
'ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం వార్త నా గుండెను ముక్కలు చేసింది' అంటూ అతని మాజీ ప్రియురాలు.. నటి ఎలిజెబెత్ హార్లీ పేర్కొంది. వార్న్ మరణాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఎమెషనల్ అయింది. ఈ సందర్భంగా తన మాజీ ప్రియుడికి కడసారి వీడ్కోలు పలుకుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వార్న్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
''వార్న్ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. అతనితో అనుబంధం విడదీయలేనిది. సూర్యుడు ఎప్పటికి మేఘాల వెనుక దాక్కోవడానికి వెళ్లినట్లుగానే వార్న్ మరణాన్ని ఫీలవుతున్నా.. ఐ మిస్ యూ మై లవ్లీ వార్న్'' అంటూ రాసుకొచ్చింది. ఇక 2007లో మొదటి భార్య సిమోన్‌తో విడాకుల అనంతరం.. నటి ఎలిజెబెత్ హర్లీతో వార్న్ ప్రేమాయణం నడిపాడు. 2011 సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ ఇద్దరు రెండేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2013 డిసెంబర్‌లో వార్న్, హార్లీలు విడిపోయారు.
కాగా వార్న్ మృతిపై పలు సందేహాలు ఉన్నాయంటూ థాయ్ పోలీసులు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్‌పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని తెలిపారు. ఆదివారం థాయ్ అధికారులు వార్న్ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. ఒక వేళ వార్న్‌ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆదివారమే వార్న్ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం స్పిన్ దిగ్గజం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
చదవండి: Shane Warne Death: విషాద సమయంలో ఇలాంటివి అవసరమా.. గావస్కర్‌పై విమర్శలు!
Shane Warne: స్పిన్ మాంత్రికుడి మృతిపై అనుమానాలు.. గదిలో రక్తపు మరకలు..!
Shane Warne: శవ పరీక్షకు వార్న్ భౌతికకాయం.. బోరుమన్న కుమారుడు