
విశాఖపట్నం: భువనేశ్వరి దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. అవినీతిపరుడి కోసం దీక్ష చేసి గాంధీని అవమానించారని మండిపడ్డారు. లంచాలు తిని కంచాలు కొడితే చేసిన తప్పులు పోతాయా..? అని ప్రశ్నించారు. భువనేశ్వరి చేసిన దీక్ష సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే అని ఎద్దేవా చేశారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా చంద్రబాబు.. ఆర్థిక ఉగ్రవాది అంటూ నిప్పులు చెరిగారు.
'చంద్రబాబు కడిగిన ముత్యం కాదు, అవినీతి ముత్యం. దీక్ష పేరుతో భువనేశ్వరి ఎస్సీ, ఎస్టీ మహిళా నేతలను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడనీ ఎన్టీఆర్ చెప్పారు. అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య అని పేరు పెడితే బాగుంటుంది. 30 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బతుకు చంద్రబాబుది.' అని వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.
'చంద్రబాబు అక్రమ ఆస్తులుపై భువనేశ్వరి దీక్షల చేయాలి. చంద్రబాబును మించిన అవినీతి సైకో మరొకరు లేరు. టిడిపి నేతలకు పళ్లు రాలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి' అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తోడు దొంగల ‘రింగ్’!
Comments
Please login to add a commentAdd a comment