ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింల మైనార్టీ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ విమర్శించారు. ముస్లింలను చంద్రబాబు వంచించారని, అందుకు ఆయన కేబినెట్‌లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేకపోవడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు ముస్లిం నేతలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రెహమాన్.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దేనని తెలిపారు.