నటుడు తారకరత్న మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి నిన్న(శనివారం)రాత్రే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు.
అయితే తన తండ్రిని అలా చలనం లేకుండా ఉండడాన్ని చూసి తారకరత్న కూతురు నిషిక వెక్కివెక్కి ఏడ్చింది. తన తండ్రి ఇక రాడని తెలిసి గుండెలు పగిలేలా రోదించింది. ఈ క్రమంలో కూతుర్ని ఓదార్చుతూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సైతం కన్నీటి పర్యంతం అవడాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ కుటుంబానికి దేవుడు తీరని లోటు మిగిల్చాడని, ఈ బాధను తట్టుకునే శక్తిని వారికి ఆ భగవంతుడు కల్పించాలని ప్రార్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment