
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్.ఎ.రెహమాన్‌కు సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రెహమాన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇంతకు ముందు గుండెనొప్పి రావడంతో వైద్యులు స్టెంట్ వేశారు. సోమవారం మళ్లీ గుండెపోటు వచ్చింది. విషయం తెలుసుకున్న బంధువులు, పార్టీ నేతలు ఆయనను చూసేందుకు వస్తున్నారు. రెహమాన్ త్వరగా కోలుకోవాలని కింగ్‌కోఠి వాసులు మసీద్‌లో ప్రార్థనలు చేశారు.