
బెంగళూరు : ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా, హీరోయిన్ మేఘనా రాజ్ వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు మే 2న బెంగళూరు ప్యాలెస్ మైదానం వైట్‌పెటల్స్‌లో పెళ్లి జరుగుతుందని పెళ్లి పత్రిక సామాజిక మాధ్యామాల్లో వైరల్ అవుతోంది. దీంతో వీరి అభిమానుల్లో సందడి నెలకొంది. సినీనటులు ప్రేమించి పెళ్లిచేసుకోవడం పరిశ్రమలో కొత్తేం కాదు. ఇటీవలే టాలీవుడ్‌లో నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకోగా తాజగా శాండల్‌వుడ్ సినీ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇందుకోసం ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి తేదీని కూడా ఖరారు చేశారు.
సుందర్‌రాజ్, ప్రమీలా జోసాయి దంపతుల కుమార్తె మేఘనారాజ్. ప్రముఖ నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా అల్లుడు చిరంజీవి సర్జా ఇద్దరు ‘ఆటగార’ సినిమాలో జంటగా నటించారు. అదే జోడీ ఇప్పుడు వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు. చిరంజీవి సర్జా 2009లో కన్నడలో వాయుపుత్ర సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించగా, మేఘానారాజ్ తెలుగుతోపాటు దక్షిణాది భాషా సినిమాల్లో నటించారు. ఈ జంట గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రస్తుతం రెండు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ విషయం అందరికీ తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment