
మేఘన, దేవరాజ్
కర్నాటకలో 1979లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిందాగ్యాంగ్– ది రియల్ గ్యాంగ్’. దేవరాజ్, మేఘనా రాజ్ హీరో హీరోయిన్‌గా నటించారు. కృష్ణచంద్ర, లోకి, భరత్ రాజ్ తలికోట్, యువరాజ్ కీలక పాత్రలు పోషించారు. మహేష్ దర్శకత్వంలో ఎస్. మంజు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మా ‘జిందా గ్యాంగ్’ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది. నగేష్ వి. ఆచార్య అందించిన విజువల్స్, గ్రాండియర్ విజువల్స్, శ్రీధర్ వి. సంబ్రం మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయి. దేవరాజ్ నటనతో సినిమాను నిలబెట్టారు. మేఘనా రాజ్ అందం, అభినయంతో ఆకట్టుకుంటారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. చలపతి.
Comments
Please login to add a commentAdd a comment