Meghana Raj
-
భర్త జయంతి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నటి మేఘన
తన భర్త, దివంగత నటుడు చిరంజీవి బర్త్‌డే సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యింది కన్నడ నటి, ఆయన భార్య మేఘన సర్జా. సోమవారం(అక్టోబర్ 17) చిరంజీవి సర్జా జయంతి. ఈ సందర్భంగా భర్తను తలుచుకుంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే మై హ్యాపినేస్! నా సంతోషానికి కారణం ఎవరు, ఏంటీ అనేది కాదు.. అలాగే ఒకటి రెండు కారణాలు అసలే కాదు. కేవలం నీ నువ్వే. నీ వల్లే నేను నవ్వుతున్నాను మై డియర్ హస్బెండ్ చిరు.. ఐ లవ్ యూ!’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు ఇక ఆమె పోస్ట్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మిమ్మల్ని చూసి ఆయన ఆత్మ గర్వపడుతుంది మేడం, మీరు నిజంగా గొప్ప భార్య’ అంటూ మేఘనాను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే గర్భవతి అయిన మేఘన అక్టోబర్ 22న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఎపుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘనా తన కొడుకు పేరును రాయన్ రాజ్ సర్జాగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
చిరంజీవి పేరు పచ్చబొట్టు వేయించుకున్న మేఘన సర్జా
కన్నడ సూపర్‌స్టార్ చిరంజీవి మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్. తిరిగి తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన ఆమె ప్రస్తుతం పలు సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకోగా అవన్నీ వుట్టి పుకార్లేనని కొట్టిపారేసింది మేఘన. ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉన్న ఆమె చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. భర్త చిరంజీవి సర్జా, కొడుకు రాయన్ పేర్లను మణికట్టుపై టాటూ వేసుకుంది. వారు ఎప్పటికీ తనగుండెలో ఉండిపోతారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) చదవండి: విజయ్ తలపొగరు వల్ల మేము నష్టపోయాం: థియేటర్ యజమాని ఫైర్ 11 ఏళ్లుగా షకీరాతో సహజీవనం, బ్రేకప్.. ఇప్పుడు ఇంకో అమ్మాయితో! -
మళ్లీ పెళ్లి చేసుకోనున్న మేఘనా సర్జా?
కన్నడ స్టార్ చిరంజీవి సర్జా మరణంతో ఎంతగానో కుంగిపోయింది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె కొన్ని నెలల తర్వాత ఓ కుమారుడికి జన్మనిచ్చింది. తన కొడుకులోనే భర్తను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తోందామె. అయితే ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ కొద్దికాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈ రూమర్‌పై స్పందించింది. 'కొందరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరికొందరేమో నా కొడుకును బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమని సూచిస్తున్నారు. మరి నేను ఎవరి మాట వినాలి? నా భర్త చిరంజీవి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు.. ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది ఎప్పుడూ పట్టించుకోకు, నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని చెప్పేవాడు. నేను మళ్లీ పెళ్లి గురించి నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. రేపు ఏం జరుగుతుంది? కొద్ది రోజులయ్యాక నా జీవితం ఎలా ఉంటుంది? అని నేనెప్పుడూ ఆలోచించలేదు' అని మేఘన చెప్పుకొచ్చింది. కాగా చిరంజీవి సర్జా, మేఘనా రాజ్ సుమారు పదేళ్లు ప్రేమలో మునిగి తేలాక 2018 మే 2న పెళ్లాడారు. మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో మరణించారు. వీరికి రాయన్ రాజ్ సర్జా అనే కొడుకు పుట్టాడు. మేఘన నటించిన బుద్ధివంత 2 సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అలాగే ఆమె ఓ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. చదవండి: సింపుల్‌గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే! ఓటీటీలో రాజ్‌కుమార్ రావు హిట్, స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే! -
ఇంతకంటే మంచి సమయం లేదు..ఇది మన కల: మేఘనా రాజ్
సాక్షి, ముంబై: నటి మేఘనా రాజ్ తాను మళ్లీ నటించబోతున్నట్టు ప్రకటించింది. మేఘనా భర్త, దివంగత కన్నడ నటుడు చిరంజీవి సర్జా సన్నిహితుడు పన్నగా భరణ నిర్మిస్తున్న సినిమా ద్వారా మళ్లీ మూవీల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ అక్టోబర్ 17, ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ సందర్భంగా పన్నగ భరణ, నూతన దర్శకుడు విశాల్‌తో చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేఘనా లీడ్ రోల్లో నటించనుంది. చదవండి: Samantha: అంత పవర్ ఎలా ... మీరంటే భయం అందుకే : సమంత ఈ రోజు నీ పుట్టిన రోజు, ఇది మన కల... ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఇంతకంటే మంచి సమయం లేదు అంటూ తన భర్త రెండో జయంతిని పురస్కరించుకుని ఈ ప్రకటన చేసింది మేఘనా. మన కలని బహుమతిగా ఇచ్చేందుకు ఇంతకంటే మంచి టీం కూడా తనకు దొరకదని ఆమె వ్యాఖ్యానించింది. అంతేకాదు నిర్మాత పన్నగా లేకపోతే తాను ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించనని కూడా తెలిపింది. కాగా మేఘన భర్త, కన్నడ హీరో చిరు సర్జా 2020, జూన్ 7న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికే గర్భవతి అయిన మేఘన అక్టోబర్ 22న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఎపుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మేఘనా గత నెలలో తన కొడుకు పేరును రాయన్ రాజ్ సర్జాగా రివీల్ చేసింది. అంతేకాదు కొడుకుతో కలిసి జరుపుకున్న దసరా వేడుకల ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసింది. మరోవైపు అక్టోబర్ 22 న రాయన్ ఫస్ట్ బర్తడే జరుపుకోనున్నాడు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
నటి మేఘనా రాజ్ మళ్లీ పెళ్లి..? స్పందించిన బిగ్‌బాస్ విన్నర్
నటి మేఘన రాజ్ కన్నడ, మలయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయికలలో ఒకరు. ‘కాదల్ సొల్లా వందేన్’, 'నంద నందిత' వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలే. అయితే గతేడాది ఆమె భర్త కన్నడ స్టార్ హీరో చిరంజీవీ సర్జా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. ఆ సమయంలో నటి నాలుగు నెలల గర్భవతి. అనంతరం ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. అయితే చిరు మరణించిన దాదాపు ఏడాది తర్వాత మేఘన, కన్నడ ‘బిగ్‌బాస్ 4’ విన్నర్ ప్రథమ్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ప్రథమ్ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. ఆయన యూట్యూబ్‌లోని ఓ వీడియోని షేర్ చేశాడు. ‘వ్యూస్, డబ్బు కోసం ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ వీడియోను పట్టించుకోలేదు కానీ దాదాపు 2.7 లక్షలపైగా దీన్ని చూశారు. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ఇంకొకరు ఇలాంటివి పెట్టకుండా ఉంటారు’ అని ఆయన తెలిపాడు. (చదవండి: Keerthy Suresh: కమెడియన్‌కి జోడీగా కీర్తీ సురేష్..?) కాగా, మేఘనా రాజ్ ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై స్పందించలేదు. కానీ తన దివంగత భర్త చిరంజీవి కోరిక మేరకు నటనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నటులు ఇద్దరూ దాదాపు పది సంవత్సరాలు ప్రేమించుకొని 2018లో వివాహం చేసుకున్నారు. భర్త అకాల మరణంతో నటి ఎంతో కుంగిపోయింది. ఈ తరుణంలో ఇటువంటి పుకార్లు రావడం ఆమెను ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. చిరు మరణం అనంతరం తరచుగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భర్తపై ప్రేమని వ్యక్తం చేస్తుంటుంది. (చదవండి: కోర్టుపై నమ్మకం పోయింది: కంగనా రనౌత్) ನಾನ್ ನೋಡಿದ್ರೂ ignore ಮಾಡೋಣ ಅಂತಿದ್ದೆ!! But just one DAy ಲಿ 2.70 lakh views ಆಗಿದೆ!! Views ಆಗ್ಲಿ,#ದುಡ್ಡಾಗ್ಲಿ ಅಂತ ಈ ಮಟ್ಟಕ್ಕೆ ಈ youtube channel ಇಳಿದಾಗ ಸ್ವಲ್ಪ ಕಾನೂನಾತ್ಮಕವಗಿ ನೋಡಬೇಕಗುತ್ತದೆ!@meghanasraj ಇಂತಹ ಒಂದುchannel ನ ನೀವು ಕಾನೂನಾತ್ಮಕವಗಿ delete ಮಾಡ್ಸಿದ್ರೆ ಇನ್ನಷ್ಟು ಜನ ಎಚ್ಚೆತ್ತುಕೊಳ್ತರೆ! pic.twitter.com/mJUSH5Nxrb — Olle Hudga Pratham (@OPratham) September 14, 2021 -
Chiranjeevi Sarja Son: బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం
-
బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం
సాక్షి, ముంబై: దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా ఒక అందమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరు, మేఘనా తనయుడు రాయన్ రాజ్‌తో ఆడుకుంటూ, ముద్దాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భార్య ప్రేరణతో కలిసి రాయల్ రాజ్‌ను ఎత్తుకున్న ఫోటోను, అలాగే బుజ్జి రాయన్ కాలితో ధృవను తన్నుతున్న ఫోటో కూడా యాడ్ చేశారు. దీనిపై తల్లి మేఘనా రాజ్ భావోద్వేగంతో స్పందించారు. అటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది. సోదరుడు అకాల మరణం తరువాత మేఘనను అక్కున చేర్చుకొని అన్నీ తానే అయి చూసుకున్నాడు ధృవ. ఈ క్రమంలో భర్తలేని లోటు తెలియనివ్వకుండా మేఘనాకు ఘనంగా సీమంతం కూడా జరిపించాడు. అంతేకాదు తన అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ రూ. 10 లక్షల విలువ చేసే వెండి ఉయ్యాలను బహుమతిగా ఇవ్వడం అప్పట్లో విశేషంగా నిలిచింది. 2018లో చిరు సర్జా, నటి మేఘనా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో పెళ్లైన రెండేళ్లకే చిరు సర్జా మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గతేడాది జూన్ 7న తీవ్ర గుండెపోటుతో 35 ఏళ్లకే కన్నుమూశారు. అప్పటికే గర్భవతిగా ఉన్న మేఘనాను ఈ సంఘటన హతాశురాలిని చేసింది. అయితే అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషాదంనుంచి మేఘనకు కాస్తంత ఊరట లభించింది. తరచూ తన భావాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే మేఘనా తన చిన్నారి, జూనియర్ చిరు పేరును ‘‘రాయన్ రాజ్’’ అంటూ ఇటీవల ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశారు. కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘనా, చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
జూనియర్ చిరు పేరు వెల్లడించిన మేఘనా రాజ్
Meghana Raj Son Name Revealed: దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ తన కొడుకు పేరును రివీల్ చేసింది. తన బాబుకు రాయన్ రాజ్ సర్జా అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో భర్తతో కలిసి ఉన్న వీడియో క్లిప్పింగ్‌లను యాడ్ చేయడంతో పాటు కొడుకు ఆడుకుంటున్నట్లుగా చూపించింది. అనంతరం జూనియర్ చిరు పేరును రాయన్ అని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘనా.. చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలో ప్రేమలో పడ్డ ఈ ఇద్దరూ 2018లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే మేఘనను ఒంటరిని చేస్తూ చిరు సర్జా గతేడాది జూన్ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న ఆమె అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
దేవుడు చాలా కఠినాత్ముడు: మేఘనా రాజ్ ఎమోషన్
సాక్షి,బెంగళూరు: కన్నడ నటుడు సంచారి విజయ్ అకాల మరణంపై టి మేఘనా రాజ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా ద్వారా విజయ్ మృతిపై మేఘనా భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ అందమైన ఫోటోను షేర్ చేసిన మేఘనా ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ‘మనిషిగా, నటుడిగా మీరెంతో అద్భుతమైన వారు. మీరు ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు.. నిజంగా దేవుడు కఠినాత్ముడు. ఆర్ఐపీ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. అంతేకాదు గత ఏడాది జూన్‌లో తన భర్త చిరంజీవి సర్జా మృతిపైవిచారం వ్యక్తం చేసిన సంచార్ విజయ్ పోస్ట్‌ను షేర్ చేశారు. మేఘనా రాజ్ భర్త , హీరో చిరంజీవి సర్జా తీవ్ర గుండెపోటు కారణంగా (202, జూన్ 7న) ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. కాగా స్నేహితుడితో కలిసి వెళుతుండగా విజయ్ ప్రమాదానికి గురయ్యారు.తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విజయ్ను రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి ఆయన చని పోయినట్టుగా ప్రకటించారు. మరోవైపు విజయ్ ఆకస్మిక మరణంపై పరిశ్రమకు చెందిన పెద్దలు పలువురుఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప నటుడి ఆకస్మిక మరణంపై విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తరువాత కూడా విజయ్ పలువురికి ప్రాణదానం చేశారని సీఎం కొనియాడారు. మరోవైపు బంధువులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ప్రభుత్వ అధికార లాంఛనాలతో విజయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. -
చిరంజీవి సర్జా తొలి వర్థంతి, మేఘన ఎమోషనల్
కన్నడ స్టార్ హీరో, దివంగత నటుడు చిరంజీవి సర్జా మృతి చెంది నేటికి ఏడాది. గతేడాది జూన్ 7వ తేదీన చిరు సర్జా గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం(జూన్ 7) ఆయన మొదటి వర్థంతి సందర్భంగా ఆయన భార్య, నటి మేఘనా రాజ్ ఓ పోస్టు షేర్ చేశారు. చిరు, మేఘనాలు మాట్లాడుకుంటుండగా ప్రేమతో ఆమెను చూస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీనికి మేఘన ‘మన ప్రేమ నాది’ అంటు ఎమోషనల్ క్యాప్షన్‌తో హార్ట్ ఎమోజీని జోడించి అభిమానులను, నెటిజన్లను కదిలించారు. తన పోస్టుపై ప్రముఖ నటి, మేఘన స్నేహితురాలు నజ్రీయా నజీంతో పాటు పలువురు నటీనటులు స్పందించారు. కాగా చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘన అయిదు నెలల గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో జూనియర్ సర్జాకు ఆమె జన్మనిచ్చింది. అప్పటి నుంచి అతడికి సంబంధించిన ప్రతి వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్నారు. అంతేగాక చిరు సర్జాతో తనకున్న జ్ఞాపకాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనవుతున్నారు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
అరుదైన ఫోటోను షేర్ చేసిన మేఘనా రాజ్
సాక్షి, బెంగళూరు : కన్నడ నటి మేఘనా రాజ్ తన కొడుకు చిరు(సింబా) అరుదైన ఫోటోలను షేర్ చేసింది. గత కొన్ని రోజులు క్రితం మేఘనా తన చిన్నారి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో జూనియర్ చిరు ఎల్లో టీషర్ట్ ధరించి ఉన్నాడు. అయితే చిరంజీవి సర్జా అభిమానులు ఈ ఫోటోను, చిరంజీవి, మేఘనాలతో కొలైడ్ చేసి అపురూపంగా తీర్చిదిద్దారు. ఇందులో ముగ్గురూ పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు. ఈ ఫోటోను మేఘనా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. కాగా చిరంజీవి-మేఘనాలు 2018లో మేలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూన్ 7న చిరు సర్జా గుండెపోటుతో మరణించాడు. ఆ సమయంలో 5 నెలల గర్భవతిగా ఉన్న మెఘనా రాజ్ గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడి చిరునవ్వులో, కళ్లలో, కదలికలో.. ఇలా అన్నింటిలోనూ తన భర్తను చూసుకుంటున్నానని పేర్కొంది. 36 ఏళ్ల వయసులో చిరంజివి సర్జా గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిరంజీవి సర్జా 'వాయుపుత్ర' చిత్రంతో 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. సంహార, ఆద్య, ఖాకీ, సింగ, అమ్మా ఐ లవ్ యూ, ప్రేమ బరాహ, దండం దశగుణం, వరదనాయక వంటి పలు సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. పదేళ్ల కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. చదవండి : జూనియర్ 'చిరు'ను పరిచయం చేసిన మేఘనా భావోద్వేగం: కుమారుడిని ఎత్తుకున్న చిరు సర్జా! -
ఐ లవ్ యూ.. తిరిగొచ్చేయ్: చిరంజీవి సర్జా భార్య
దివంగత నటుడు చిరంజీవి సర్జా జ్ఞాపకాల సుడిగుండంలో నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతోంది అతడి భార్య మేఘనా రాజ్. భర్త చనిపోయిన కొద్ది రోజులకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఈఫిల్ టవర్ ముందు చిరుతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. తిరిగొచ్చేయ్..' అంటూ ఎమోషనల్ అయింది. ఇది చూసిన అభిమానులు నిజంగానే చిరు మళ్లీ వస్తే బాగుండు అని, కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి మనందరికీ తీరని అన్యాయం చేశాడని కామెంట్లు చేస్తున్నారు. కాగా చిరంజీవి సర్జా గతేడాది జూన్ 7న గుండెపోటుతో బెంగళూరులో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న మేఘనా రాజ్ అక్టోబర్‌లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడి చిరునవ్వులో, కళ్లలో, కదలికలో.. ఇలా అన్నింటిలోనూ తన భర్తను చూసుకుంటున్నానని పేర్కొంది. కాగా చిరంజీవి సర్జా 'వాయుపుత్ర' చిత్రంతో 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. సంహార, ఆద్య, ఖాకీ, సింగ, అమ్మా ఐ లవ్ యూ, ప్రేమ బరాహ, దండం దశగుణం, వరదనాయక వంటి పలు సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. పదేళ్ల కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నాడు. View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) చదవండి: బర్త్‌డే పార్టీ!: మీ సోదరుడు చనిపోయాడు, గుర్తుందా? భావోద్వేగం: కుమారుడిని ఎత్తుకున్న చిరు సర్జా! -
జూనియర్ 'చిరు'ను పరిచయం చేసిన మేఘనా
సాక్షి, బెంగళూరు : కన్నడ నటి మేఘనా రాజ్ మొదటిసారిగా తన కొడుకును అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ చిరు(సింబా)అంటూ చిన్నారి పేరును ప్రకటించారు. తమ జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలతో ఒక నిమిషం పాటు నిడివి ఉన్న వీడిమోను మేఘనా షేర్ చేశారు. అక్టోబర్ 22, 2017న దివంగత నటుడు చిరంజీవి-మేఘనాల ఎంగేజ్మెంట్తో వీడియో ప్రారంభం అవుతుంది. సరిగ్గా మూడేళ్ల తర్వాత అదే రోజున 2020లో మేఘనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 'నేను పుట్టకముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానించారు. మొదటిసారి మిమ్మల్ని కలుసుకుంటున్న తరుణంలో మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు..నేను మీ జూనియర్ సీ' అంటూ మేఘన తన కొడుకును ఇంట్రడ్యూస్ చేశారు. ఎంతో ఎమెషనల్‌గా సాగే ఈ వీడియోను నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే వ్యూస్ వచ్చాయి. కాగా చిరంజీవి-మేఘనాలు 2018లో మేలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది జూన్ 7న చిరు సర్జా గుండెపోటుతో మరణించాడు. అప్పటికే 5 నెలల గర్భవతిగా ఉన్న మెఘనా రాజ్ గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు. 36 ఏళ్ల వయసులో చిరంజివి సర్జా గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చదవండి : (భర్త కటౌట్‌తో నటి సీమంతం) (నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: మేఘనా రాజ్) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
భావోద్వేగం: కుమారుడిని ఎత్తుకున్న చిరు సర్జా!
కన్నడ నటి మేఘనా రాజ్‌కు ఓ అభిమాని అరుదైన బాహుమతి ఇచ్చింది. దివ్య అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఇచ్చిన ఈ బాహుమతిని చూసి మేఘనాతో పాటు చిరంజీవి సర్జా అభిమానులు సైతం భావోద్వేగానికి లోనవుతున్నారు. కాగా గతేడాది మేఘనా పడ్డంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరచూ తన కుమారుడికి సంబంధించి ఫొటోలను షేర్ చేస్తూంటారు. ఈక్రమంలో ఆమె కుమారుడిని ఎత్తుకుని నవ్వుతున్న ఓ షాడో ఫొటోను ఇటీవల షేర్ చేశారు. ఇక ఈ ఫొటోను దివ్య అనే అభిమాని మేఘనా స్థానంలో చిరు సర్జా ఫొటోను ఎడిట్ చేసి శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి ‘తండ్రి ప్రేమ ఎప్పుడూ కుమారుడి హృదయంలో ముద్రించబడి ఉంటుంది’ అంటూ మేఘనాను ట్యాగ్ చేసింది. (చదవండి: మళ్లీ నా బిడ్డను చూస్తున్నట్టే ఉంది!) ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కుమారుడిని ఎత్తుకుని ఉన్న ఈ ఫొటోపై సర్జా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక దీనిపై మేఘనా సైతం స్పందిస్తూ భావోద్యేగానికి లోనయ్యారు. ఇంతటి అమూల్యమైన బహుమతినిచ్చినందుకు సదరు అభిమానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా చిరంజీవి-మేఘనాలు 2018లో మేలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది జూన్ 7న చిరు సర్జా గుండెపోటుతో మరణించాడు. ఇక అప్పటికే 5 నెలల గర్భవతిగా ఉన్న మెఘనా రాజ్ గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు. (చదవండి: మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!) View this post on Instagram A post shared by chiru meghana forever (@_divya.33) -
చిరంజీవి సర్జా ఇంట చేదు వార్త..
బెంగళూరు: నటి, దివంగత హీరో చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ కరోనా బారిన పడ్డారు. వారి చిన్నారి కుమారుడికి కూడా కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని మేఘనా రాజ్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ మేరకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం నోట్ షేర్ చేశారు. ‘‘హలో.. మా అమ్మానాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది... గత కొన్ని వారాలుగా మమ్మల్ని కలిసిన వారు కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం.. ప్రస్తుతం మేం చికిత్స పొందుతున్నాం.. చిరు అభిమానులకు ఓ విజ్ఞప్తి.. జూనియర్ చిరు ఆరోగ్యం బాగుంది. నేనెల్లప్పుడూ తనతోనే ఉంటున్నా. దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు.. మహమ్మారిపై యుద్ధంలో మా కుటుంబం గెలుపొందుతుంది. వైరస్‌ను జయిస్తాం’’ అని మేఘన పేర్కొన్నారు. కాగా సౌతిండియా సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా(36) జూన్ 7న గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. ఇక అప్పటికే గర్భవతి అయిన చిరు భార్య మేఘనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అయితే భర్త భౌతికంగా దూరమైనా, తన మనసులో ఎప్పుడూ బతికే ఉంటారంటూ ధైర్యం కూడదీసుకున్న ఆమె, భర్త కటౌట్ పక్కన పెట్టుకుని సీమంతం వేడుక చేసుకున్నారు. అక్టోబరులో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.(చదవండి: ప్రేమ పెళ్లి: దారుణంగా హింసించేవాడు..) View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) -
మళ్లీ నా బిడ్డను చూస్తున్నట్టే ఉంది!
సాక్షి, బెంగళూరు : దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. దక్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో బాబు పుట్టాడని చిరంజీవి సర్జా సోదరుడు, నటుడు ధ్రువ సర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తమ అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ చెప్పకొస్తున్న ధ్రవ "బేబీ బాయ్, జై హనుమాన్" అంటూ ఆనందం ప్రకటించారు. స్వీట్లు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే తన బిడ్డకు వెండి ఉయ్యాల కావాలన్న అన్న కోరికను నేరవేర్చానని ధ్రువ తెలిపారు. బాబుకి ఏపేరు పెట్టాలన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. చాలా సంతోసంగా ఉంది..మళ్లీ నా చిరంజీవిని చూస్తున్నట్టు ఉందంటూ చిరంజీవి సర్జా తల్లి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ రోజు మేఘనా, చిరంజీవి నిశ్చితార్థం చేసుకున్న రోజని కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. కాగా చిరంజివి సర్జా 36 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూయడం అటు కుటుంబ సభ్యులను, ఇటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే చిరంజీవి చనిపోయే సమయానికే అతని భార్య మేఘనా రాజ్ గర్భవతి. ఇటీవల మేఘనా బేబీ షవర్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
లవ్ యూ.. మై వరల్డ్: మేఘన
బెంగళూరు: కన్నడ నటుడు చిరంజీవి సర్జా జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి మేఘనా రాజ్ చిరును తలచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘హ్యాపీ బర్త్‌డే, మై వరల్డ్! అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను!’’ అని భర్త ఫొటో షేర్ చేసి ఉద్వేగపూరిత క్యాప్షన్ జతచేశారు. సంప్రదాయ వస్త్రధారణలో చిరునవ్వులు చిందిస్తున్న చిరంజీవి ఫొటో చూసి ఆయన ఫ్యాన్స్ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. త్వరలోనే చిరు తన బిడ్డ రూపంలో మళ్లీ తిరిగి వస్తారని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటూ మేఘనకు సూచిస్తున్నారు.(చదవండి: మేఘనా సర్జా సీమంతం వేడుక) కాగా సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా జూన్ 7న బెంగళూరులో మరణించిన విషయం విదితమే. 36 వయస్సులోనే గుండెపోటుతో ఆయన కన్నుమూయడం అందరినీ తీవ్ర వేదనకు గురిచేసింది. ఇక అప్పటికే గర్భవతి అయిన చిరు భార్య మేఘనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అయితే భర్త భౌతికంగా దూరమైనా, తన మనసులో ఎప్పుడూ బతికే ఉంటారంటూ ధైర్యం కూడదీసుకున్న ఆమె, ఇటీవల భర్త కటౌట్ పక్కన పెట్టుకుని సీమంతం వేడుక చేసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
భర్త కటౌట్‌తో నటి సీమంతం
హీరో అర్జున్ మేనల్లుడు, నటుడు అయిన చిరంజీవి సర్జా కొద్ది నెలల క్రితం చనిపోయిన సంగతి తెలిసిందే. మరణించే నాటికే అతడి భార్య గర్భవతి. ఈ క్రమంలో చిరంజీవి సర్జా సతీమణి మేఘన సీమంతం వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. భర్త జ్ఞాపకాలతో బ్రతుకున్న మేఘన చిరంజీవి స్టైల్‌గా నుంచున్నట్లు కటౌట్ తయారుచేయించి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. దూరం నుంచి చూస్తే చిరంజీవి నిజంగానే భార్య పక్కను నిలబడినట్లు ఉండటంతో కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మేఘన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!) ఈసందర్భంగా ‘నాకెంతో ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు. చిరు.. నువ్వు ఇలాగే కదా ఈ వేడుక జరగాలని కోరుకున్నావు. నువ్వు కోరుకున్న విధంగానే జరిగింది. ఇకపైనా జరుగుతుంది. ఐ లవ్ యూ బేబీ మా’ అని పేర్కొన్నారు. మేఘన షేర్ చేసిన ఫొటోలు చూసిన అభిమానులు భావోద్వేగానికి గురి అవుతున్నారు. ‘చిరంజీవి కటౌట్ చూస్తుంటే ఆయన నిజంగా వేడుకలో ఉన్నట్లే ఉంది’, ‘మేడమ్ మీకు అంతా మంచే జరగాలి. అలాగే మీరు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నాం’ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి సర్జా కన్నడలో సుమారు 22 సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఆయన నటి మేఘనా రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఛాతీ నొప్పితో ఇంట్లోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే మేఘన గర్భవతిగా ఉన్నారు. తన భర్త సజీవంగా లేకపోయినా... ఆయన జ్ఞాపకాలు తనతోనే జీవితాంతం ఉంటాయని మేఘన పేర్కొన్నారు. -
ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తాం: అర్జున్
బెంగళూరు: కన్నడ హీరో చిరంజీవి సర్జా(39) మృతిపై యాక్షన్ కింగ్ అర్జున్‌తో సహా కుటుంబ సభ్యులంతా ఇప్పటికీ శోకసంద్రంలో మునిగిపోయారు. చిరంజీవి సర్జా అర్జున్‌కు మేనల్లుడు. చిరంజీవితో అర్జున్‌కు ఎంతో సానిహిత్యం ఉండేది. అంతేగాక చిరంజీవి అంతిమ కర్మలు ముగిసే వరకు కూడా అర్జున్ అక్కడే ఉన్నారు. కాగా జూన్ 7న చిరంజీవి సర్జా ఆకస్మికంగా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బెంగుళూరులో ఉన్న ఫాంహౌజ్‌లో ఈనెల 8న కుటుంబ సభ్యుల మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా శుక్రవారం చిరంజీవి సోదరుడు ధృవ్ సర్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సర్జా కుటుంబ సభ్యులను అందరి చిత్రాలతో వీడియోను రూపొందించి ‘అన్నయ్య లవ్ యూ సోమచ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో అర్జున్ వాయిస్ వినిసిస్తూ..తన అభిమాన మేనల్లుడికి వీడ్కోలు చెబుతూ, అతన్ని చాలా మిస్ అవుతున్నానని అర్జున్ చెప్పారు. (మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!) ‘నిరాశ చెంది, కోపంతో నువ్వు కొన్ని రోజులు దూరంగా వెళ్లేవాడివి. కానీ అది వేరు. ఇప్పుడు నువ్వు మళ్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి, మా అందరికి దూరం అయ్యావు. నేను కళ్లు మూసిన ప్రతిసారి నీ చిరునవ్వు కనిపిస్తోంది. కొద్దిరోజుల్లో మేము నిన్ను మరిచిపోతాం అంటే అది అబద్దం. నీ మరణం మమ్మల్నీ ఎంతగానో గాయపరిచింది. నువ్వు ఎప్పటికీ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతావు. మీ తాత నీకు చిరంజీవి అని పేరు పెట్టారు, అది నిజమే. నీ మాటలు, చిరునవ్వు, జ్ఞాపకాలు, మా బంధం చిరంజీవిగా నిలిచిపోతాయి.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. (‘నువ్వు లేకుండా ఉండలేం.. వచ్చేయ్’) View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) on Jun 16, 2020 at 8:27pm PDT కాగా చనిపోయిన తన మేనల్లుడిని తన బిడ్డలో చూసుకోవాలన్న కోరికను అర్జున్ వ్యక్తపరిచాడు. ‘దయచేసి నువ్వు నీ పిల్లల రూపంలో మళ్లీ మా వద్దకు తిరిగి వచ్చేయ్. చిన్న పిల్లావాడి చిరునవ్వులో మీ ప్రతిబింబాన్ని చూసుకుంటాం. చిరు.. నిన్ను మేము చాలా ప్రేమిస్తున్నాము. మేము ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తాం. ప్రేమతో నీ కుటుంబం. అభిమానులు అంటూ అర్జున్కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా 2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను చిరంజీవి వివాహమాడారు.ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. (కన్నీటిపర్యంతమైన అర్జున్) -
మన బిడ్డ రూపంలో నిన్ను తీసుకొస్తా!
‘‘నా చిరూ.. ఎప్పటికీ నువ్వు నా చిరూవే. నీ గురించి చాలా చాలా చెప్పాలని ఉంది. ప్రపంచంలో ఎన్ని పదాలు ఉన్నా నువ్వు నాకెంత ముఖ్యమో చెప్పడానికి సరిపోవడంలేదు. నా స్నేహితుడు, నా ప్రేమికుడు, నా భాగస్వామి, నా కుమారుడు, నా ఆత్మవిశ్వాసం, నా భర్త... వీటన్నింటికంటే నువ్వు నాకు చాలా ఎక్కువ’’ అంటూ మేఘనా రాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త చిరంజీవి సర్జాని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు. నటుడు అర్జున్ మేనల్లుడు, హీరో చిరంజీవి సర్జా రెండు వారాల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. 2018లో చిరంజీవి సర్జా, కథానాయిక మేఘనా రాజ్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మేఘనా నాలుగు నెలల గర్భవతి. గురువారం తన మనోభావాలను ఈ విధంగా పంచుకున్నారామె. ‘‘నా ఆత్మలో నువ్వు సగభాగం. నేను తలుపువైపు చూసిన ప్రతిసారీ ‘ఇంటికొచ్చేశా’ అంటూ నువ్వు అరవడం చూడాలనుకుంటా.. కానీ ఎక్కడ? నిన్ను ఇక ఎప్పటికీ తాకలేను అనే ఫీలింగ్ నా హృదయాన్ని ముక్కలు చేస్తోంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకు ఓ చిహ్నం. ఈ బిడ్డ రూపంలో నిన్ను ఈ భూమ్మీదకు తీసుకురావడానికి ఆసక్తిగా ఉన్నాను. నీ చిరునవ్వుని వినడానికి ఎదురు చూస్తున్నా. నేను శ్వాసించినంత కాలం నువ్వు బతికే ఉంటావ్. నువ్వు నాలో ఉన్నావ్. ‘ఐ లవ్ యు’’ అంటూ భర్తతో ఉన్న ఈ ఫొటోను షేర్ చేశారు మేఘనా రాజ్. తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘనా.. చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్‌లీలా’ వంటి చిత్రాల్లో నటించారు. ఆ సినిమాల సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్నారు. -
నువ్వు నాలోనే ఉన్నావు.. ఐ లవ్ యూ
సాక్షి, బెంగళూరు: కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం నుంచి అతని కుటుంబం ఇంకా కోలుకోలేపోతోంది. అతడు ఈ లోకం నుంచి నిష్క్రమించాడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చిరంజీవి సతీమణి మేఘనా రాజ్ గురువారం సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖ పంచుకున్నారు. "చిరు.. నీకు ఎన్నో విషయాలు చెప్పాలనుంది. కానీ ఎంత ప్రయత్నించినా దాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. నువ్వు నాకు ఎంత ముఖ్యమనేది ప్రపంచంలో ఏదీ వర్ణించలేదు. స్నేహితుడిగా, ప్రేమికుడిగా, జీవిత భాగస్వామిగా, చంటి పిల్లాడిగా, నా ధైర్యంగా, నా భర్తగా.. అసలు వీటన్నింటి కన్నా ఎక్కువే. నువ్వు నా ప్రాణం. కానీ ఏదో అర్థం కాని బాధ నన్ను ప్రతీక్షణం చిత్రవధ చేస్తోంది. నువ్వు లేవని గుర్తొస్తున్న ప్రతిక్షణం నా మనసు కుంగిపోతుంది. వేలాదిసార్లు చస్తున్నంత నరకంగా ఉంది. కానీ నా చుట్టూరా ఏదో మంత్రం వేసినట్లు అనిపిస్తోంది. నేను దిగులుపడ్డ ప్రతిసారి నన్ను సంరక్షించేందుకు నువ్వు నా చుట్టూనే ఉన్నావనిపిస్తోంది." (కన్నీటిపర్యంతమైన అర్జున్) "నన్ను ఎంతగానో ప్రేమించావు.. ఎప్పటికీ నా చేయి వదలనంటూ మాటిచ్చావు. కానీ ఏం చేశావు? మన ప్రేమకు గుర్తుగా నాకు పాపాయిని ఇస్తున్నందుకు నీకు చిరకాలం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను. మన బిడ్డగా నిన్ను మళ్లీ భూమిపైకి తీసుకువచ్చేందుకు నేను తహతహలాడుతున్నాను. నీతో కలిసి బతికేందుకు ఎదురు చూస్తున్నాను. నీ నవ్వు చూసేందుకు నేనాగలేకున్నాను.. నీ నవ్వులతో గదంతా వెలుగులు విరజిమ్మడం కోసం ఎదురుచూస్తున్నా.. నేను నీకోసం ఎదురుచూస్తూనే ఉంటా.. అలాగే నువ్వు నాకోసం ఎదురుచూస్తూ ఉండు.. అయినా నా ఊపిరి ఆగిపోయేవరకు నువ్వు బతికే ఉంటావు. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. ఐ లవ్ యూ.." అంటూ రాసుకొచ్చారు. చిరంజీవి సర్జా 2018 మే 2న మేఘనా రాజ్‌ను వివాహమాడారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా చిరంజీవి సర్జా జూన్ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. (తండ్రి కాబోతున్న చిరంజీవి సర్జా.. అంతలోనే) -
నటుడు చిరంజీవి సర్జా కన్నుమూత
కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో కన్నుమూశారు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా. ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి సర్జా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ చిరంజీవి సర్జా మృతి చెందారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య మేషునా రాజ్‌తో చిరంజీవి సర్జా గత మూడు, నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని వైద్యులు తెలిపారు. మృతదేహం నుంచి కరోనా పరీక్షల కోసం నమూనాలను సేకరించారు. 1980 అక్టోబరు 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా కెరీర్ తొలినాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ‘ఆకే’, ‘సింగా’, ‘సంహారా’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన చిరంజీవి సర్జా యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన 19 సినిమాల్లో హీరోగా నటించారు. గత ఏడాది చిరంజీవి సర్జా నటించిన నాలుగు సినిమాలు (సింగా, ఖాకీ, ఆద్యా, శివార్జున) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఆయన హీరోగా కమిటైన నాలుగు సినిమాల్లో ఒక చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా, మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. 2018 మే 2న నటి మేఘనా రాజ్‌ను వివాహమాడారు చిరంజీవి సర్జా. భర్త మరణంతో తీవ్రశోకంలో మునిగిపోయారు మేఘనా రాజ్. పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి సర్జా మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సోమవారం ఉదయం చిరంజీవి సర్జా స్వగ్రామం తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలు జరుగుతాయి. -
హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం
బెంగుళూరు: కన్నడ చిత్రసీమంలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో ఆదివారం హఠాన్మరణం చెందారు. యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఈయన మేనల్లుడు. జూన్ 6న చిరంజీవి సర్జాకు శ్వాసకోస సమస్య రావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆయన వయసు తక్కువే కావడంతో ఇది హృదయ సంబంధ వ్యాధి అని ఎవరూ అనుకోలేదు. కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన చిరంజీవికి తీవ్రమైన ఛాతీ నొప్పి కూడా వచ్చినట్టు తెలిసింది. దాంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. చిరంజీవి సర్జా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆకే, సింగా, సంహారా వంటి విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటించారు. చిరంజీవికి నటి మేఘనా రాజ్‌తో 2018లో వివాహం జరిగింది. ఇక ఆయన సోదరుడు ధ్రువ సర్జా కూడా సినిమా ఇండస్ట్రీలోనే నటుడిగా ఉన్నారు. భర్త ఆకస్మిక మృతితో మేఘనా రాజ్ కుప్పకూలిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు హీరో మృతిపై సంతాపం తెలియజేస్తున్నారు. సర్జా– మేఘన జంట -
1979లో ఏం జరిగింది?
కర్నాటకలో 1979లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిందాగ్యాంగ్– ది రియల్ గ్యాంగ్’. దేవరాజ్, మేఘనా రాజ్ హీరో హీరోయిన్గా నటించారు. కృష్ణచంద్ర, లోకి, భరత్ రాజ్ తలికోట్, యువరాజ్ కీలక పాత్రలు పోషించారు. మహేష్ దర్శకత్వంలో ఎస్. మంజు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మా ‘జిందా గ్యాంగ్’ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నగేష్ వి. ఆచార్య అందించిన విజువల్స్, గ్రాండియర్ విజువల్స్, శ్రీధర్ వి. సంబ్రం మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయి. దేవరాజ్ నటనతో సినిమాను నిలబెట్టారు. మేఘనా రాజ్ అందం, అభినయంతో ఆకట్టుకుంటారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. చలపతి. -
హీరోయిన్స్ ఇన్ యాక్షన్
మేఘనా రాజ్, రాగిణి త్రివేది, దీప్తి, సంయుక్త వర్నాడ్ ముఖ్య పాత్రల్లో మహేశ్ తెరకెక్కించిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై సి. పుట్టు స్వామి నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఏ’ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత పుట్టు స్వామి మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హీరోయిన్లు మేఘన, రాగిణి, దీప్తి, సంయుక్తల యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నెలాఖరున సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీధర్. వి. సంబ్రమ్. -
రియల్ దండుపాళ్యం
1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. రాగిణీ ద్వివేది, మేఘనా రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ ముఖ్య తారలుగా నారాయణ భట్ సమర్పణలో మహేశ్ దర్శకత్వంలో రూపొందింది. సి.పుట్టుస్వామి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. మహేశ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో వచ్చిన ‘దండుపాళ్యం’ చిత్రకథకు, మా ‘రియల్ దండుపాళ్యం’ కథకు ఏమాత్రం సంబంధం లేదు. శ్రీధర్ ఈ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. ‘‘ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఎదురైన సమస్య ను ఎలా ఎదుర్కొన్నారు? అన్నదే కథ. ఈ నెలాఖరున విడుదల చేయనున్నాం’’ అన్నారు పుట్టుస్వామి. -
ఘనంగా మూడుముళ్ల బంధం
యశవంతపుర: శాండల్‌వుడ్ నటీనటులు చిరంజీవి సర్జా, మేఘనా రాజ్‌లు మూడుముళ్లతో ఒక్కటయ్యారు. నటి ప్రమీళా జోషాయ్, నటుడు ఎంకె సుందరరాజ్ల కూతురు మేఘనారాజ్‌తో శక్తి ప్రసాద్ మనవడు చిరంజీవి సర్జా వివాహం బెంగళూరు లోని ప్యాలెస్ మైదానంలోని వైట్ పెటల్స్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో బుధవారం ఘనంగా జరిగింది. వెంకటేశ్వర–పద్మావతిల వైభవ మంటపంలో బంగారురంగులో పెండ్లిపందిరిని అలంకరించారు. వధువు మేఘనరాజ్ క్రీమ్ రంగు, గోల్డ్ మిక్స్ గ్రీన్ అంచున్న పట్టు చీరలో మెరిసిపోతే, చిరంజీవి సర్జా పట్టు పంచను కట్టారు. గత నెల 29న క్రైస్తవ సంప్రదాయంలో ఒక చర్చిలో ఇద్దరూ ఉంగరాలను మార్చుకుని పెళ్లి చేసుకోగా, బుధవారం హిందూ రీతిలో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. సీనియర్ నటుడు శ్రీధర్, భారతి విష్ణువర్ధన్, అనిరుద్ధ కుటుంబసభ్యులు, హీరో అర్జున్ కుటుంబసభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన అనేక మంది హాజరై నూతన జంటను దీవించారు. -
మే 2న చిరంజీవి సర్జా –మేఘనా వివాహం
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనా రాజ్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు మే 2న బెంగళూరు ప్యాలెస్ మైదానం వైట్పెటల్స్లో పెళ్లి జరుగుతుందని పెళ్లి పత్రిక సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతోంది. దీంతో వీరి అభిమానుల్లో సందడి నెలకొంది. సినీనటులు ప్రేమించి పెళ్లిచేసుకోవడం పరిశ్రమలో కొత్తేం కాదు. ఇటీవలే టాలీవుడ్లో నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకోగా తాజగా శాండల్‌వుడ్ సినీ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇందుకోసం ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. సుందర్రాజ్, ప్రమీలా జోసాయి దంపతుల కుమార్తె మేఘనారాజ్. ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా అల్లుడు చిరంజీవి సర్జా ఇద్దరు ‘ఆటగార’ సినిమాలో జంటగా నటించారు. అదే జోడీ ఇప్పుడు వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు. చిరంజీవి సర్జా 2009లో కన్నడలో వాయుపుత్ర సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించగా, మేఘానారాజ్ తెలుగుతోపాటు దక్షిణాది భాషా సినిమాల్లో నటించారు. ఈ జంట గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ విషయం అందరికీ తెలిసింది. -
ఆ నలుగురూ ఆడాళ్లే... అండ్ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే!
కన్నడలో ‘ఎమ్ఎమ్సిహెచ్’ అనే ఓ సినిమా రూపొందుతోంది. దీని స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో ముఖ్య తారలు నలుగురూ ఆడాళ్లే! ఈ సిన్మాకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండోయ్! అదేంటంటే.. ఆ నలుగురూ ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నవాళ్లే. ఆ నలుగురూ... ‘దూకుడు, ఓ మై ఫ్రెండ్’ తదితర తెలుగు చిత్రాలు చేసిన నటి వినయ్ ప్రసాద్ కుమార్తె ప్రతిమా ప్రసాద్, ‘ఉలవచారు బిర్యాని’ ఫేమ్ సంయుక్తా హోర్నాడ్ (నటుడు ప్రకాశ్ బేలవాడి మేనకోడలు, రీసెంట్గా విడుదలైన ‘గృహం’లో పాస్టర్‌గా నటించారీయన), మేఘనా రాజ్ (నటుడు సుందర్ రాజ్ కుమార్తె), నక్షత్రా బాబు (నటుడు రాజేంద్రబాబు కుమార్తె). సినిమాలో ఈ హీరోయిన్లు అందరూ కాలేజ్ స్టూడెంట్స్‌గా కనిపిస్తారట! ఇంకో స్పెషాలిటీ ఏంటంటే... ఇందులో కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణీ ద్వివేది అతిథి పాత్ర చేస్తున్నారు. ఇదొక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలో రాగిణి ఓ హీరోయిన్గా నటించారు. -
పెళ్లిపీటలెక్కబోతున్న చిరంజీవి
సాక్షి, బెంగుళూరు: సినీనటులు ప్రేమించి పెళ్లిచేసుకోవడం పరిశ్రమలో కొత్తేం కాదు. ఇటీవలే టాలీవుడ్లో నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకోగా తాజగా శాండల్‌వుడ్ సినీ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనారాజ్ ఓ ఇంటి వారు కానున్నారు. ఇందుకోసం ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు. సుందర్రాజ్, ప్రమీలా జోసాయి దంపతుల కుమార్తె మేఘనారాజ్. ప్రముఖనటుడు, దర్శకుడు అర్జున్సర్జా అల్లుడు చిరంజీవి సర్జా ఇద్దరు ఆటగార సినిమాలో జంటగా నటించారు. అదే జోడీ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ నెల 22వ తేదీ నిశ్చితార్థం నిర్వహించి డిసెంబర్ రెండో వారంలో పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చిరంజీవి సర్జా 2009లో కన్నడలో వాయుపుత్ర సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించగా. నటి మేఘానారాజ్ తెలుగుతోపాటు దక్షిణాది భాషా సినిమాల్లో నటించింది. ఈ జంట గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నా ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ విషయం అందరికీ తెలిసింది. -
హీరోయిన్ నన్ను పెళ్లాడి మోసగించింది
నటి మేఘనారాజ్పై తమిళనాడు వ్యాపారవేత్త జనార్దన్ ఫిర్యాదు సాక్షి, బెంగళూరు: తెలుగు, కన్నడతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించిందంటూ చెన్నైకి చెందిన వ్యాపారవేత్త జనార్దన్ బెంగళూరు పోలీసులను ఆశ్రయించారు. ఆయన కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అయితే.. ఎలాంటి సాక్ష్యాలు చూపకపోవడంతో కేసును మూసేసినట్లు బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సినీనటి మేఘనా రాజ్ తనను పెళ్లాడి మోసగించడంతో పాటు వివాహానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా దొంగలించారంటూ జనార్దన్ కొన్ని నెలల క్రితం బెంగళూరు పోలీస్ కమిషనర్ మేఘరిక్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. జేపీనగర పోలీసులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. జనార్దన్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వివరాలను సేకరించారు. నటి మేఘనారాజ్‌తో వివాహమైనట్లుగా ఆయన ఎలాంటి సాక్ష్యాలనూ చూపలేకపోయారు. నగరంలో మేఘనారాజ్ నివాసం ఎక్కడున్నదీ కూడా చెప్పలేకపోయారు. దీంతో ఫిర్యాదు దశలోనే ఈ కేసును మూసేశారు. ఈ విషయంపై మేఘనా రాజ్ తల్లి ప్రమీలా జోషాయ్ మాట్లాడుతూ....‘అసలు జనార్దన్ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలీదు. సినీ రంగంలో నా కూతురు ఎదుగుదలను చూసి సహించలేని కొందరు ఈ విధంగా దుష్ర్పచారానికి దిగుతున్నారు. జనార్దన్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామ’ని చెప్పారు. -
ఆ హీరోయిన్‌కి లవరున్నాడహో!
చెన్నై : నటి మేఘ్నారాజ్కు లవరున్నాడట. ఈ విషయాన్ని ఆ భామ చెప్పకనే చెప్పేసింది. అసలు నటి మేఘ్నారాజ్ గుర్తుందా? ఆ మధ్య తమిళంలో కాదల్ సొల్లవందేన్, ఉయిర్‌తిరు 420, నందానందిత చిత్రాల్లో కథానాయికగా నటించారు. ప్రస్తుతం కన్నడంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగు, మలయాళ భాషల్లోనూ కొన్ని చిత్రాలు చేసింది. కాగా ఈ అమ్మడు లవ్‌లో పడ్డట్టు కొద్ది కాలంగా ప్రచారం జోరందుకుంది. మేఘ్నారాజ్, కన్నడ నటుడు చిరంజీవి సార్జా ప్రేమలో పడ్డారని, ఇద్దరూ పార్టీలు, ఇతర కార్యక్రమాలకు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని వదంతులు హల్చల్ చేస్తున్నా ఖండించలేదు కదా అసలు వాటిని పట్టించుకోలేదు. ఇటీవల చిరంజీవి సార్జా తమ్ముడు ధ్రువ పుట్టిన రోజును పురస్కరించుకుని మేఘ్నారాజ్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలుపుతూ అలవాటులో పొరపాటు అన్నట్లు.... నా మరిదికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొంది. అలా మేఘ్నారాజ్ నటుడు చిరంజీవి సార్జాతో తన ప్రేమని చెప్పకనే చెప్పేయడం సినీ వర్గాల్లో సంచలన సృష్టిస్తోంది. మేఘ్నారాజ్కు ప్రియుడున్నాడు అంటూ ప్రచారం హల్చల్ చేస్తోంది.ఇంతకీ నటుడు చిరంజీవి సాన్జా ఎవరని ఆరా తీస్తే ఆయన నటుడు అర్జున్‌కు దగ్గర బంధువు అని తెలిసింది. -
ప్రేమలో పడ్డ మేఘ్నా
నటి మేఘ్నారాజ్ ప్రేమలో జోగుతోంది. త్వరలో భాజా భజంత్రీలు కూడా మోగనున్నాయట. మేఘ్నా బహుభాషా నటి. తమిళంలో కాదల్ సొల్ల వందేన్, తిరు 420, నందా నందిత తదితర చిత్రాల్లో నటించింది. బెండు అప్పారావుతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ కన్నడ బ్యూటీ సహ కన్నడ నటుడు చిరంజీవి షార్జాతో ప్రేమాయణం సాగిస్తోందన్నది తాజా సమాచారం. తమిళంలో విజయం సాధించిన సండకొళి, పిజ్జా, కాక్క కాక్క, పైయ్యా చిత్రాల కన్నడ రీమేక్‌లో హీరోగా చిరంజీవి షార్జా నటించారు. ప్రస్తుతం పాండియనాడు చిత్ర రీమేక్‌లో నటిస్తున్నారు. ఒక చిత్ర షూటింగ్లో కలుసుకున్న మేఘ్నారాజ్, చిరంజీవి షార్జ్ల మధ్య పరిచయం ప్రేమగా మారిందట. దీంతో వీరు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తాజా సమాచారం. మేఘ్నారాజ్కు ప్రస్తుతం తమిళంలో అవకాశాలు లేకపోయినా కన్నడం, మలయాళంలో నటిస్తున్నారు. ఆ చిత్రాల షూటింగ్ పూర్తి అయిన తరువాత వచ్చే ఏడాది చిరంజీవి షార్జ్తో పెళ్లికి రెడీఅవుతున్నట్లు కోలీవుడ్ టాక్. -
నిద్రాహారాలు మాని...
రాజకీయాల కోసం నిద్రాహారాలు మాని కుస్తీ పడుతున్నారు నటి మేగ్నారాజ్. ప్రస్తుతం వేడెక్కుతున్న రాజకీయ వాతావరణంలో నటి మేగ్నారాజ్ రాజకీయ గొడవేమిటని అనుకుంటున్నారా? అయితే ప్రస్తు తం ఈ బ్యూటీ రాజకీయరంగ ప్రవేశం చేయకపోయినా భవిష్యత్తులో అలాంటిది జరిగే అవకాశం ఉందంటున్నారు ఆమె సన్నిహితులు. తమిళంలో ఉయిరే తిరు 420, నందా నందిత, కాదల్ సొల్ల వందేన్ తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన మేగ్నారాజ్ ప్రస్తుతం మలయాళం, కన్నడం చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరో పక్క పొలిటికల్ సైన్స్ డిగ్రీ పొందడం కోసం నిద్రాహారాలు మాని కష్టపడి చదివేస్తున్నారట. త్వరలో పరీక్షలు మొదలు కానుండడంతో రాత్రుల్లో టీని తెగ తాగేస్తూ, చదువుతో కుస్తీ పడుతున్నారట. ఈ విషయంలో ఆమె కు తన స్నేహ బృందం ప్రోత్సాహం మెండుగా ఉందంటున్నారు. ఇంతకీ పొలి టికల్ సైన్స్ డిగ్రీ కోసం ఇంతగా నిద్రాహారాలు మాని పాటుపడటానికి కారణం మేగ్నా భవిష్యత్తులో రాజకీ య తెరంగేట్రం ఆలోచనేనని ఆమె స్నేహ బృందం పేర్కొంటోంది.