Devraj
-
Parliament: నా కొడుకు చేసింది తప్పే.. ఉరి తీయండి
ఢిల్లీ: నూతన పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో సభలో దుండగులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు . అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో, ఈ ఘటన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి దేవరాజ్ పార్లమెంట్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. తాజాగా దేవరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. తన కొడుకు చేసింది ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి చొరబడి తన కొడుకు తప్పు చేశాడని అంగీకరించాడు. ఇక తన కొడుకు సమాజానికి తప్పు చేసినట్లైతే అతడిని ఉరితీయాలని కామెంట్స్ చేశారు. తన కొడుకు ఏదైనా మంచి పని చేస్తే ప్రోత్సహిస్తానని.. కానీ ఇలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని అన్నారు. In #Karnataka's #Mysuru, Devraj, father of Manoranjan who caused a security breach inside the Lok Sabha today, says, "This is wrong, nobody should do anything like that... If my son has done anything good, of course, I support him but If he has done something wrong I strongly… pic.twitter.com/5DTbNhJyG2 — Hate Detector 🔍 (@HateDetectors) December 13, 2023 నిందితుల వివరాలు ఇలా.. లోక్‌సభలో టియర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నిందితులను సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి కౌర్, లలిత్ ఝా, విక్కీ శర్మలుగా గుర్తించారు పోలీసులు. కాగా, దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో కాగా.. మనో రంజన్ కర్ణాటకలోని మైసూర్. అమోల్ షిండే స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా.. నీలం దేవి కౌర్ స్వస్థలం హర్యాణాలోని హిస్సార్. After breaking the law herself, she says, save the Constitution, 😂😂#ParliamentAttack#SecurityBreach #LokSabha pic.twitter.com/BF1uo5rvhj — Prabha Rawat🕉️🇮🇳 (@Rawat_1199) December 13, 2023 అయితే వీరందరూ భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో ఆన్లైన్లో పరిచయం చేసుకున్నట్టు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే పార్లమెంట్లో అలజడి సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సిన్హా పాస్‌లతోనే పార్లమెంట్‌లోకి వచ్చినట్టు వివరించారు. మరోవైపు.. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లో నీలం దేవి కౌర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనల్లో పాల్గొందని.. కానీ ఏ రాజకీయ పార్టీతో ఆమెకు సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు. ఇక, వీరంతా లలిత్ ఝా ఇంట్లోనే బస చేసినట్టు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. BJP MP Pratap Simha, who gave passes to Sagar Sharma for entering #LokSabha leading to a significant #SecurityBreach #ParliamentAttack2023, shud be suspended and his house shud be bulldozed. His alleged role in aiding Sagar shud be probed. #BJPFailsIndia #AmitShah… pic.twitter.com/Je3TDeXGmM — Faheem (@stoppression) December 13, 2023 ఇదిలా ఉండగా.. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్టు చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఏపీఏ), ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. Parliament security breach | A case under Sections 120-B (criminal conspiracy), 452 (trespassing), Section 153 (want only giving provocation with an intent to cause riot), 186 (obstructing public servant in discharge of public functions), 353 (assault or criminal force to deter… — ANI (@ANI) December 14, 2023 Sansad breaking. Two people with tear gas canisters jumped into Lok Sabha well and opened it. House adjourned. #LokSabha pic.twitter.com/UrFZ7xE8pB — sansadflix (@sansadflix) December 13, 2023 -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) యూట్యూబ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దేవరాజ్ తన 'దిల్ సే బురా లగ్తా హై' అనే డైలాగ్‌తో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయనకు యూట్యూబ్‌లో అతనికి 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కమెడియన్ దేవ్‌రాజ్ పటేల్ పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. కాగా.. 2021లో భువన్ బామ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ధిండోరాలో దేవరాజ్ విద్యార్థి పాత్రలో కనిపించాడు. దేవ్‌రాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేశాడు. సీఎం ట్విటర్లో రాస్తూ.. ''దిల్ సే బురా లగ్తా హై'తో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) “दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए. इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है. ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v — Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023 View this post on Instagram A post shared by Devraj Patel (@imdevrajpatel) -
హీరోగా నటుడు దేవరాజ్ తనయుడు.. వైరం టీజర్ చూశారా?
నటుడు దేవరాజ్ తనయుడు ప్రణమ్ దేవరాజ్ హీరోగా నటించిన చిత్రం ‘వైరం’. సాయి శివం జంపాన దర్శకత్వం వహించిన ఈ మూవీలో మోనాల్ హీరోయిన్. యువాన్స్ నాయుడు సమర్పణలో తెలుగు, కన్నడ భాషల్లో జె. మల్లికార్జున నిర్మించారు. నటులు దేవరాజ్, చంద్ర దేవరాజ్ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, నటులు బెనర్జీ, కాశీ విశ్వనాథ్ ‘వైరం’ టీజర్‌ను విడుదల చేశారు. దేవరాజ్ మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు నన్నెంతో ఆదరించారు. హీరోగా వస్తున్న నా కుమారుడు ప్రణమ్ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు జె. మల్లికార్జున. ‘‘ఈ సినిమా బాగా వచ్చింది’’ అన్నారు సాయి శివన్ జంపాన. ఈ చిత్రానికి సహనిర్మాత: శీలం త్రివిక్రమ్ రావు, అరిపిరాల కళ్యాణ్ శాస్త్రి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: సామల భాస్కర్. What you have seen in the teaser was just a glimpse only, the movie will be 100 times more than the glimpse. -Hero @PranamDevaraj Speech at #Vairam Teaser Launch Event✨ ▶️https://t.co/wNlndVpfgL@Saishivan3 @GarudaRaam @ActorBhadram @monal_jagtani @ShatruActor @MaddipatiVinnu… https://t.co/BEfTd7Qets pic.twitter.com/pUHSLrqEpB — YouWe Media (@MediaYouwe) March 17, 2023 -
హీరోగా లాంచ్ అయిన నటుడు దేవరాజ్ కొడుకు.. రిలీజ్‌కు రెడీ
రామ్.! జై శ్రీరామ్.! ఈ మాట సినిమాల సక్సెస్ మంత్రం అయిపోయింది. ఔను, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంత పెద్ద సక్సెస్ అవడానికి అందులో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపిస్తే, దాన్ని శ్రీరాముడి పాత్రగా నార్త్ ఆడియన్స్ తీసుకున్నారు మరి. చాలా సినిమాలు ‘జై శ్రీరామ్’ సెంటిమెంట్‌తో ఇటీవలి కాలంలో మంచి విజయాల్ని అందుకున్నాయి. తాజాగా ‘రామ్’ అంటూ ‘వైరం’ సినిమా తొలి పోస్టర్ని వదిలారు. ప్రముఖ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ హీరోగా తెరకెక్కిన ‘వైరం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకి టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సాయి శివన్ జంపన దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయనుంది ‘వైరం’ టీమ్. కాగా, నెంబర్ ప్లేట్ మీదున్న ‘నంబర్’ ఒకింత ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపింది. కారణమేంటంటే, ఆ నెంబర్స్ ‘రామ్’ని తలపిస్తుండడం. హిందీలో ‘ర’ అక్షరాన్ని నెంబర్ ‘2’గా చూపిస్తూ, రెండు ‘1’ నెంబర్లను పేర్కొంటూ, ‘4’ నెంబర్ని ‘మ’ అక్షరాన్ని పోలి వుండేలా ప్రస్తావించారు. పోస్టర్‌లోని ఈ అంశం సంచలనంగా మారే అవకాశం వుంది. ఈ చిత్రానికి జె.మల్లికార్జున నిర్మాత కాగా, సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించారు. మహతీ స్వర సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. -
'పోల్‌వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం
