సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరవాడ ఫార్మా సిటీలో జరిగిన పేలుడుపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ పేలుడుకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరా తీశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్‌తో ఫొన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. (విశాఖ ప్రమాదం.. అనాథలైన పిల్లలు)
విశాఖపట్నం ఫార్మ సిటిలో పేలుడు ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఎవరికి ప్రాణ నష్టం లేకుండా వైద్యం అందించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. (విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం)
సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. (విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి)
Comments
Please login to add a commentAdd a comment