
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింల మైనార్టీ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ విమర్శించారు. ముస్లింలను చంద్రబాబు వంచించారని, అందుకు ఆయన కేబినెట్‌లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేకపోవడమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు ముస్లిం నేతలతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రెహమాన్.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌దేనని తెలిపారు.
సమస్యలపై నిలదీస్తే ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేస్తారా అంటూ వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వి.ఖాదర్ బాషా ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామని, ఇమమ్‌లకు రూ. 10 వేల ఇస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప‍్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా ఖాదర్ బాషా గుర్తు చేశారు. ఈనెల12న ముస్లింలతో వైఎస్ జగన్ ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని రెహమాన్ పేర్కొన్నారు. దానికి ముస్లింలు అంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment