
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి.