న్యూయార్క్ : ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ప్రముఖ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ కరోనా మృతులకు ఘన నివాళి అర్పించింది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన ఆదివారం ఎడిషన్ మొదటి పేజీని పూర్తిగా కరోనాతో మరణించిన వారి పేర్లను ప్రచురించింది. 'యూఎస్ డెత్స్ నియర్ 1,00,000, యాన్ ఇన్‌క్యాలికబుల్ లాస్' అనే ప్రధాన శీర్షికతో ప్రచురణ చేసింది. అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 16లక్షలు దాటగా, మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది.
ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన వారికి నివాళిలర్పిస్తూ న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీని మొత్తం వెయ్యి మంది పేర్లతో పూర్తిగా ఆరు కాలమ్స్‌లో ప్రచురించింది. 'ఇదంతా ఏదో జాబితాలోని పేర్లు మాత్రం అనుకోకండి.. వారంతా కరోనా దాటికి మృతి చెందిన అమెరికా బాధితులంటూ' పేర్కొంది. పేజీలో ఫోటోలు, వార్తలకు బదులు పూర్తిగా మరణించిన వారి పేర్లతో ఎడిషన్‌ను మొదటి పేజీని నింపేయడం విశేషం. ఈ మహమ్మారి దాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,01,612 కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల 10 వేల 657. కోవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 43 వేల 804 మంది మృత్యువాతపడ్డారు. (కరోనా టెస్ట్ చేయించుకోలేదని కడతేర్చారు..! )
Comments
Please login to add a commentAdd a comment