టీడీపీ దొంగ దీక్షను జనం నమ్మరు: జోగి రమేష్ | public will not believe TDP's fake diksha: Jogi ramesh | Sakshi
Sakshi News home page

టీడీపీ దొంగ దీక్షను జనం నమ్మరు: జోగి రమేష్

Published Thu, Aug 15 2013 1:10 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

public will not believe TDP's fake diksha: Jogi ramesh

సీమాంధ్రలోని టీడీపీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర అంటూ దొంగ దీక్ష చేస్తే జనం నమ్మె పరిస్థితిలో లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ గురువారం విజయవాడలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశంపార్టీ గతంలో లేఖ ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు క్విట్ సోనియా అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు నిరవధిక దీక్ష చేపడుతున్నట్లు జోగి రమేష్ ఈ సందర్బంగా  వివరించారు.

అయితే తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూటకోమాట మార్చి పబ్బం గడుపుకుంటున్నారని కంకిపాడు మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ విజయవాడలో ఆరోపించారు. 2008లోనే తెలంగాణాకు అనుకూలం అంటూ బాబు కేంద్రానికి లేఖ ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు స్ఫష్టమైన వైఖరిని తెలిపిన తరువాతే దీక్ష చేపట్టాలని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణుతోపాటు దేవినేని నెహ్రూలు టీడీపీ ఎమ్మెల్యే ఉమాకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement