
సంచారి విజయ్ (ఫైల్ ఫొటో)
సాక్షి,బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ అకాల మరణంపై టి మేఘనా రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా ద్వారా విజయ్ మృతిపై మేఘనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ అందమైన ఫోటోను షేర్ చేసిన మేఘనా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ‘మనిషిగా, నటుడిగా మీరెంతో అద్భుతమైన వారు. మీరు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.. నిజంగా దేవుడు కఠినాత్ముడు. ఆర్‌ఐపీ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. అంతేకాదు గత ఏడాది జూన్‌లో తన భర్త చిరంజీవి సర్జా మృతిపైవిచారం వ్యక్తం చేసిన సంచార్ విజయ్ పోస్ట్‌ను షేర్ చేశారు. మేఘనా రాజ్ భర్త , హీరో చిరంజీవి సర్జా తీవ్ర గుండెపోటు కారణంగా (202, జూన్ 7న) ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే.
కాగా స్నేహితుడితో కలిసి వెళుతుండగా విజయ్ ప్రమాదానికి గురయ్యారు.తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విజయ్‌ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆయన చని పోయినట్టుగా ప్రకటించారు. మరోవైపు విజయ్ ఆకస్మిక మరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు పలువురుఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నటుడి ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తరువాత కూడా విజయ్ పలువురికి ప్రాణదానం చేశారని సీఎం కొనియాడారు. మరోవైపు బంధువులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికార లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment