ప్రకటించాలని కోరుతున్నాం. ఇదే చివరి ఘటన కావాలని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: శ్రీశైలం ప్రమాదం: మృతుల చివరి సంభాషణ -
విశాఖ ప్రమాదం: మెరుగైన వైద్యం అందించండి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో జరిగిన పేలుడుపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్‌తో ఫొన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. (విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు) విశాఖపట్నం ఫార్మ సిటిలో పేలుడు ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఎవరికి ప్రాణ నష్టం లేకుండా వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం) సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి) -
కరోనా మృతులకు న్యూయార్క్ టైమ్స్ నివాళి
న్యూయార్క్ : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ కరోనా మృతులకు ఘన నివాళి అర్పించింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన ఆదివారం ఎడిషన్ మొదటి పేజీని పూర్తిగా కరోనాతో మరణించిన వారి పేర్లను ప్రచురించింది. 'యూఎస్ డెత్స్ నియర్ 1,00,000, యాన్ ఇన్క్యాలికబుల్ లాస్' అనే ప్రధాన శీర్షికతో ప్రచురణ చేసింది. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 16లక్షలు దాటగా, మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన వారికి నివాళిలర్పిస్తూ న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీని మొత్తం వెయ్యి మంది పేర్లతో పూర్తిగా ఆరు కాలమ్స్‌లో ప్రచురించింది. 'ఇదంతా ఏదో జాబితాలోని పేర్లు మాత్రం అనుకోకండి.. వారంతా కరోనా దాటికి మృతి చెందిన అమెరికా బాధితులంటూ' పేర్కొంది. పేజీలో ఫోటోలు, వార్తలకు బదులు పూర్తిగా మరణించిన వారి పేర్లతో ఎడిషన్‌ను మొదటి పేజీని నింపేయడం విశేషం. ఈ మహమ్మారి దాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,612 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల 10 వేల 657. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 43 వేల 804 మంది మృత్యువాతపడ్డారు. (కరోనా టెస్ట్ చేయించుకోలేదని కడతేర్చారు..! ) -
మాజీ స్పీకర్ అగరాల మృతి
సాక్షి, తిరుపతి : విద్యావేత్త, తిరుపతికి చెందిన తొలితరం నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ స్పీకర్ డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి(87) ఆదివారం మృతి చెందారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 02.30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈయన రెండు పర్యాయాలు తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్‌గా, స్పీకర్‌గా పనిచేసి అందరి మన్ననలు పొందారు. ఆయన స్వగ్రామం రేణిగుంట సమీపంలోని తూకివాకం. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు తిరుపతిలోనే స్థిర పడగా, కుమార్తె చెన్నైలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ...మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి తెలిపారు. డాక్టర్ ఈశ్వర రెడ్డి తిరుపతి శాసన సభ నియోజకవర్గం నుంచి 1967, 1978లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగ దేశం ప్రభంజనంలో 1983లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.తిరుపతి, రేణిగుంటలలో విద్యా సంస్థలు స్థాపించి విద్యాదానం చేస్తున్నారు. ఆచార్య ఎన్జీరంగా, మాడభూషి అనంతశయనం అయ్యంగార్లకు శిష్యుడిగా గుర్తింపు పొందారు. 1982 సెప్టెంబర్ 7 నుంచి 1983 జనవరి 16వరకు స్పీకర్‌గా పనిచేశారు. అంతకు ముందు 1981 మార్చి 23 నుంచి 1982 సెప్టెంబర్ 6 వరకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. స్వతంత్ర పార్టీ నుంచి ఎన్నిక: 1962లో డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌లో చేరి స్వతంత్ర అభ్యర్థి గురవారెడ్డిపై గెలుపొందారు. అప్పటి సీఎం టీ. అంజయ్య ఈయనను డిప్యూటీ స్పీకర్‌గా నియమించారు. అనంతరం ఇందిరాగాంధి ఆశీస్సులతో స్పీకర్‌గా నియమితులయ్యారు. 1983లో టీడీపీ ఏర్పాటు చేశాక,టీడీపీ ప్రభంజనంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్టీరామారావుపై పోటీ చేసి ఓడిపోయారు. విద్యావేత్త: డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి మద్రాస్ రెసిడెన్సీ కళాశాలనుంచి డిగ్రీ, ప్రెసిడెన్సీ కళాశాల నుంచిఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. మద్రాస్ లా కళాశాల నుంచి బీఎల్ డిగ్రీ పొందారు. అలాగే రాంచీ యూనివర్సిటీలో పరిశోధనలు చేసి రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. విద్యాసంస్థలు నెలకొల్పడమే కాకుండా అనేక పుస్తకాలు రచించారు. ఎస్వీయూ, ఏపీ వ్యవసాయ విశ్వ విద్యాలయాలకు సిండికేట్ సభ్యుడిగా పనిచేశారు. ఉస్మానియా వర్సిటీకి సెనెట్ మెంబర్‌గా పనిచేశారు. సోమవారం అంత్యక్రియలు: డాక్టర్ అగరాల ఈశ్వర రెడ్డి భౌతిక కాయానికి సోమవారం సాయంత్రం తిరుపతిలోని గోవింతదామంలో అంత్యక్రియలు జరపనున్నారు. అగరాల మరణ వార్త తెలియగానే తిరుపతి యువనేత భూమన అభినయ్ రెడ్డి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి,సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తిరుపతికి లోటని చెప్పారు. -
తహశీల్దార్ హత్యపై కేసీఆర్ విచారం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. నేరస్తులను పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
'నా భర్త చనిపోయే వరకు ఇబ్బందులు పెట్టారు'
మాచర్ల: పార్టీలో విబేధాలు ఉన్న మాట వాస్తవమేనని, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేస్తామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం పట్టణంలోని 15వ వార్డులో ఉన్న చైర్పర్సన్ శ్రీదేవి ఇంటికి విచ్ఛేసి శ్రీదేవిని, భర్త మల్లిఖార్జునరావు తండ్రి బ్రహ్మయ్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 'నా కుటుంబాన్ని రాజకీయాలలోకి దించి నా భర్త చనిపోయే వరకు ఇబ్బందులు పెట్టారు. నా భవిష్యత్తేమిటో తేల్చండి.. అప్పుల పాలై అండదండలు లేక అల్లాడిపోయే విధంగా మా కుటుంబాన్ని పార్టీ నాయకులే రోడ్డుపాల్జేశారు. న్యాయం చేయాలి' అంటూ పరామర్శకు వచ్చిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముందు శ్రీదేవి బోరున విలపించారు. 'మా కుటుంబానికి రాజకీయాలు తెలియవు, మీరు తప్పితే ఎవరూ గెలవరని చెప్పి మమ్మల్ని రంగంలోకి దింపి ప్రతిరోజూ వేధించి నా భర్త మానసిక ఒత్తిడికి గురై మృతిచెందేలా చేశారు. అప్పులపాలైన మేము ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులలో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం' శ్రీదేవి, బ్రహ్మయ్య ఆయన కుమారుడు సుబ్బారావు తెలిపారు. రెండేళ్లుగా పార్టీ నాయకులు ఏ విధంగా వేధించి ఎటువంటి అనారోగ్యం లేని మల్లిఖార్జునరావు మృతిచెందే వరకు బాధించిన విషయాన్ని కన్నీటితో యరపతినేనికి వివరించారు. దీనికి స్పందించిన యరపతినేని మాట్లాడుతూ రాజకీయాలలో ఆటుపోట్లుంటాయి, మానసిక ఒత్తిడితో మల్లిఖార్జునరావు మృతిచెందడం దురదృష్టకరం అన్నారు. కుటుంబానికి న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా తీవ్రంగా నష్టపోయిన చైర్పర్సన్ కుటుంబానికి న్యాయం చేసేందుకు నా వంతుగా కృషి చేస్తాను. అధిష్టానంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చైర్పర్సన్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చలమారెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు, నాయకులు రంగా సత్యం, మాజీ ఎంపీపీ సానికొమ్ము పుల్లారెడ్డి, నాయకులు పలువురు పాల్గొన్నారు. -
రాయపాటికి పలువురి పరామర్శ
నగరంపాలెం (గుంటూరు) : నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును బుధవారం రాష్ట్ర హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పరామర్శించారు. లక్ష్మీపురంలోని ఎంపీ నివాసంలో రాయపాటి సతీమణి లీలాకుమారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అలాగే, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, చైతన్య కళాశాల డైరెక్టర్ బీఎస్ రావు, శాసనసభ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, నగర ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తదితరులు రాయపాటిని పరామర్శించిన వారిలో ఉన్నారు.