సర్జా– మేఘన జంట
యశవంతపుర: శాండల్‌వుడ్ నటీనటులు చిరంజీవి సర్జా, మేఘనా రాజ్‌లు మూడుముళ్లతో ఒక్కటయ్యారు. నటి ప్రమీళా జోషాయ్, నటుడు ఎంకె సుందరరాజ్‌ల కూతురు మేఘనారాజ్‌తో శక్తి ప్రసాద్ మనవడు చిరంజీవి సర్జా వివాహం బెంగళూరు లోని ప్యాలెస్ మైదానంలోని వైట్ పెటల్స్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో బుధవారం ఘనంగా జరిగింది. వెంకటేశ్వర–పద్మావతిల వైభవ మంటపంలో బంగారురంగులో పెండ్లిపందిరిని అలంకరించారు.
వధువు మేఘనరాజ్ క్రీమ్ రంగు, గోల్డ్ మిక్స్ గ్రీన్ అంచున్న పట్టు చీరలో మెరిసిపోతే, చిరంజీవి సర్జా పట్టు పంచను కట్టారు. గత నెల 29న క్రైస్తవ సంప్రదాయంలో ఒక చర్చిలో ఇద్దరూ ఉంగరాలను మార్చుకుని పెళ్లి చేసుకోగా, బుధవారం హిందూ రీతిలో శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. సీనియర్ నటుడు శ్రీధర్, భారతి విష్ణువర్ధన్, అనిరుద్ధ కుటుంబసభ్యులు, హీరో అర్జున్ కుటుంబసభ్యులతో పాటు సినీ రంగానికి చెందిన అనేక మంది హాజరై నూతన జంటను దీవించారు.
Comments
Please login to add a commentAdd a comment