Mahesh Babu Emotional Post On Brother Ramesh Babu Death - Sakshi
Sakshi News home page

Mahesh Babu: రమేశ్‌బాబు మృతిపై మహేశ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

Published Sun, Jan 9 2022 2:44 PM | Last Updated on Sun, Jan 9 2022 4:00 PM

Mahesh Babu Pens Emotional Post About Ramesh Babu Demise - Sakshi

Mahesh Babu pens an emotional note mourning the demise of his elder brother Ramesh Babu: సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌ బాబు(56)మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన  శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఇక అన్నయ్య మృతిపై తొలిసారి స్పందించిన మహేశ్‌ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసుకున్నారు.  


'మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాగా కోవిడ్‌ కారణంగా ప్రస్తుతం మహేశ్‌ బాబు హోంక్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement