సాక్షి, బెంగుళూరు: సినీనటులు ప్రేమించి పెళ్లిచేసుకోవడం పరిశ్రమలో కొత్తేం కాదు. ఇటీవలే టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకోగా తాజగా శాండల్‌వుడ్ సినీ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనారాజ్ ఓ ఇంటి వారు కానున్నారు. ఇందుకోసం ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు.
సుందర్‌రాజ్, ప్రమీలా జోసాయి దంపతుల కుమార్తె మేఘనారాజ్. ప్రముఖనటుడు, దర్శకుడు అర్జున్‌సర్జా అల్లుడు చిరంజీవి సర్జా ఇద్దరు ఆటగార సినిమాలో జంటగా నటించారు. అదే జోడీ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ నెల 22వ తేదీ నిశ్చితార్థం నిర్వహించి డిసెంబర్ రెండో వారంలో పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
చిరంజీవి సర్జా 2009లో కన్నడలో వాయుపుత్ర సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించగా. నటి మేఘానారాజ్ తెలుగుతోపాటు దక్షిణాది భాషా సినిమాల్లో నటించింది. ఈ జంట గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నా ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ విషయం అందరికీ తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment