సాక్షి, సుల్తాన్‌బజార్: వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఏ రెహమాన్ గుండెపోటుతో కన్నుమూశారు. రంజాన్ ఉపవాస దీక్ష లో ఉన్న రెహమాన్ శుక్రవారం ఒంట్లో నలత గా ఉందంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమ యంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయా రని కుటుంబసభ్యులు చెప్పారు.
హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో నివాసముంటున్న ఆయనకు గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉండే రెహమాన్ ఆకస్మికంగా మరణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం రాత్రి బార్కాస్ శ్మశాన వాటికలో నిర్వహించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రెహమాన్‌కు పార్టీతో కల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు.
వైఎస్ జగన్‌కు వీరాభిమాని
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రెహమాన్ వీరాభిమాని. ఆయన పార్టీ అగ్ర నేతలతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవా రు. రెహమాన్‌కు సంబంధించిన శుభ కార్యా ల్లో, ఇఫ్తార్ విందుల్లో జగన్ పాల్గొనేవారు.
రెహమాన్ మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఏ రెహమాన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రెహమాన్‌కు పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment