తిరువనంతపురం: ప్రముఖ మలయాళ గాయకుడు ఎంఎస్ నసీమ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు(బుధవారం)తుదిశ్వాస వదిలారు. దూరదర్శన్, ఆకాశవాణి, ఇతర స్టేజ్ ప్రోగ్రామ్‌లలో మొత్తం వెయ్యికి పైగా పాటలు పాడి తన శ్రావ్యమైన గొంతుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు.పలు స్టేజ్ షోలతో పాటు టెలివిజన్ షోలు కూడా నిర్వహించేవారు. రెండు సినిమాల్లో నసీమ్ పాడిన పాటలు ఎంతో ప్రజాధరణ పొందాయి. (మెరిల్ స్ట్రీవ్, గాల్ గాడోట్‌లతో పోల్చుకున్న కంగనా..)
1992,93,95,1997లో నసీమ్ ఉత్తమ గాయకుడిగా కేరళ సంగీత అకాడమీ అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా వరుసగా ఉత్తమ మినీ స్క్రీన్ సింగర్ అవార్డును సంపాదించుకున్నారు. అయితే నసీమ్‌కు 16 ఏళ్లు ఉన్నప్పుడే మొదటిసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. నసీమ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేరళలో నసీమ్ గాత్రానికి చాలామంది అభిమానులు ఉన్నారు. కాగా నసీమ్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. (సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు)
Comments
Please login to add a commentAdd a comment