
సాక్షి, అనంతపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ బ్రోకర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో జనసేన పనిచేస్తోందని ఆరోపించారు. రహస్య పొత్తులతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న హత్యారాజకీయాలు పవన్‌కు కనిపించడంలేదా అని ప్రశ్నించారు. మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్న చంద్రబాబు ఐదేళ్లలో ఏం సాధించారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల భవిష్యత్ నా బాధ్యత అనటం చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు.