
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
శుక్రవారం రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీ మృతి చెందారు. సాబ్జీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏకి తీవ్రగాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
చదవండి: AP: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment