diksha
-
ఆమె నెగ్గింది.. అమ్మ గెలిచింది
‘మా అమ్మాయి దీక్ష అస్సాం సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయింది తెలుసా!’ అంటూ ఎంతోమందికి సంతోషంగా చెప్పుకుంటోంది బేబీ సర్కార్. దీక్ష పసిగుడ్డుగా ఉన్నప్పుడు బేబీ సర్కార్‌ను అత్త నిర్దాక్ష్యిణ్యంగా ఇంటి నుంచి వెళ్లగొట్టింది. అత్త దృష్టిలో బేబీ సర్కార్ చేసిన నేరం... ఆడపిల్లను కనడం!‘ఆడపిల్ల పుట్టింది’ అనే మాట చెవిన పడగానే ఆ అత్త అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. కోడలు బేబీ సర్కార్‌ను తిట్టడం మొదలుపెట్టింది. ఆ అత్త నలుగురు కొడుకులకూ ఆడపిల్లలు జన్మించారు. ‘ఎవరైతే ఏమిటి!’ అనుకోలేదు ఆమె. చిన్న కొడుకుకు ఎలాగైనా మగబిడ్డ పుడుతుందని ఆశించింది. అంతేనా...‘నువ్వు కూడా ఆడపిల్లనే కంటే ఇంటి నుంచి గెంటేస్తాను’ అని కోడలిని హెచ్చరించింది. అయితే ఆమె కోరుకున్నట్లు జరగలేదు. బేబీ సర్కార్ కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కోపం తట్టుకోలేని అత్త కోడలిని ఇంటి నుంచి గెంటేసింది. ఇంత జరిగినా....‘అలా మాట్లాడడం తప్పమ్మా...ఇలా చేయడం తప్పమ్మా’ అంటూ బేబీ సర్కార్ భర్త నుంచి చిన్న పదం కూడా బయటికి రాలేదు.‘‘నా భర్త మా అత్తను వ్యతిరేకించలేదు. ‘మా అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. అమె చేసినదాంట్లో తప్పేం ఉంది’ అన్నట్లుగా మాట్లాడేవాడు’’ అని భర్త గురించి చెప్పింది అస్సాంలోని శ్రీభూమి జిల్లాకు చెందిన బేబీ సర్కార్. అత్త ఇంటి నుంచి గెంటేయడంతో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. కొంత కాలం తరువాత భర్త చనిపోయాడు. ఆ తరువాత అత్త చనిపోయింది. మరోవైపు చూస్తే తల్లిదండ్రుల ఇంట్లో ఉండడం కష్టంగా అనిపించింది. వారికే పూటగడవడం కష్టంగా ఉంది. దీంతో కూతురు దీక్షతో కలిసి అక్క బీజోయ ఇంట్లో ఉండేది. బీజోయ ఎల్ఐసీలో ఉద్యోగం చేసేది.అక్క డిప్రెషన్‌తో బాధ పడుతుండడంతో ఆమె కుటుంబాన్ని కూడా తానే చూసుకునేది. దీక్ష పదవతరగతి పూర్తి చేసేవరకు అక్క ఇంట్లోనే ఉంది. ఆ తరువాత తల్లీకూతుళ్లు ఒక అద్దె ఇంట్లోకి మారారు. కుమార్తె చదువు కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టింది బేబీ సర్కార్. దీక్ష చదువు కోసం సర్కార్ అప్పు కూడా చేయాల్సి వచ్చేది. తల్లీకూతుళ్లు ఆచితూచి ఖర్చు చేస్తుండేవారు. ఒకవైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే మరోవైపు యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది దీక్ష. ఈ చానల్ ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకు ఉపయోగపడేది. అస్సాం సివిల్ సర్వీసెస్ పరీక్షలో దీక్ష విజయం సాధించడంతో తల్లీకూతుళ్ల కష్టాలకు తెరపడ్డట్లయింది.‘విజయాలు సాధించడం అనేది అబ్బాయిలకు మాత్రమే పరిమితం కాదని నా కుమార్తె విజయం నిరూపించింది’ అంటుంది బేబీ సర్కార్. ‘మా అమ్మ, పెద్దమ్మ కష్టాలు, త్యాగాల పునాదిపై సాధించిన విజయం ఇది. అమ్మ నా కోసం చాలా కష్టపడింది. ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆమెకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటాను’ అంటుంది ట్రైనీ ఏసీఎస్ (అస్సాం సివిల్ సర్వీస్) ఆఫీసర్ అయిన దీక్ష. -
'అవినీతిపరుడి కోసం దీక్ష.. గాంధీని అవమానించడమే..'
విశాఖపట్నం: భువనేశ్వరి దీక్ష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. అవినీతిపరుడి కోసం దీక్ష చేసి గాంధీని అవమానించారని మండిపడ్డారు. లంచాలు తిని కంచాలు కొడితే చేసిన తప్పులు పోతాయా..? అని ప్రశ్నించారు. భువనేశ్వరి చేసిన దీక్ష సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే అని ఎద్దేవా చేశారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా చంద్రబాబు.. ఆర్థిక ఉగ్రవాది అంటూ నిప్పులు చెరిగారు. 'చంద్రబాబు కడిగిన ముత్యం కాదు, అవినీతి ముత్యం. దీక్ష పేరుతో భువనేశ్వరి ఎస్సీ, ఎస్టీ మహిళా నేతలను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. చంద్రబాబు పెద్ద అవినీతి పరుడనీ ఎన్టీఆర్ చెప్పారు. అవినీతి చక్రవర్తికి అబద్ధాల భార్య అని పేరు పెడితే బాగుంటుంది. 30 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బతుకు చంద్రబాబుది.' అని వరుదు కళ్యాణి దుయ్యబట్టారు. 'చంద్రబాబు అక్రమ ఆస్తులుపై భువనేశ్వరి దీక్షల చేయాలి. చంద్రబాబును మించిన అవినీతి సైకో మరొకరు లేరు. టిడిపి నేతలకు పళ్లు రాలగొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి' అని వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: తోడు దొంగల ‘రింగ్’! -
తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసమే.. నిరుద్యోగ దీక్ష: వైఎస్ షర్మిల
కవాడిగూడ (హైదరాబాద్): నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1,200 మంది విద్యార్థులు బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే సీఎం గద్దెనెక్కిన కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అందుకే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. బుధవా రం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద టీ–సేవ్ ఆధ్వర్యంలో ష ర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కొట్లాడాలంటే కూడా కోర్టుల నుంచి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. అయినా దీక్ష అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ అందించిన పాలన రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు నోరు మూసుకుని కూర్చుంటే, తాను వారిపక్షాన నిలబడి కొట్లాడుతున్నానని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణిని అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ–సేవ్ తరఫున కేసీఆర్‌కు పది ప్రశ్నలు పంపుతున్నామని, దమ్ముంటే వాటికి సమాధానం చెప్పాలని ష ర్మిల సవాల్ విసిరారు. విద్యార్థులు రాజకీయ శక్తిగా ఎదిగి పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని గద్దర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద ఉద్యమం ఉంది తప్ప డబ్బులు లేవని, ఇప్పుడు మాత్రం డబ్బులే మిగిలాయని పేర్కొన్నారు. దీక్షలో ప్రొఫెసర్ కాశీం, వైఎస్ఆర్టీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్‌తో శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టే నిరాహార దీక్షకు అంతా సిద్ధమైంది. జంతర్‌మంతర్ వేదికగా జరిగే ఈ దీక్షకు భారత జాగృతి నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభం కానుండగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షకు 18 రాజకీయ పా ర్ణీలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించగా, వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల నేతలు, ప్రతినిధులు హాజరు కానున్నారు. మద్దతుపై కాంగ్రెస్‌తోనూ చర్చలు... మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేపడుతున్న దీక్షకు సంఘీభవం తెలపాలని వివిధ రాజకీయ పా ర్ణీల నేతలను భారత జాగృతి నేతలు సంప్రదించారు. అందుకు బీఆర్ఎస్ సహా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డీ, జేఎమ్ఎమ్ వంటి పా ర్ణీలు సమ్మతించాయి. కాగా ఈ దీక్షకు సంఘీభావంగా పార్టీ తరఫున ప్రతినిధులను పంపాలని కాంగ్రెస్ అగ్రనేతలను సైతం సంప్రదించామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ నుంచి ప్రతినిధుల హాజరుపై మాత్రం స్పష్టత రాలేదు. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభిస్తారు. ఈ మేరకు గురువారం సీతారాం ఏచూరిని కవిత కలిసి శుక్రవారం నాటి దీక్ష ప్రారంభ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వా నించారు. ఇక దీక్ష ముగింపునకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితరులు పాల్గొనే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. దీక్షలో సుమారు 5వేల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీక్ష కోసం వివిధ వర్శిటీల నుంచి యువకులు, మహిళలను పెద్ద ఎత్తున తరలించేలా నేతలు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో బీజేపీ వేదిక మార్పు .. కాగా జంతర్‌మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్షా స్థలి విషయంలో కొంత వివాదం తలెత్తింది. దీక్షలో 5వేల మంది పాల్గొనేందుకు వీలుగా తొలుత విశాలమైన దీక్షా స్థలిని కేటాయించిన ఢిల్లీ పోలీసులు గురువారం మధ్యాహ్నం దానిని కుదించినట్లు కవితకు సమాచారమిచ్చారు. దీక్షకు మొదటగా కేటాయించిన ప్రాంతాన్ని విభజించి టిబెట్ అంశంపై జరిగే ఆందోళన, ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళనకు స్థలం కేటాయించారు. ఈ నేపథ్యంలో కవిత ఢిల్లీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో దీక్షాస్థలికి పక్కనే బీజేపీ ఆందోళనకు కేటాయించిన స్థలాన్ని ఢిల్లీ పోలీసులు మార్చారు. భారత జాగృతి దీక్ష, బీజేపీ ఆందోళన పక్క పక్కనే జరిగితే ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనే ఉద్దేశ్యంతో బీజేపీ కార్యక్రమ వేదికను దీన్ దయాళ్ మార్గ్ ప్రాంతానికి మార్చారు. -
ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!!
మొన్నటి వరకు వాళ్లిద్దరూ ఉప్పు-నిప్పులా ఉన్నారు.. ఒకరు తమ పదవి కొనసాగింపు కోసం... మరొకరు అదే పదవిని కొట్టేయడానికి హస్తిన చుట్టూ తిరిగారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన ట్రీట్మెంట్ తో వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు ? వాళ్లు మనుషులు మాత్రమే కలిశారా ? మనుసులు కూడా కలిశాయా ? తెలంగాణ కాషాయ దళపతి బండి సంజయ్... ఉద్యమ కెరటం ఈటల రాజేందర్... విరుద్ద స్వభావాలు కల్గిన వీరిద్దరి ఎజెండా ఒక్కటే అయినా.. మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. పక్కా హిందుత్వం ఎజెండాతో ముందుకు వెళ్లే బండి సంజయ్ ఓ వైపు... బీజేపీ యేతర ఓటు బ్యాంకు కల్గిన ఈటల రాజేందర్ మరోవైపు పార్టీకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ఉప్పు–నిప్పుగా ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను మార్చుతున్నారని ప్రచారం కావడం.. ఆపై ఆ పదవి దక్కించుకోవడానికి ఈటల రాజేందర్ పార్టీ హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టడం జరిగింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ తెలంగాణ కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో సున్నితమైన హెచ్చరికలు చేయడం.. కలిసి వెళ్లాలని సూచించారు. అమిత్ షా ఇచ్చిన ట్రీట్మెంట్ తో తెలంగాణ నేతల్లో మార్పు కనిపిస్తుందని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. తెలంగాణ నేతల మధ్య సమన్వయం చేసే బాధ్యతను ప్రత్యేకంగా బన్సల్ కు అప్పగించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బన్సల్ టానిక్ ఎఫెక్ట్ తో నేతలు కొంతకలివిడిగా కనిపిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా చేపట్టిన దీక్షలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ కలిసి మాట్లాడుకోవడం దీక్షలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ఇద్దరు నేతలు ఒక్కటైనట్లైనని కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. గతంలో ఒకరు మాట్లాడితే.. మరొకరు ఖండనలు ఇవ్వడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. సీఎం కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే.. తాను అక్కడే పోటీ చేస్తానని గతంలో ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఆ వెంటనే బండి సంజయ్ ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందన్న కామెంట్ చేశారు. పార్టీలో కోవర్టులున్నారని ఈటల రాజేందర్ కామెంట్ చేస్తే.. వెంటనే పార్టీలో మరో నేత కోవర్టులు ఎవరో చెప్పాలని కౌంటర్ ఇచ్చారు. -విక్రమ్, సాక్షిన్యూస్, హైదరాబాద్. చదవండి: అందుకే అలా మాట్లాడా.. నాకు వేరే ఉద్దేశం లేదు: కోమటిరెడ్డి -
పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై షర్మిల దీక్ష
-
రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష
-
రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం వైఎస్ షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇందిరాపార్క్ వద్ద గురువారం ఆమె దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ దీక్ష కొనసాగించడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో లోటస్‌పాండ్ వద్ద దీక్ష కొనసాగించేందుకు వైఎస్ షర్మిల ధర్నా చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ఆమెను మరోసారి అడ్డుకున్నారు. ప్రత్యేక వాహనంలో ఆమెను తరలించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడం, పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించడంతో ఒక దశలో వైఎస్ షర్మిల స్పృహతప్పి పడిపోయారు. దుస్తులు స్వల్పంగా చిరిగిపోవడంతో పాటు ఎడమ చేతికి గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్ర చేస్తూ లోటస్‌పాండ్‌కు చేరుకున్న వైఎస్ షర్మిల దీక్షను కొనసాగిస్తున్నారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతినబూనారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు -
ఓట్ ఫర్ మిస్ ఇండియా
మిస్ ఇండియా–2015 లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’ టైటిల్ విజేత దీక్ష యూపీ పంచాయితీ ఎన్నికల్లో జాన్పుర్ లోని బక్షా‘గ్రామ ప్రధాన్’గా పోటీ చేస్తున్నారు. నాలుగు విడతల ఆ ఎన్నికల్లో మొదటి విడతలోనే జాన్పుర్ జిల్లా ఉంది. పోలింగ్ ఏప్రిల్ 15 న. మే 2న ఫలితాల వెల్లడి. ‘‘నా చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఈ రోజుకీ అలానే ఉంది. ఆ పరిస్థితిని మార్చేందుకే నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను’’ అని దీక్ష (24) అంటున్నారు. వాస్తవానికి దీక్ష ఇప్పటికే తన కెరీర్‌ని నిర్మించుకునే క్రమంలో వయసుకు మించిన గుర్తింపే తెచ్చుకున్నారు. ప్రధానంగా ఆమె మోడల్. పెద్ద పెద్ద కంపెనీలకు మోడలింగ్ ఇచ్చారు. త్వరలోనే వెబ్ సీరీస్‌లో కనిపించబోతున్నారు. ‘ఇష్క్ తేరా’ అనే ఒక సినిమా కథను రాసి, సినిమాగా తెరకు ఎక్కించేందుకు దర్శక నిర్మాతల కోసం చూస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె విడుదల చేసిన మ్యూజిక్ ఆల్బమ్ ‘రబ్బా మెహర్ కరే’కు నెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ చేస్తున్న దీక్ష ఇప్పుడిక పంచాయితీ ఎన్నికల్లో గ్రామ ప్రధాన్‌గా పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేస్తున్నది 26 వ నెంబరు వార్డు అభ్యర్థిగా. ఆ వార్డు పేరు బక్షా. దీక్ష పుట్టింది అక్కడే.. బక్షా ప్రాంతంలోని చిత్తోరి గ్రామంలో. ఆ గ్రామం జాన్పుర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. బక్షా గ్రామ ప్రధాన్‌గా గెలిచి, క్రమంగా జాన్పుర్ జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి జరపాలని దీక్ష ఆశిస్తున్నారు. అందుకు కారణం ఆమె చిన్నప్పుడు జాన్పుర్ ఎలా ఉందో ఇప్పటికీ ఏ అభివృద్ధీ జరగకుండా అలాగే ఉండటం! మిస్ ఇండియా 2015లో ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’గా టైటిల్ గెలుచుకున్నప్పుడు దీ„ý వయసు 18. అప్పుడు ఆమె ముంబైలో బి.ఎ.సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అప్పుడే ఫ్రెండ్స్ ప్రోద్బలంతో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆమె తండ్రి జితేంద్ర సింగ్ బిజినెస్‌మేన్. ముంబై, గోవా, రాజస్థాన్‌లలో వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. అలా వాళ్ల కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని జాన్పుర్ నుంచి ముంబైకి మారింది. దీక్ష ఇష్టాలు, ఆసక్తులు కూడా మారి మోడలింగ్ రంగంలోకి వెళ్లిపోయారు. ముంబైలో ఉంటున్న దీక్ష తరచు జాన్పుర్ వస్తుంటారు. ఈసారి అలా వచ్చినప్పుడే పంచాయితీ ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన ఆమెకు కలిగింది. ‘‘చదువుకున్న అమ్మాయి కదా. నువ్వు గ్రామ ప్రధాన్ అయితే గ్రామం బాగుపడుతుంది. అంతే కాదు.. రాజకీయాల్లో నువ్వు పైపైకి ఎదిగిన కొద్దీ ఊరు, జిల్లా, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతాయి’’ అని ఊళ్లోని పెద్దలు మద్దతు ఇచ్చారు. తల్లి, తండ్రి కూడా సరేనన్నారు. అంతే.. ఏప్రిల్ 3 న నామినేషన్ వేశారు దీక్ష. ఆమె ఆ ఊళ్లో మూడో తరగతి వరకు చదివారు. గ్రామ ప్రధాన్‌గా ఎన్నికైతే కనుక అదే ఊరి చేత అభివృద్ధి అక్షరాలను దిద్దించబోతారు దీక్ష. -
‘కౌరవ సభను తలపించిన చంద్రబాబు దీక్ష’
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యంగ్యాస్త్రాలు సందించారు. చంద్రబాబు దీక్ష కౌరవ సభను తలపించిందని ఆయన ట్విట్ చేశారు. దీక్షపై ఐవైఆర్ స్పందిస్తూ.. ‘‘చంద్రబాబుతో శకుని మాట్లాడిన దృశ్యం కనిపించింది. లక్ష్మణ్ కూమార్ కూడా సభకు వచ్చి వెళ్లారు. ధుర్యోదన ధర్మపోరాట దీక్ష సభకు హాజరుకాలేదు.’’అని ట్విటర్లో పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నిర్వహించిన దీక్షకు కాంగ్రెస్ నేతలు హాజరైన విషయం తెలిసిందే. వారిని ఉద్దేశించే ఐవైఆర్ ఈ ట్విట్లు చేసినట్లు తెలుస్తోంది. This looks like #kauravasabha which divided #AP than a #dharmaporatasabha. Dhrutarashtra is having a word with the CM. Sakuni can be seen in the picture. Laxman Kumar came and went. Duryodhana did not attend the meeting. Duryodhana need not necessarily be a male . pic.twitter.com/Q6wsq8fTAL — IYRKRao , Retd IAS (@IYRKRao) February 12, 2019 -
నమ్మించి మోసం చేశాడు.. యువతి దీక్ష
ముండ్లమూరు (ప్రకాశం): ప్రేమ పేరుతో తనని మోసం చేసి మరో యువతిని రిజిస్టర్ వివాహం చేసుకున్న యువకుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌనదీక్ష చేస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆ క్రమంలో వెంకటేశ్వర్లుకు విజయనగరం జిల్లా మొరకముడి మండలం యాడిక గ్రామానికి చెందిన బొత్స దేవీకుమారితో పరిచయమైంది. కొంతకాలం స్నేహంగా ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని ఆ తర్వాత మోహం చాటేయడంతో బాధితురాలు శనివారం రాత్రి కమ్మవారిపాలెం వచ్చి వెంకటేశ్వర్లును నిలదీసింది. నీతో స్నేహం మాత్రమే చేశానని, తనకి మరో యువతితో రిజిష్టర్ వివాహం జరిగిందని అతడు బదులిచ్చాడు. ఆందోళన చెందిన యువతి తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా వేరే యువతిని పెళ్లి చేసుకున్నానని చెప్పడం ఏంటని అతడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శివనాంచారయ్య తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని బాధిత యువతిని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వర్లు ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉంటే చూపితే కేసు నమోదు చేసి న్యాయం చేస్తామని ఎస్ఐ ఆమకు హామీ ఇచ్చారు. అందుకు ఆ యువతి మౌనంగా ఉంది. ప్రియుడి ఇంటి ముందు దీక్ష కొనసాగిస్తోంది. పోలీసులు ఉమన్ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం అందించారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ ఇందిరమ్మ వచ్చి బాధిత యువతికి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
ఎలాంటి బూతులు మాట్లాడలేదు
గుంటూరు : ఏపీ సీఎం చేపట్టినదీక్షలో తాను ఎలాంటి బూతుమాటలు వాడలేదని, అలా అనుకునేవారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల మంది ప్రజల ఆవేదనను ప్రధానిపై ఆగ్రహం వ్యక్తం చేసేలా తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు. తాను మాట్లాడిన మాటలను మార్ఫింగ్ చేసి నన్ను అప్రదిష్ట పాలు చేయాలని చూశారని ఆయన అన్నారు. జై సింహ వంద రోజుల ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఆదివారం చిలకలూరిపేటకు బాలకృష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబు దీక్షా శిబిరం వద్ద బాబు చేసిన వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా నిర్వహించిన దీక్షా వేదికపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ‘ ఒక శిఖండిలాగా.. ఒక కొజ్జాలాగా సీట్లు గెలవచ్చనుకుంటున్నారు... టీ కప్పులో పడ్డ ఈగను కూడా చీకుతావా.. మఖ్కీ ఛూస్ .. జాగ్రత్త!.. ఇక దండోపాయమే. ఇది వార్నింగ్. ద్రోహి..నమ్మకద్రోహి. నిన్ను పరుగెత్తించి కొడతారు. బంకర్లో దాక్కున్నా సరే భరతమాత నిన్ను క్షమించదు. సమాధి చేసేస్తుంది..’ అని దూషించడంతో పాటు ‘మీ ఇంట్లో వారిని గౌరవించడం చేతకాదు. మీ భార్యను గౌరవించడం చేతకాదు..’ అంటూ వ్యక్తిగత విమర్శలు సైతం చేయడంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై బీజేపీ నేతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్యపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని బాలకృష్ణ నివాసాన్ని ముట్టడించి ఆయన కారును అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంతో విషయం ఎక్కడో వెళ్తుందని భావించి బాలయ్య ఈ విషయం గురించి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చిలకలూరిపేటలో చెప్పారు. -
మధుమతి సినిమా ఆడియో
రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో రూపొందించిన మధుమతి సినిమా స్టిల్స్. ఉదమభాను, దీక్షా, శివకుమార్ ఈ చిత్రంలో ముఖ్య తారాగణం. -
టీడీపీ దొంగ దీక్షను జనం నమ్మరు: జోగి రమేష్
సీమాంధ్రలోని టీడీపీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర అంటూ దొంగ దీక్ష చేస్తే జనం నమ్మె పరిస్థితిలో లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ గురువారం విజయవాడలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశంపార్టీ గతంలో లేఖ ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు క్విట్ సోనియా అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు నిరవధిక దీక్ష చేపడుతున్నట్లు జోగి రమేష్ ఈ సందర్బంగా వివరించారు. అయితే తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూటకోమాట మార్చి పబ్బం గడుపుకుంటున్నారని కంకిపాడు మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ విజయవాడలో ఆరోపించారు. 2008లోనే తెలంగాణాకు అనుకూలం అంటూ బాబు కేంద్రానికి లేఖ ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు స్ఫష్టమైన వైఖరిని తెలిపిన తరువాతే దీక్ష చేపట్టాలని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణుతోపాటు దేవినేని నెహ్రూలు టీడీపీ ఎమ్మెల్యే ఉమాకు సూచించారు.