పవన్‌, నాగబాబుపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Sri Reddy Sensational Comments On Pawan Kalyan And Nagababu | Sakshi
Sakshi News home page

పవన్‌, నాగబాబుపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published Tue, Apr 9 2019 8:56 AM | Last Updated on Tue, Apr 9 2019 3:51 PM

Sri Reddy Sensational Comments On Pawan Kalyan And Nagababu - Sakshi

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి చర్చకు తెరలేపి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆయన సోదరుడు, జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థి నాగబాబుపై నిప్పులు చెరిగారు. ‘పవన్‌ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కూడా కాదు. ఆయన ఓ నటుడు మాత్రమే. దయచేసి ఆయన మాటలను నమ్మి ఉన్మాదులుగా మారొద్దు’ అని హితవు పలికారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి ఎన్నికల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. ఓటు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రుణం తీర్చుకుని, అభివృద్ధి చేసుకోవాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

నాగబాబుకు ఓటెయ్యద్దని చెప్పిన శివాజీరాజాను నోటికి వచ్చినట్టు తిట్టిన దిలీప్‌ సుంకరపై శ్రీరెడ్డి మండిపడ్డారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని దిలీప్‌ సుంకరను హెచ్చరించారు. ‘ఓ మహిళగా పవన్‌ తల్లి గురించి మాట్లాడిన మాటలకు సారీ చెబుతున్నా. జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం అంటూ కామెంట్లు చేస్తారు. రౌడీయిజం చేస్తారా. అసలేం తెలుసురా మీకు పవన్‌, నాగబాబు గురించి. నాగబాబుకు ఎంత పొగరు. సాటి ఆర్టిస్టులకు డబ్బులు లేనంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా. నరసాపురం నియోజకవర్గంలో పదివేల రూపాయల గుప్తదానం చేశావా. కనీసం పది రూపాయలు ఎవరికైనా దానం చేశావా. వరుణ్‌తేజ్‌, నిహారికలను తీసుకొస్తే గెలుస్తావా. మీ తమ్ముడు వంశపారంపర్య రాజకీయాలు చేయము అన్న ఉత్తముడు, ఉదాత్తుడు కదా. మరి నిన్నెందుకు తీసుకొచ్చాడు. రాజకీయ నాయకులను వెధవలు, రా అంటున్నావు. ఏరా పోరా అంటున్న మిమ్మల్ని నేను కూడా అంటా. మీరే నాకు ఆ హక్కు ఇచ్చారు. ఏందిరా పవన్‌ కల్యాణ్‌ నీ యాక్టింగ్‌లు. బొచ్చెలో తినడం. పవన్‌ ఏం చేశావని నీ అన్నను ఎంపీగా గెలిపించాలి. నువ్వు చెప్పిన వాళ్లందరికీ ఓటు వేయాలా.

కాపుల్లో ఉత్తములు ఉన్నారు. అధోగతి పాలైన వారు ఉన్నారు. కమ్మ, రెడ్డి, కాపు అయినా ప్రతీ కులంలో చెడ్డోడు ఉన్నాడు మంచోడు ఉన్నాడు. పవన్‌ మంచోడు కాదు అలా అని చెడ్డోడు కాదు. రాజకీయంగా కొన్ని లక్షణాలు ఉండాలి. చదువు రాని వాడివి ఏవిధంగా రా ఐఏఎస్‌ల ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావు. టెన్త్‌ సర్టిఫికెట్లు దొంగతనంగా సృష్టించావు. సీఎం అయితే వందల కోట్ల ఫైల్స్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించావు. కారు లేదంటావు. ఈఎంఐలు కట్టలేనంటావు. మరి నీకు హెలికాప్టర్లు ఎక్కడినుంచి వచ్చాయి. కానిస్టేబుల్‌ కొడుకునంటావు. ఐటీ కోట్లకు కోట్లు కట్టానంటావు. డబ్బుల్లేవంటావు. పైత్యం ఉన్న ఇలాంటి వ్యక్తిని కొంతమంది ఉన్మాదులు, కాపు వ్యక్తి సీఎం కావాలనే వ్యక్తులు నీ వెనుక తిరగొచ్చు. కనీసం అబద్ధాలైనా కరెక్టుగా గుర్తు పెట్టుకుని చెప్పు. ఆంధ్రప్రదేశ్‌ నిధులు ఏం కావాలి. కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి ఉపయోగం అన్న విషయాలు తెలుసా. పవన్‌ కల్యాణ్‌ అనే వెధవకు, దరిద్రుడైన నాగబాబుకి, కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమందికి ఓటు వేసే ముందు ఆలోచించండి. రాజకీయ నాయకులు మాకు సేవచేయడానికి మాత్రమే మీరున్నది. దయచేసి మీ ఓటు ఎవరికి వేయాలో ఆలోచించి వేయండి’ అని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement