చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం | Niharika Marriage: Bride Take Selfie With Chiranjeevi | Sakshi
Sakshi News home page

చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం

Published Mon, Dec 7 2020 10:39 AM | Last Updated on Tue, Dec 8 2020 5:31 AM

Niharika Marriage: Bride Take Selfie With Chiranjeevi - Sakshi

కొణిదెల వారింట్లో పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. మరో రెండు రోజుల్లో నాగబాబు కూతురు నిహారిక పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈనెల 9న జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. ఈ వేడుకకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా కానుంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. నిహారిక, చైతన్యల కుటుంబం మాత్రం ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్‌ బయలు దేరారు. ఈ ఫోటోను నిహారిక తన ట్విటర్‌లో పోస్టు్‌ చేశారు.


ఇక నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడకల్లో కుటుంబ సభ్యులంతా సందడి చేస్తున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పెళ్లి పనులకు చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాగా నిహారిక పెళ్లి వేడుకల్లో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌,అల్లు అర్జున్‌ కనిపించలేదన్న విషయం తెలిసిందే.చదవండి: పెళ్లి కూతురుగా నిహారిక.. ఫోటోలు వైరల్‌!

అయితే తాజాగా నాగాబాబు నిహారిక-చిరంజీవి దిగిన ఓ సెల్పీ ఫోటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో మెగాస్టార్‌ కూడా పెళ్లి పనుల్లో భాగం అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో తన తల్లి నిశ్చితార్థం నాటి చీరను ధరించిన నిహారిక.. పెద్దనాన్న చిరంజీవితో కలిసి నవ్వులు చిందిస్తున్నారు. ‘అతని ప్రేమకు అవధుల్లేవు, అతని చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఒక వేడుకగా మార్చుతుంది’ అంటూ చిరంజీవి గురించి ట్వీట్‌ చేస్తూ నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక మెగా బ్రదర్స్‌ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పోస్టుతో అన్న మీద ఉన్న ప్రేమను నాగబాబు మరోసారి బయటపెట్టారు. చదవండి: అమ్మ చీరలో నిహారిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement