demise
-
జాకీర్ హుస్సేన్ ఉసురు తీసిన ప్రాణాంతక వ్యాధి, ఈ విషయాలు తెలుసుకోండి!
ప్రఖ్యాత తబలా వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో కన్నుమూయడం సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (ఐపీఎఫ్) తో అనే దీర్గకాలిక వ్యాధితో బాధపడుతూ శాన్ ఫ్రాన్సిస్కోలో తుదిశ్వాసతీసుకున్నారు.దీంతో అసలేంటి ఐపీఎఫ్? ఇది అంత ప్రమాదకరమా? చికిత్స లేదా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణలు, నివారణ మార్గాలను తెలుసుకుందాం. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఏమిటి?సాధారణంగా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణిస్తారు. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులు లేదా అల్వియోలీ ( ఊపిరితిత్తులలోని చిన్న, సున్నితమైన గాలి సంచులు)గాలి పీల్చినప్పుడు రక్తప్రవాహంలోకి ఆక్సిజన్ పొందడానికి అవి సహాయపడతాయి. వీటి చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధే ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్.అమెరికా నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (NIH) ప్రకారం, ఇది తీవ్రమైన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, ఇది అవయవంలోని గాలి సంచులు లేదా అల్వియోలీ చుట్టూ ఉన్న కణజాలాలను ప్రభావితం చేస్తుంది. ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ మచ్చలు, ఊపిరితిత్తుల కణజాలం మందంగా మారిపోతుంది. ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ లక్షణాలు ఇవి మరింత ముదిరి ఊపిరితిత్తుల పనితీరు సన్నగిల్లి, రక్తంలోకి, శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్ సరఫరా కష్టమవుతుంది. అల్వియోలీ గోడలు మందంగా మారి మచ్చలు రావడాన్నే ఫైబ్రోసిస్ అంటారు. అలాగే ఇడియోపతిక్ అంటే ఈ పరిస్థితికి కారణమేమిటో గుర్తించలేకపోవడం. ఈ వ్యాధిని సరియైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం.కారణాలుధూమపానం అలవాటున్న వారికి, ఫ్యామిలీలో అంతకుముందు ఈ వ్యాధి వచ్చిన చరిత్ర ఉన్నా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది . సాధారణంగా 60- 70 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధికనిపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధి స్త్రీల కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. రసాయనాలు లేదా ప్రమాదకర పదార్థాలను ఎక్కువగా పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయిలక్షణాలుఊపిరి ఆడకపోవడం: మొదట్లో అలసిపోయినపుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవు తుంది. వ్యాధి ముదురుతున్న కొద్దీ శ్వాస సమస్యలు పెరుగుతాయి. ఏపనీ చేయంకుండా, విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.విపరీతమైన పొడిదగ్గుకీళ్ళు ,కండరాలలో నొప్పిఅలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపించడం .కారణం లేకుండానే బరువు తగ్గడంనైల్ క్లబ్బింగ్ అంటే చేతివేళ్లు లేదా కాలి వేలి గోర్లు వెడల్పుగా, స్పాంజిలాగా ఉబ్బినట్లుగా అవ్వడం రక్తంలో చాలా తక్కువ ఆక్సిజన్ వల్ల సైనోసిస్, నీలిరంగు చర్మం , నోటి చుట్టూ, చర్మంపైనా, కళ్ల చుట్టూ బూడిద రంగు లేదా తెల్లటిమచ్చలుఈ లక్షణాలు కొందరిలో చాలా త్వరగా వ్యాపిస్తాయి. మరికొందరిలో చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయి. దీర్ఘం కాలం పాటు ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలి. చికిత్స లేదుఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్‌కు ప్రస్తుతానికి ఖచ్చితమైన చికిత్స లేదు. అయితే కొన్ని మందులు, ఇతర చికిత్సలు ద్వారా వ్యాధి ముదరకుండా జాగ్రత్తపడవచ్చు. ఊపిరితిత్తులకు ఎక్కువ నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే అని గమనించగలరు. వ్యాధి ఏదైనా, నిపుణుల పర్యవేక్షణలో, సంబంధిత వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించుకొని చికిత్సతీసుకోవాల్సి ఉంటుంది. -
రతన్ టాటాకు రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. ఆయన మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. దేశంలో అతిపెద్ద బిజినెస్ ట్రస్ట్ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాంతో రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారుభారత్ పారిశ్రామిక దిగ్గజాన్నికోల్పోయింది: రాష్ట్రపతిరతన్ టాటా మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా మృతి నిజంగా బాధాకరం. పారిశ్రామిక దిగ్గజాన్ని భారత్ కోల్పోయింది. మంచి విలువులున్న వ్యక్తి రతన్ టాటా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.In the sad demise of Shri Ratan Tata, India has lost an icon who blended corporate growth with nation building, and excellence with ethics. A recipient of Padma Vibhushan and Padma Bhushan, he took forward the great Tata legacy and gave it a more impressive global presence. He…— President of India (@rashtrapatibhvn) October 9, 2024 రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం: ప్రధాని మోదీప్రధాని మోదీ ట్విట్టర్లో ఇలా రాశారు - రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం. దయాహృదయం కలిగిన వ్యక్తి. అసాధారణమైన వ్యక్తి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. సమాజాన్ని మెరుగుపరచడంలో అతనికున్న అచంచలమైన నిబద్ధత స్ఫూర్తిదాయకమైనవి. Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared… pic.twitter.com/p5NPcpBbBD— Narendra Modi (@narendramodi) October 9, 2024 మంచి స్నేహితుడిని కోల్పోయా: ముఖేష్ అంబానీరతన్ టాటా మృతిపట్ల ముఖేష్ అంబానీ సంతాపం వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: సుధామూర్తిరతన్ టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. ఇతరుల పట్ల కరుణ చూపే వ్యక్తి రతన్ టాటా అని ఆమె కొనియాడారు.ఆయనొక వెలకట్టలేని వజ్రం: ఆర్ఎస్ఎస్రతన్ టాటా మృతిపట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా మృతి భారతీయులందరికీ బాధాకరమని ఆర్ఎస్ఎస్ తెలిపింది. రతన్ టాటా వెలకట్టలేని వజ్రమని కొనియాడింది.పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్: వైఎస్ జగన్ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని వైఎస్ జగన్ కొనియాడారు. సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమన్నారు వైఎస్ జగన్.Deeply saddened by the loss of Shri Ratan Tata Ji. A true visionary whose kindness, integrity, and leadership will continue to inspire us and generations to come. My condolences to the Tata family .— YS Jagan Mohan Reddy (@ysjagan) October 10, 2024గొప్ప మానవతావాది: మానవతావాది: వెంకయ్య నాయుడురతన్టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. గొప్ప మానవతావాది అని వెంకయ్యనాయుడు కొనియాడారు. రతన్ టాటా జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్న వెంకయ్య నాయుడు.. అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. పరోపకారి రతన్ టాటా: కేసీఆర్రతన్ టాటా మృతికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కేసీఆర్ పేర్కొన్నారు. దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కేసీఆర్ కొనియాడారు.రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త: కేటీఆర్రతన్ టాటా మృతిపట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త అని కొనియాడారు. రతన్ టాటా మరణం వ్యాపార ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చిందన్న కేటీఆర్.. ఆయన అందరి హృదయాల్లో ఉంటారన్నారు.రతన్ టాటా మృతిపట్ల జేపీ నడ్డా సంతాపంరతన్ టాటా సేవలు దేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయినిజమైన మానవతావాది రతన్ టాటా: సీఎం చంద్రబాబురతన్ టాటా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామన్నారు సీఎం చంద్రబాబు.రతన్ టాటా దాతృత్వానికి ప్రతీక: సీఎం రేవంత్రెడ్డిరతన్ టాటా దాతృత్వానికి ప్రతీక అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ కొనియాడారు.టాటా విజన్ కలిగిన వ్యక్తి: రాహుల్ గాంధీకాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. రతన్ టాటా విజన్ కలిగిన వ్యక్తి. వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారు.Ratan Tata was a man with a vision. He has left a lasting mark on both business and philanthropy.My condolences to his family and the Tata community.— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2024ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన రతన్ టాటారక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సంతాప సందేశంలో.. రతన్ టాటా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రాశారు.దూరదృష్టి గల వ్యక్తిని భారత్ కోల్పోయిందిపారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ట్వీట్లో.. ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన, దూరదృష్టి గల వ్యక్తిని భారత్ కోల్పోయింది. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు.. అతను తిరుగులేని నిబద్ధతతో భారతదేశ స్ఫూర్తిని మూర్తీభవించారు.India has lost a giant, a visionary who redefined modern India's path. Ratan Tata wasn’t just a business leader - he embodied the spirit of India with integrity, compassion and an unwavering commitment to the greater good. Legends like him never fade away. Om Shanti 🙏 pic.twitter.com/mANuvwX8wV— Gautam Adani (@gautam_adani) October 9, 2024టాటా జీ మరణం చాలా బాధాకరంఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా ట్వీట్ చేశారు.. భారతదేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, 'పద్మ విభూషణ్' రతన్ టాటా జీ మరణం చాలా బాధాకరం. అతను భారతీయ పరిశ్రమకు తిరుగులేని దిగ్గజం. ఆయన మృతి తీరని లోటు. అతని జీవితమంతా దేశ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి అంకితం అయ్యింది. రతన్ టాటా దేశానికి నిజమైన రత్నం.Saddened by the passing away of Shri Ratan Tata. He was a Titan of the Indian industry known for his monumental contributions to our economy, trade and industry. My deepest condolences to his family, friends and admirers. May his soul rest in peace.— Rajnath Singh (@rajnathsingh) October 9, 2024రతన్ టాటా సహకారం చారిత్రాత్మకంఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో - దేశ అభివృద్ధికి రతన్ టాటా చేసిన సహకారం చారిత్రాత్మకమైనది. దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.भारत के प्रख्यात उद्योगपति, 'पद्म विभूषण' श्री रतन टाटा जी का निधन अत्यंत दुःखद है।वह भारतीय उद्योग जगत के महानायक थे। उनका जाना उद्योग जगत के लिए अपूरणीय क्षति है। उनका सम्पूर्ण जीवन देश के औद्योगिक और सामाजिक विकास को समर्पित था। वे सच्चे अर्थों में देश के रत्न थे।प्रभु…— Yogi Adityanath (@myogiadityanath) October 9, 20241991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలుకాగా, రతన్ టాటా 1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు ఈ పదవిలో కొనసాగారు. అతను 1996లో టాటా సర్వీసెస్, 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితర కంపెనీలను స్థాపించారు.నేడు అంత్యక్రియలుటాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్ధివ దేహాన్ని తరలించారు. ఉదయం 10.30 గంటలకు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మైదానంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 4గంటల తరువాత అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత -
ఇన్ స్టా వేదికగా పూనమ్ పాండే మరో వీడియో
-
విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం
గుంటూరు, సాక్షి: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్ కుటుంబసభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని సదరు ప్రకటనలో తెలిపారు సీఎం జగన్. యాక్షన్ హీరోగా తమిళ చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేసింది తెలిసిందే. ఇదిలా ఉంటే.. 71 ఏళ్ల విజయ్‌కాంత్ ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈమధ్యే కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషించారు. అయితే కరోనా బారినపడ్డాక ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లో కెప్టెన్ ఓ సంచలనం -
ఎమ్మెల్సీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
-
ఎమ్మెల్సీ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. శుక్రవారం రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం -
కన్నీళ్లు ఆపులేకపోయిన దిల్‌రాజ్.. చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నిర్మాత!
తెలుగు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి (86) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిల్ రాజును పరామర్శించారు. (ఇది చదవండి: దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం) దిల్ రాజు తండ్రి మరణవార్త తెలుసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో దిల్ రాజ్‌కు ధైర్య చెబుతూ కనిపించారు. దీంతో తన బాధను ఆపుకోలేకపోయిన దిల్ రాజ్.. ప్రకాశ్ రాజ్‌ను పట్టుకుని బోరున విలపించారు. దిల్ రాజు ఇంటికెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. శ్యాంసుందర్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. దిల్ రాజు తండ్రి పేరు శ్యాంసుందర్ రెడ్డి.. కాగా తల్లి పేరు ప్రమీలమ్మ. దిల్ రాజుకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన ఆయన పైచదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించారు. వీరికి కూతురు హన్షిత ఉంది. తర్వాత ఆయన 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు. (ఇది చదవండి: ఈడీ ముందుకు హాజరైన హీరో నవదీప్.. బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు) -
నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్‌తో సైంధవ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హిట్ మూవీ సిరీస్‌తో హిట్స్ కొట్టిన శైలేష్.. హిట్-3 కూడా నానితో తీసేందుకు ప్లానింగ్ చేస్తున్నాడు. అయితే తాజాగా హిట్ మూవీ డైరెక్టర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. విశ్వక్ సేన్‌తో తీసిన హిట్ పార్ట్-2, అడివి శేష్‌తో తీసిన హిట్-2 సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాగార్జున బ్లాక్ బస్టర్ మూవీ.. సైడ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్!) హిట్-2 సినిమాలో కనిపించిన డాగ్ చనిపోయిందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ చిత్రంలో హీరోను కాపాడే ఓ సీన్లో డాగ్ కనిపించింది. మూవీ ప్రమోషన్స్‌లోనూ డాగ్ కనిపించింది. ఒకరోజు ముందే శైలేష్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్ని తెలిపారు. డాగ్ మ్యాక్స్‌కు జ్వరం వచ్చిందని అందరూ తన కోసం ప్రార్థించడని కోరారు. అంతలోనే ఈ విషాదం నెలకొంది. మ్యాక్స్ మరణించిన విషయాన్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. శైలేష్ తన ట్వీట్లో రాస్తూ..'బాధాతప్త హృదయంతో నేను ఈ వార్తను మీకు చెబుతున్నా. మాకు ఎంతో ప్రియమైన మాక్స్ ఇప్పుడే చనిపోయాడు. తాను గత పది రోజులుగా తీవ్రమైన టిక్ ఫీవర్‌తో బాధపడుతూ పోరాటం చేశాడు. నా జీవితంలో నేను కలుసుకున్న అత్యంత సున్నితమైన సోల్మేట్స్లో తాను ఒకరు. మీ అందరి ప్రార్థనలకు ధన్యవాదాలు. ఆఫీసర్ మాక్స్ నిన్ను మిస్ అవుతున్నాం. మీరు లేకుండా హిట్-2 సినిమాను ఊహించుకోలేం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sailesh Kolanu (@saileshkolanu) (ఇది చదవండి: మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్) With a shattered heart I bring this news to you guys. Our beloved Max just passed away. She was suffering for the last ten days with a severe tick fever and fought really hard. Despite being a ferocious breed, she is one of the most gentle souls I have ever met in my life. Thanks… pic.twitter.com/UF6o2TCK1k — Sailesh Kolanu (@KolanuSailesh) July 13, 2023 -
నిన్ను చూడాలని, నీ చేతిముద్ద తినాలనుంది: బుల్లితెర నటి ఎమోషనల్
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతవారం తమిళ బుల్లితెర నటి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి ఏడు రోజుల క్రితం కన్నుమూశారు. ఈ విషాద ఘటనను తలుచుకుంటూ నటి పవిత్ర లక్ష్మి తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: 'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా బన్నీ) ఇన్‌స్టాలో పవిత్ర రాస్తూ.. 'నువ్వు మమ్మల్ని విడిచివెళ్లి అప్పుడే ఏడు రోజులైంది. ఈ బాధ నుంచి బయటపడాలని చూస్తున్నా. నువ్వు ఎందుకింత త్వరగా వదిలి వెళ్లిపోయావో అర్థం కావటం లేదు. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు అక్కడ ఉండవని భావిస్తున్నా. నువ్వు ఒక సూపర్ మామ్. సింగిల్ పేరెంట్‌గా ఉంటూ బిడ్డల్ని చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. నాకు నిన్ను ఓ సారి చూడాలని ఉంది. నీతో ఒకసారి మాట్లాడాలని ఉంది. నీ చేతి ముద్దలు తినాలని ఉంది. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన సినీ ప్రముఖులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. (ఇది చదవండి: హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? స్పందించిన హీరోయిన్) View this post on Instagram A post shared by Pavithralakshmi (@pavithralakshmioffl) -
ప్రముఖ దర్శకనటుడి హఠాన్మరణం
బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్(67) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని మరో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ ద్వారా ధృవీకరించారు. తమది 45 ఏళ్ల స్నేహమని, ఇకపై సతీష్ లేకుండా జీవితంలో ముందుకు సాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు అనుపమ్ ఖేర్. మరోవైపు నటి కంగనా రనౌత్‌తోపాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు సైతం సతీష్ హఠాన్మరణంపై విచారం, సోషల్ మీడియా ద్వారా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్ కౌశిక్ తన నివాసంలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc — Anupam Kher (@AnupamPKher) March 8, 2023 13 ఏప్రిల్ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఆపై బాలీవుడ్లో సతీష్ కౌశిక్‌కు బ్రేక్ దక్కింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు. కల్ట్ క్లాసిక్ చిత్రంగా గుర్తింపు పొందిన ఆ సినిమా సంభాషణలు చాలా కాలం పాటు హిందీ ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి. ఆపై యాక్టర్‌గా కొనసాగారు. కమెడియన్‌గా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్లో రాణించారు. శ్రీదేవి లీడ్ రోల్లో నటించిన రూప్ కీ రాణి.. చోరో కా రాజా, టబు లీడ్ రోల్లో నటించిన ‘ప్రేమ్’ చిత్రాలకు ఈయనే దర్శకుడు. కానీ, ఈ రెండు చిత్రాలు ఆడలేదు. అయితే.. హమ్ ఆప్కే దిల్ మే రహ్తే హై, తేరే సంగ్ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అలరించాయి. మిస్టర్ ఇండియాలో ‘క్యాలెండర్’, దీవానా మస్తానాలో పప్పు పేజర్ పాత్రలు ఐకానిక్ రోల్స్‌గా హిందీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. రామ్ లఖన్(1990)తో పాటు సాజన్ చలే ససూరల్(1997) చిత్రానికి బెస్ట్ కమెడియన్‌గా ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. -
తారకరత్న భౌతికకాయం చూసి వెక్కివెక్కి ఏడ్చిన కూతురు
నటుడు తారకరత్న మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి నిన్న(శనివారం)రాత్రే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అయితే తన తండ్రిని అలా చలనం లేకుండా ఉండడాన్ని చూసి తారకరత్న కూతురు నిషిక వెక్కివెక్కి ఏడ్చింది. తన తండ్రి ఇక రాడని తెలిసి గుండెలు పగిలేలా రోదించింది. ఈ క్రమంలో కూతుర్ని ఓదార్చుతూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సైతం కన్నీటి పర్యంతం అవడాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ కుటుంబానికి దేవుడు తీరని లోటు మిగిల్చాడని, ఈ బాధను తట్టుకునే శక్తిని వారికి ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తున్నారు. -
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సినీ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఇలాంటి బాధాకర సమయంలో తారకరత్న కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం పీఎంఓ ట్వీట్ చేసింది. Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi — PMO India (@PMOIndia) February 19, 2023 రేవంత్ రెడ్డి సంతాపం.. తారకరత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. Deeply saddened by the untimely demise of shri #Tarakaratna garu… My deepest condolences to the friends and family.I pray God to give them strength in this hour of grief. pic.twitter.com/SmPINq1PZb — Revanth Reddy (@revanth_anumula) February 19, 2023 గుండెపోటుతో 23 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన తారకరత్న శనివారం బెంగళూరులోని హృదయాలయలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. బండి సంజయ్ ట్వీట్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తారకరత్న మృతికి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏 pic.twitter.com/BXEIVTXwIM — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023 హరీశ్‌రావు.. తారకరత్న మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆయన కుటుంసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna. Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace. Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq — Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023 డీకే అరుణ బీజేపీ నేత డీకే అరుణ కూడా తారకరత్న మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. Extremely saddened to learn about the passing of #Telugu actor Shri Nandamuri #TarakaRatna Ji. His sudden demise has left the entire Telugu film industry in a state of shock and mourning. My deepest condolences to his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/6q9bD2ZelS — D K Aruna (@aruna_dk) February 19, 2023 చంద్రబాబు సంతాపం.. తారకరత్న తమ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) February 18, 2023 నారా లోకేష్.. తారకరత్న మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G — Lokesh Nara (@naralokesh) February 18, 2023 -
తారకరత్న మృతి పట్ల చిరంజీవి, రవితేజ సంతాపం..
హైదరాబాద్: ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూసిన నందమూరి తారకరత్న(39) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను కలచివేసిందన్నారు. ప్రకాశవంతమైన, ప్రతిభావంతుడైన, ఆప్యాయత గల యువకుడు చిన్నవయసులోనే మరణించాడని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. Deeply saddened to learn of the tragic premature demise of #NandamuriTarakaRatna Such bright, talented, affectionate young man .. gone too soon! 💔 💔 Heartfelt condolences to all the family members and fans! May his Soul Rest in Peace! శివైక్యం 🙏🙏 pic.twitter.com/noNbOLKzfX — Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2023 రవితేజ సంతాపం.. మృత్యువుతో పోరాడి తారకరత్న మరణించారనే విషాద వార్త తెలిసి చాలా బాధపడ్డానని రవితేజ ట్వీట్ చేశారు. ఇతరులపట్ల దయగల స్వభావం కలగిన ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈమేరకు రవితేజ ట్వీట్ చేశారు. Profoundly saddened to learn about the tragic demise of dear Taraka Ratna after battling hard! He will always be fondly remembered for his kind-hearted nature towards everyone! My sincere condolences to his dear ones. Om Shanti 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 18, 2023 -
K.Viswanath: ఆయన కళ అజరామరం- కమల్ హాసన్
లోకనాయకుడు కమల్ హాసన్‌కు తెలుగులో స్టార్‌డమ్‌ను తీసుకొచ్చిన వ్యక్తి.. కళాతపస్వి కే. విశ్వనాథ్. వాళ్లిద్దరి మధ్య అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే ఆయన మృతిపై కమల్ ఎమోషనల్ అయ్యారు. కళాతపస్వి కె విశ్వనాథ్ గారు జీవిత పరమార్థాన్ని, కళ యొక్క అమరత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. అందువల్లే జీవితకాలం దాటినా.. ఆయన కళకు గుర్తింపు ఉంటూనే ఉంటుంది. ఆయన కళ అజరామరం. అమితమైన అభిమాని కమల్ హాసన్ అంటూ ట్వీట్ చేశారాయన. Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM — Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023 కిందటి ఏడాది హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో తన మాస్టర్ విశ్వనాథ్‌ను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు కమల్. ఆ సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకున్నట్లు కమల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సాగర సంగమంతో మొదలైన వీళ్ల కాంబోలో.. స్వాతి ముత్యం, శుభ సంకల్పం లాంటి కల్ట్ క్లాసిక్లు వచ్చాయి. శుభ సంకల్పంతో పాటు కురుతిపునాల్(ద్రోహి), ఉత్తమ విలన్ చిత్రాల్లో కలిసి నటించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి స్పందిస్తూ.. కమల్ హాసన్‌కు సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ ఉంది. నటనలో, దర్శకత్వంలో అతనికి తెలియనిది అంటూ లేదు. అంత నాలెజ్డ్ ఉండడం తప్పు సినిమా రంగంలో అంటూ విశ్వనాథ్ చమత్కరించారు. అంతేకాకుండా..కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని ఆలోచిస్తానన్నారాయన. K. Vishwanath Ji you taught me so much, being on set with you during Eeshwar was like being in a temple… RIP My Guru 🙏 pic.twitter.com/vmqfhbZORx — Anil Kapoor (@AnilKapoor) February 2, 2023 ఇక.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.. కే విశ్వనాథ్ మృతిపై ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. విశ్వనాథ్‌గారూ తనకెంతో నేర్పించారని, ఈశ్వర్ షూటింగ్ సందర్భంలో.. ఒక దేవాలయంలో ఉన్న అనుభూతి చెందానని ట్వీట్ చేశారు అనిల్ కపూర్. కమల్ హాసన్ ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని బాలీవుడ్లో ఈశ్వర్ పేరుతో రీమేక్ చేశారు విశ్వనాథ్. అందులో అనిల్ కపూర్, విజయశాంతి లీడ్ రోల్లో నటించారు. ఉత్తమ కథగా ఈ చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ కూడా అవార్డు దక్కింది. -
విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్
KK Demise: KK Sweating Badly At Concert Video Goes Viral: ప్రముఖ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) మృతిపై పోలీసులు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత ఆయన గుండెపోటుతో కన్నుమూశారనే ప్రకటన మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అయితే.. కేకే చివరిసారిగా ప్రదర్శన ఇచ్చే సమయంలో తీవ్ర ఇబ్బందికి లోనయ్యారు. కోల్‌కతా నజ్రుల్ మంచాలోని గురుదాస్ కాలేజ్ వద్ద జరిగిన కాన్సెర్ట్‌లో పాల్గొన్నారు కేకే. అయితే ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బందికి లోనయ్యారు. వేదిక క్లోజ్డ్ హాల్. ఫ్యాన్, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో విపరీతమైన చెమటలు పోసి ఇబ్బందిపడ్డారు. ఒకానొక టైంలో భరించలేక కిందకు దిగి నిర్వాహకులకు స్వయంగా ఆయనే ఇబ్బందిపై ఫిర్యాదు కూడా చేశారు. అయినా నిర్వాహకులు సరిగా స్పందించలేదు. దీంతో ఇబ్బంది పడుతూనే ఆయన గంటపాటు ప్రదర్శన పూర్తి చేశారు. ఆ తర్వాత హోటల్ ఒబెరాయ్ గ్రాండ్‌కు చేరుకుని ఛాతీలో భారంగా ఉందని తన సిబ్బందికి తెలిపారాయన. అలా చెబుతూనే కుప్పకూలిన ఆయన్ని.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండె పోటుతోనే మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అసహజ మరణం కిందే కేసు నమోదు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని సీఎంఆర్ఐ ఆస్పత్రిలో ఉంచారు. శవ పరీక్ష పూర్తి అయితేనే ఆయన మృతికి గల అసలు కారణం తెలిసేది. చదవండి: ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ ఇదిలా ఉంటే కేకే చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన కేకే అభిమానులు ఆయన మరణానికి నిర్వహకుల నిర్లక్ష్యమే కారణంగా ఎత్తిచూపుతున్నారు. 'అక్కడ ఏసీ లేదు. వేడి, డీహైడ్రేషన్ వల్లే స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయి' అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. 'ఆ కాన్సెర్ట్‌లో పాల్గొనకపోతే కేకే బతికి ఉండేవాడు. కేవలం ఆయన తన అభిమానుల కోసమే ప్రదర్శన ఇచ్చారు. నిర్వాహణ లోపం కారణంగా మనం ఒక రత్నాన్ని కోల్పోయాం' అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. AC wasn't working at Nazrul Mancha. he performed their and complained abt it bcoz he was sweating so badly..it wasnt an open auditorium. watch it closely u can see the way he was sweating, closed auditorium, over crowded, Legend had to go due to authority's negligence. Not KK pic.twitter.com/EgwLD7f2hW — WE जय (@Omnipresent090) May 31, 2022 -
ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలికించేవి: ప్రధాని మోదీ
PM Narendra Modi Akshay Kumar Condolence On Singer KK Death: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. పాపులర్ ప్లేబ్యాక్ సింగర్ కేకే (కృష్ణకుమార్ కున్నత్) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న అనంతరం కేకే తాను బస చేస్తున్న హోటల్ గదిలో కుప్పకూలి మరణించినట్లు సమాచారం. కేకే తన ఆఖరి ప్రోగ్రాంకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 ఏళ్ల కేకే గత మూడు దశాబ్దాల్లో హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో అనేక హిట్ గీతాలను ఆలపించారు. కేకే హఠాన్మరణం మరణం పట్ల ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. #WATCH | Singer KK died hours after a concert in Kolkata on May 31st. The auditorium shares visuals of the event held some hours ago. KK was known for songs like 'Pal' and 'Yaaron'. He was brought dead to the CMRI, the hospital told. Video source: Najrul Manch FB page pic.twitter.com/YiG64Cs9nP — ANI (@ANI) May 31, 2022 'కేకేగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పాటలు అన్ని రకాల వయసుల వారికి అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా చేశాయి. కేకే పాటలు మనకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'కేకే హఠాన్మరణం వార్త విని చాలా షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. తీరని లోటు ఇది. ఓం శాంతి.' అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వీరితోపాటు దర్శక నిర్మాత కరణ్ జోహార్, సింగర్స్ ప్రీతమ్, జుబిన్ నటియాల్, ఆర్మాన్ మాలిక్, శ్రేయ ఘోషల్ విచారం వ్యక్తం చేశారు. చదవండి: సింగర్ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి.. Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti. — Narendra Modi (@narendramodi) May 31, 2022 Extremely sad and shocked to know of the sad demise of KK. What a loss! Om Shanti 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) May 31, 2022 Heartbreaking news on the sudden passing away of such an incredible talent…. RIP KK…💔 the entertainment world has lost a true artist today….Om Shanti 🙏 pic.twitter.com/SiKQutPJVO — Karan Johar (@karanjohar) May 31, 2022 In utter shock. Just heard about KK . Someone please tell me it's not true — Pritam (@ipritamofficial) May 31, 2022 Black year for Indian music. Lata didi, bappi da, sidhu paaji and now KK sir. These losses.. all of them feel so personal. — ARMAAN MALIK (@ArmaanMalik22) May 31, 2022 One and only . KK 😔 . — Jubin Nautiyal (@JubinNautiyal) May 31, 2022 My deepest sincerest condolences. His golden, soulful voice echoes in all our hearts. Rest in peace dear #KK🙏🏻💔 — Shreya Ghoshal (@shreyaghoshal) May 31, 2022 Singer KK never smoked or drank! Led the most simple non controversial non media hyped life. Complete family man. Jab bhi mujhe mile he met with so much of love & kindness. God! Too unfair! OM SHANTI. — RAHUL VAIDYA RKV (@rahulvaidya23) May 31, 2022 -
సీపీఐ నారాయణకు సతీవియోగం
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత నారాయణ భార్య వసుమతి కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో వసుమతి అంత్యక్రియలు జరుగుతాయని చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శి రామానాయుడు తెలిపారు. ప్రముఖుల సంతాపం: ► సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ► సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ గారి సతీమణి వసుమతి దేవి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. విద్యార్థిగా ఎఐఎస్ ఎఫ్‌లో పని చేసి, అనంతరం బ్యాంక్ ఉద్యోగిగా పని చేశారు. తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కమ్యూనిస్టు పార్టీలో పని చేశారు. ప్రజా సహాకారంతో ప్రారంభించిన 99 టీవీ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కామ్రేడ్ వసుమతి మృతి పట్ల నారాయణకు, వారి కుటుంబ సభ్యులకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
'వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది'
'ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం వార్త నా గుండెను ముక్కలు చేసింది' అంటూ అతని మాజీ ప్రియురాలు.. నటి ఎలిజెబెత్ హార్లీ పేర్కొంది. వార్న్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఎమెషనల్ అయింది. ఈ సందర్భంగా తన మాజీ ప్రియుడికి కడసారి వీడ్కోలు పలుకుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వార్న్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ''వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. అతనితో అనుబంధం విడదీయలేనిది. సూర్యుడు ఎప్పటికి మేఘాల వెనుక దాక్కోవడానికి వెళ్లినట్లుగానే వార్న్ మరణాన్ని ఫీలవుతున్నా.. ఐ మిస్ యూ మై లవ్లీ వార్న్'' అంటూ రాసుకొచ్చింది. ఇక 2007లో మొదటి భార్య సిమోన్‌తో విడాకుల అనంతరం.. నటి ఎలిజెబెత్ హర్లీతో వార్న్ ప్రేమాయణం నడిపాడు. 2011 సెప్టెంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ఇద్దరు రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. 2013 డిసెంబర్లో వార్న్, హార్లీలు విడిపోయారు. కాగా వార్న్ మృతిపై పలు సందేహాలు ఉన్నాయంటూ థాయ్ పోలీసులు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్‌పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని తెలిపారు. ఆదివారం థాయ్ అధికారులు వార్న్ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. ఒక వేళ వార్న్‌ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు! Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..! Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు View this post on Instagram A post shared by Elizabeth Hurley (@elizabethhurley1) -
Shane Warne: మద్యం, మాంసం, సిగరెట్లతో స్పిన్ మాంత్రికుడికి నివాళి
స్పిన్ మాంత్రికుడు, ఆసీస్ దిగ్గజ బౌలర్ షేన్ వార్న్(51) శుక్రవారం థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే మెల్బోర్న్ క్రికెట్ మైదానం ముందు ఏర్పాటు చేసిన అతని కాంస్య విగ్రహం వద్దకు బారులు తీరిన అభిమానులు స్పిన్ మాంత్రికుడికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తున్నారు. రకరకాల పూలతో పాటు తమ ఆరాధ్య క్రికెటర్‌కు ఎంతో ప్రీతిపాత్రమైన మద్యం (బీర్), మాంసం, సిగరెట్లను విగ్రహం ముందు ఉంచి అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా చనిపోతే వారికి ఇష్టమైన వాటిని సమాధి ముందుంచడం ఆనవాయితీ. ఈ క్రమంలో వార్న్‌కు ఇష్టమైన బీర్‌ను, మాంసాన్ని, సిగరెట్లను అభిమానులు అతని విగ్రహం ముందుంచుతున్నారు. కాగా, క్రికెటింగ్ కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వార్నీ.. వ్యసనాలకు బానిసై వివాదాలకు కేంద్ర బింధువుగా నిలిచిన విషయం తెలిసిందే. మద్యం, సిగరెట్లతో పాటు స్త్రీ వ్యామోహం కూడా అధికంగా కలిగిన అతను.. చాలా సందర్బాల్లో వీటిని సేవిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టాడు. సమకాలీన క్రికెట్లో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (1347) తర్వాత వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చదవండి: Shane Warne: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం -
సౌదీలో గుండెపోటుతో జగిత్యాల వాసి మృతి.. రెండు వారాలుగా ఎదురు చూపులు
పొట్టకూటి కోసం సౌదీకి వెళ్లిన జగిత్యాల వాసి గుండెపోటుతో అక్కడే మరణించాడు. ఇండియాకి తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కోరారు. రెండు వారాలుగా మృతదేహం కోసం కుటుంబ సభ్యులు స్వగ్రామంలో ఎదురు చూస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పెండ్లి పోషయ్య అనే వ్యక్తి ఉపాధి కోసం సౌదీకి వెళ్లాడు. అక్కడ జెడ్డా సమీపంలో పని చేస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 10న అప్రెల్ బాథెన్ దగ్గర ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. అప్పటి నుంచి అతని మృతదేహం సౌదీలోనే ఉండిపోయింది. పెండ్లి పోషయ్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు సహాకారం అందివ్వాల్సిందిగా మృతుడి తరఫున వారు మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్లో కోరారు. సౌదీలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సాయం అందిస్తామంటూ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. -
అల్లం నారాయణకు సతీ వియోగం
హైదరాబాద్(లక్డీకాపూల్): రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి పద్మ(54) కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన లూపస్, కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఇటీవల కోవిడ్ సోకింది. దీంతో ఆమె 22 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం ఎర్రగడ్డ జేక్ కాలనీలోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వద్ద ఉంచుతారు. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో మధ్యాహ్నం 12 గం.కు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలో నిమ్స్‌లోని ఆమె భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళా జేఏసీలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మెస్‌లు మూసివేయడంతో ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చడమేగాక.. అమ్మల సంఘం అధ్యక్షురాలిగా పని చేస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ సంతాపం..: అల్లం పద్మ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నారాయణను ఫోన్లో పరామర్శించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్మ మరణం పట్ల శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రాజమౌళిచారి, టీయూడబ్లు్యజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పద్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. -
గౌతమ్‌రెడ్డి మృతిపై అసత్య ప్రచారం.. ఖండించిన కుటుంబ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్‌రెడ్డి మృతి చెందినప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై ఆయన కుటుంబం స్పదించింది. గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... ► ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి ఇంటికి చేరారు. ► 06.00 గంటలకు రోజూలాగే ఉదయాన్నే ఆయన మేల్కొన్నారు. ► 06:30 గంటల వరకూ మంత్రిగారు ఫోన్లతో కాలక్షేపం చేశారు. ► 07.00 గంటలకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో మంత్రి కూర్చుని ఉన్నారు. ► 07:12 గంటలకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు. ► 07:15గంటలకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోఫా నుంచి ఆయన మెల్లిగా కిందకి ఒరిగారు. ► 7:16 గంటలకు మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి కంగారు పడి గట్టిగా అరిచారు. ► 07:18 గంటలకు పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతి మీద చేయితో నొక్కి డ్రైవర్ నాగేశ్వరరావు స్వల్ప ఉపశమనం కలిగించారు. ► 07:20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు. ► 07:20 గంటలకు మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భార్య శ్రీకీర్తి.. వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. ► 07:22 ‘నొప్పి పెడుతుంది కీర్తి’ అంటున్న మంత్రి మాటలకు స్పందించి.. అక్కడి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరారు. ► 07:27 మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆస్పత్రికి, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటి డ్రైవర్, సిబ్బంది చేర్చారు. ► 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. ► 09:13 గంటలకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ► 09:15 గంటలకు మంత్రి మేకపాటి మృతిచెందినట్లు అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు. -
మేకపాటి గౌతమ్‌రెడ్డి.. ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి కోసమే
నేటి రాజకీయాల్లో మృదు స్వభావిగా వివాదరహితుడిగా పేరు తెచ్చుకోవడం చాలా అరుదు. అలాంటి గుర్తింపు సాధించిన అరుదైన రాజకీయవేత్తల్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా తన ఆఖరి క్షణాల వరకు ఏపీ అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పన అంశాలపైనే ఆయన ఫోకస్ చేశారు. రాష్ట్రం విడిచి పది రోజుల పాటు విదేశాల్లోనే మకాం వేసి భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీకి తీసుకువచ్చారు. ఎంతో సంతోషకరమైన వార్తను ఏపీ ప్రజలతో స్వయంగా పంచుకోకుండానే ఆయన హఠన్మరణం పొందారు. చనిపోవడానికి ఒక్క రోజు ముందు వరకు మేకపాటి గౌతంరెడ్డి ఏపీ అభివృద్ధి కోసమే శ్రమించారు. ఏపీ ఐటీ పరిశ్రమల మంత్రి హోదాలో చివరగా దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు. 2022 ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ దుబాయ్ ఎక్స్‌పోలో నిర్వహించిన ఏపీ పెవిలియన్‌ను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో వారం రోజుల పాటు అలుపెరగకుండా చర్చలు జరిపారు. అంతేకాదు అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ రోడ్‌షోలో ఆయన స్వయంగా పాల్గొని ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రమ ఫలించి ఏపీలో భారీ పెట్టుబడులకు అనేక కంపెనీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఆదివారం ఆయన జారీ చేసిన ప్రకటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుస్థిరమైన పాలనలో నవరత్నాలు పేరుతో అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ఏపీకి భారీ పెట్టుబడులు రాబోతున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 11 సెక్టార్లలో 70 ప్రాజెక్టులకు గ్రీన్ పెట్టుబడి అవకాశాలను దుబాయ్ ఎక్స్‌పోలో సాధించినట్టు ఆయన వివరించారు. రూ. 5,150 కోట్ల పెట్టుబడులకు ఆరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో కుదిరిన ఒప్పందాల్లో రీజెన్సీ గ్రూపు హైపర్ రిటైల్, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. అల్యూమినియం కాయిల్స్, ప్యానల్స్ తయారీకి మల్క్ హోల్డింగ్స్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కాసిస్ ఈ-మొబిలిటీ, స్మార్ట్ సిటీ యుటిలీటీకి సంబంధించి ఫ్లూయంట్ గ్రిడ్ సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3,440 మందికి, పరోక్షంగా 7,800 మందికి ఉపాధి లభించనుంది. @MekapatiGoutham last speech in #Expo2020Dubai 💔#MekapatiGouthamReddy pic.twitter.com/9s6A9xc2rf — Latha (@LathaReddy704) February 21, 2022 దుబాయ్ ఎక్స్పో ముగించుకున్న అనంతరం మరో మూడు రోజులు ఆయన దుబాయ్‌లోనే ఉన్నారు. 2022 ఫిబ్రవరి 20 రాత్రి హైదరాబాద్‌కి ఆయన చేరుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో సాధించిన విజయాలను, రాబోతున్న పెట్టుబడులు, యువతకు లభించనున్న ఉపాధి అవకాశాలను ఏపీ ప్రజలకు స్వయంగా తెలియజేయాలనుకున్నారు. కానీ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి 24 గంటలు కూడా పూర్తికాక ముందే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చివరి క్షణం వరకు ఆయన ఏపీ అభివృద్ధి, యువత ఉపాధిలనే తన శ్వాసగా ఆయన జీవించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం: హైదరాబాద్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ -
రమేశ్ బాబు మృతి.. 'హీరో' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
Ramesh Babu Passed Away,Hero Movie Pre Release Event Cancelled: సూపర్‌స్టార్ కృష్ణ మనువడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా నటించిన చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు(ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న హీరో చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
సోదరుడి మృతిపై మహేశ్‌బాబు తీవ్ర భావోద్వేగం.. ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu pens an emotional note mourning the demise of his elder brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు(56)మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఇక అన్నయ్య మృతిపై తొలిసారి స్పందించిన మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకున్నారు. 'మీరు నాకు స్ఫూర్తి, నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కాగా కోవిడ్ కారణంగా ప్రస్తుతం మహేశ్ బాబు హోంక్వారంటైన్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంతిమ కార్యక్రమాలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
అనూహ్య దుర్ఘటన
ఇది హృదయాన్ని కలచివేసే అనూహ్య దుర్ఘటన. దేశంలో త్రివిధ సైనిక దళాలకు పెద్ద తలకాయ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సైనిక హెలికాప్టర్ బుధవారం మధ్యాహ్నం తమిళనాడులో ప్రమాదానికి గురికావడం, రావత్ – ఆయన సతీమణి సహా 13 మంది దుర్మరణం దిగ్భ్రాంతికరం. దట్టమైన చెట్లు, తేయాకు తోటలు నిండిన నీలగిరుల్లో, కూనూరుకు సమీపంలో 5 నిమిషాల్లో గమ్యానికి చేరతారనగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోనే అత్యంత కీలక సైనికాధికారి మరణానికి కారణమైన ఈ ప్రమాదం అనేక భావోద్వేగాలకూ, తొలి దశలో రక్షణపరమైన అనుమానాలకూ దారి తీస్తోంది. గత ప్రమాదాల కథ గిర్రున రీలులా తిరుగుతోంది. తొందరపడి ఒక నిర్ధారణకు రావడం సరైనది కాదు కానీ, అసలు ఇలాంటి వీఐపీల ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారా అని సామాన్యుల్లో సందేహం రేపుతోంది. 2015లో నాగాలాండ్‌లో ఓ సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ టేకాఫ్ అయ్యీ అవగానే 20 అడుగుల ఎత్తున ప్రమాదానికి గురైనప్పుడు రావత్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కానీ, ఈసారి అదృష్టం ఆయనకు ముఖం చాటేసింది. అయితే, భారత తొలి సీడీఎస్‌గా నియుక్తులైన అదృష్టం రావత్‌కే దక్కింది. హోదా రీత్యా భారత సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి కాగా, ఆ తర్వాతి స్థానం ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ది. దేశరక్షణ వ్యవహారాల్లో ప్రధానికీ, రక్షణ మంత్రికీ సీడీఎస్ కీలక సలహాదారు. అలాంటి అత్యున్నత స్థాయి వ్యక్తి దుర్మరణం దేశానికి భారీ నష్టం. తదుపరి చర్యల కోసం ‘రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ’ (సీసీఎస్) హుటాహుటిన సమావేశమవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రతిసారీ రావత్ హాజరయ్యే ఆ భేటీ ఈసారి ఆయన లేకనే జరగాల్సి రావడం విషాదం. నాలుగు స్టార్లు ధరించిన అరుదైన జనరల్‌గా ఎదిగిన 63 ఏళ్ళ రావత్ 1978 నుంచి ఇప్పటికి 43 ఏళ్ళుగా భారత సైన్యంలో విశేష సేవలందిస్తూ వచ్చారు. గతంలో ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించారు. కీలక ఘట్టాల్లో వీరోచిత సైనికుడిగా తన సత్తా చాటి, ఎన్నో గౌరవ పతకాలు అందుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాంతి పరిరక్షణ బాధ్యతలు, ఈశాన్యంలో తీవ్రవాద నిరోధక చర్యలు, సరిహద్దు ఆవల మయన్మార్ ఆపరేషన్లు, ఆ మధ్య సర్జికల్ దాడుల్లో రావత్ కీలక పాత్రధారి. రిటైరయ్యే లోగా నెరవేర్చాల్సిన బృహత్తర బాధ్యత చాలా ఉందని సీడీఎస్‌గా చెబుతూ వచ్చారు. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత, త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం కోసం, సైన్యంలో అవసరమైన సంస్కరణల కోసం సీడీఎస్ అనే ప్రత్యేక హోదా ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. రెండు దశాబ్దాల తాత్సారం తర్వాత, రెండేళ్ళ క్రితం అది కార్యరూపం దాల్చింది. ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రావత్ దూరదృష్టితో, చురుకుగా ముందుకు సాగారు. అప్పటి దాకా ఆలోచనలకే పరిమితమైన సైనిక సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. సౌత్ బ్లాక్‌లోని కార్యాలయంలో బల్ల నిండా ఫైళ్ళు, నిరంతర సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతూ వచ్చారు. అనుకున్నది సాధించే దాకా విశ్రమించని వ్యక్తిగా పేరున్న రావత్ విమర్శలు, వివాదాలు వచ్చిపడ్డా వెనక్కి తగ్గలేదు. అదేమంటే, ‘నేనేమీ అందరినీ మెప్పించి, ఎన్నికల్లో గెలవనక్కర్లేదుగా’ అని నవ్వేయడం ఆయన విలక్షణ శైలి. దేశ రక్షణకు కీలకమైన ఇంతటి వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇలా కూలిపోవడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మునుపు సంజయ్ గాంధీ (1980 జూన్), కాంగ్రెస్ నేత మాధవరావ్ సింధియా (2001 సెప్టెంబర్) విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తెలుగువారైన లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి (2002 మార్చి), సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (2009 సెప్టెంబర్), అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండూ (2011 మే) తదితరులు వివిధ హెలికాప్టర్ ప్రమాదాల్లో అకాల మరణం పాలయ్యారు. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు, తేలని విచారణలు తెలిసిందే. ఇప్పటి ఈ తాజా ప్రమాదానికి కారణం – అననుకూల వాతావరణమా? వాహనంలో వచ్చిపడ్డ సాంకేతిక సమస్యా? పైలట్ల అనుభవ రాహిత్యమా? ఇలా ఎన్నో బేతాళ ప్రశ్నలు. విచారణలో నిజాలు నిగ్గు తేలతాయి. ఎయిర్ మార్షల్ స్థాయి ఉన్నతాధికారి సారథ్యంలో త్రివిధ దళాధికారులతో లోతైన విచారణ జరపనున్నట్టు సమాచారం. రష్యా నుంచి భారత సైన్యంలోకి వచ్చిన జవనాశ్వంగా ‘మీ–17వీ5’ హెలికాప్టర్లకు పేరు. ప్రముఖుల ప్రయాణాలకూ, కీలక రవాణాకూ చాలాకాలంగా నమ్మకమైన ఈ ఛాపర్లు ప్రమాదం పాలవడం ఆశ్చర్యమే. సీనియర్లు, అనుభవజ్ఞులైన పైలట్లే ఇలాంటి వీవీఐపీల హెలికాప్టర్లను నడుపుతారు. ప్రముఖుల ప్రయాణాలకు ముందు వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆయిల్ మార్చడం మొదలు అనేక చిన్న విడిభాగాలను మార్చడం దాకా అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బుధవారం ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నారట. కానీ, ఊహించని రీతిలో తక్కువ ఎత్తులో ఛాపర్ ప్రయాణిస్తోందనీ, ఓ భారీ వృక్షానికి గుద్దుకుందనీ, ఇంధన ట్యాంకు పేలి, కాలిపోయిందనీ కథనం. అంతా పైకి కనిపిస్తున్నట్టనిపించినా, బ్లాక్‌బాక్స్ విశ్లేషణ సహా లోతైన విచారణ తర్వాతే కనిపించని కారణాలు తెలియరావచ్చు. ఏమైనా జరగకూడని నష్టం జరిగేపోయింది. వర్తమానానికి అవసరమైన కీలక సైనిక సంస్కరణలు చేయడానికి రావత్ సిద్ధమవుతున్న వేళ, దేశానికి పశ్చిమ, ఉత్తరాల నుంచి పాక్, చైనాలతో ముప్పున్న వేళ ఆయనను పోగొట్టుకోవడం ఓ అశనిపాతం. ఈ భారత వీరపుత్రుడు అర్ధంతరంగా వదిలేసివెళ్ళిన సంస్కరణల సత్కార్యాన్ని పూర్తి చేయడమే ఆయనకు నిజమైన నివాళి. -
ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
ఈ గాలీ.. ఈ నేలా.. ఈ ఊరు
వేటూరి తరువాత తెలుగు సినీ పాటకు విశ్వఖ్యాతి తెచ్చిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణ వార్త జిల్లాను విషాదంలోకి నెట్టేసింది. జిల్లాలో పాటల, సాహితీ ప్రియులు ఆయన పాటలతో ఉన్న బంధాన్ని.. పదాలు రగిలించిన స్ఫూర్తిని తల్చుకుని కన్నీటిపర్యంతమయ్యారు. జగమంత అభిమానుల కుటుంబాన్ని వదిలి ‘ఏకాకి జీవితం నాది’ అంటూ నిష్క్రమించిన ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం/కాకినాడ: సీతారామశాస్త్రితో జిల్లాకు విడదీయరాని బంధం ఉంది. ఆయన తండ్రి వెంకట యోగి కాకినాడ ఐడియల్ కళాశాలలో హిందీ అధ్యాపకుడిగా పని చేశారు. 1970–72 ప్రాంతంలో అదే కళాశాలలో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదివారు. తండ్రి నుంచి సాహితీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఆయన సాహిత్య ప్రస్థానం కాకినాడలోనే ప్రారంభమైంది. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ బిల్డింగ్ వద్ద ఆయన కుటుంబం నివాసం ఉండేది. 1976 నుంచి 1984 వరకూ కాకినాడలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో క్లరికర్ క్యాడర్లో పని చేశారు. అక్కడి సాహితీవేత్తలు అద్దేపల్లి రామ్మోహనరావు తదితరులతో అప్పటికే పరిచయాలుండేవి. సాహితీవేత్త సీహెచ్ కృష్ణారావు నిర్వహించే ‘నెలనెలా వెన్నెల’ సాహిత్య సభలకు హాజరయ్యేవారు. కవితలు రాసి వినిపించేవారు. పద్మశ్రీ అవార్డు పొందిన సిరివెన్నెలను 2019 ఆగస్టు 3న కాకినాడ సూర్య కళామందిర్లో స్థానిక కవులు సత్కరించారు. ‘సిరివెన్నెల’గా మారిందిక్కడే.. సుప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాల షూటింగ్‌లు దాదాపు ఈ జిల్లాలోనే జరిగేవి. కాకినాడకు చెందిన రచయిత ఆకెళ్ల ద్వారా విశ్వనాథ్‌కు సీతారామశాస్త్రి తొలిసారి పరిచయమయ్యారు. ఆయన ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ జనని జన్మభూమి (1984) సినిమాలో తొలి అవకాశమిచ్చారు. రామచంద్రపురంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సిరివెన్నెల ఒక పాట పాడి వినిపించడంతో విశ్వనాథ్ ఆకర్షితులయ్యారు. ఆ పాటను వెంటనే జనని జన్మభూమి సినిమాలో తీసుకున్నారు. ఆయన సాహితీ స్థాయిని అర్థం చేసుకున్న విశ్వనాథ్ తన తదుపరి చిత్రమైన సిరివెన్నెలలో అవకాశమిచ్చారు. అందులోని పాటలన్నీ సీతారామశాస్త్రే రాశారు. ఆ పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిపోయింది. రామచంద్రపురానికి చెందిన ఉజూరు వీర్రాజు, చింతా రామకృష్ణారెడ్డి, ఎం.భాస్కరరెడ్డిలు సంయుక్తంగా సిరివెన్నెల సినిమా నిర్మాణ సారథ్యం వహించారు. ఈ సినిమాలో పాట ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. సిరివెన్నెల సినిమా ఆయన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ►స్వాతి కిరణం చిత్రంలో స్వీయరచన శివానీ.. భవానీ పాట చిత్రీకరణ సందర్భంగా రామచంద్రపురంలోని రాజుగారి కోటలో సీతారామశాస్త్రి రెండు రోజుల పాటు సీతారామశాస్త్రి ఉన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరాన్ని పలుమార్లు సందర్శించారు. ►సీతానగరం మండలం రాపాక పంచాయతీ పరిధిలోని శ్రీరామనగరం సద్గురు చిట్టిబాబాజీ సంస్థానాన్ని సిరివెన్నెల ఏటా సందర్శించేవారు. ఆ పాట ఎప్పటికీ జనం నోళ్లలో.. సంప్రదాయ కావ్య భాషను చలన చిత్రాల్లో పాటగా మలచి, సామాన్యుడు సైతం సులువుగా పాడుకునే శైలిని ప్రవేశపెట్టారు సీతారామశాస్త్రి. ఆయన పాటలతో సినిమా సాహిత్యం సుసంపన్నమైంది. సీతారామశాస్త్రి మృతి చెందినప్పటికీ ఆయన పాట ఎప్పటికీ జనం నోళ్లలో నిలిచే ఉంటుంది. ఆయన కాకినాడలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు, వివిధ సాహిత్య సభల్లో ఆయనతో నా అనుబంధం స్నేహపాత్రమైనది. – దాట్ల దేవదానంరాజు, కవి, యానాం అలా పరిచయం చేశారు డిగ్రీ చదువుతున్న రోజుల నుంచే సీతారామశాస్త్రి పరిచయం. ఆకెళ్ల గారితో పాటు సీతారామశాస్త్రిని తరచూ కలుసుకునేవాడిని. ఆయనకు నా కవిత్వం అంటే ఎంతో అభిమానం. ఒకసారి నేను ఆయన ఆఫీసుకు వెళ్లాను. అక్కడే ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఉన్నారు. ‘ఈయన నా అభిమాన కవి’ అంటూ నన్ను ఆయనకు పరిచయం చేయడమే కాకుండా.. పత్రికల్లో అచ్చయ్యే నా కవితలను ఎత్తి రాసుకున్న డైరీ చూపించినపుడు నేనే ఆశ్చర్యపోయాను. అప్పటి నుంచీ అనేక సందర్భాల్లో కలుస్తూనే ఉన్నాం. – డాక్టర్ శిఖామణి, సంపాదకుడు, కవిసంధ్య, యానాం సీతానగరం మండలం శ్రీరామనగరంలోని చిట్టిబాబాజీ ఆశ్రమంలో సిరివెన్నెల పూజలు (ఫైల్) మాది 40 ఏళ్ల స్నేహబంధం సీతారామశాస్త్రితో నాది 40 ఏళ్ల స్నేహబంధం. మాది సాహిత్య సంబంధమే కాదు.. ఆత్మీయ అనుబంధం కూడా. మా కుటుంబంలో ఓ వ్యక్తిలా ఉంటారు. సిరివెన్నెల మరణం తీరని లోటు. ఆయనపై ఓ పుస్తకం రాస్తున్నాను. ఓ అధ్యాయం పూర్తి చేశాను. ఇటీవల కలుసుకోవాలనుకున్నా అనారోగ్యం వల్ల వాయిదా పడింది. అమలాపురంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ‘సిరివెన్నెల సినీ గీతాలు’ శీర్షికతో పూర్తి చేసి ఆవిష్కరిస్తాను. – డాక్టర్ పైడిపాల, పాటల పరిశోధన రచయిత రాజమహేంద్రవరంతో అనుబంధం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సాహిత్య సభలకు సిరివెన్నెల తరచూ వచ్చేవారు. నగరానికి చెందిన చాగంటి శరత్‌బాబుతో ఎక్కువ సాంగత్యం ఉండేది. సామర్లకోటలోని రామ్షా వద్ద వీరిద్దరూ సహాయకులుగా ఉండేవారు. రామ్షా ఆయుర్వేద వైద్యుడే కాకుండా జ్యోతిష శాస్త్ర ప్రవీణుడు కూడా. దీంతో వీరిద్దరూ ఆయుర్వేదంతో పాటు జ్యోతిష శాస్త్రంపై కూడా పట్టు సంపాదించారు. ఏ ఉద్యోగం దొరకకపోతే జ్యోతిషం చెప్పుకొని బతకవచ్చంటూ సిరివెన్నెల సరదాగా అనేవారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చాగంటి శరత్‌బాబుతో ఉన్న బంధంతో ఆయన కుమార్తెను తన కోడలిగా చేసుకున్నారు. శరత్‌బాబు గత సెప్టెంబర్ 26న మరణించారు. అక్టోబర్ 5న రాజమహేంద్రవరం దానవాయిపేటలో జరిగిన సంస్మరణ సభలో సిరివెన్నెల పాల్గొన్నారు. అదే నగర చివరి సందర్శన అవుతుందని అభిమానులు అనుకోలేదు. సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నగరానికి చెందిన సినీ నటుడు, గాయకుడు జిత్‌మోహన్‌మిత్రా కన్నీరు పెట్టుకున్నారు. సిరివెన్నెల చిత్రం షూటింగ్లో సీతారామశాస్త్రి తదితరులు ఆయనతో పరిచయం మరువలేనిది ‘సిరివెన్నెల’ సినిమాకు నిర్మాణ బాధ్యతలు వహించడం నా జీవిత అదృష్టం. ఇందులో సీతారామశాస్త్రి రాసిన పాటలు అమోఘం. పాటకు కొత్త సొబగులద్దారు. ఆయన రాసిన పాటలు ఆ సినిమాకు ప్రాణం పోశాయి. నంది అవార్డు రావటం ఎంతో ఆనందాన్ని అందించింది. మా చిత్రం నుంచే ఆయన ‘సిరివెన్నెల’గా మారిపోయారు. – ఉజూరు వీర్రాజు, సిరివెన్నెల నిర్మాత, రామచంద్రపురం -
Sirivennela: మహాప్రస్థానంలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు
Live Updates: Sirivennela Sitaramasastry: మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిసాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు: ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు మన మాటల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు, ఆయన ఎన్నో పాటలు రాశారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయి. రాబోయే తరానికి ఆయన పాటలు బంగారు బాటలు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలా కలుస్తాననుకోలేదు: దేవీశ్రీ ప్రసాద్ చాలారోజుల నుంచి కలవాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కలుస్తాననుకోలేదు. మా నాన్నగారి తర్వాత నన్ను కొట్టేవారు, తిట్టేవారు ఆయన ఒక్కరే. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నేను ఏమైనా పాట రాస్తే అది వివరించి చెప్పేవారు.కరోనా మా మధ్య దూరం పెంచింది. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు శ్రీకాంత్ నివాళులర్పించారు. ►రాజశేఖర్ సినిమాలకి ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను అని జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని రాజశేఖర్ అన్నారు. సామాన్యులకి కూడా అర్థం అవుతాయి: తలసాని సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు..అందరికీ బాధాకరం అని తలసాని అన్నారు. 'మూడు వేలకు పైగా పాటలు రాసిన గొప్ప వ్యక్తి. సిరివెన్నెల పాటలు అంటే పండుగ లాంటి పాటలు. పద్మశ్రీ, 11 నంది అవార్డులు రావడం ఎంతో గొప్ప వరం. సామన్యులకి కూడా అర్థం అయ్యేలా ఆయన పాటలు ఉంటాయి. ఈరోజు తెలుగు వారంతా బాధలో ఉన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రైటర్స్‌కి సిరివెన్నెల స్పూర్తి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం 'అని తలసాని అన్నారు. మంచి వ్యక్తిత్వం..ఆ పాట గుర్తొస్తుంది: నాగార్జున సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు అది ఊహించడమే కష్టం: మహేశ్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్ అన్నారు. అందుకే విష్ణు రాలేదు: నరేశ్ 'తెలుగు సినీ పరిశ్రమకి బాలు, సిరివెన్నెల లాంటి వారు రెండు రధ చక్రాలను కోల్పోయాం. పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం. సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. బాబాయ్ కర్మకి విష్ణు వెళ్లారు. అందుకే రాలేదు' అని నరేశ్ అన్నారు. ప్రతిరోజూ ఆయన పాటలు వింటాం: సింగర్ కౌసల్య సిరివెన్నెలను కోల్పోవడం చాలా బాధాకరం.సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాశారు.ఆయన పాటలు తెలియని ప్రజానీకం లేరు. ఆయనతో నేను చాలా పాటలు పాడాను. సిరివెన్నెల గారు రాసిన పాటలు ప్రతిరోజూ వింటూ ఉంటాం. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ నివాళులు అర్పించారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికిసింగర్ గీతామాధురి, నటుడు శివబాలాజీ నివాళులు అర్పించారు. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీర్ణించుకోలేకపోతున్నాను: సింగర్ సునీత 'సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని సునీత పేర్కొన్నారు. శకం ముగిసింది: అల్లు అరవింద్ 'సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అల్లు అర్జున్ నివాళులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సందర్శించిన అల్లు అర్జున్ ఆయనకు నివాళులు అర్పించారు కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ 'ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయా : మణిశర్మ 'జగమంత కుటుంబాన్ని వదిలేసి సిరివెన్నెల వెళ్లిపోయారు. మంచి సాహిత్యవేత్తతో పాటు మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక వటవృక్షం కూలిపోయింది: తనికెళ్ల భరణి 'సిరివెన్నెల భౌతికకాయాన్ని చూసి నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోరోజులు కలిసి పనిచేశాం. ఒక వటవృక్షం కూలిపోయింది. ఇక అంతా శూన్యమే. దీన్ని భర్తీ చేయలేము. ప్రతిరోజూ నవ్వుతూ ఉండేవారు. ఆయన ప్రతీ పాట ప్రకాశిస్తుంది. సిరివెన్నెల లేని లోటు తీర్చలేం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి రామజోగయ్య శాస్త్రి నివాళులర్పించారు. గుండె తరుక్కుపోతుంది: పరుచూరి 'పాటే శ్వాసగా జీవించిన వ్యక్తి సిరివెన్నెల. అన్నగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. ఆయన లేడు అంటే గుండె తరుక్కుపోతుంది. ఆ మహానుభావుడు లేడంటే బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వేటూరి తర్వాత స్థానం సిరివెన్నెలదే. సిరివెన్నెల ప్రతి పాట ఆణిముత్యం: సాయికుమార్ సిరివెన్నెల పార్థివదేహానికి సినీ నటుడు సాయికుమార్ నివాళులర్పించారు. 'ప్రతి అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన రాసే ప్రతి పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల. ఎవడు సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. నేను విలన్ పాత్ర పోషించాను' అంటూ సాయికుమార్.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పోలీసుల మీద పాట రాశారు: సజ్జనార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'ఒక మంచి గేయ రచయితని కోల్పోయాం. రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో నాకు పరిచయం. పోలీసుల మీద మంచి పాటలు రాశారు. పోలీసుల తరపున, టీఎస్ఆర్టీసీ తరపున ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం' అని సజ్జనార్ అన్నారు. సిరివెన్నెల లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే: సి. కల్యాణ్ 'ఆరోజుల్లో సినిమా సాహిత్యం వేరు..ఇప్పుడు వేరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు' అని నిర్మాత సి. కల్యాణ్ పేర్కొన్నారు. నారప్ప వరకు కలిసి పనిచేశాను: హీరో వెంకటేశ్ 'సిరివెన్నెల మరణవార్త ఎంతో బాధాకరం. ఎంతో మంచి వ్యక్తి. సర్ణకమలం నుంచి మొన్న వచ్చిన నారప్ప సిరివెన్నెలతో కలిసి పనిచేశాను. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యరంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెంకటేశ్ అన్నారు. ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది: డైరెక్టర్ మారుతి 'ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. గత ఐదారేళ్ల నుంచి ఆయన ఇంట్లో కుటుంబసభ్యుడిలా ఉంటున్నా. మా ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది. సిరివెన్నెల ఇంకా మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన పాటలు ప్రతిరోజూ వింటాం' అని మారుతి తెలిపారు. ఈ లోటు తీరేది కాదు: ఎస్వీ కృష్ణారెడ్డి 'సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన లోటు తీరేది కాదు' అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sirivennela Seetharama Sastry: నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం
Sirivennela Seetharama Sastry Passed Away: నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసి పెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ‘కొండతల్లి నేలకిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగేదాకా తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్టదాహం’... కవి ఊహ అది. సిరి ఉన్న కవి ఊహ. ‘గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా’.. ఓహో.. ఏమి ఇమేజరీ. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇంత సరళమా పల్లవి? ‘పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ’ ఈ చేదు వాస్తవం పలకనివాడు కవి ఎలా అవుతాడు? ‘ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం’ ఈ హితం చెప్పే కవి లేని సమాజం అదేల? సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ కవిగా చిరాయువును పొందారు. ఆయన రాజకీయ భావాల పట్ల అభ్యంతరాలు ఉన్నవారు సైతం ఆయన పాటను ఆనందించారు. ఆస్వాదించారు. సిరివెన్నెల పండిత కవి. తెరపై పండు వెన్నెల కాయించిన కవి. ఆయనకు నివాళి. ‘బటర్‌ఫ్లై’ ఎఫెక్ట్ అంటే? ఇక్కడ జరిగే ఘటన ఎక్కడి ప్రతిఫలనానికో అని. భలేవాడివే. అది విధాత తలంపు కదా. 1980.. ‘శంకరాభరణం’ రిలీజైంది. ఊరూవాడా సంబరాలు. సన్మానాలు. కాకినాడకు యూనిట్ వస్తోందట. సన్మానం చేయాలట. ఆ ఊళ్లో అప్పటికి ఒక బుల్లి కవి ఉన్నాడు. ప్రతి సాహిత్య సభలో ప్రారంభ గీతాన్ని పాడుతూ ఉంటాడు. ‘అతణ్ణి అడుగుదాం... విశ్వనాథ్‌ని కీర్తిస్తూ ఒక పాట కట్టమందాం’ అనుకున్నారు మిత్రులు. ‘నేను విశ్వనాథ్ మీద కట్టను. వ్యక్తి మీద పాట ఏమిటి? శంకరాభరణం సినిమా మీద కడతాను. తెలుగువారి కళాదృష్టి దాహార్తిని తీర్చడానికి గంగలా ఆ సినిమా అవతరించింది. కనక గంగావతరణం పేరుతో గేయం రాస్తాను’ అన్నాడా కవి. రాశాడు. సన్మానం జరిగే రోజు వచ్చింది. యూనిట్‌ని చూడటానికి జనం విరగబడితే పోలీసులు ఈ బుల్లి కవిని లోపలికి పంపలేదు. కవికి అహం ఉంటుంది. ‘నా పాట వినే అదృష్టం విశ్వనాథ్‌కు లేదు’ అనుకుంటూ అక్కణ్ణుంచి వచ్చేశాడు. అంతేనా? ‘నా పేరు ఎప్పటికైనా అతనికి తెలుస్తుంది’ అనుకున్నాడు. నిజంగానే తెలిసింది కొన్నాళ్లకు. సిహెచ్.సీతారామశాస్త్రి. చెంబోలు సీతారామశాస్త్రి. ‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం’... అని రాశాడు వేటూరి ‘సాగర సంగమం’లో. ‘శంకరా నాద శరీరాపరా’ అని కూడా రాశాడాయన ‘శంకరాభరణం’లో. కె.విశ్వనాథ్‌కు నిజంగా తన సినిమాలో ‘గంగావతరణం’ పెట్టాల్సి వస్తే వేటూరి సంతోషంగా రాసేవాడు. విశ్వనాథ్ సినిమాలకు వేటూరిది సింగిల్ కార్డ్. కాని ‘జననీ జన్మభూమి’లో ఆ సింగిల్ కార్డ్‌కు తోడు సిహెచ్ సీతారామ శాస్త్రి అనే పేరు తోడయ్యింది. ఆ సినిమాలో ‘గంగావతరణం’ అనే చిన్న డాన్స్ బ్యాలేకు సీతారామశాస్త్రి గతంలో రాసిన ‘గంగావతరణం’లోని కొన్ని పంక్తులను వాడారు. అలనాడు కాకినాడలో సీతారామశాస్త్రి రాసిన గేయం ఆ నోట ఈ నోట విశ్వనాథ్ దాకా వెళ్లి అది విని ఆయన ముచ్చటపడి సినిమాలో వాడాల్సి వచ్చింది. తెలుగు తెర మీద సీతారామశాస్త్రికి అది తొలి పాట లెక్క ప్రకారం. అంతటితో ఆ పాట ఆగిపోయేదేమో. కాని కొనసాగాల్సి వచ్చింది. ఎందుకంటే అలా కొత్త కవి చొరబాటుకు వేటూరి అలిగాడు. ‘ఇక విశ్వనాథ్‌కు పాటలు రాయను’ అన్నాడు. విశ్వనాథ్‌కు అప్పటికి సీతారామశాస్త్రి చేత రాయించాలని లేదు. సీతారామశాస్త్రి ఎవరో కూడా ఎప్పుడూ చూళ్లేదు. దాంతో ఆయన ‘స్వాతిముత్యం’ సినిమాకు సినారెను, ఆత్రేయను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘సిరివెన్నెల’ తీయాలి. ఇటు చూస్తే తనకు అలవాటైన వేటూరి అలిగి ఉన్నాడు. అటు చూస్తే సీనియర్లు తనకు ఎక్కువ టైమ్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఏం చేయాలి? బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే. ఎవరో అలిగారు. సీతారామశాస్త్రికి ‘సిరివెన్నెల’ వచ్చింది. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం’.. 1985 అక్టోబర్ 4న అఫీషియల్‌గా సీతారామశాస్త్రి తొలి పాట రికార్డ్ అయ్యింది. పాడటానికి వచ్చిన బాలూ ఆ వొత్తుజుట్టు, దళసరి కళ్లద్దాలు, పలుచటి శరీరం ఉన్న కవిని చూసి ‘మీరు కవిగా అమిత శక్తిమంతులు. రాబోయే దశాబ్దాలు మీవే’ అన్నాడు. అలాగే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు దశాబ్దాల పాటు సీతారామశాస్త్రి పాట సాగిపోయింది. మొదటి సినిమాలోనే ప్రశంసల వెన్నెల కురిసింది. ఇంటి పేరు సిరివెన్నెల అయ్యింది. మద్రాసులో ఈ క్షణం కోడంబాకంలో కబురు పుడితే మరునిమిషం అది తడ దాకా పాకుతుంది. ఎవరో కొత్త కవి అట. సీతారామశాస్త్రి అట. విశ్వనాథ్‌కు రాస్తున్నాడట. నిజమే. మరి మసాలా పాట రాస్తాడా? వెళ్లిన వాళ్లకు ఆ కవి చెప్పిన జవాబు.. పెట్టిన షరతులు మూడు. 1. స్త్రీలను కించ పరచను 2. సమాజానికి చెడు సందేశాలు ఇవ్వను. 3. యువతకు కిర్రెక్కించే పాట రాయను. విన్న నిర్మాతలు సడేలే అనుకుని ముఖం తిప్పుకుని పోవడం మొదలెట్టారు. కాని సుకవి సుగంధం, సత్కవి మకరందం ఎవరు వదలు కుంటారు. ‘శృతిలయలు’ విడుదలైంది. అంతవరకూ ఎప్పుడూ వినని అన్నమయ్య కీర్తన అందులో ఉంది. ‘తెలవారదేమో స్వామి నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ’... ఈ కీర్తనను వెతికి పట్టాడంటే విశ్వనాథ్ ఎంత గొప్పవాడవ్వాలి. ఆ తర్వాత ‘నంది’ అవార్డులకు ఆ పాట వస్తే జడ్జిగా ఉన్న సి.ఎస్.రావు ‘ఏమయ్యా... ఇప్పుడు అన్నమయ్యకు నంది అవార్డు అవసరమా’ అనంటే ‘అది సీతారామశాస్త్రి రాసిన పాటండీ’ అని చెప్పారు. అన్నమయ్య రాసేడా అనిపించేలా సీతారామశాస్త్రి రాసిన పాట. ‘నంది’ ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. రాంగోపాల్ వర్మ గొప్ప టెక్నీషియన్. కనుక గొప్పవాళ్లే తన సినిమాకు పని చేయాలనుకున్నాడు. సీతారామశాస్త్రితో కాలేజీ పాటా? బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా? మిగిలిన సినిమా అంతా కుర్రకారు ఎంత ఉద్వేగంగా చూశారో ఈ పాటకు అంత ఉత్సాహంగా టక్కులు ఊడబెరికి గంతులేశారు. అయినా సరే.. ‘కమర్షియల్ సాంగ్’ అనేది ఒకటి ఉంటుంది. శాస్త్రిగారు ఆ ఒక్క తరహా కూడా రాసేస్తే? రాయలేడా ఆయనా? ‘బొబ్బిలి రాజా’ వచ్చింది. ‘బలపం పట్టి భామ బళ్లో.. అఆఇఈ నేర్చుకుంటా’... పాటా సినిమా సూపర్‌డూపర్ హిట్. ఇప్పుడు... సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘సమగ్ర సినీ కవి’ అయ్యాడు. హంసలా బతకాలని నిశ్చయించుకోవాలే గాని బతకొచ్చు. కాకిలా కశ్మలంలో వాలాలనుకుంటే వాలొచ్చు. చాయిస్ మనదే. నిర్ణయం తీసుకుంటే అలా బతికే వీలు ప్రకృతి కల్పిస్తుంది. ‘శుభ్రమైన పాట’ రాయాలని సీతారామశాస్త్రి అనుకున్నాడు. దారిన వెళుతుంటే అదిగో ఆ మంచి పాట రాసింది అతనే అనుకోవాలి... ఏదైనా సభకు పిలవాలి... ఎదుటపడితే నమస్కారం పొందేలా ఉండాలి... ‘శాస్త్రిగారు’లా ఉండాలి... ‘గాడు’... పేరు చివర పొరపాట్న కూడా పడకూడదు. ఆయన తన తుదిశ్వాస వరకూ ‘శాస్త్రిగారు’గానే ఉన్నాడు. పల్లవి మర్యాద. చరణం గౌరవం. కాంటెక్స్›్టలో పెట్టి చూపితే తప్ప సిరివెన్నెల గొప్పతనం అర్థం కాదు. గండు చీమ, బెల్లం, ఒడి, తడి, గొళ్లెం, తాళం వంటి పదాలు పాటలుగా చెలామణి అవుతున్న రోజుల్లో ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ రాయడం కోసం కలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోవడం సిసలైన వ్యక్తిత్వం. అసలైన సంస్కారం. సరే. ఈ కవి పండితుడు కదా. ఈతనికి గ్రామీణుడి పదం తెలుసా... జానపదుని పాదం తెలుసా? ‘స్వయం కృషి’ విడుదలైంది. ‘సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి’ రాశాడు. ‘రాముడి సిత్తంలో కాముడు సింతలు రేపంగా’ అని జానపద శృంగారం ఒలికించాడు. ‘ఆపద్బాంధవుడు’లో? ‘ఔరా అమ్మకచెల్ల... ఆలకించి నమ్మడమెల్లా... అంత వింత గాధల్లో ఆనందలాల’ రాశాడు. ‘శుభసంకల్పం’లో ‘నీలాల కన్నుల్లో సంద్రవే నింగి నీలవంతా సంద్రవే’ అని బెస్తపడవలో మీన మెరుపు వంటి పదాలను అల్లాడు. సిరివెన్నెలకు రాని విద్య లేదు. పాట వచ్చి దాని మీద కేవలం డబ్బు సంపాదించేవాడు సగటు కవి అవుతాడు. దాని ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని తపించేవాడు ఉదాత్త కవి అవుతాడు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అని రాశాడు సిరివెన్నెల. సమాజంలో పాలకుల్లో ఎంత పెడధోరణి ఉన్నా ఎన్ని అకృత్యాలు సాగుతున్నా ‘మనకెందుకులే’ అని సాగిపోయే జనం ఈ పాటను విని భుజాలు తడుముకున్నారు. తమ నిస్సహాయతకు సిగ్గుపడ్డారు. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటు ఇటు ఎటో వైపు’ అని ‘అంకురం’లో రాశాడు. ఒక్కళ్లే నడవడానికి భయమా? ‘మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి’ అని చెప్పాడు. ఎంత ధైర్యం ఇలాంటి కవి పక్కన ఉంటే. ‘నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది’ అన్నాడు ‘రుద్రవీణ’లో. ‘రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా... తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే’ అని ఈసడిస్తాడు. ‘నిత్యం కొట్టుకుచచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా’... అని ఆయన ఈ దేశపు వర్తమానాన్ని ఎద్దేవా చేస్తాడు. ఒక్క పాట వేయి మోటివేషనల్ స్పీచ్‌లకు సమానం. నిరాశలో కూరుకుపోయి, నిర్లిప్తతలో కుదేలైన వారికి లే.. లేచి నిలబడు అని ఉపదేశం ఇచ్చినవాడు సిరివెన్నెల. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అన్నాడు. సిరివెన్నెలకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసు కలిగిన తండ్రి చనిపోయాడు. ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. జీవచ్ఛవంలా మారిన తల్లి. వారి కోసం బతికాడు సిరివెన్నెల. అందుకే– ‘నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు బతుకు అంటే నిత్యఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది అంతకంటే సైన్యముండునా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’... అని రాశాడు. ‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అని ‘శ్రీకారం’ కోసం ఆయనే రాశాడు. ‘భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి... తెల్లారింది లెగండోయ్’ అని కోడికూతను వినిపించాడు. ‘ఒరే ఆంజనేయులు... తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్లు నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్ భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడుకు గోలీమార్’... అని ‘అమృతం’ టైటిల్ సాంగ్. రోజూ వింటే బి.పి ట్యాబ్లెట్ అవసరం రానే రాదు. ‘నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను’ అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసిపెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించి పంపాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ఉపదేశం ఇచ్చే కవి ఊరికే ఉంటాడా? ‘దేవుడా.. ఈ లోకాన్ని మార్చు’ అని పాట వినిపించడూ? అందాక ఆ కవిని గౌరవించడానికి ఆయన మంచిపాటలు పాడుకుందాం. ఈ జగత్తు మనదిగా అనుకోవాలి. జనులందరి బాగు కోరుకోవాలి. మనల్ని బాధించే మోహాల దాహాల ఒంటరి నిర్మోహత్వాన్ని సాధన చేయాలి. సిరివెన్నెల పాట చిరాయువుగా ఉండాలి. జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె... సన్యాసం శూన్యం నాదె... ప్రముఖుల నివాళి బహుముఖ ప్రజ్ఞ, సాహితీ సుసంపన్నత సిరివెన్నెల రచనల్లో ప్రకాశిస్తుంది. తెలుగు భాష ప్రాచుర్యానికి శాస్త్రి ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి తెలుగు పాటకు అందాన్నే గాక, గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేనూ ఒకణ్ని. 2017లో గోవాలో వారికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి, వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి విచారిస్తూ వచ్చాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని, త్వరలోనే కోలుకుంటారని భావించాను. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – ఎం.వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి సీతారామశాస్త్రి ఇక లేరని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి. సాహితీ విరించి సీతారామశాస్త్రికి నా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు నా సానుభూతి. – ఎన్.వి.రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాల ద్వారా తెలుగు వారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా ఉంటారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు. ఆయన సాహిత్య ప్రస్థానం సామాజిక, సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం తెలుగు చలన చిత్ర రంగానికి, సాహిత్య అభిమానులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు స్వర్గస్తులు కావడం నాకు, తెలుగు సినిమా రంగానికి, జాతీయ భావజాలంతో కూడిన కవులు, కళాకారులకు ఎంతో లోటు. దేశభక్తిపై ఆయన రాసిన పాటలను సీడీ రూపంలో 15రోజుల క్రితం నన్ను కలిసి ఇచ్చారాయన. కోలుకుంటున్న సమయంలో స్వర్గస్తులు కావడం చాలా దురదృష్టకరం. నా భావజాలం జాతీయ భావజాలం అని స్పష్టంగా చెప్పేవారు ఆయన. – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బాలసుబ్రహ్మణ్యం మృతి చెందినప్పుడు కుడి భుజం పోయిందనుకున్నాను. సిరివెన్నెల మృతితో ఎడమ భుజం కూడా పోయింది. ఎంతో సన్నిహితంగా మాట్లాడుకునేవాళ్లం.. ఒక్కసారిగా దూరమయ్యాడంటే నమ్మశక్యం కావడం లేదు. తన ఆత్మకు శాంతి చేకూరాలి.. తన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – కె.విశ్వనాథ్, దర్శకుడు సిరివెన్నెలగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఫోనులో నాతో ఎంతో హుషారుగా మాట్లాడారు. నవంబరు నెలాఖరుకల్లా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారని ఊహించలేదు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప రచయిత సిరివెన్నెల. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీగారి పదును కనబడుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, సిరివెన్నెలగారు.. ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే. – చిరంజీవి, నటుడు సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెలగారు. – బాలకృష్ణ, నటుడు సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు, సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. – మంచు మోహన్‌బాబు, నటుడు అందమైన పాటలు, పదాలను మాకు మిగిల్చి, మీరు వెళ్లిపోయారు. వాటి రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. – నాగార్జున, నటుడు బలమైన భావాన్ని.. మానవత్వాన్ని.. ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి సీతారామశాస్త్రిగారు. ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. – పవన్ కల్యాణ్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – మహేశ్‌బాబు, నటుడు అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంతకాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి. – ఎన్టీఆర్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని షాకయ్యాను. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు అసామాన్యమైనవి. – రామ్‌చరణ్, నటుడు గత శనివారం సిరివెన్నెలగారితో ఫోనులో మాట్లాడాను. ‘మీలాగ నేను కూడా ఓ పాట పరిపుష్టిగా రాయాలి’ అని ఆయనతో అంటే, ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.. నువ్వు రాయగలవు’ అన్నారు. మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇంత గొప్పగా రాయాలని ఓ బెంచ్ మార్క్ సృష్టించారాయన. ఇంట్లో తండ్రిని చూసి పిల్లలు నేర్చుకున్నట్లు ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. నాలో ఆత్మ విశ్వాసాన్ని బలంగా నింపిన గురువు ఆయన. – రామజోగయ్య శాస్త్రి, సినీ గేయ రచయిత 1996లో ‘అర్ధాంగి’ సినిమాతో మేం సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి’, ‘ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రిగారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తుతెచ్చుకుని పాడుకుంటే ధైర్యం వచ్చేది. నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రిగారికి శ్రద్ధాంజలి. – రాజమౌళి, దర్శకుడు ‘సాహసం నా రథం. సాహసం జీవితం’.. పాట నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన కచ్చితంగా స్వర్గానికే వెళ్లి ఉంటారు. – రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్పవరం. బాలూగారు మనకు దూరమైనా ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. ‘సిరివెన్నెల’గారు కూడా మన గుండెల్లో నిలిచే ఉంటారు. – వీవీ వినాయక్, దర్శకుడు గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్. మీరు బతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. – సుకుమార్, డైరెక్టర్ ∙ఇంకా అశ్వనీదత్, బీవీఎస్‌యన్ ప్రసాద్, ఎమ్మెస్ రాజు, ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, వైవీఎస్ చౌదరి, మారుతి తదితర ప్రముఖులు నివాళులు అర్పించారు. చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు -
Sirivennela Sitarama Sastry Demise: పాట విశ్రమించింది..
పదహారు కళల పౌర్ణమి వంటి పాట కటిక నలుపు అమావాస్యకు ఒరిగిపోయింది. పద నాడులకు ప్రాణ స్పందననొసగిన పల్లవి అసంపూర్ణ చరణాలను మిగిల్చి వెళ్లిపోయింది. చలువ వెన్నెలలో మునిగి అలల మువ్వలను కూర్చి ఒక కలం గగనపు విరితోటలోని గోగుపూలు తెస్తానని వీధి మలుపు తిరిగిపోయింది. కవిని చిరాయువుగా జీవించమని ఆనతినివ్వని ఆది భిక్షువును ఏమి అడగాలో తెలియక ఒక గీతం అటుగా అంతర్థానమయ్యింది. తెలుగువారి కంట కుంభవృష్టి మిగిల్చి ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ అనే పేరు తెలిమంచులా కరిగిపోయింది. తెలుగువారి ఆఖరు పండిత సినీ కవి సువర్ణ చరిత్ర తుది పుట మడిచింది. ‘అమ్మలాల.. పైడి కొమ్మలాల.. వీడు ఏమయాడె.. జాడ లేదియాల’... అయ్యో... కట్ట వలసిన పాట వరుస హార్మోనియం మెట్ల మీద పడి భోరున విలపిస్తూ ఉంది. -
సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్ విచారణ
-
గుండె బద్దలైపోయింది.. ఇది నమ్మలేకపోతున్నాను :నటి
చిన్నారి పెళ్లికూతుర(బాలికా వధు)ఫేమ్ సురేఖ సిఖ్రి మృతిపై సీనియర్ నటి నీనా గుప్తా స్పందించారు. సిఖ్రి ఇక లేరన్న విషయం తెలిసి గుండె బద్దలైపోయింది. ఇది నమ్మలేకపోతున్నాను. ఆమెతో బధాయి హో అనే సినిమాలో కలిసి నటించాను. షూటింగ్ బ్రేక్‌లో చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. స్పాట్లో రెగ్యులర్‌గా కలిసే తినేవాళ్లం. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. సిఖ్రి మరణవార్త జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటూ నీనా గుప్తా ఎమోషనల్ అయ్యారు. 2018లో వచ్చిన బధాయి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీలో సురేఖ సిఖ్రి నీనా గుప్తాకు అత్తగా నటించారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. -
భారతీయ సినిమాకు ఆద్యుడు...అభినయం ఒక విశ్వవిద్యాలయం
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అస్తమయంపై సినీ సెలబ్రిటీలతోపాటు, పలువురు రాజకీయ రంగ ప్రముఖులు, ఇతర నేతలు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన ఆద్యుడు అంటూ కొనియాడారు. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం సినీరంగంలో చిరస్థాయిగా నిలిచి పోతుందంటూ దిలీప్ కుమార్‌కు ఘన నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినిమా లెజెండ్‌గా దిలీప్ ఎప్పటికీ గుర్తుండిపోతారనిపేర్కొన్నారు. ‘అసమాన తేజస్సు ఆయన సొంతం..అందుకే ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని’ మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ రాజ్యసభ సభ్యుడు దిలీప్ నిష్క్రమణపై సంతాపం తెలిపారు. సినీ ప్రపంచం ఒక గొప్ప నటుడుని కోల్పోయిందంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. Deeply anguished by the passing away of veteran actor & former Rajya Sabha member. In the death of Shri Dilip Kumar, the world of cinema has lost one of the greatest Indian actors. #DilipKumar pic.twitter.com/kW7RMoBBJD — Vice President of India (@VPSecretariat) July 7, 2021 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దిలీప్ కుమార్ మృతిపై సంతాపం వెలిబుచ్చారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సేవలు రానున్న తరాలకు కూడా గుర్తుండి పోతాయన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాలీవుడ్లో ఒక అధ్యాయం ముగిసిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిలీప్ కుమార్ మృతిపై సంతాపం తెలిపారు. యూసుఫ్ సాబ్ అద్భుతమైన నటనా కౌశలం ప్రపంచంలో ఒక విశ్వవిద్యాలయంలా నిలిచిపోతుందన్నారు. ఆయన మనందరి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సీఎం ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు లెజెండ్ దిలీప్ కుమార్ ఆద్యుడు. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారని మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నివాళులర్పించారు. భారతీయ సినీ చరిత్రను లిఖిస్తే.. దిలీప్ కుమార్‌కు ముందు, దిలీప్ కుమార్‌కు తరువాత అని పేర్కొనాల్సి వస్తుందని బాలీవుడ్ మరో సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన సహ నటుడు దిలీప్ కుమార్‌ను గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1922 డిసెంబర్ 11న జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో చాలామంది లాగే ఆయన కూడా తన పేరును మార్చుకున్నారు. 1944 తన తొలి సినిమా జ్వర్ భాటా నిర్మాత దేవికా రాణి సూచన మేరకు యూసుఫ్ ఖాన్ తన పేరును దిలీప్ కుమార్‌గా మార్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా ప్రఖ్యాతి గాంచిన ఆయన మధుమతి, దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ లాంటి ఎన్నో ప్రసిద్ధ సినిమాల్లో తన నటనతో అజరామరంగా నిలిచిపోయారు. हिंदी फ़िल्म जगत के मशहूर अभिनेता दिलीप कुमार जी का चले जाना बॉलीवुड के एक अध्याय की समाप्ति है। युसुफ़ साहब का शानदार अभिनय कला जगत में एक विश्वविद्यालय के समान था। वो हम सबके दिलों में ज़िंदा रहेंगे। ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें। विनम्र श्रद्धांजलि pic.twitter.com/PEUlqSYk3i — Arvind Kejriwal (@ArvindKejriwal) July 7, 2021 My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji. His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630 — Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021 Dilip Kumarji was the doyen of Indian Cinema and will forever be remembered. Condolences to his family and friends. May the legend's soul rest in eternal peace. pic.twitter.com/s8kRj8cFdw — Mohanlal (@Mohanlal) July 7, 2021 T 3958 - An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' .. My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲 Deeply saddened .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021 -
గురుప్రసాద్ మహాపాత్ర మృతి: పీఎం మోదీ సంతాపం
సాక్షి,ముంబై: కరోనా సంబంధిత సమస్యలతో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర కన్నుమూశారు.ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన శనివారం కన్నుమూశారు. గురుప్రసాద్ మరణంపై ప్రధానమంతత్రి నరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ గురుప్రసాద్ మృతిపై విచారాన్ని వ్యక్తం చేశారు. మహాపాత్రను కోల్పోయినందుకు చాలా బాధగా ఉందనీ సుదీర్ఘకాలంపాటు, దేశానికి ఎనలేని సేవలందించారని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగానికి ఆయన కుటుంబానికి స్నేహితులకు సానుభూతిని తెలిపారు. అటు ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ కూడా సంతాపం వెలిబుచ్చారు. అత్యంత సమర్థవంతమైన, డెడికేటెడ్ అధికారిని కోల్పోవడం విచారకరమని పేర్కొన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ నెలలో ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అయినా కోవిడ్ అనంతర సమస్యల కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విచారు. గుజరాత్ కేడర్ 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన గురుప్రసాద్ 2019 ఆగస్టులో డీపీఐఐటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో గుజరాత్‌లోని సూరత్‌లో మునిసిపల్ కమిషనర్ పదవిని నిర్వహించిన వాణిజ్య విభాగంలో జాయింట్ సెక్రటరీగా తన సేవలను అందించారు. Deeply saddened by the demise of Dr.Guruprasad Mohapatra,Secretary DPIIT,GOI. A highly efficient and dedicated civil servant. Knew him as a former colleague through several interactions.Was always very responsive and constructive. May his soul rest in eternal peace. — Shaktikanta Das (@DasShaktikanta) June 19, 2021 Extremely saddened to hear about the loss of Dr. Guruprasad Mohapatra, Secretary DPIIT. His long-standing service and dedication to the Nation have left a lasting impact. I convey my deepest sympathies to his family and friends. ॐ शांति pic.twitter.com/JFwZJFDE1b — Piyush Goyal (@PiyushGoyal) June 19, 2021 -
దేవుడు చాలా కఠినాత్ముడు: మేఘనా రాజ్ ఎమోషన్
సాక్షి,బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ అకాల మరణంపై టి మేఘనా రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా ద్వారా విజయ్ మృతిపై మేఘనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ అందమైన ఫోటోను షేర్ చేసిన మేఘనా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ‘మనిషిగా, నటుడిగా మీరెంతో అద్భుతమైన వారు. మీరు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.. నిజంగా దేవుడు కఠినాత్ముడు. ఆర్ఐపీ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. అంతేకాదు గత ఏడాది జూన్‌లో తన భర్త చిరంజీవి సర్జా మృతిపైవిచారం వ్యక్తం చేసిన సంచార్ విజయ్ పోస్ట్‌ను షేర్ చేశారు. మేఘనా రాజ్ భర్త , హీరో చిరంజీవి సర్జా తీవ్ర గుండెపోటు కారణంగా (202, జూన్ 7న) ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా స్నేహితుడితో కలిసి వెళుతుండగా విజయ్ ప్రమాదానికి గురయ్యారు.తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విజయ్ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆయన చని పోయినట్టుగా ప్రకటించారు. మరోవైపు విజయ్ ఆకస్మిక మరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు పలువురుఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నటుడి ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తరువాత కూడా విజయ్ పలువురికి ప్రాణదానం చేశారని సీఎం కొనియాడారు. మరోవైపు బంధువులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికార లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే టీచర్ మరణవార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన ఫేవరెట్ టీచర్ శ్రీమతి జెసికా దరువాలా ఇక లేరనే వార్తతో తన గుండె పగిలి పోయిందంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఇన్‌స్టాలో తన బాధను షేర్ చేసుకున్నారు. ఢిల్లీలోని మానెక్జీ కూపర్ స్కూల్లో చదివి ఉంటే ఇతరులకు కూడా తన టీచర్ గురించి తెలుసుకునే అదృష్టం దక్కేదని పేర్కొన్నారు. ఈ ప్రపంచం ఒక రత్నాన్ని కోల్పోయిందంటూ సంతాపం ప్రకటించారు పూజా. తాను నిరాశపడిన ప్రతీసారి ఆమె తనకు ఎంతో ధైర్యం చెప్పేవారని ఆమె ధైర్యవచనాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా కొంతమంది టీచర్లు ప్యూర్ గోల్డ్ అంటూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన ఉన్నతికి కారణమైన అంతటి గొప్ప టీచర్ మాటలను ఎప్పుడూ మరిచిపోలేను.. జెసికా జియోగ్రఫీ టీచర్ అయినా ఎన్నో జీవిత పాఠాలను నేర్పించారన్నారు. ఈ సందర్భంగా టీచర్ కుటుంబ సభ్యులకు పూజా తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చదవండి: ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి! -
అమ్మమ్మను కోల్పోయిన బాధలో ఉంటే.. జాతి వివక్ష వ్యాఖ్యలా..?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. ఈ విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ట్విటర్లో తన అమ్మమ్మ మరణ వార్తను తెలుయజేస్తూ.. "చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. అంతకుముందు అమ్మ ప్రతి నెలా చైనాకు వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఈ ఏడాది అమ్మ వెళ్లలేదు" అంటూ పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు.. చైనీస్ వైరస్ అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారు. దీనిపై బాధతో ఆమె స్పందిస్తూ.. ఓపక్క అమ్మమ్మను కోల్పోయిన బాధలో మేముంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించిందన్నారు. అసలు మనం బతుకుతున్నది సమాజంలోనేనా.. అలాగైతే సానుభూతి ఎక్కడ.. మనం ఎటువైపు పయనిస్తున్నాం.. ఇది సిగ్గుపడాల్సిన విషయం అంటూ ఆమె ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. Ammaama passed away in China on d eve of CNY!My mom use 2 visit her every month but for past year she couldn’t because of https://t.co/pvd6Pcfvsj dis covid has made us realise how important it is 2 be in present do whatever v can for our loved ones whenever v can! Happy new year pic.twitter.com/EUyEqNDopj — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 I am mourning the loss of my grand mom who passed away in China and to my surprise I get racist replies....and I am asked why I say covid and not Chinese virus.... What has happened to us as a society...where’s the empathy...where r we headed...and there r defenders?? Shameful! — Gutta Jwala (@Guttajwala) February 12, 2021 -
కరోనా లేదన్నాడు, దానికే బలయ్యాడు
కైవ్: కరోనా వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మందిలో కరోనా వైరస్‌కు సంబంధించి అపోహలు ఉన్నాయి. ఇది ఆరోగ్య ఉన్న వారిని ఏం చేయలేదని, ఫిట్‌గా ఉన్న వారి దరిదాపుల్లోకి కూడా రాదని భావిస్తున్నారు. వచ్చిన వారంలో కోలుకోవచ్చని కూడా చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఈ వైరస్ సోకి యుక్త వయసులో ఉన్నవారు కూడా చాలామంది మరణించిన ఉదంతాలు కోకొల్లలు. తాజాగా ఉక్రేన్కు చెందిన 33 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, దిమిత్రి స్టుజుక్ కోవిడ్ -19 బారిన పడి మరణించారు. ఒకప్పుడు ఆయన తన అనుచరులకు కరోనా వైరస్ లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. అయితే ఆయనే కరోనా మహమ్మారి సోకి మరణించారు. ఈ విషయాన్ని దిమిత్రి మాజీ భార్య సోఫియా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో స్టుజుక్ మరణ వార్తను ధ్రువీకరించింది. ఇక కరోనా బారిన పడిన దిమిత్రి తాను కరోనా బారిన పడేంత వరకు అది ఉందని అసలు నమ్మలేదని చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ ఇప్పట్లో అంతం కాదని, అది చాలా బలమైందని పేర్కొన్నారు. టర్కీకి వెళ్లినప్పుడు దిమిత్రికి తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అనంతరం తన దేశానిక తిరిగి రాగానే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన డిశార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. తరువాత ఉన్నట్టుండి ఆయన పరిస్థితి విషయం కావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దిమిత్రికి 1.1 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: ఐజీని కబళించిన కరోనా మహమ్మారి -
రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయాం : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, బిహార్ సీనియర్ నేత, మాజీ ఆర్జేడీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న సింగ్ (74) ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. క్షేత్రస్ధాయి నుంచి ఎదిగిన రఘువంశ్ ప్రసాద్ సింగ్‌కు గ్రామీణ భారతంపై పూర్తి అవగాహన ఉండేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మరణం విషాదకరమని కుటుంబ సభ్యులు, అభిమానులకు రాష్ట్రపతి సానుభూతి తెలిపారు. సీనియర్ నేత రఘువంశ్ ప్రసాద్ సింగ్ మన మధ్యలేరని, ఆయన మృతి బిహార్‌తో పాటు దేశానికి తీరనిలోటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బిహార్ ఓ రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయిందని అన్నారు. నవభారత్, నవ బిహార్ నిర్మాణానికి రఘువంశ్ ప్రసాద్ సింగ్ పాటుపడ్డారని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సింగ్ మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బలహీనవర్గాలు, గ్రామీణ ప్రాంత వికాసానికి ఆయన గట్టిగా పోరాడేవారని అన్నారు. ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సామాజిక న్యాయం కోసం నిత్యం తపించేవారని కొనియాడారు. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తమ సహచరుడి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రఘువంశ్ ప్రసాద్ సింగ్‌తో శుక్రవారం తాను మాట్లాడానని, ఇంతలోనే ఇలా జరగడంతో మాట రావడం లేదని, ఆయన మరణవార్త తనను కలచివేసిందని అన్నారు. చదవండి : అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ! -
‘మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణంతో దేశం విషాదంలో మునిగిపోయింది. ప్రణబ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆయన కుమార్తె శర్మిష్ట ముఖర్జీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. అందరికీ వందనం అంటూ ట్వీట్‌ను ప్రారంభించిన శర్మిష్ట ‘నాన్నా..అందరికీ మీ తుది వీడ్కోలు పలికేందుకు మీ అభిమాన కవి కోట్‌ను ఉదహరించే స్వేచ్ఛ తీసుకుంటున్నాను..దేశ సేవలో, ప్రజా సేవలో మీరు పూర్తిగా, అర్ధవంతమైన జీవితం గడిపారు..మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆరోగ్యం విషమించి మరణించారని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రణబ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. “সবারে আমি প্রনাম করে যাই” I bow to all🙏 Baba, taking the liberty to quote from your favourite poet to say your final goodbye to all. You have led a full, meaningful life in service of the nation, in service of our people. I feel blessed to have been born as your daugher. pic.twitter.com/etYfZXzZ1j — Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 31, 2020 చదవండి : రాష్ట్రపతి భవన్‌ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ -
గుండె పగిలింది : కమలా హారిస్
హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మ్యాన్ అకాలమరణం సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని మరణం తీరని లోటంటూ పలువురు హాలీవుడ్ ప్రముఖులు, ఇతరులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డొమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా విచారం ప్రకటించారు. తెలివైన వాడు, మంచివాడు. తన స్నేహితుడు ఇంత చిన్న వయసులో ఈ లోకాన్ని వీడాడంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. (బ్లాక్ పాంథర్ నటుడు కన్నుమూత) చాడ్విక్ బోస్‌మ్యాన్ పెద్దప్రేగు క్యాన్సర్‌తో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కాలిఫోర్నియాలో జరిగిన ఫ్రీడమ్ ఫర్ ఇమ్మిగ్రెంట్స్ కార్యక్రమంలో కమలా హారిస్‌కు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలాను జో బైడెన్ ప్రతిపాదించిన అనంతరం కమలాతో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. అదే అతని ఆఖరి ట్వీట్ కావడం విషాదం. దీంతో కమలా హారిస్ చాడ్విక్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. కాగా బ్లాక్ పాంథర్ మార్వెల్ పాత్రతో పాపులర్ అయిన జాకీ రాబిన్సన్ పాత్రతోపాటు అనేక పాత్రల్లో అద్భుతమైన నటనతో మెప్పించారు. YES @KamalaHarris! 👏🏾👏🏾👏🏾#WhenWeAllVote #Vote2020 pic.twitter.com/iOU3duBAcA — Chadwick Boseman (@chadwickboseman) August 11, 2020 Heartbroken. My friend and fellow Bison Chadwick Boseman was brilliant, kind, learned, and humble. He left too early but his life made a difference. Sending my sincere condolences to his family. pic.twitter.com/C5xGkUi9oZ — Kamala Harris (@KamalaHarris) August 29, 2020 -
భార్యతో గొడవ వల్లే ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల కారణంగానే శ్రీఆదిత్య హాస్పిటల్ ఎండీ డాక్టర్ రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంధువుల గృహ ప్రవేశానికి భార్య రాకపోవడంతో మనస్తాపం చెంది తన లైసెన్స్ రివాల్వర్ కాల్చుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. సోమవారం జవహర్ నగర్ పోలీస్టేషన్ పరిధిలోని సాకేత్ మిథిలలో ప్లాట్ నెంబర్ 57 గల ప్లాట్‌లో డాక్టర్ రవీందర్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. రవీందర్ కుమార్ మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉండడంతో టుంబ సభ్యులు వెంటనే జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో పరిశోధించారు. రవీందర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. రవీందర్ ఆత్మహత్య కేసుపై జవహర్ నగర్ సిఐ మాట్లాడుతూ సిద్దిపేటకు చెందిన రవీందర్ కాప్రా సాకేత్ మిథిలాలోని ప్లాట్ నెంబర్ 57 లో నివాసం ఉంటున్నారని, నిన్న రాత్రి భార్య భర్తల మధ్య ఘర్షణ కాగా డాక్టర్ రవీంద్ర భార్య స్మిత రాత్రి పదకొండు గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ లోని తన తల్లిగారింటికి వెళ్లిందని.. దీనితో మనస్తాపానికి గురై తన లైసెన్స్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం డాక్టర్ రవీంద్ర కుమార్ పోను లిఫ్ట్ చేయకపోవడంతో ఆదిత్య హస్పెటల్ పనిచేసే తన భార్య చెల్లలు స్వప్న ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న డాక్టర్ రవీంద్ర కుమార్ ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చిందని తెలిపారు. అనుమానాస్పద కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేపట్టారు. -
సీనియర్ బుష్ కన్నుమూత
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్. డబ్ల్యూ. బుష్(94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 1989లో అమెరికా 41వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన పాలనలో తనదైన ముద్ర వేసి కీర్తి గడించారు. కాగా ఆయన మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామ, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు.. సీనియర్ బుష్‌గా సుపరిచితులైన జార్జ్ హర్బర్ట్ వాకర్ బుష్ జూన్ 12, 1924లో మసాచుసెట్స్‌లోని మిల్టన్‌లో జన్మించారు. ఆయన ముద్దు పేరు పాపీ. బుష్ జన్మించిన కొద్ది కాలానికే ఆయన కుటుంబం గ్రీన్విచ్కు వెళ్లి స్థిరపడింది. దీంతో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది. తర్వాత ఉన్నత విద్యకై 1938లో మసాచుసెట్స్‌లోని ఫిలిప్స్ అకాడమీలో చేరిన బుష్... స్టూడెంట్ కౌన్సిల్ సెక్రటరీ, కమ్యూనిటీ ఫండ్ రైజింగ్ గ్రూపు అధ్యక్షుడు, స్కూల్ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ మెంబర్, బేస్‌బాల్, సాకర్ టీమ్స్ కెప్టెన్‌గా చిన్నతనంలోనే పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇలా చిన్ననాటి నుంచే ఆయనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో.. నేవీ అధికారిగా 18 ఏట గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం(1941) బుష్ అమెరికా నౌకాదళంలో చేరారు. 10 నెలల శిక్షణ అనంతరం యూఎస్ నావల్ రిజర్వ్ విభాగంలో నావల్ ఏవియేటర్(పైలట్)గా నియమితులయ్యారు. టీనేజ్లోనే ఈ ఘనత సాధించిన బుష్ రికార్డు ఇప్పటి వరకు చెక్కుచెదరలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నేవీ అధికారి, ఫొటోగ్రఫిక్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన బుష్.. అమెరికా సాధించిన పలు విజయాల్లో భాగస్వామి అయ్యారు. ప్రేమ- పెళ్లి.. కుటుంబం గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే జార్జ్ బుష్‌కు బార్బరా పియర్స్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం స్నేహితులుగా మెదిలిన వీరు.. ప్రేమికులుగా మారారు. ఆ తర్వాత వివాహబంధంతో ఒక్కటయ్యారు. బార్బరా-బుష్ దంపతులది 73 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం. వారికి ఐదుగురు సంతానం (వీరిలో జార్జ్ బుష్ (జూనియర్) అమెరికా 43వ అధ్యక్షుడిగా పనిచేశారు). 17 మంది మనవళ్లు, మనవరాళ్లు, ఏడుగురు మునిమవళ్లు, మునిమనవరాళ్లు ఉన్నారు. కాగా బార్బరా పియర్స్ బుష్(93) ఈ ఏడాది ఏప్రిల్‌లో కన్నుమూశారు. వ్యాపార- రాజకీయ జీవితం... రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన అనంతరం బుష్ కుటుంబం టెక్సాస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. ఆ తర్వాత తండ్రి వ్యాపారాన్ని విస్తరించడంలో దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా 1953లో జపాటా పెట్రోలియం కార్పోరేషన్ అనే సంస్థను ప్రారంభించి 1966 వరకు దానికి చైర్మన్‌గా కొనసాగారు. రిపబ్లికన్ పార్టీలో చేరిన బుష్.. 1963లో టెక్సాస్‌లోని హ్యారిస్ కంట్రీ చైర్మన్‌గా పదవి చేపట్టి రాజకీయ జీవితం ప్రారంభించారు. పౌర హక్కుల బిల్లు కోసం పోరాడిన బుష్.. 1966లో హౌజ్ ఆఫ్ రిప్రంజేటివ్స్కు ఎంపికయ్యారు. సెనేటర్‌గా, అమెరికా గూఢాచార సంస్థ(సీఐఏ) డైరెక్టర్‌గా, రొనాల్డ్ రీగాన్ హయాంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1989లో అమెరికా 41వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా జూనియర్ బుష్(బుష్ తనయుడు) తన తండ్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎనిమిదేళ్లకే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. కొడుకు జార్జ్ డబ్ల్యూ బుష్‌తో సీనియర్ బుష్ -
శిఖర సమానుడు: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి మరణం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు అగ్ర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో విశిష్ట నేతగా పేరొందిన కరుణానిధి తమిళనాడుకు, దేశానికి విలువైన సేవలు అందించారని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ట్వీట్ చేశారు. కరుణానిధి మరణ వార్త తనను కలిచివేసిందని అన్నారు. శిఖర సమానుడు : ప్రధాని ఇక సుదీర్ఘ రాజకీయ ప్రస్ధానంలో కరుణానిధి తన జీవితాన్ని పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కరుణానిధి మరణవార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన దేశంలోనే అత్యంత సీనియర్ నేతని ప్రస్తుతించారు. కరుణానిధి ప్రజాక్షేత్రంలో వేళ్లూనుకొన్న జననేత, తత్వవేత్త, ఆలోచనాపరుడు, రచయిత, శిఖరసమానుడని ప్రధాని ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో కరుణానిధి కుటుంబ సభ్యులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మృతితో దేశం యావత్తూ, ముఖ్యంగా తమిళనాడు దిగ్గజ నేతను కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. రాజకీయాల్లో చెరగని ముద్ర : వెంకయ్య డీఎంకే చీఫ్ ఎం. కరుణానిధి మృతిపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. రాజకీయ దిగ్గజ నేతగా దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం సేవలందించిన నేత కరుణానిధి కన్నుమూత తనను బాధించిందని అన్నారు. ఎనిమిది దశాబ్ధాల ప్రజాజీవితంలో కరుణానిధి 56 ఏళ్ల పాటు తమిళనాడు అసెంబ్లీ సభ్యులుగా ఉన్నారని, తమిళనాడు, జాతీయ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్రవేశారని కొనియాడారు. -
మాది అపూర్వ బంధం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘దేశంలోనే అగ్రశ్రేణి తారగా ఖ్యాతి గడించిన సూపర్‌స్టార్ శ్రీదేవికి సొంత చిన్నమ్మ కూతుర్నని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడేదాన్ని. ఆమె తిరుపతి వస్తే ఆ రోజంతా మాకు పండుగే. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో పలకరిస్తుంది. బంధువుల సంగతులన్నీ విని, అవునా.. అంటూ ఆశ్చర్యపోయేది. మాతో కలసి సరదాగా తింటుంది. అవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. పప్పీ అక్క లేదంటే నమ్మశక్యంగా లేదు..’ అంటూ శ్రీదేవి చిన్నమ్మ కూతురు ప్రసన్నలక్ష్మి కన్నీరుమున్నీరయ్యారు. అలవాట్లు, అభిరుచులు దాదాపు ఒక్కటే కావడంతో తమద్దరి మధ్యా అపూర్వ బంధం పెనవేసుకుందని ప్రసన్నలక్ష్మి వివరించారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసే ప్రసన్నలక్ష్మికి శ్రీదేవి స్వయానా పెద్దమ్మ కూతురు. శ్రీదేవి, ప్రసన్నలక్ష్మిలు అక్కాచెల్లెళ్లైన రాజేశ్వరి, అనసూయల కుమార్తెలు. దుబాయ్‌లో శ్రీదేవి ఆకస్మికంగా కన్నుమూసిందన్న సమాచారం వినగానే తిరుపతి పద్మావతిపురంలో ఉండే పిన్ని అనసూయ, సోదరి ప్రసన్నలక్ష్మి, ఈమె భర్త గిరిప్రసాద్‌లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ నుంచి శ్రీదేవి మృతదేహం ముంబైకు తీసుకువస్తున్నారని తెలుసుకున్న వీరంతా మంగళవారం హుటాహుటిన ముంబై వెళ్లారు. వెళ్లే ముందు వీరు శ్రీదేవితో తమ జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. శనివారమంటే ఎంతో ఇష్టం.. ‘శ్రీదేవి అక్కను ఇంట్లో అందరూ ప్రేమగా పప్పీ అని పిలుస్తుంటారు. మేం కూడా అలాగే పిలుస్తుంటాం. తన పుట్టిన రోజైన ఆగస్టు 13న ఏటా తిరుమల వస్తుండేది. తిరుమల శ్రీవారికి శనివారం అంటే ఇష్టం. అక్కకు కూడా అదేరోజు ఇష్టం. యాధృచ్ఛికంగా శనివారమే తనూ చనిపోయింది. దేవుడు తనలో ఐక్యం చేసుకున్నాడని భావిస్తున్నామని’ ప్రసన్నలక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు. తమకున్న బంధువులందరిలోనూ పప్పీ అక్కే టాప్. ఆమె నటనలోనే కాదు. అన్నింటా ఆమె ముందుంటుంది. సినీ పరిశ్రమ గురించి ఆమె చెప్పే కబుర్లు గుర్తుకొస్తున్నాయి. చివరకు శ్రీదేవి అక్క మామ్ సినిమా ప్రమోషన్ కోసం తిరుపతి వచ్చింది. హోటల్ రూమ్‌లో ఉండి ఫోన్ చేసింది. మేమంతా అక్కడికెళ్లాం. సరదాగా భోజనం చేస్తూ మాట్లాడుకున్నాం. అదే లాస్ట్ ఆమెను చూడటం..’ అని ప్రసన్నలక్ష్మి గుర్తుచేసుకున్నారు. ఆమెలో కోపం, చిరాకు, ఏడుపులాంటివి ఎన్నడూ చూడలేదని.. ఎప్పుడూ ఏంజల్ (దేవత)లా కనిపించేదని ఆమె వివరించారు. -
శోకసంద్రంలో శ్రీదేవి సిబ్బంది
తమిళ సినిమా (చెన్నై): అందాల రాశి శ్రీదేవి ఇక లేరన్న నిజాన్ని అభిమానులే తట్టుకోలేకపోతుంటే.. తమకు జీవనాధారాన్నిస్తున్న వా రి పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉం ది. శ్రీదేవి ముంబైకి మారినా.. ఆమె స్థిరాస్తులు ఇప్పటికీ చెన్నైలో ఉన్నాయి. చెన్నై, వీసీఆర్ రోడ్డులో అధునాతనమైన భవనంతో కూడిన ఐదెకరాల స్థలం ఉంది. ఇది షూటిం గ్ స్పాట్‌గా కొనసాగుతోంది. స్థానిక ఆల్వార్‌పేట, సీఐటీ కాలనీలో భవనం ఉంది. వీటి నిర్వహణ బాధ్యతను వెంకటపతి అనే ఆయనకు శ్రీదేవి అప్పగించారు. ఆమె హఠాన్మరణ వార్త విన్న వెంకటపతి వెంటనే తన కుటుంబసభ్యులతో ముంబై వెళ్లాడు. ప్రత్యక్షంగా చూడలేకపోయాను శ్రీదేవి ఇంట్లో పనిచేస్తున్న రవి అనే వ్యక్తి తాను శ్రీదేవి వీరాభిమానినని, కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన తాను నెల రోజుల కిందటే భార్య పిల్లలతో శ్రీదేవి ఇంట్లో పనిమనిషిగా చేరామని చెప్పాడు. శ్రీదేవిని దగ్గరగా చూడవచ్చనుకున్నానని ఇప్పుడా ఆశ ఆవిరైపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నా పిల్లల్ని చదివించారు శ్రీదేవి ఇంటికి వాచ్‌మన్‌గా ఏడేళ్లు పనిచేసిన మాలైరాజు మాట్లాడుతూ.. శ్రీదేవి తమతో చాలా బాగా మాట్లాడేవారని, ఆమెది చాలా మంచి మనసు అని అన్నాడు. తమ పిల్లల్ని ఆమె చదివించారని, శ్రీదేవి సహాయంతోనే తన పెద్ద కొడుకు ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడని చెప్పాడు. డిసెంబర్లో చివరిసారిగా చెన్నైకి.. గత ఏడాది నవంబర్ 8న శ్రీదేవి కుటుంబ సభ్యులతో చెన్నైకి వచ్చి 4 రోజులుండి తన భర్త పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నా రని ప్రస్తుత వాచ్‌మన్ నిర్మల్ చెప్పాడు. ఆ తరువాత డిసెంబర్ 3న చివరిసారిగా శ్రీదేవి ఒక్కరే వచ్చారని చెప్పాడు. -
ఎక్కడున్నా ఆగస్టు 13న తిరుపతికే!
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి ఊరన్నా, తిరుమల వెంకన్న దర్శనమన్నా సినీనటి శ్రీదేవికి ఎంతో ఇష్టం. బాల్యాన్ని గుర్తు చేసేది ఊరైతే, కోర్కెలు తీర్చేది వెంకన్న దేవుడు. అందుకే తన పుట్టిన రోజున (ఆగస్టు 13) ఎక్కడున్నా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు శ్రీదేవి. ఇది మాత్రమే కాదు.. ఇక్కడున్న తీర్థకట్ట వీధిలోని ఇంటి నెంబరు–93కి మరో ప్రాధాన్యత ఉంది. శ్రీదేవి తాతగారిల్లు ఇదే. ఆయన పేరు వెంకటస్వామిరెడ్డి. ప్రైవేటు బస్సులు ఆపరేట్ చేసుకునే ఆయన నర్సుగా పనిచేసే వెంకట రత్నమ్మను వివాహమాడారు. వీళ్లిద్దరూ ఈ ఇంట్లోనే ఉన్నారు. వీరికి శ్రీదేవి తల్లి రాజేశ్వరితో పాటు మరో ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. వీళ్లంతా ఇక్కడే పెరిగారు. దీన్నిబట్టి శ్రీదేవి కుటుంబ మూలాలు ఇక్కడే మొదలయ్యాయని అర్థమవుతోంది. ఇల్లంటే ఎంతో ఇష్టమట.. తిరుపతిలోని తాత గారిల్లంటే శ్రీదేవికి ఎంతో మమకారం. ఈ ఇంటిని చూస్తే తన బాల్యం, అప్పట్లో తనతో గడిపిన మిత్రులు గుర్తుకొస్తారని చెప్పేది. పాతబడ్డ ఇంటిని పడగొట్టి మళ్లీ కొత్త ఇల్లు కట్టుకోవడం.. అదే సమయంలో శ్రీదేవి సినిమాల్లో బిజీ అవడంతో ఇక్కడకు రాకపోకలు ఆగిపోయాయి. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లడం.. అక్కడి నుంచి తిరుమలకు చేరుకోవడం.. దర్శనం అయ్యాక హోటల్‌కు బంధువుల్ని పిలిపించుకుని వారితో మాట్లాడ్డం జరిగేది. తెలుగు భాష పెద్దగా రాని శ్రీదేవి భర్త బోనీకపూర్.. తిరుపతిలో బంధువులు కలిసినపుడు ‘నమస్తే’ చెప్పడం మినహా పెద్దగా మాట్లాడేవారు కాదని ఇక్కడున్న శ్రీదేవి బంధువులు చెబుతున్నారు. ఎవర్నీ అనుమానించలేం.. శ్రీదేవి మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని మంగళవారం మీడియా హోరెత్తిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ఉన్న ఆమె బాబాయ్ మారపురెడ్డి వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. ‘ఎవర్నీ అనుమానించలేం. బోనీకపూర్‌పై మంచి అభిప్రాయమే ఉంది మాకు. మాకు తెల్సినంత వరకూ శ్రీదేవి అందరితోనూ బాగానే ఉంటుంది. అయితే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని విన్నాం. అంతమాత్రాన ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు. ఏదేమైనా మా ఇంటి పిల్ల దూరమైంది. అదే బాధగా ఉంది. ఈ ఇల్లు కట్టేటపుడు అడిగి మరీ మద్రాసు నుంచి మార్బుల్స్ పంపింది. వాటినే ఫ్లోరింగ్‌కు వేశాం’ అంటూ వేణుగోపాలరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అందరూ అనిల్ ఇంట్లోనే.. తిరుపతి నుంచి ముంబై చేరుకున్న శ్రీదేవి బంధువులందరూ బోనీకపూర్ సోదరుడు అనిల్‌కపూర్ ఇంట్లోనే బసచేశారు. తాజ్ హోటల్లో మరో ఆరు గదులు తీసుకున్నారు. చెన్నై, మధురై, బెంగళూరు, న్యూజిలాండ్‌ల నుంచి ముంబై చేరుకున్న బంధువులందరికీ శ్రీదేవి సొంత చెల్లెలు శ్రీలత బస ఏర్పాట్లు చేశారు. ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య దగ్గరుండి అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. -
ముంబైకి శ్రీదేవి పార్థివదేహం
దుబాయ్/ముంబై : సినీనటి శ్రీదేవి మరణంపై ముసురుకున్న అనుమానాలకు తెరపడింది! దేశవ్యాప్తంగా గత మూడ్రోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. స్పృహ కోల్పోయి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోవడం వల్లే శ్రీదేవి మరణించారని నిర్ధారిస్తూ దుబాయ్ పోలీసులు మంగళవారం కేసును మూసివేశారు. భౌతికకాయాన్ని భర్త బోనీకపూర్‌కు అప్పజెప్పారు. అంతకుముందే మృతదేహం పాడవకుండా చేసే ఎంబామింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ప్రత్యేక ప్రైవేటు విమానం ద్వారా శ్రీదేవి భౌతికకాయం మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ముంబై చేరుకుంది. 10.30 గంటలకు లోఖండ్‌వాలాలోని శ్రీదేవి నివాసానికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విలేపార్లె సేవా సమాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12.30 వరకు అభిమానులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం లోఖండ్వాలా కాంప్లెక్స్‌లోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో శ్రీదేవి భౌతికకాయాన్ని ఉంచుతారు. కేసు మూసేశారు.. కానీ.. దుబాయ్‌లో బంధువుల వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి అక్కడే తానున్న జుమైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లోని గదిలో శనివారం హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత, ఆమె గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గుండెపోటుతో కాదు.. బాత్‌టబ్‌లో పడిపోయి చనిపోయారని, ఆమె శరీరంలో మద్యం తాగిన ఆనవాళ్లున్నాయని, శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికను ఉటంకిస్తూ గల్ఫ్ న్యూస్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. దుబాయ్ పోలీసులు బోనీకపూర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారని, ఆయన పాస్‌పోర్ట్‌ను సైతం స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే వీటన్నింటినీ ముగింపు పలుకుతూ మంగళవారం దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం పలు ట్వీట్లు చేసింది. ‘‘నటి శ్రీదేవి మరణంపై పూర్తి దర్యాప్తు అనంతరం.. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పేందుకు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అనుమతించింది’’అని అందులో పేర్కొంది. ‘‘ఈ తరహా కేసుల దర్యాప్తులో చేపట్టాల్సిన అన్ని లాంఛనాలను దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముగించింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. స్పృహ కోల్పోవడంతో బాత్రూమ్లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయి ఆమె మృతి చెందారని నిర్ధారించారు. అందువల్ల కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మూసివేస్తోంది’’అని మరో ట్వీట్ చేసింది. అయితే ఆమె స్పృహ కోల్పోవడానికి గల కారణాలను మాత్రం ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. నో కెమెరా.. ప్లీజ్! ‘ఈ బాధాకర సమయంలో మాకు తోడుగా నిలిచిన మీడియాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’అని పేర్కొంటూ కపూర్, అయ్యప్పన్ కుటుంబాలు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశాయి. శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల చివరి చూపుకోసం లోఖండ్‌వాలాలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు ఉంచుతామన్నారు. 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మీడియా కూడా నివాళులర్పించవచ్చని, అయితే కెమెరాలు, ఇతర రికార్డింగ్ వస్తువులను బయటే వదిలేసి రావాలని విజ్ఞప్తి చేశారు. తండ్రికి సాయంగా.. శనివారం శ్రీదేవిని సర్ప్రైజ్ డిన్నర్‌కు తీసుకెళ్లేందుకు బోనీకపూర్ దుబాయ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ఆయన అక్కడే ఉన్నారు. మంగళవారం ఉదయం ఆయనకు తోడుగా ఉండేందుకు మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ కూడా దుబాయ్ బయల్దేరి వెళ్లారు. శ్రీదేవి భౌతికకాయాన్ని తమకు అప్పగించినప్పుడు బోనీతోపాటు ఆయన కూడా అక్కడే ఉన్నారు. శ్రీదేవి మృతదేహాన్ని ముంబైకి తీసుకువచ్చేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ తన ఎంబ్రేయర్ విమానాన్ని దుబాయ్ పంపించారు. అనిల్ కపూర్ నివాసానికి తారాలోకం ముంబైలోని బోనీకపూర్ సోదరుడు అనిల్ కపూర్ నివాసం శ్రీదేవి సహ నటులు, శ్రేయోభిలాషులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం నుంచే వారంతా రావడం ప్రారంభించారు. ‘‘మా నాన్న మరణం తర్వాత నన్నంతగా బాధించింది శ్రీదేవి మరణమే. ఈ వార్త విన్నప్పటి నుంచి ఆమె ముఖమే పదేపదే నాకు గుర్తొస్తోంది. తను నన్నెంతో ప్రేమగా చూసేది. నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తిత్వం ఆమెది. నేను తనను చిన్నమ్మ (మౌసీ)లా భావిస్తాను’’అని బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అనిల్‌కపూర్ నివాసానికి వచ్చినవారిలో షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్, రజనీకాంత్, కమల్‌హాసన్, దీపిక పడుకోన్, రణ్వీర్ సింగ్, టబు, రేఖ, ఫరాఖాన్, జావేద్ అఖ్తర్, షబానా ఆజ్మీ తదితరులున్నారు. మరోవైపు లోఖండ్‌వాలాలోని శ్రీదేవి నివాసం వెలుపల అభిమాన నటికి చివరి వీడ్కోలు పలికేందుకు అశ్రునయనాలతో అభిమానులు వేచి చూస్తున్నారు. చానళ్ల అతిపై సెలబ్రిటీల మండిపాటు శ్రీదేవి మరణంపై టీవీ చానళ్ల అతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఆమె అభిమానులు మండిపడ్డారు. చానెళ్లు నిర్దయగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయని హీరోయిన్ విద్యాబాలన్, నటుడు ఫర్హాన్ అక్తర్ దుయ్యబట్టారు. ‘ప్రాణానికి భారత్‌లో విలువ లేదన్న విషయాన్ని మీడియా మరోసారి రుజువు చేసింది. శ్రీదేవి మీకు వినోదం పంచేందుకు మరణించలేదు..’అని అమితాబ్ బచ్చన్ ఘాటుగా విమర్శించారు. ‘మీకు, మీ ఫ్యామిలీకి ఏదైనా మంచి చేయాలనుకుంటే వెంటనే టీవీలు కట్టేయండి’అని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా మాంటెనా పేర్కొన్నారు. ఓ లెజెండ్ మరణం చుట్టూ ఇన్ని కట్టుకథలు అల్లిన తర్వాత ఆమె ఆత్మకు ఎలా శాంతి చేకూరుతుంది అని సోనూ సూద్ ప్రశ్నించారు. రిపోర్టింగ్ ప్రమాణాలు ఏ స్థాయికి దిగజారాయో చూసుకొని చానళ్లు సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ‘శ్రీదేవిని మీడియా లైవ్‌లో చంపేస్తుండగా దేశమంతా చేష్టలుడిగి చూసింది’ అని ఓ అభిమాని, శ్రీదేవి మరణాన్ని ఓ వినోద కార్యక్రమంగా చూపడం ఇకనైనా ఆపాలని మరో అభిమాని ఆవేదన వ్యక్తంచేశారు. -
అనిల్ కపూర్ నివాసానికి ప్రముఖులు
-
‘శ్రీ’ విషాదం ఓ మిస్టరీ..?
దుబాయ్/ముంబై : ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు.. గంట గంటకో సంచలన విషయం.. మొత్తంగా సినీనటి శ్రీదేవి మరణం ఓ మిస్టరీగా మారింది! గుండెపోటుతో మృతి చెందినట్టు ఆమె కుటుంబీకులు చెప్పిన విషయం అవాస్తవమని తేలిపోయింది. శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందిందని దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. బాత్రూంలోని టబ్‌లో స్పృహతప్పి పడిపోవడం వల్లే మరణించినట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం దుబాయ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ సమీ వాదీ పేరుతో ఒక ప్రకటన వెలువడింది. ఇందులో శ్రీదేవి పూర్తిపేరును ‘శ్రీదేవి బోనీ కపూర్ అయ్యప్పన్’గా పేర్కొన్నారు. ఆమె పాస్‌పోర్టు నంబర్, ఘటన జరిగిన తేదీ, మృతికి కారణాలను వివరించారు. దుబాయ్ ప్రభుత్వ అధికారిక మీడియా కార్యాలయం కూడా తన ట్విటర్ ఖాతాలో.. శ్రీదేవి ప్రమాదవశాత్తూ స్నానాల తొట్టిలో పడిపోయి చనిపోయిందని తెలిపింది. తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేసినట్టు పేర్కొంది. మరోవైపు గల్ఫ్ న్యూస్ మరో కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి అల్కాహాల్ సేవించిందని, ఆ మత్తులో బాత్ టబ్‌లో పడిపోయి మరణించిందని పేర్కొంది. అయితే దీన్ని అధికారులెవరూ ధ్రువీకరించలేదు. ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లేందుకు కారణమేంటన్న దానిపై స్పష్టత రావడం లేదు. అలాగే బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం ఎంతవరకు సాధ్యమంటూ బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ సహా పలువురు ప్రశ్నిస్తున్నారు. భౌతికకాయం తరలింపు మరింత జాప్యం శ్రీదేవి భౌతికకాయాన్ని ముంబైకి తరలించడం మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నారు. కేసు పోలీసుల చేతి నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదలాయించడంతోపాటు ఇతర చట్టపరమైన అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం ఇందుకు కారణం. భౌతికకాయం అప్పగింతకు మరో అనుమతి(క్లియరెన్స్) రావాల్సి ఉందని దుబాయ్ పోలీసులు చెప్పినట్లు యూఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి తెలిపారు. ఎలాంటి అనుమతి రావాల్సి ఉందని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ఆ విషయం తెలియదు. అది వారి అంతర్గత వ్యవహారం..’’అని బదులిచ్చారు. భౌతికకాయాన్ని భారత్‌కు ఎప్పట్లోగా తరలిస్తారని అడగ్గా.. ‘టైం చెప్పడం కష్టం. ఇక్కడ చట్టపరమైన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది’అని పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం ఎంబామింగ్ శ్రీదేవి భౌతికకాయానికి ఎంబామింగ్ (మృతదేహం పాడవకుండా ఉండేందుకు చేపట్టే ప్రక్రియ) ఇంకా పూర్తి కాలేదు. మంగళవారం మధ్యాహ్నం ఎంబామింగ్ చేసే అవకాశం ఉన్నట్టు గల్ఫ్ న్యూస్ పేర్కొంది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టుకు శ్రీదేవి భౌతికకాయాన్ని తరలించే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం అయినా ముంబైకి తరలిస్తారా? లేదా మరింత జాప్యం జరుగుతుందా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘంగా బోనీ విచారణ శ్రీదేవి మృతి కేసులో ముమ్మరంగా విచారణ సాగుతోంది. దుబాయ్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం బోనీని సుదీర్ఘంగా విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. ఆయన పాస్‌పోర్టు కూడా సీజ్ చేసినట్లు వార్తలు వచ్చినా అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. శ్రీదేవితో హోటల్లో ఎప్పటివరకు ఉన్నారు? ముంబై నుంచి హోటల్‌కు ఎప్పుడు తిరిగొచ్చారు? సర్ప్రైజ్ చేద్దామని వచ్చారా? లేదా శ్రీదేవి మృతి విషయాన్ని హోటల్ సిబ్బంది చెబితే వచ్చారా? అన్న అంశాలపై పోలీసులు బోనీని ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే శ్రీదేవి దుబాయ్ వెళ్లినప్పట్నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? ఎవరితో ఫోన్లో మాట్లాడారు? అన్న అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు. బోనీ కపూర్ ఫోన్ కాల్‌డేటాను సైతం విచారిస్తున్నట్టు సమాచారం. హోటల్ సిబ్బందిని సైతం దుబాయ్ విచారిస్తున్నారు. హోటల్లో శ్రీదేవిని చివరిసారిగా చూసిందెవరు? ఆ సమయంలో ఆమె ఏ పరిస్థితిలో ఉంది? ఆమె గదిలో ఎవరైనా ఉన్నారా? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు బోనీకపూర్ దుబాయ్‌లోనే ఉండాలని అక్కబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగం చెప్పినట్టు తెలిసింది. ఆరోజు అసలేం జరిగింది? శ్రీదేవి మృతి చెందిన రోజు ఏం జరిగిందన్న విషయంపై స్థానిక ఖలీజ్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. మేనల్లుడి వివాహ కార్యక్రమం తర్వాత బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ సహా కుటుంబీకులంతా ముంబై వచ్చేశారు. శ్రీదేవి మాత్రం కొద్దిరోజులు దుబాయ్‌లో ఉండి వస్తానని చెప్పింది. అయితే భార్యకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు బోనీ శనివారం సాయంత్రం మళ్లీ దుబాయ్‌కు వచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో (దుబాయ్ కాలమానం ప్రకారం).. శ్రీదేవి ఉన్న జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్ చేరుకున్నారు. నిద్రలో ఉన్న ఆమెను లేపి దాదాపు 15 నిమిషాలసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత భర్తతో కలిసి డిన్నర్‌కు వెళ్లేందుకు శ్రీదేవి సిద్ధమయ్యారు. బాత్రూమ్లోకి వెళ్లి 15 నిమిషాలైనా ఆమె బయటకు రాకపోవటంతో బోనీ తలుపుతట్టారు. దీంతో బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే శ్రీదేవి బాత్‌టబ్‌లో అపస్మారకస్థితిలో పడిపోయి ఉన్నారు. వెంటనే బోనీ తన మిత్రుడిని పిలిచారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లినా అప్పటికే అప్పటికే శ్రీదేవి మృతిచెందారని ఖలీజ్ టైమ్స్ వివరించింది. అనిల్ కపూర్ నివాసానికి ప్రముఖులు శ్రీదేవి మృతి నేపథ్యంలో అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు ముంబైలోని ఆమె మరిది అనిల్ కపూర్ ఇంటికి తరలి వస్తున్నారు. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషీ ఆదివారం నుంచి ఈయన ఇంట్లోనే ఉన్నారు. నటీనటులు మాధురీ దీక్షిత్, జయప్రద, టబు, అమీషా పటేల్, సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, ఆయన భార్య సారిక, కూతుళ్లు శృతి, అక్షర హాసన్‌లు, దివ్యా దత్తా, సారా అలీ ఖాన్, జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్, దర్శకులు భారతీ రాజా, ఫరా ఖాన్, కరణ్ జోహార్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిధ్వానీ, శేఖర్ కపూర్, తెలుగు సినీ హీరో వెంకటేశ్ తదితర ప్రముఖులు సోమవారం ఉదయం అనిల్ ఇంటికి వెళ్లారు. అటు లోఖండ్వాలా ప్రాంతంలోని శ్రీదేవి ఇంటికి కూడా ఆమె అభిమానులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. -
కనుమరుగైన అపురూపం
బాలనటిగా ప్రవేశించి దాదాపు అయిదు దశాబ్దాలపాటు తన నటనాపాటవంతో వెండితెరపై కాంతులు విరజిమ్మి రసహృదయాలను మైమరపించిన అపురూప సౌందర్యరాశి శ్రీదేవి కనుమరుగయ్యారు. ఆమె సినీ రంగ జీవితం ఒక అద్భుత మైతే... ఆమె హఠాన్మరణం ఒక దిగ్భ్రమం. ఏ మరణమైనా విషాదకరమైనదే... కానీ హఠాన్మరణం ఆ విషాదాన్ని మరిన్ని రెట్లు పెంచుతుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడామె మరణం చుట్టూ అల్లుకుంటున్న సవాలక్ష సందేహాలు అందరినీ విస్మ యపరుస్తున్నాయి. అందులోని నిజానిజాలేమిటో ఎటూ ఒకటి రెండు రోజుల్లో వెల్లడవుతాయి. ఆమె మరణవార్త తొలిసారి విన్న ప్రతి ఒక్కరూ అది నిజం కాదేమోనన్న సందేహం వెలిబుచ్చారంటే ఆమెపై ఉన్న వల్లమాలిన అభిమానమే అందుకు కారణం. కేవలం 54 ఏళ్ల వయసులోనే ఊహకందని విధంగా ఆమె మృత్యువుబారిన పడటం అందరినీ కలచివేసే అంశం. ఆమెకు గుండెపోటు రావ డం వల్ల ఈ దురదృష్టకర ఘటన జరిగిందని తొలిరోజు చెప్పారు. ఇప్పుడది కార ణమే కాదంటున్నారు. స్నానాలగదిలోని నీళ్లున్న తొట్టెలో ప్రమాదవశాత్తూ పడి పోయి కన్నుమూశారంటున్నారు. బాలనటిగా నాలుగేళ్ల వయసుకే కెమెరా ముందుకొచ్చి ఇంతింతై ఎదుగుతూ దక్షిణాదిన మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభి మానుల్ని ఆమె సంపాదించుకున్నారు. ఆ ముఖంలో కనబడే అమాయకత్వం, అందులో ఇంకా కనుమరుగుకాని పసితనం, పాత్రోచితంగా ఒదిగిపోయే స్వభావం శ్రీదేవిని ఈ స్థాయికి చేర్చాయి. లోకజ్ఞానం అంతగా లేని వయసులో పాత్ర స్వభావం గురించి డైరెక్టర్ చెప్పింది ఆకళింపు చేసుకోవడం, తాను చెప్పవలసిన సంభాషణలను కంఠతా పట్టడం, కెమెరా ముందు సహజత్వం ఉట్టిపడేలా వాటిని చెబుతూ చుట్టూ ఉన్నవారి అభినందలను అందుకోవడం ఓ వరం. ఇలాంటి సామ ర్ధ్యం ఉన్నవారు క్రమేపీ ఒక రకమైన ఆధిక్యతాభావనకు లోనవుతారు. తమను తాము అతీతులుగా సంభావించుకుంటారు. కానీ శ్రీదేవి ఇందుకు విరుద్ధం. నిరుడు ‘మామ్’’ చిత్రం విడుదలైన సందర్భంలో సైతం నటనలో తానింకా విద్యా ర్థినేనని చెప్పారు. ఇది ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటంగా కనబడవచ్చుగానీ, ఇంకా ఏదో నేర్చుకోవాలన్న పట్టుదల, తనకప్పగించిన పాత్రను మరింత మెరుగుపరచాలన్న తపన, చేసే పని పట్ల ఉండే అంకితభావం శ్రీదేవిని అలా తీర్చిదిద్దాయి. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీరంగాల్లో దిగ్గజాలనదగ్గ నటుల వద్ద బాలనటిగా నటించారు. అనంతరకాలంలో వారి సరసనే హీరోయిన్గా వెలిగారు. అదే వింతనుకుంటే ఆ దిగ్గజాల వారసుల పక్కన సైతం కథానాయికగా చేసి అందరినీ మెప్పించారు. మరే హీరోయిన్‌కూ ఇది సాధ్యపడలేదు. దక్షిణాది భాషల కంటే విస్తృతమైన మార్కెట్ గల హిందీ సినీ రంగానికెళ్లి దాన్ని సైతం జయించగలిగారు. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అవతార్’లో ఆమెతో నటింపజేయాలని జేమ్స్ కామెరాన్ తహతహలాడాడంటే అందుకు శ్రీదేవి లోని నటనావైదుష్యమే కారణం. అసమాన ప్రతిభాపాటవాలున్నపక్షంలో భౌగోళిక సరిహద్దులు మటుమాయమవుతాయని ఆమె నిరూపించారు. హిందీ చిత్రసీమలో శ్రీదేవికి ముందు వైజయంతిమాల, హేమమాలిని వంటివారు పేరుప్రఖ్యాతులు గడించి ఉండొచ్చుగానీ ‘సూపర్‌స్టార్’ కీర్తిశిఖరాలను అధిరోహించిన ఖ్యాతి మాత్రం ఒక్క శ్రీదేవికే దక్కింది. ఆ తర్వాత వచ్చిన నటీమణులెవరూ ఆమె స్థాయికి చేరుకోలేకపోయారు. పురుషాధిక్యత రాజ్యమేలే సినీరంగంలో ఒక మహిళ ‘సూపర్‌స్టార్’గా వెలుగులీనడం సాధారణ విషయం కాదు. భారీ పెట్టుబడులతో మరింత భారీగా లాభాలను ఆర్జించాలని తహతహలాడే చలనచిత్ర రంగంలో హీరోయిన్ అనగానే గ్లామర్, శరీరాకృతి వంటివే ఎక్కువగా ప్రాధాన్యతలోకొస్తాయి. కథానాయకుడి పక్కన కుందనపు బొమ్మలా కనిపించడం, పాటల్లో గంతులేస్తూ నటించడమే కథానాయిక పని అనుకునేచోట హీరోయిన్ ప్రాధాన్యతను ఆమె తెలియజెప్పారు. కథానాయికగా మొదట్లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు’ మొదలుకొని అనేక చిత్రాల్లో ఆమె వైవిధ్యభరితమైన నటనను ప్రదర్శించి అందరితో ఔరా అనిపించుకున్నారు. 1983లో వచ్చిన హిందీ చిత్రం ‘హిమ్మత్ వాలా’లో హీరోయిన్గా సమ్మోహనపరిచిన నటే అంతకు ముందు సంవత్సరం తమిళ చిత్రం ‘మూండ్రాంపిరై’(తెలుగులో వసంత కోకిల)లో ప్రమాదంబారినపడి గతాన్ని మరచిన యువతిగా నటించి ప్రేక్షక లోకాన్ని కంట తడిపెట్టించిందంటే ఎవరూ నమ్మలేరు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణం క్షణం’ వంటి చిత్రాలు సైతం శ్రీదేవిని ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలబెట్టాయి. ఇరవై ఆరేళ్లపాటు తెల్లారుజామునే లేచి తయారుకావడం, రోజుకు రెండు మూడు షూటింగ్‌లు, భిన్నమైన పాత్రలు, నిరంతరం అవుట్డోర్లు, ఆర్క్‌లైట్ వెలు గులు... ఇవే జీవితంగా గడిపిన శ్రీదేవి ఆ తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు నిజ జీవితంలో గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. కుటుంబమే ప్రపంచంగా బతికారు. అయినా సరే 2012లో మళ్లీ ముఖానికి రంగేసుకుని ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంలో నటించేనాటికి కూడా ఆమె అభిమాన ప్రపంచం చెక్కుచెదరలేదు. గ్లామర్ ప్రపంచం ఆడవాళ్లను శాసించినంతగా మగవాళ్ల జోలికి రాదు. నాజూగ్గా కనబడాలని ఎవరూ చెప్పినట్టు, ఆదేశించినట్టు కనబడదు. కానీ ఏమూలో దానికి లొంగిపోయే స్వభావం ప్రతివారిలోనూ ఎంతో కొంత ఉంటుంది. కోట్లాదిమందిని ఆకట్టుకునే మాధ్యమంలో దిగ్గజాలుగా వెలుగుతున్నవారికి అది అప్పుడప్పుడు శాపమవుతోంది. శ్రీదేవి మరణానికి అలాంటిదేమైనా కారణమా అన్నది తెలియదు. కానీ సహజంగానే సామాజిక మాధ్యమాల్లో ఆ కోణంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చిత్రపరిశ్రమలో ఏనాడూ వివాదాల జోలికి పోకుండా, చివరికంటా ఎంతో హుందాగా జీవించి అందరి ఆదరాభిమానాలూ చూరగొన్న శ్రీదేవి రానున్న తరాలకు సైతం అపురూపంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. -
శ్రీదేవి మృతి పట్ల మాలీవుడ్ విచారం
తిరువనంతపురం: అందాల నటి శ్రీదేవి అకస్మాత్తుగా మృతిచెందడంతో మలయాళ చిత్ర పరిశ్రమ(మాలీవుడ్) విచారం వ్యక్తం చేసింది. శ్రీదేవి మొత్తం 26 మలయాళ చిత్రాల్లో నటించారు. 1969లో వచ్చిన కుమార సంభవం ఆమె మొదటి మలయాళ చిత్రం. 1996లో వచ్చిన దేవరాగం ఆమె చివరి మలయాళ చిత్రం. పూంపట్ట(1971) చిత్రానికి గానూ మొదటిసారి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కేరళ స్టేట్ నుంచి అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మరో రెండు అవార్డులు కూడా దక్కాయి. దుబాయ్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు మృతిచెందిన సంగతి తెల్సిందే. శ్రీదేవి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విచారం వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం సినీ లోకానికి తీరని నష్టమని వ్యాఖ్యానించారు. బాలనటిగా విభిన్న పాత్రలు వేసి అందరి మనసుల్లో చోటుదక్కించుకున్నదని అన్నారు. ఇదొక గుండెకు నొప్పి కలిగించే వార్తని వెటరన్ నటుడు రాఘవన్ అన్నారు. సినిమాల పట్ల ఆమె పట్టుదల, అంకితభావం చాలా విలువైందని వ్యాఖ్యానించారు. తన నటనతో సినీ అభిమానులను మంత్రముగ్గుల్ని చేసిందని, ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని నటుడు జగదీశ్ అన్నారు. -
భావోద్వేగానికి లోనైన మంచులక్ష్మీ, కోన
సాక్షి, సినిమా : అశేష సినీ వాహినిని శోకసంద్రంలో ముంచేసి నటి శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయారు. శ్రీదేవి హఠాన్మరణం పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆమెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రచయిత కోన వెంకట్, మంచులక్ష్మీలు భావోద్వేగంతో కూడిన సందేశాలను విడుదల చేశారు. ‘భారతీయ చలనచిత్ర రంగం ఒక దేవతను కోల్పోయింది’ అని ప్రముఖ రచయిత కొన వెంకట్ పేర్కొన్నారు. శ్రీదేవి మరణవార్త విని యావత్ ప్రపంచంతో తాను షాక్‌కి గురయ్యానని.. ఆమెతో కలిసి మామ్ చిత్రానికి తాను పని చేశానని ఆయన చెప్పారు. తాను ఆమెతో కలిసి పని చేసిన మొదటి చిత్రం అదేనని.. దురదృష్టవశాత్తూ అదే ఆమె కెరీర్ లో చివరి చిత్రం అవుతుందని ఊహించలేదని కోన తెలిపారు. ఆమె లేని లోటు ఎవరూ, ఎప్పటికీ పూడ్చలేరని, ఎన్ని యుగాలైన ఆ లోటు భర్తీ కాలేదని చెప్పారు. సౌమ్యురాలు.. సున్నితమైన వ్యక్తి, అందరినీ ప్రేమించే గుణం.. ఇలా ఎన్నో గొప్పలక్షణాలు ఆమెకున్నాయన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు కోన వీడియో సందేశంలో చెప్పారు. She loved cinema.. Cinema loved her more... Never thought that I was writing her last film.. MOM 🙏 pic.twitter.com/g9m1wIt3lA — kona venkat (@konavenkat99) 25 February 2018 ‘ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదు’ శ్రీదేవి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందనుకోలేదని నటి మంచు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ‘ఆమె నటన నుంచి ప్రేరణ పొందని నటీనటులు లేరంటే అతిశయోక్తి కాదేమో. తెర వెనుకాల హుందాగా ఉండే శ్రీదేవి కెమెరా ముందుకు వస్తే నటనతో విజృంభించేవారు. ఎలాంటి పాత్రలైనా అలవోకగా పోషించే ఆమె ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తలు చాలా తీసుకునేవారు. అలాంటి వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందటం శోచనీయం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని మంచులక్ష్మీ తెలిపారు. -
శ్రీదేవి మృతి సినీ లోకానికి తీరని లోటు
-
‘శ్రీదేవి ఇక లేరు అంటే నమ్మలేం’
ప్రముఖ నటి శ్రీదేవి మరణంపై టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. భారతీయ వెండి తెరపై తనదైన ముద్రను వేసిన శ్రీదేవి గారి హఠాన్మరణం నమ్మలేనిదన్నారు. దుబాయిలో వివాహానికి వెళ్ళిన శ్రీదేవిగారు చనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. ఆమె మృతి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని తెలియజేస్తూ ‘అసమానమైన అభినయ ప్రతిభతో భారత ప్రేక్షక లోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. శ్రీదేవి గారు ఇక లేరు అనే మాట నమ్మలేనిది... కానీ ఆమె వెండి తెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీ చిరస్మరణీయాలే. భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. శ్రీదేవి గారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకొనే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను. బాల నటిగా, కథానాయకిగా దక్షిణ భారత సినీ రంగంలో విజయాలు అందుకొన్న శ్రీదేవి గారు అదే స్థాయిలో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. బడి పంతులు సినిమాలో బాల నటిగా ‘బూచాడమ్మ బూచాడు’ అనే పాటలో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ పలికింఛిన హావభావాల్ని ప్రేక్షకులు మరచిపోలేరు. అన్నయ్యతో జగదేక వీరుడు అతిలోక సుందరిలో దేవకన్య ఇంద్రజగా కనిపించిన తీరు ‘మానవా..’ అంటూ చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకొనేవే. శ్రీదేవిగారు అమాయకత్వంతో పలికించే నటన మరచిపోలేనిది. విరామం తరవాత ఇంగ్లిష్ వింగ్లీష్, మామ్ చిత్రాల్లో నటించి తన శైలిని ఈ తరానికీ చూపించారు. పెద్ద కుమార్తెని కథానాయకిగా చిత్ర సీమకి తీసుకువస్తున్న తరుణంలో ఈ లోకాన్ని వీడటం బాధాకరం’ అన్నారు. -
అమితాబ్ ముందే ఊహించారా?
సాక్షి, ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నటి శ్రీదేవి మరణవార్త మీడియాలో రావటం కంటే ముందే ఆయన ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ ఆమె మృతికి సంబంధించిందేనంటూ ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. ‘ఎందుకో తెలీదు. మనుసులో ఏదో అలజడి రేగుతోంది’ అని ఆయన ఓ ట్వీట్ చేశారు. శ్రీదేవి మరణ వార్త మీడియాలో రావటానికి కొన్ని నిమిషాల ముందే ఈ ట్వీట్ చేయటం విశేషం. దీంతో ఆమె చనిపోతారని అమితాబ్ ముందే ఊహించే ఆ ట్వీట్ చేశారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పని చేసిందని.. అందుకే ఆయన జరగబోయేది ముందే తెలిసిపోయి ఉంటుందని’ అని అంటున్నారు. అయితే శ్రీదేవి అమితాబ్‌తో కలిసి ఐదారు చిత్రాల్లో నటించారు. ఆమె కుటుంబంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు, లేదా సన్నిహిత వ్యక్తులు.. బిగ్ బీకి వెంటనే సమాచారం అందించి ఉంటారని, అందుకే ఆయన అలా ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు అమితాబ్ ఆ ట్వీట్‌పై మళ్లీ స్పందించకపోవటంతో సోషల్ మీడియాలో దానిపై చర్చ ఆగటం లేదు. -
శ్రీదేవి మృతి సినీ లోకానికి తీరని లోటు: రోజా
సాక్షి, తిరుమల : నటి శ్రీదేవి మరణం సినీ లోకానికి తీరని లోటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజా తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ... శ్రీదేవిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది సినిమాల్లో నటించటానికి వచ్చారని, అందులో తానూ ఒకరినని చెప్పారు. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు యూటర్న్ ప్రత్యేక హోదా ఉద్యమంలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం పాకులాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాకుంటే రాష్ర్ట నష్టం పోతుందని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేసులకు భయపడేది వైఎస్ జగన్మోహన్రెడ్డి కాదని.. తనపై బురద చల్లినా నిర్దోషిగా నిరూపించుకోవటానికి కోర్టులకు తిరుగుతున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కైనా స్టేలు తెచ్చుకుని కోర్టులకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. -
9 ఏళ్లక్రితం ఆయన...ఇపుడు వినోద్‌జీ
ముంబై: సుమారు 100పైగా సినిమాల్లో నటించి బాలీవుడ్ సినీ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, యాక్టివ్ పోలిటీషియన్ వినోద్ ఖన్నా (70) ఇక లేరన్న వార్త తో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. శ్వాసకోశ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినోద్ ఖన్నా గురువారం ఉదయం 11.20గంగలకు అంతిమ శ్వాస విడిచారని హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.తీవ్ర అనారోగ్యంతో ఏప్రిల్‌లో మొదటి వారంలో సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటలో చేరారు. తమ అభిమాన, సహచర నటుడు కన్నుమూతతో బాలీవుడ్ గుండె బరువెక్కింది. అశ్రునయనాలతో ఆయనకు నివాళులర్పించారు. ముఖ్యంగా కేంద్రమంత్రి, నటి స్మృతి ఇరాని వినోద్ ఖన్నా ఆకస్మిక మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయన సిరీస్‌ను ప్రొడ్యూస్ చేసినగౌరవం తనకు దక్కిందని ఆమె గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ మరో సీనియర్ నటుడు రిషీకపూర్ అమర్ అక్బర్, ఆంటోనీ సినిమాలో అమర్ పాత్ర పోషించిన వినోద్‌కు ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే హీరోయిన్ రాధిక, రిచా చద్దా తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. పంజాబ్ గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు బీజీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘‘మేరె అప్నే’ "ఇన్సాఫ్" "అమర్, అక్బర్ ఆంటోనీ, లాంటి సినిమాలతో ఆయన పాపులర్ అయ్యారు. వినోద్ ఖన్నా మరణంపై సినీ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ ఆదర్శ్ సంతాపం ప్రకటించారు. 2015లో షారూక్ సినిమా దిల్వాలే ఆయన నటించిన ఆఖరి సినిమా. ఖుర్బానీ, దయావన్ మూవీలలో వినోద్ ఖన్నాతో కలిసి నటించిన ఫిరోజ్‌ఖాన్ తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున( ఏప్రిల్ 27) మరణించారని, ఇపుడు వినోద్ ఖన్నా ఇదే రోజున కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా అక్టోబర్ 6, 1946లోజన్మించిన ఆయన 1968లో సినీ కరియర్ ను ప్రారంభించారు. అమర్ అక్బర్ ఆంటోనీ, ది బర్నింగ్ ట్రైన్ లాంటి చిత్రాలలో నటించారు. 1982లో ఓషో రజనీష్ ప్రభావంతో ఫిలిం ఇండస్ట్రీని వీడాలని నిర్ణయించుకున్నారు. అయితే అయిదేళ్ల తరువాత ఇన్సాఫ్, సత్యమేవ జయతే చిత్రాలో సినీరంగాని తిరిగి చేరువయ్యారు. వినోద్ ఖన్నాకు భార్య , ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. Will miss you Amar. RIP. pic.twitter.com/WC0zt71R4J — Rishi Kapoor (@chintskap) April 27, 2017 Heard about the sad demise of Vinod Khannaji. Kind, considerate, a legend in his own right. Had the honour of producing a series with him. — Smriti Z Irani (@smritiirani) April 27, 2017 -
ఆప్తమిత్రుడిని కోల్పోయా: మోహన్ బాబు
హైదరాబాద్ : మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పట్ల సీనియర్ నటుడు మోహన్ బాబు, బాలకృష్ణ సంతాపం తెలిపారు. గుండెపోటుతో దేవినేని నెహ్రూ ఈ రోజు ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. నెహ్రూ తన ఆప్తమిత్రుల్లో ఒకరని, ఆయన మృతి బాధాకరమన్నారు. షిర్డీ సాయిబాబా.. నెహ్రూ కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. అలాగే మంచు మనోజ్ కూడా నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. Devineni Nehru Garu 's sad demise is an irreparable loss to the politics. I will miss him! My most sincere condolences to the family. — Manoj Manchu ❤️ -
కాస్ట్రో నిర్యాణంపై బి-టౌన్
ముంబై: క్యూబా విప్లవ యోధుడు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు ఫెడల్ కాస్ట్రో మరణానికి నివాళులర్పిస్తూ బాలీవుడ్ స్పందించింది. దర్శకులు మధుర్ భండార్కర్, హన్సల్ మెహతా, అశ్విన్ ముశ్రన్, నిఖిల్ అద్వాని వివేక్ అగ్నిహోత్రి, ఆయు ష్మాన్ ఖురాన్ తదితర ప్రముఖులు 90సం.రాల వయస్సులో అనారోగ్యంతో మరణించిన కాస్ట్రోకి ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ఆయనొక విప్లవ చిహ్నమని కొనియాడారు. ప్రపంచంలో ఉత్తమ, అత్యంత వివాదాస్పద నాయకులలో కాస్ట్రో ఒకరని, అమెరికా చేసిన వందల హత్యాయత్నాలను తప్పించుకున్నా అంతిమంగా అనారోగ్యంతో మరణించి సుదీర్ఘ నైతిక పోరాటాన్ని నిరూపించారన్నారు. ఫిడేల్ కాస్ట్రో మరణంతో క్యూబా చరిత్రలో ఒక ముఖ్యమైన శకం ముగింసింని మధుర్ భండార్కర్ ట్వీట్ చేశారు. ప్రభావవంతమైన విప్లవాత్మక నాయకుడు కాస్ట్రో అని అభివర్ణించారు. కాగా కాస్ట్రో మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగాసంతాప సందేశాలు వెల్లువెత్తాయి. దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా నివాళులర్పించారు. , Death of #FidelCastro marks the end of an important era in Cuban history. An influential & a revolutionary leader. Almost traveled to Havana. Visa issues made me change plans. Wish I'd made it before the passing away of #FidelCastro — Hansal Mehta (@mehtahansal) November 26, 2016 -
బాపు....లేదు మరపు
బాపు కుంచెకు ప్రాణంపోసిన బెజవాడ అత్యధికంగా నగరంలోనే ముద్రితం ఏడాది పాటు గాంధీనగర్లోనే అద్దెకు ఉన్న బాపు-రమణలు కృష్ణమ్మ పరవళ్లు, బీసెంట్‌రోడ్డు రద్దీ, గాంధీనగర్ అంటే ఆయనకెంతో ఇష్టం.. అచ్చతెలుగు ఆనంద శిఖరం కరిగిపోయింది. భక్తిచిత్రాల బంగారు నిధి నింగికెగసింది. అందాల అలివేణి.. తెలుగింటి విరిబోణి అయిన ‘బాపు’బొమ్మ మూగబోయింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న తెలుగుతేజం దేహం విడిచింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఎన్నో సినిమాలకు జీవంపోసిన సంప్రదాయ సంగమం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ఆదివారం చెన్నైలో పరమపదించడంతో జిల్లాలోని ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యూరు. ఆ మహనీయునికి జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విజయవాడ కల్చరల్ : బాపు కుంచె నుంచి జాలువారిన చిత్రాలెన్నో బెజవాడలోనే ప్రాణం పోసుకున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలసంఖ్యలో బాపు బొమ్మలు నగరంలో ముదిత్రమయ్యాయి. 1955లో బెజవాడతో మొదలైన ఆయన అనుబంధం తుదిశ్వాస విడిచే వరకు కొనసాగింది. నగరానికి చెందిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్, ప్రముఖ రచయితలు పెద్దిభొట్ల సుబ్బరామయ్య, పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, నవోదయ పబ్లిషర్స్‌కు చెందిన రామ్మోహన్రావు, న్యూస్టూడెంట్ బుక్ సెంటర్ అధినేత బాజ్జీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్, బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణమ్మ పరవళ్లు, బీసెంట్‌రోడ్డులో రద్దీ, డిస్ట్రిబ్యూటర్ల కేంద్రమైన గాంధీనగర్ అంటే బాపు గారికి ఎంతో అభిమానం. ఇలా సుమారు 50 ఏళ్ల పాటు నగరంతో ఆయన సాహితీ అనుబంధాన్ని కొనసాగించారు. బాపు బొమ్మలకు డిమాండ్ ఎక్కువ ఒకప్పుడు ఏదైనా ముఖచిత్రంపై బాపు బొమ్మ ఉంటే చాలు ఆ పుస్తకాలకు డిమాండ్ విపరీతంగా ఉండేది. ఇదే కోవలో బాపుకు బెజవాడతో బంధం ఏర్పడింది. అనేకమంది ఔత్సాహిక కవులు, రచయితలు రాసిన పుస్తకాలపై బాపుతో ముఖచిత్రం వేయించుకోవటం అంటే అప్పట్లో పెద్ద క్రేజ్‌గా ఉండేది. ఇలా వందల పుస్తకాలు ముద్రితమైన క్రమంలో బాపు స్వయంగా రచయితతో, పబ్లిషర్‌తో మాట్లాడేవారు. న్యూ స్టూడెంట్ బుక్ సెంటర్ ముద్రించే నోట్ పుస్తకాలపై బాబు వేసిన బొమ్మలు, కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబించించేలా ముద్రించే అభినందన గ్రీటింగ్ కార్డులకు బాపు బొమ్మలు వేసేవారు. వీటికి అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. మాసపత్రిక నుంచి మోడరన్ కేఫ్ వరకు.. బాపుకు విజయవాడలో ఏడాది పాటు అద్దెకు ఉన్నారు. 1970వ దశకంలో ఆంధ్రజ్యోతి మాసపత్రికలో కార్టూనిస్ట్‌గా పనిచేశారు. అదే మాసపత్రికకు ముళ్లపూడి రచయితగా పనిచేశారు. గాంధీనగర్‌లోని పాత రాధా టాకీస్ సమీపంలోని నివాసంలో బాపు, రమణ ఒకేచోట నివాసం ఉన్నారు. ఏడాదిపాటు ఇక్కడ పనిచేసిన ఇద్దరూ ఆ తరువాత చెన్నై వెళ్లిపోయూరు. ఆ తర్వాత ప్రచురణలు, ఇతర పనుల నిమిత్తం ఎప్పుడు విజయవాడ వచ్చినా బీసెంట్‌రోడ్డులోని మోడరన్ కేఫ్ హోటల్లోనే బస చేసేవారు. అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రూపొందించిన ‘ఇద్దరుమిత్రులు’ సినిమా కథ రచన, చిత్రాల రూపకల్పన పనులన్నీ అక్కడే జరిగాయని బాపు ఒక సందర్భంలో ప్రకటించారు. ఆ తర్వాత విశాలాంధ్ర పబ్లిషర్స్‌లో ఆయన ముఖచిత్రాలు అనేకం ప్రచురితమయ్యూరుు. ‘బుక్ ఫెస్టివల్’తో అనుబంధం విజయవాడలో ఏటా నిర్వహించే బుక్ ఫెస్టివల్‌కు, బాపుకు విడదీయరాని బంధం ఉంది. దీనికి కావాల్సిన లోగోలు, బొమ్మలు ఆయనే వేసేవారు. ఈ ఏడాది జరిగిన 20వ బుక్ పెస్టివల్ లోగో బొమ్మను ఆయనే వేశారు. ఆయన సన్మానాలకు ఇష్టపడేవారు కాదని ఆయనకు సన్నిహితంగా ఉండేవారు పేర్కొంటారు. అయితే, బుక్ ఫెస్టివల్‌కు వచ్చి ఇక్కడ పుస్తకాలు కొనుగోలు చేసుకుని వెళ్లేవారు. బుక్ ఎగ్జిబిషన్ లైబ్రరీలో బాబు బొమ్మలు మనకు దర్శనమిస్తాయి. అపర శ్రీరామభక్తుడు బాపు రామభక్తుడు. ఒక రచయిత్రి ‘రామాయణ విషవృక్షం’ అనే నవల రాసి ముఖచిత్రం వేసి ఇవ్వమంటూ ఖాళీ చెక్కును ఆయనకు పోస్ట్ చేశారు. ఆయన ఆ ఖాళీ చెక్కుపై శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ.. అని రాసి సదరు రచయితకు తిప్పి పంపి తన భక్తిని చాటుకున్నారు. దైవానికి వ్యతిరేకంగా బొమ్మలు గీయడం కానీ, వ్యాఖ్యానాలు చేయడం కానీ బాపు ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవు. చిత్ర పరిశ్రమకు తీరని లోటు తెలుగు సినీరంగానికి విశేష సేవలందించిన బాపు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన దర్శకత్వంలో ఎన్నో కళాత్మక చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తనదైన బాణీలో సినిమాలు తీసి సినీరంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. - మండలి బుద్ధప్రసాద్, శాసనసభ డెప్యూటీ స్పీకర్ గోటితో నా బొమ్మ వేశారు.. నేను రచించిన ‘ధ్రువతార’ నవల వారంవారం ప్రచురితమయ్యేది. దాని ముఖచిత్రాలు బాపునే వేసేవారు. ముఖచిత్రం ఏవిధంగా ఉంటే ఆకర్షణగా ఉంటుందో ఆయనే నాతో మాట్లాడేవారు. నేను రాసిన ‘అంగారతల్పం’ నవలకు కూడా ముఖచిత్రం ఆయనే వేశారు. ఒకసారి ఆయనను కలిసినప్పుడు నాతో మాట్లాడుతూనే.. గోటితో నా బొమ్మను వేసి ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. - పెద్దిబొట్ల సుబ్బరామయ్య, రచయిత ఏడు దశాబ్దాల అనుబంధం బాపు, రమణ లతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఏడు దశాబ్దాలుగా బాపుతో స్నేహాన్ని కొనసాగిస్తున్నాను. రమణతో కలిసి నేను ప్రజాతంత్ర పత్రికలో పనిచేసేవాడ్ని. అక్కడకు బాపుగారు కూడా వచ్చేవారు. ‘బాపు రమణీయం’ పుస్తకం నన్నెంతో ఆకట్టుకుంటుంది. బాపు శ్రీరామ కథలను సినిమాగా తీసేవారు. నేటితరం ఆర్టిస్టులకు ఆయన ఆదర్శం. - తుర్లపాటి కుటుంబరావు, సీనియర్ పాత్రికేయుడు రచయిత ఆరాధ్యుడు.. మాలాంటి రచయితలు బాపును ఆరాధిస్తారు. ఆయన సోదరుడు సత్తిరాజు రామనారాయణకు మ్యూజియంరోడ్డులో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. నా తొలి పుస్తకం ‘అమలిన శృంగారం’ 1980లో విడుదలైంది. దాని ముఖచిత్రం బాపుగారే వేశారు. ‘నీ స్నేహితుడు కాబట్టి అతని వద్ద డబ్బు తీసుకోవద్దు. పూర్ణచంద్‌కు నా అభినందనలు.’ అని బాపు అనడం మరచిపోలేను. - జీవీ పూర్ణచందు,కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి -
బాపు గీసిన తొలి బొమ్మ
-
రమణగారు లేని జీవితం కష్టంగా ఉందండీ!
బాపుగారి చివరి ఇంటర్వ్యు సరిగ్గా 200 రోజుల క్రితం... ఉదయం పదకొండు గంటల వేళప్పుడు - చెన్నైలో బాపుగారింట్లో... ఆయన ఇంటర్వ్యూకోసం దర్శకుడు వీఎన్ ఆదిత్య, నేను (సినిమా డెస్క్‌హెడ్ పులగం చిన్నారాయణ), ఫొటోగ్రాఫర్ శివ చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఒక చేదువార్త... బాపు గారికి నీరసంగా ఉందట. ఇప్పుడేం మాట్లాడరట.. ముగ్గురం నీరసపడిపోయాం. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి. కనీసం ఆయనను కలిసి అయినా వెళదామని అలానే కూర్చుండిపోయాం.. మా అదృష్టం బాగుంది. బాపు గారు కరిగిపోయారు. లోపలకు రమ్మన్నారు. చాలా నీరసంగా కనబడ్డారాయన. మాటలు మొదలయ్యాక... చాలా హుషారు ఆయనలో. చిన్న పిల్లాడై పోయారు. చిత్రాలు... చిత్ర పటాలు... చిత్రాతిచిత్రమైన సంఘటనలు... గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌లు... మనసులో తగిలించుకున్న జ్ఞాపకాల చిత్తరువులు... పలు రకాల పుస్తకాలు.. బోలెడన్ని గ్రామ్‌ఫోన్ రికార్డులు... ఆయన బొమ్మలేసే చోటు.. రంగులేసే కుంచె... ఆ పక్కనే ఆయనకు కావాల్సిన స్వరాలందించే పాతకాలపు టేప్‌రికార్డర్... బాపు గారితో అలా... అలా... లీనమైపోయాం. రెండున్నర గంటలు... బాపు గారితో గడపడమంటే, మా మనసు ముంగిట్లో ముత్యాలముగ్గు వేసుకున్నంత ఆనందం. ఈ ఇంటర్వ్యూ మా జీవితంలో గ్రేటెస్ట్ మెమొరీ. కానీ... అదే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందని అనుకోలేదు. మనసు నిండా విషాద మేఘాలు కమ్ముకున్న ఈ వేళ... ఒక్కసారి ఆయన జ్ఞాపకాలలోకి... మాటలలోకి... మీకు ఈ చిత్రకళ ఎలా అబ్బింది? బాపు: మా నాన్నగారు కూడా బొమ్మలు వేసేవారు. ఆయన అడ్వకేట్ అయినా హాబీగా బొమ్మలు వేసేవారు. అయితే ఇది కూడూ గుడ్డా పెట్టేది కాదని ఆయన అభిప్రాయం. నిజంగానే ఆ రోజుల్లో ఆర్టిస్టుగా బతకడం కష్టం. అందుకే నన్ను ‘లా’ చదివించారు. లా పూర్తయ్యాక, ఎప్పుడైనా కోర్టులో వాదించారా? అస్సల్లేదు. అప్పుడప్పుడు కోర్టుకి వెళ్లా. బీఎల్ డిగ్రీ రావడానికి ఎన్రోల్ కావాలి కదా. స్నేహితుల దగ్గర నల్లకోటు అరువు తీసుకుని వెళ్లాను. ఇంతకూ మీరు వెళ్లింది ఏ కోర్టు? నేను పుట్టి పెరిగిందంతా చెన్నై కదా. అక్కడ కోర్టుకే వెళ్లా. మా నాన్నగారు కూడా అక్కడే అడ్వకేట్‌గా పనిచేశారు. తమిళంలో ఓ ఫేమస్ ఆర్టిస్ట్‌కు మీరు ఏకలవ్య శిష్యుడట? ఆయన పేరు గోపులుగారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నాకు ఇష్టమైన ఆర్టిస్టులు అందరి దగ్గరికీ వెళ్తుండేవాణ్ణి. శని, ఆదివారాలు అదే పని నాకు. గోపులుగారింటికి ఆదివారాలు వెళ్లి, ఆయన బొమ్మలు వేస్తుంటే చూసేవాణ్ణి. నేనంటే చాలా ప్రేమ ఆయనకు. అప్పట్లో ఆయన ‘ఆనంద వికటన్’ మేగజైన్లో పనిచేసేవారు. మీరు బొమ్మలు గీసే పద్ధతి ఎలా ఉంటుంది? (వెంటనే ఆయన తన గదిలోకి తీసుకెళ్లి తను కూర్చుని బొమ్మలు గీసే ప్లేస్ చూపించారు). ఇక్కడే నేల మీద బాసింపట్టు వేసుకుని బొమ్మలు వేస్తుంటాను. మొదట్నుంచీ ఇదే అలవాటు. టేబుల్, కుర్చీ వాడను. ఏ ఆర్ట్‌కైనా మూడ్ ప్రధానం కదా. మరి మీకు ఏ టైమ్‌లో మూడ్ ఉంటుంది. నాకు మ్యూజిక్ ఉంటే చాలు. మూడ్‌తో పనిలేదు. ఏ టైమ్ అయినా, అర్ధరాత్రయినా సరే మ్యూజిక్ వింటూ బొమ్మలేసుకునే పని చేసేవాణ్ణి. ఇలా బొమ్మల మధ్యనే పడుకుని నిద్రపోయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు ఓపిక లేదు. కూర్చుంటే లేవలేను. మీ రూమ్‌లో హిందీ మ్యూజిక్ డెరైక్టర్ సి. రామచంద్ర ఫొటో పెట్టుకున్నారు..? చాలా మంచి మ్యూజిక్ డెరైక్టరాయన. ‘అనార్కలి’ చేయడానికి ఆయన మద్రాసు వచ్చినప్పుడు కలిశాను. నా క్లోజ్‌ఫ్రెండ్ వి.ఎ.కె. రంగారావుగారు ఆయనకు వీరాభిమాని. సి. రామచంద్రగారి పాటల వల్ల నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. నాకు నలుగురితో కలిసి మాట్లాడటమంటే భయం. జలగండంలా నాకు ‘జన’గండం ఉన్నట్టుంది. రామచంద్ర పాట అంటే ఇష్టమని చెప్పగానే, అయిదు నిమిషాల్లో నాకు ఫ్రెండ్స్ అయిన వాళ్లు చాలామంది ఉన్నారు. మీరు వినేది గ్రామ్‌ఫోన్ రికార్డులా? ఆడియో క్యాసెట్లా? మొదట్లో గ్రామ్‌ఫోన్ రికార్డులే వినేవాణ్ణి. తర్వాత క్యాసెట్లు. ఇప్పుడు సీడీలు. మీ దగ్గర బ్రహ్మాండమైన మ్యూజిక్ కలెక్షన్ ఉందట? మెహదీహాసన్, బడే గులాం అలీఖాన్‌ల మ్యూజిక్ కలెక్షన్ మొత్తం ఉంది. వాళ్ల గజల్స్ అంటే నాకు ప్రాణం. గజల్స్ అనే కన్నా, వాళ్ల వాయిస్సే నాకిష్టం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని వాయిస్సులు వాళ్లవి. నాకు ఉర్దూ పెద్దగా రాదు. అయినా వారి వాయిస్‌ల వల్ల ఆ పాటలు బాగా ఎంజాయ్ చేశాను. 1978లో మెహదీహాసన్‌ని కలిశాను. ఓ బొమ్మవేసి ఇచ్చి సంతకం పెట్టమన్నాను. ‘‘హార్మోనియం పెట్టె... సగం బొమ్మే గీశావ్. మొత్తం గీసి తీసుకురా. అప్పుడు పెడతాను’’ అన్నారు. పెద్దవాళ్లకు వాళ్ల కళంటే అంత అభిమానం. బడే గులాం అలీఖాన్‌ను కలవలేకపోయాను. ఆయన కచ్చేరీలకు నన్ను పీబీ శ్రీనివాస్ తీసుకు వెళ్లేవారు. సినిమాలు బాగా చూస్తారా? రెగ్యులర్‌గా చూస్తా. అయితే అన్నీ వీడియోల్లోనే. నేను సినిమా బఫ్‌ని. రోజుకి పది దాకా వీడియోలు చూడగలను. వీడియోలు లేని రోజుల్లో మద్రాసులో మూడు రిలీజ్‌లుండేవి. మూడు పూట్లా మూడు రిలీజ్లు చూసేసేవాణ్ణి. సినిమా సినిమాకీ మధ్య ఒక టీ తాగి, బిస్కెట్లు తినేవాళ్లం. సినిమాలు తీయడానికి మీకు ఇన్స్పిరేషన్..? చిన్నప్పట్నుంచీ సినిమాలంటే చాలా ఇష్టం. మద్రాసులో హాలీవుడ్ సినిమాలన్నీ విడుదలయ్యేవి. అన్నిటికీ నేలక్లాసుకి వెళ్లిపోయేవాళ్లం. మీరు మౌత్ ఆర్గాన్ బాగా వాయించేవారట? కాలేజీ రోజుల్లో బాగా వాయించేవాణ్ణి. ‘మూగమనసులు’ పోస్టర్ మీరే డిజైన్ చేశారు కదా? అవును. రమణగారు ఆ సినిమాకి వర్క్ చేశారు కదా. సినిమాలో ఉన్నదాన్నే ఎలివేట్ చేస్తూ పడవ, పంగలి కర్ర, ముద్దబంతి పువ్వు ఆర్ట్‌గా వేశాను. మీ తొలి సినిమా ‘సాక్షి’కి మీరు పబ్లిసిటీ డిజైన్ చేసుకోకుండా ఈశ్వర్‌తో చేయించారెందుకని? ఈశ్వర్ పోస్టర్స్ ఇష్టపడి ‘సాక్షి’కి తనతో వేయించాను. ‘బంగారు పిచిక’లో యద్దనపూడి సులోచనారాణిగారిని కథానాయికగా తీసుకోవాలనుకున్నారట..? హీరోయిన్గా కాదు. ఆ సినిమాలో ఓ చోట హీరోకి గొప్పింటి సంబంధాలు తీసుకు వస్తుంది తల్లి. అక్కడ ఓ పెళ్లికూతురి వేషం యద్దనపూడి గారితో చేయించాలనుకున్నాం. ఆవిడ కూడా ఒప్పుకున్నారు. కానీ చేయించడం కుదర్లేదు. మీ ప్రతి సినిమాకూ స్టోరీబోర్డ్ వేసుకుంటారు. ఆ ఆలోచన ఎందుకొచ్చింది? నాకు బొమ్మలేయడం వచ్చు కాబట్టి, కన్వీనియంట్‌గా ఉంటుందని స్టోరీ బోర్డ్ వేసుకుంటుంటాను. హాలీవుడ్లో దాదాపుగా అందరూ స్టోరీబోర్డ్ ఫాలో అవుతుంటారు. హైదరాబాద్‌లో కూడా స్టోరీబోర్డ్ వేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అది ప్యూర్లీ పర్సనల్. బయటివాళ్లకు అర్థం కావు. ఆర్టిస్టులు కూడా చూద్దామని తీసుకుని అర్థంకాక ఇచ్చేసేవారు. మీ తొలి సినిమా ‘సాక్షి’ నుంచి స్టోరీబోర్డ్ ఫాలో అయ్యారా? అవును. నేను హోమ్‌వర్క్ ఎక్కువ చేసేవాణ్ణి. మీ స్టోరీబోర్డ్ ఫాలో అయితే ఎవరైనా ఫొటోగ్రఫీ చేసేయొచ్చునంటారు. లెన్స్ రేంజ్‌లు కూడా డీటెల్డ్‌గా రాస్తారట? అబ్బే అదేం లేదండి. ఎవరి పని వాళ్లదే. మీ సినిమాలకు గొప్ప గొప్ప బాలీవుడ్ కెమెరామేన్లు పనిచేశారు కదా! బాబా ఆజ్మీ, ఇషాన్ ఆర్యలాంటి వాళ్లు పనిచేశారు. వాళ్లతో మీకెలా పరిచయం? వాళ్ల సినిమాలు చూశాను. హిందీ సినిమా ‘గరమ్ హవా’కు ఇషాన్ ఆర్య వర్క్ చూసి, ఆయన ఎక్కడుంటారో కనుక్కుని మాట్లాడాను. ‘ముత్యాల ముగ్గు’ ఆయనకు తొలి తెలుగు సినిమా. దానికి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. స్నేహం, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు సినిమాలకు నాతో పనిచేశారు. ఆయన అసిస్టెంటే బాబా ఆజ్మీ. నటి షబనా ఆజ్మీ తమ్ముడాయన. కైఫీ ఆజ్మీగారబ్బాయ్. రాజాధిరాజు, వంశవృక్షం, రాధా కల్యాణం, త్యాగయ్య, పెళ్లీడు పిల్లలు తదితర సినిమాలకు వర్క్ చేశారు. ‘సంపూర్ణ రామాయణం’ సినిమాకి ట్రిక్ వర్క్ అంతా రవికాంత్ నగాయిచ్‌గారు చూసుకున్నారు. మీరు షాట్ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేవారా? అలా మాట వినకపోతే నాతో పని చేయడం కష్టం. ఆర్టిస్టులకి మీరు యాక్ట్ చేసి చూపిస్తారా? చూపించాలి కదండీ. లేకపోతే వాళ్లకు ఎక్స్‌ప్రెషన్సూ అవీ ఎలా తెలుస్తాయండీ. సినిమా మొత్తం మనకు తెలుస్తుంది. వాళ్లు ఎక్కడనుంచో ఇక్కడకు వస్తారు. మనం చెప్పకపోతే వాళ్లకు ఎలా తెలుస్తుంది? మీ సినిమాల్లో ‘సీతమ్మ పెళ్లి’ ప్రత్యేకంగా అనిపిస్తుంది... చాలా మంచి కథ అది. మహేంద్రన్‌గారని తమిళంలో నాకిష్టమైన దర్శకుడు చేసిన ‘నిండు కొయిరాన్’ని తెలుగులో నేను చేశాను. తమిళంలో రజనీకాంత్ చేసిన పాత్రని తెలుగులో మోహన్‌బాబుతో చేయించాం. అందరూ మీ బొమ్మలు వాడుతుంటారు. మీరేమో ‘సీతాకల్యాణం’లో ఓ పాటలో మీ బొమ్మలు కాకుండా వేరే చిత్రకారుని బొమ్మలు వాడినట్టున్నారు? పిలకా నరసింహమూర్తిగారని మా గురువుగారు. ఆయనతో దశావతారాలు బొమ్మలు వేయించాను. మీ సినిమాల్లో ఎక్కడో ఒక చోట పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకని? ఐజన్‌బర్గ్ గారని గాడ్‌ఫాదర్ ఉండేవారు. ఫోర్డ్ ఫౌండేషన్‌వాళ్లు పెట్టిన సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కి ఆయన హెడ్. ఆయన చెప్పేవారు... సినిమాలో ఎక్కడో ఒకచోట పుస్తకం చూపించమని. వంటగదిలో సీన్ అయినా సరే. ఇల్లాలు పిల్లాడికి పాలు పట్టిస్తున్నా ఓ చేత్తో పుస్తకం ఉన్నట్టు చూపించమనేవారు. అందరూ పుస్తకాలు చదవాలనేది ఆయన అభిలాష. ‘సాక్షి’ సినిమాని ఇప్పుడు కూడా రీమేక్ చేయొచ్చునా? చాలామంది స్క్రీన్‌ప్లే అది. స్క్రీన్‌ప్లే వైజ్ గొప్పదే కానీ, పర్సనల్‌గా నా వర్క్ నాకు అంత గొప్పగా అనిపించదు. తమిళంలో ఏమైనా చేశారా? ఓకే ఒక్క సినిమా చేశాను. ‘ఇన్సాఫ్ కే తరాజ్’ని తెలుగులోనూ, తమిళంలోనూ చేశాం. మీ సినిమాలకు నెగిటివ్ ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువనుకుంటాను? అవునండీ. సినిమా నిడివికి మూడు రెట్లు ఎక్స్పోజర్ ఉండేది. ఎందుకంటే రమణగారు స్క్రిప్ట్ రాసి ఇస్తే, నేను స్టోరీబోర్డ్ వేసేసేవాణ్ణి. అక్కడే చాలామట్టుకు ఎడిటింగ్ అయిపోతుంది. ఓ హిందీ సినిమాని ఒకే సెట్లో రెండు చోట్ల ఊటీలోనూ, ముంబైలో తీసేశాం. కాల్షీట్లు ఇబ్బంది వల్ల. అదంతా స్టోరీబోర్డ్ వల్ల సాధ్యపడింది. రమణగారికి ఏయన్నార్ క్లోజ్ అయితే, మీకు ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేదా? అదేం లేదండి. నాకెవ్వరితోనూ ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది కాదు. ఎన్టీఆర్‌తో రెండు సినిమాలు చేశాను. పిల్లల కోసం ప్రభుత్వం తరఫున ఓ ప్రాజెక్ట్ చేయిస్తే చేశాను. అదంతా రమణగారి చలవవల్లే. అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉండటం చాలా కష్టం. మీది మొదట్నుంచీ అదే పద్ధతి. కానీ ఏమీ లేకపోయినా డాంబికాలు పలికేవారిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంకొకళ్ల గురించి జడ్జ్ చేయడం కష్టం. తప్పు కదా..? ఈ గోడ మీద మీ బొమ్మలు కాకుండా పెద్ద పెద్ద పెయింటింగ్స్ ఏంటండీ? ఇవన్నీ ఓల్డ్‌మాస్టర్ పెయింటింగ్స్. ‘సీతా కల్యాణం’ టైమ్‌లో లండన్ వెళ్లినపుడు గూటాల కృష్ణమూర్తి గారితో వెళ్లి ఈ పెయింటింగ్స్ కొన్నా. నా ఇంకో ఫ్రెండ్ శ్రీరమణగారు ఇవన్నీ లామినేట్ చేసి పెట్టారు. 1978 నాటి బొమ్మలివి. చిత్రకళలో వచ్చే మార్పుల్ని గమనించడం కోసం ఇంటర్నెట్‌ని ఫాలో అవుతుంటారా? నాకస్సలు కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలీదు. ఎప్పటికప్పుడు పుస్తకాలు రిఫర్ చేస్తుంటాను. అప్పట్లో సెంట్రల్ స్టేషన్ దగ్గర్లో మూర్ మార్కెట్ ఉండేది. అక్కడ చిత్రకళకు, సంబంధించి ఫారిన్ బుక్స్ దొరికేవి. ఆల్మోస్ట్ ఆల్ అదే నాకు స్కూలులాంటిది. ప్రతివారం ఆ మార్కెట్‌కి వెళ్తుండేవాణ్ణి. లేకపోతే లైబ్రరీకి వెళ్లి బుక్స్ రిఫర్ చేస్తుండేవాణ్ణి. నా చిన్నప్పుడు ‘బాల’ అనే చిల్డ్రన్ మేగజైన్ ఉండేది. ‘రేడియో అన్నయ్య’ న్యాపతి రాఘవరావు గారిది. అందులో బొమ్మలేసేవాణ్ణి. ఆయనే ఎంకరేజ్ చేసేవారు. పుస్తకాల షాపుకి తీసుకెళ్లి ‘నీకు కావాల్సినవి కొనుక్కోవయ్యా’ అనేవారు. షీట్స్, రంగులు అన్నీనూ. ఇంటర్నేషనల్ లెవెల్లో మీ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ ఏమైనా పెట్టారా? చాలా పెట్టారండీ. అమెరికా, లండన్. ‘సీతాకల్యాణం’ టైమ్‌లో నేను కూడా లండన్ వెళ్లాను. మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఏం చేయాలండీ? లోపల ఉండాలండీ. నేచురల్‌గా ఇంట్రస్ట్ ఉంటే ప్రాక్టీస్... ప్రాక్టీస్... ప్రాక్టీస్... చేస్తూనే ఉండాలి. అబ్దుల్ కరీం ఖాన్ అని గొప్ప క్లాసికల్ సింగర్ ఉండేవారు. చేతిలో పొన్ను కర్ర. దానికి వెండి పిడి. ఒకాయన ఎవరో మూడు నెలలు సెలవు పెట్టి వస్తాను... సంగీతం నేర్పించమన్నాడట. దానికాయన తన పొన్నుకర్రని చూపించి దీన్ని ఫ్యాక్టరీలో మెషిన్ మీద అయిదు నిమిషాల్లో తయారు చేస్తారు. కానీ నా అరచేయి కింద 30 ఏళ్లుగా ఉంది. అందుకే ఇంత నునుపు తేలింది. సంగీతం మూడు నెలల్లో నేర్చుకుంటే రాదు అన్నారట. అందుకే నిరంతరం అదే పనిలో ఉండాలి. వర్తమానంలో చిత్రకళ గురించి మీ అభిప్రాయం? అద్భుతంగా ఉంది. ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. పాతవే మంచివి అనుకోవడం పొరపాటు. ప్రస్తుతం మీకు నచ్చిన చిత్రకారుడెవరు? (నవ్వుతూ) నాకు జుట్టు లేదు కానీ, ఇంతమంది చిత్రకారులున్నారు. నిజంగా వేలల్లో ఉన్నారు. మనవళ్లూ మనవరాళ్లలో ఎవ్వరికైనా మీ ఆర్ట్ అబ్బిందా? నా రెండో అబ్బాయి కూతురు బొమ్మలు వేస్తుంది. దానికి 8 ఏళ్లు. మా అమ్మాయి కూడా బొమ్మలు వేస్తుంది. తను ఏదో గ్రాఫిక్స్ కంపెనీలో పనిచేస్తోంది. బొమ్మలు వేయడం నేర్పమని పిల్లలు అడగరా? (నవ్వేస్తూ) నాకు వస్తే కదా... వాళ్లకు నేర్పేది. నేను నిరంతర విద్యార్థిని. నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పుడు మీకు కాలక్షేపం ఏంటి? ఓపిక ఉంటే బొమ్మలు వేయడం. లేకపోతే పుస్తకాలు చదవడం. మొదట్నుంచీ పుస్తకాలు ఎక్కువ చదివేవాణ్ణి. రమణగారి స్క్రిప్టు లేకుండా మీరు రెండు సినిమాలు చేసినట్టున్నారు? లేదండీ. ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకం ఆధారంగా తీసిన సినిమా కదా. పద్యాలు ఉంటాయని గబ్బిట వెంకట్రావ్‌గారితో స్క్రిప్ట్ చేయించాం. రమణగారి ఇది లేనిదే నేను ఏ సినిమా తీయలేదు. ‘రామాంజనేయ యుద్ధం’కు రమణగారి కంట్రిబ్యూషన్ ఇన్‌డెరైక్ట్‌గా ఉంది. రమణగారు రాసిపెట్టుకున్న సినిమా స్క్రిప్టులు ఇంకేమైనా ఉన్నాయాండీ? లేవండీ. కొన్ని కొన్ని స్టోరీ ఐడియాలుండేవి. చేద్దామని ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌గా ఏ స్క్రిప్టూ పెట్టుకోలేదు. ఐడియా నచ్చితే అప్పటికప్పుడు స్క్రిప్టు తయారు చేసుకునేవాళ్లం. డబ్బు ఎంత గొప్ప స్నేహితులనైనా విడదీస్తుందంటారు. మీరిద్దరూ తీసిన సినిమా ఫ్లాప్ అయితే ఏం ఇబ్బంది ఎదురు కాలేదా? అంతా రమణగారే చూసుకునేవారు. ఈ ఇల్లు ఆయన కట్టించిందే. ఎన్టీఆర్‌గారి స్కూలు పాఠాల ప్రాజెక్ట్ తర్వాత ఇది, పక్కన మా అమ్మాయి ఇల్లు, వెనుక రమణగారిల్లు కట్టుకున్నాం. రమణగారు ఇల్లు అమ్మేశాక, ఈ ఇంట్లోనే పైన ఉండేవారు. వెనుక ఇంట్లో ఏడాదో, రెండేళ్లో ఉన్నారంతే. ‘‘ఎప్పుడూ కలిసుండేవాళ్లం ఇలా వెనక్కు వెళ్లాను. అందుకే అమ్మేశాను’’ అని జోక్ చేసేవారు రమణ. చిన్నప్పట్నుంచీ తను మా ఇంట్లోనే ఉండేవాడు. మా అమ్మగారు తనను పెద్దబ్బాయ్ అని పిలిచేది. రమణగారు ఉండి ఉంటే... ఇంకో సినిమా చేసేవారా? చేసేవాణ్ణి. ‘శ్రీరామరాజ్యం’ తర్వాత ఏమైనా అనుకున్నారా? ‘శ్రీరామరాజ్యం’ జరుగుతుంటేనే పోయారాయన. స్క్రిప్ట్ ముందే రాసేస్తారు కనుక ఇబ్బంది అనిపించలేదు. రమణగారితో మీ లాస్ట్ వర్డ్? రాత్రి రెండింటికి వాళ్లావిడ పిలిచింది. నన్ను పైకి రమ్మంటున్నారని. జస్ట్ టూ మినిట్స్. అనాయాస మరణం. ఊపిరి అందలేదు. రమణగారు లేని లైఫ్ ఎలా ఉందండీ? చాలా కష్టంగా ఉందండీ (అంటుండగానే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి). అప్పటి నుంచీ నాకు ఓపిక పోయింది. - సంభాషణ: వి.ఎన్. ఆదిత్య, పులగం చిన్నారాయణ -
దర్శకుడు బాపు కన్నుమూత
-
బాపు మృతిపై ప్రముఖుల దిగ్బ్రాంతి
-
ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత!
ప్రముఖ సినీ దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఐదు నంది అవార్డులు అందుకున్నారు. 1933 సంవత్సరం డిసెంబర్ 15 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బాపు జన్నించారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మినారాయణ. ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించిన ఆయన సంగీతకారుడిగా, చిత్రకారుడిగా, కార్టునిస్ట్, డిజైనర్ గా పలు రంగాలకు ఎనలేని సేవనందించారు. సాక్షి చిత్రం ద్వారా చలన చిత్ర జీవితాన్ని ప్రారంభించిన బాపు తన కెరీర్ లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపు చివరి చిత్రం శ్రీరామరాజ్యం. ఆయన సినీ జీవితంలో 5 నంది అవార్డులు, రెండు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ముత్యాలముగ్గు చిత్రానికి బాపుకు జాతీయ పురస్కారం లభించింది. 1986 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2013లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగులో సాక్షి, బాలరాజు కథ, ముత్యాల ముగ్గు, భక్త కన్నప్ప, మనవూరి పాండవులు, గోరంత దీపం, తూర్పు వెళ్లే రైలు, వంశవృక్షం, మిస్టర్ పెళ్లాం, రాధా గోపాలం, శ్రీరామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాలకు, హిందీలో హమ్ పాంచ్, సీతా స్వయవర్, అనోఖా భక్త్, బేజుబాన్, వో సాత్ దిన్, ప్యారీ బహ్నా, మొహబ్బత్, మేరా ధరమ్, ప్రేమ్ ప్రతిజ్ఞ చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలరాజుకథ, అందాల రాముడు, ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, శ్రీరామరాజ్యం చిత్రాలకు నంది అవార్డు లభించింది. ముత్యాల ముగ్గు, మిస్టర్ పెళ్లాం చిత్రాలకు జాతీయ అవార్డులను బాపు సొంతం చేసుకున్నారు. -
సోషల్ మీడియాలో బాపు మృతిపై అభిమానుల దిగ్బ్రాంతి
బాపు స్కూల్ నుంచి వచ్చిన వాడినని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని సినీ హీరో నానీ అన్నారు. బాపు వద్ద దర్శకత్వ శాఖలో నానీ పనిచేసిన సంగతి తెలిసిందే. బాపు మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. Rip Bapu garu. A legend rests. What an amazing artistic journey. — Lakshmi Manchu (@LakshmiManchu) August 31, 2014 Bapu gaaru is no more..My first director..My guru..My inspiration.A great artist.An amazing director.A complete human being.Will miss u sir. — Nani (@NameisNani) August 31, 2014 I am very very proud to say that I belong to Bapu school .. Thank you for everything sir. pic.twitter.com/44XD3ua81t — Nani (@NameisNani) August 31, 2014 Oh Sad news, veteran director Bapu, maker of some memorable movies in Telugu, Hindi has passed away, may his soul have peace. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) August 31, 2014 RIP bapu garu. Greatest filmmaker ever. — idlebrain jeevi (@idlebrainjeevi) August 31, 2014 One frame of Bapu garu will tell 100stories, Master!! Pride of Telugu. Rest in peace Legend. — Deepak (@Deepuzoomout) August 31, 2014 Saddened by the demise of dir. Bapu.Admired his work a lot &worked in Radha Kalyanam which got me a lot of awards .A genius. RIP sir — Radikaa Sarathkumar (@realradikaa) August 31, 2014 One of the biggest compliments for any Telugu girl is to be called a Bapu Bomma. Such was his artistry, may God grant peace to his soul. — Ratnakar Sadasyula (@ScorpiusMaximus) August 31, 2014 RIP Bapu garu!!!a great loss for the industry..:( — Priya Mani (@priyamani6) August 31, 2014 Highly shocking to knw that Bapu garu is no more!! :-O! Snehithudi deggaraki vellipoyara appude? Will take more time to digest this news :-( — Kireeti Damaraju (@KirrD) August 31, 2014 Rip legendary director bapu garu... I shall always treasure the paintings that u drew and gave me when I met u for te first time... — soumya bollapragada (@bsoumya26) August 31, 2014 Bapu garu, director of many classics like Mutyalamuggu, is no more. Great loss to Tollywood. RIP. — Jalapathy Gudelli (@JalapathyG) August 31, 2014 very sad to hear about the sudden demise of legendary director bapu garu.... rest in peace... — krishnachaitanya (@kanchetikrishna) August 31, 2014