ha rehaman
-
వైఎస్సార్సీపీ నేత రెహమాన్ మృతి..
-
వైఎస్సార్సీపీ నేత రెహ్మాన్ మృతి.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, సుల్తాన్‌బజార్: వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ హెచ్ఏ రెహమాన్ గుండెపోటుతో కన్నుమూశారు. రంజాన్ ఉపవాస దీక్ష లో ఉన్న రెహమాన్ శుక్రవారం ఒంట్లో నలత గా ఉందంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమ యంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయా రని కుటుంబసభ్యులు చెప్పారు. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో నివాసముంటున్న ఆయనకు గతంలో రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సన్నిహితంగా ఉండే రెహమాన్ ఆకస్మికంగా మరణించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం రాత్రి బార్కాస్ శ్మశాన వాటికలో నిర్వహించారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రెహమాన్‌కు పార్టీతో కల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. వైఎస్ జగన్‌కు వీరాభిమాని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెహమాన్ వీరాభిమాని. ఆయన పార్టీ అగ్ర నేతలతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవా రు. రెహమాన్‌కు సంబంధించిన శుభ కార్యా ల్లో, ఇఫ్తార్ విందుల్లో జగన్ పాల్గొనేవారు. రెహమాన్ మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్సీ హెచ్ఏ రెహమాన్ మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. రెహమాన్‌కు పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని జగన్ గుర్తు చేసుకున్నారు. పార్టీ కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. -
‘పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ బ్రోకర్’
సాక్షి, అనంతపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ బ్రోకర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో జనసేన పనిచేస్తోందని ఆరోపించారు. రహస్య పొత్తులతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న హత్యారాజకీయాలు పవన్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్న చంద్రబాబు ఐదేళ్లలో ఏం సాధించారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల భవిష్యత్ నా బాధ్యత అనటం చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. -
పవన్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ బచ్చా అని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ.రెహమాన్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినిమాల్లో నటించినట్లు రాజకీయాల్లో నటిస్తే కుదరదని హెచ్చరించారు. వైఎస్ పాలన గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిదని ప్రశ్నించారు. పవన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, వెంటనే పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, అన్యాయాలను పక్కన పెట్టి వైఎస్సార్ గురించి మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఐదేళ్లకోసారి పార్టీలు మారుస్తూ కాపురం చేసే చంద్రబాబు, ఆర్నెల్లకోసారి పెళ్లాలను మార్చే పవన్ ఒక్కటయ్యారని ఆరోపించారు. ఏపీలోని దోచుకున్న అవినీతి సోమ్ము తెలంగాణలో ఖర్చు పెడుతున్నారని, విచ్చలవిడిగా టీడీపీ నాయకుల ఇళ్లలో నగదు దొరుకుతోందని తెలిపారు. తిత్లీ తుపాను బాధితులను మరచి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. నాడు వైఎస్సార్ ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, అందుకే మైనార్టీల భుజాలపై మహానేత వైఎస్సార్ ఉన్నారని చెప్పారు. వైఎస్ ఆశయ సాధన కోసం జగన్ పాటుపడుతున్నట్లు వివరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రజాకూటమి, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో స్వర్ణయుగం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘నారా హమారా.. టీడీపీ హమారా’ కేసు వాయిదా
హైదరాబాద్: రెండు నెలల క్రితం గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’బహిరంగ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ముస్లిం యువకులపై దాడిచేసి అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్ఎ రెహమాన్ దాఖలు చేసిన ఫిర్యాదు విచారణ డిసెంబరు 17వ తేదీకి వాయిదా పడింది. ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ నంద్యాలకు చెందిన ముస్లిం యువకులు ఆ బహిరంగసభలో శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చితకబాదారు. అంతటితో ఆగకుండా అక్రమ కేసులు బనాయించారు. ఈ ఘటనను సవాలు చేస్తూ ఆగస్టు 31న మానవ హక్కుల కమిషన్‌లో రెహమాన్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారకులైన పోలీసులపై, వారిని ప్రేరేపించిన సీఎం చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ అక్టోబరు 22కి వాయిదా వేస్తూ సమగ్ర నివేదిక ను అందజేయాలంటూ గుంటూరు అర్బన్ ఎస్పీకి నోటీసులు జారీచేసింది. అయితే.. సోమ వారం గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం నుంచి ఎవరూ హాజరుకాలేదని రెహమాన్ తెలిపారు. -
చంద్రబాబు ముస్లింల మైనార్టీ ద్రోహి
-
‘ముస్లింలను చంద్రబాబు వంచించారు’
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింల మైనార్టీ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ విమర్శించారు. ముస్లింలను చంద్రబాబు వంచించారని, అందుకు ఆయన కేబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేకపోవడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు ముస్లిం నేతలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రెహమాన్.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దేనని తెలిపారు. సమస్యలపై నిలదీస్తే ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేస్తారా అంటూ వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వి.ఖాదర్ బాషా ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామని, ఇమమ్‌లకు రూ. 10 వేల ఇస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా ఖాదర్ బాషా గుర్తు చేశారు. ఈనెల12న ముస్లింలతో వైఎస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని రెహమాన్ పేర్కొన్నారు. దానికి ముస్లింలు అంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
గుంటూరు ఘటనపై నివేదిక కోరిన హెచ్చార్సీ
హైదరాబాద్: గుంటూరు బి.ఆర్.స్టేడియంలో ఆగస్టు 28న ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ప్లకార్డులు ప్రదర్శించిన తొమ్మిది మంది యువకులపై జరిగిన హింసాత్మక సంఘటనలపై సమగ్ర నివేదికను అందజేయాలంటూ గుంటూరు అర్బన్ ఎస్పీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదస్సులో తమ నిరసనను శాంతియుతంగా తెలియజేసిన వారిపై కక్ష సాధింపు పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ యువకులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ.రెహమాన్ గత నెల 31వ తేదీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఈ కేసును మంగళవారం హెచ్చార్సీ విచారణకు స్వీకరించింది. కేసు విచారణను అక్టోబరు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం హెచ్.ఎ.రెహమాన్ మాట్లాడుతూ సదస్సులో మైనార్టీల కోసం సీఎం చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిస్తారని తొలుత అంతా ఆశించారన్నారు. అయితే ఆయన ప్రసంగంలో కొత్తదనం లేకపోవడంతో మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సభలో ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన సీఎం అందుకు విరుద్ధంగా పోలీసులను ప్రయోగించి వారిని సభ నుంచి తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముస్లింల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని రెహమాన్ హెచ్చరించారు. సభలో నిరసన చేస్తే తప్పా సభలో హక్కులను కాలరాస్తున్నారని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తే తప్పా.? అని ఏపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా ప్రశ్నించారు. పార్లమెంటులో మీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలపలేదా.? మరి వారిని అరెస్టు చేసి కేసులు పెట్టలేదే అన్నారు. విజయవాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ ఎస్కె.మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను టీడీపీ చిన్నచూపు చూస్తోందన్నారు. బాధిత యువకులను పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. హెచ్.ఎ.రెహమాన్ తో పాటు విజయవాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ ఎస్కె.మహ్మద్ ఇక్బాల్, రాష్ట్ర నేతలు మహ్మద్ ఇసాక్, విజయవాడ అధ్యయన కమిటీ నిర్వాహకులు ఎం.ఎస్.బేగ్, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి హఫీజ్ ఖాన్, నంద్యాల నియోజకవర్గం ఇన్‌ఛార్జి రవి శిల్పా ఉన్నారు. -
హక్కులు అడిగితే అరెస్టు చేస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ. రెహమాన్ ఆరోపించారు. గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయకపు ముస్లిం మైనార్టీ యువకులను టీడీపీ ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసిందని ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసు జులం కొనసాగుతోందన్నారు. న్యాయపరమైన హక్కుల కోసం నినదించిన వారిపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. అమాయకులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇలా చేయడం ఆర్టికల్ 14 ప్రకారం హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. ఈ హక్కులను ఉల్లంఘించిన ఏపీ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, ముస్లిం యువకులను అరెస్టు చేయడానికి ప్రోత్సహం అందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెహమాన్ శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్లో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ ఏపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషాతో కలిసి ఫిర్యాదు చేశారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబుకు ముస్లిం మైనార్టీలు ఏనాడూ గుర్తుకు రాలేదని మండిపడ్డారు. చంద్రబాబు కేబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు ముస్లిం మైనార్టీలను కరివేపాకులా వాడుకుని తీసిపారేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ఏపీ అధ్యక్షులు ఖాదర్ బాషా మాట్లాడుతూ... నారా బట్టేబాజ్... టీడీపీ దోఖేబాజ్ అని నిప్పులు చెరిగారు. సదస్సులో చెప్పులు విసిరితే అరెస్టులు చేయాలి గానీ శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. -
వైఎస్సార్సీపీ నేత రెహమాన్‌కు గుండెపోటు
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.ఎ.రెహమాన్‌కు సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రెహమాన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇంతకు ముందు గుండెనొప్పి రావడంతో వైద్యులు స్టెంట్ వేశారు. సోమవారం మళ్లీ గుండెపోటు వచ్చింది. విషయం తెలుసుకున్న బంధువులు, పార్టీ నేతలు ఆయనను చూసేందుకు వస్తున్నారు. రెహమాన్ త్వరగా కోలుకోవాలని కింగ్‌కోఠి వాసులు మసీద్‌లో ప్రార్థనలు చేశారు. -
వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం
తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ.రెహ మాన్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు జిల్లాల్లో పర్యటిం చనున్నట్లు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి హెచ్ఎ రెహమాన్ వెల్లడించారు. హైదరాబాద్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మనసులో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే ఉన్నాయని, వాటిని ఇరు ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వాలు పట్టిం చుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లోపించిందని, పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజల ను మోసగించి అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా తనను నియమించిన పార్టీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వై.వి.సుబ్బారెడ్డికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై ఉద్యమించనున్నట్లు తెలి పారు. నాంపల్లిలోని గండిపేట్ మైసమ్మ ఆలయం నుంచి పర్యటన ప్రారంభిస్తానన్నారు. అనంతరం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పర్యటన సాగుతుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ప్రస్తావన తీసుకురాలేదని, దానిని వెంటనే అమలు చేయాలన్నారు. నాడు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ వల్ల మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ పార్టీ తెలంగాణ జిల్లాల్లో ముందుకుసాగుతుందన్నారు.