వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తాం
తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ.రెహ మాన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు జిల్లాల్లో పర్యటిం చనున్నట్లు పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎ రెహమాన్ వెల్లడించారు. హైదరాబాద్లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మనసులో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే ఉన్నాయని, వాటిని ఇరు ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. రెండు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వాలు పట్టిం చుకోవడం లేదని మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లోపించిందని, పచ్చి అబద్ధాలు మాట్లాడి ప్రజల ను మోసగించి అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా తనను నియమించిన పార్టీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, వై.వి.సుబ్బారెడ్డికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 9వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై ఉద్యమించనున్నట్లు తెలి పారు. నాంపల్లిలోని గండిపేట్ మైసమ్మ ఆలయం నుంచి పర్యటన ప్రారంభిస్తానన్నారు.
అనంతరం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో పర్యటన సాగుతుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ప్రస్తావన తీసుకురాలేదని, దానిని వెంటనే అమలు చేయాలన్నారు. నాడు వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ వల్ల మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ పార్టీ తెలంగాణ జిల్లాల్లో ముందుకుసాగుతుందన్నారు.