Struggle of Young Pole Vaulter Devraj: భారతదేశంలో క్రీడలంటే మొదటగా గుర్తుకువచ్చేది.. క్రికెట్. క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్, చెస్ లాంటి క్రీడలకు కాస్తో కూస్తో ప్రాధాన్యం ఉందని చెప్పొచ్చు. మనకు తెలియకుండా వివిధ రంగాల క్రీడల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను చూపెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఆ రంగంలో రాణించేలా ఆయా ప్రభుత్వాలు ఆటగాళ్లను ప్రోత్సహించడం లేదు. ఆ కోవకు చెందినవాడు దేవరాజ్. రాజస్తాన్‌కు చెందిన దేవరాజ్‌కు గొప్ప పోల్‌వాల్టర్ కావాలనేది కల. చిన్నప్పటి నుంచే పోల్‌వాల్ట్‌పై మమకారం పెంచుకున్న అతను.. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లేనప్పటికి తన సొంతకాళ్లపై కష్టపడుతూనే పోల్‌వాల్ట్‌ను ఇష్టపడి నేర్చుకున్నాడు. 23 ఏళ్ల వయసు వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్‌వాల్ట్‌లో మెళుకువలు అందిపుచ్చుకున్న దేవరాజ్..తన శిక్షణలో మరింత రాటుదేలేందుకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఎంచుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే దేవరాజ్ 2019లో ఢిల్లీలో అడుగుపెట్టాడు. నెహ్రూ స్డేడియానికి ఆనుకొని పక్కనే ఒక డ్రైనేజీ ఉంటుంది.. దానికి ఆనుకొని ఒక చిన్న గది ఉంటుంది. అందులోనే దేవరాజ్ అద్దెకు ఉండేవాడు. పోల్‌వాల్ట్ కర్ర తన రూమ్‌లో ఉంచడం సాధ్యం కాకపోవడంతో ఇంటి టెర్రస్‌కు తాడుతో కట్టేవాడు. ఉదయం నాలుగు గంటలకే లేచి మూడు గంటలపాటు నెహ్రూ స్డేడియంలో సాధన చేసేవాడు. అనంతరం పొట్టకూటి కోసం సైకిల్‌పై వెళ్లి ఎక్కడ ఏ పని దొరికినా ఇష్టంతో చేసేవాడు. చదవండి: ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్ ఎలాగైనా పోల్‌వాల్టర్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపెట్టడంతో పాటు.. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కల గన్నాడు. అతను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. అతను వచ్చిన ఆరు నెలల్లోనే కరోనా మహమ్మారి ఉపద్రవం ముంచుకొచ్చింది. దీంతో తాను రోజు ప్రాక్టీస్ చేసే నెహ్రూ స్టేడియాన్ని మూసేశారు. దీంతో ఇంటికి తిరిగి వెళ్లలేక.. చేసేందుకు పనిలేక నానా అవస్థలు పడ్డాడు. అయితే తన ఆశయాన్ని మాత్రం దేవరాజ్ ఎన్నటికి విడవలేదు. పరిస్థితులు సద్దుమణిగాక నెహ్రూ స్డేడియాన్ని మళ్లీ తెరిచారు. ఈసారి దేవరాజ్ సరికొత్తగా సిద్ధమయ్యాడు. పొద్దంతా నెహ్రూ స్టేడియంలో పోల్‌వాల్ట్ సాధన చేస్తున్న దేవరాజ్..రాత్రుళ్లు నిర్మాణంలో ఉన్న భవనాలకు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ బతుకుతున్నాడు. ప్రస్తుతం తాను సంపాదిస్తున్న ప్రతీ రూపాయి అద్దెకు.. తిండికే సరిపోతున్నాయి. తన ఆటను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సహకారమందిస్తుందనే ఆశతో దేవరాజ్ ఎదురుచూస్తున్నాడు. చదవండి: Neeraj Chopra: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తిగా రికార్డు -
పరారీలో ఆర్ఎక్స్100 నిర్మాత
-
చొక్కా కోసం కోర్టుకెళ్లాడు...
సాక్షి, బళ్లారి: పేదరికంలో మగ్గుతున్న ఓ విద్యార్థి తనకు కష్టం వచ్చిందని బాధపడుతూ కూర్చోలేదు. హక్కుల కోసం న్యాయస్థానం తలుపు తట్టాడు. కొప్పళ తాలూకా కిన్నాళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి మంజునాథ్ ఓ రోజు పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. తాను ధరించిన చొక్కా అపరిశుభ్రంగా ఉంది. మరో చొక్కా వేసుకుందామంటే అదీ చిరిగిపోయింది. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉండగా.. ఒక జత మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీంతో మంజునాథ్ యూనిఫామ్ పంపిణీలో ప్రభుత్వ జాప్యాన్ని, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించకూడదని తండ్రిని అడిగాడు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించవచ్చని.. కోర్టుకు సైతం వెళ్లవచ్చని తండ్రి దేవరాజ్ చెప్పాడు. కుమారుడిని హైకోర్టు న్యాయవాది అజిత్ వద్దకు తీసుకెళ్లి విషయం తెలిపాడు. దీనిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చని న్యాయవాది సలహా ఇవ్వడంతో విద్యార్థి మంజునాథ్ ఈ ఏడాది మార్చి 25న రిట్ వేశాడు. విచారణకు స్వీకరించిన హైకోర్టు ›ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మహమ్మద్ నవాజ్‌తో కూడిన డివిజన్ బెంచ్ సుదీర్ఘంగా విచారించి గురువారం కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్) యాక్ట్ ప్రకారం రెండు నెలల్లోపు యూనిఫామ్‌తోపాటు షూ, సాక్సులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేసు వేసిన విద్యార్థికి రెండు వారాల్లోపు రెండు జతల యూనిఫామ్, షూ, సాక్సులు ఇవ్వాలని కోర్టు ప్రత్యేకంగా సూచించింది. కోర్టు తీర్పు అనంతరం బాలుడు మంజునాథ్ మాట్లాడుతూ తన అర్జీపై హైకోర్టు స్పందించి ఆదేశాలు ఇవ్వడం సంతోషం కలిగించిందన్నాడు. తన పోరాటానికి తండ్రి దేవరాజ్ సహకారం ఇవ్వడం వల్లే విజయం సాధించానని చెప్పాడు. -
1979లో ఏం జరిగింది?
కర్నాటకలో 1979లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జిందాగ్యాంగ్– ది రియల్ గ్యాంగ్’. దేవరాజ్, మేఘనా రాజ్ హీరో హీరోయిన్గా నటించారు. కృష్ణచంద్ర, లోకి, భరత్ రాజ్ తలికోట్, యువరాజ్ కీలక పాత్రలు పోషించారు. మహేష్ దర్శకత్వంలో ఎస్. మంజు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. మా ‘జిందా గ్యాంగ్’ స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నగేష్ వి. ఆచార్య అందించిన విజువల్స్, గ్రాండియర్ విజువల్స్, శ్రీధర్ వి. సంబ్రం మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తాయి. దేవరాజ్ నటనతో సినిమాను నిలబెట్టారు. మేఘనా రాజ్ అందం, అభినయంతో ఆకట్టుకుంటారు’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి. చలపతి. -
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన సీనియర్ నటుడు
క్రైమ్ : షూటింగ్ నుంచి తన ఫ్యామిలీతో తిరిగి వెళ్తోన్న కన్నడ సీనియర్ నటుడు దేవరాజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వారికి స్పల్వ గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని మైసూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని సమాచారం. ఈ ప్రమాదంలో కన్నడ నటుడు దర్శన్‌కు చేయి విరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఎవరు డ్రైవింగ్ చేశారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. దేవరాజ్ తెలుగులో ప్రతినాయక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా వచ్చిన ‘భరత్ అనే నేను’లో కూడా ఓ పాత్రను పోషించారు. ‘యజ్ఞం’ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. -
హీరోగా విలన్ తనయుడు
‘ఎస్పీ పరశురాం, సమరసింహారెడ్డి, యజ్ఞం, ఎవడైతే నాకేంటి, భరత్ అనే నేను’ తదితర చిత్రాల ద్వారా విలన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ గుర్తింపు పొందారు కన్నడ నటుడు దేవరాజ్. తాజాగా ఆయన తనయుడు ప్రణమ్ దేవరాజ్ ‘వైరం’ చిత్రంతో తెలుగులోకి హీరోగా పరిచయవుతున్నారు. సాయి శివన్.జె దర్శకత్వంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున పిక్చర్స్ పతాకంపై జె.ఎం.కె నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకుడు వి.సాగర్ క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి శ్రీవాస్ గౌరవ దర్శకత్వం వహించారు. దేవరాజ్ మాట్లాడుతూ– ‘‘తెలుగు, కన్నడలో ఎన్నో చిత్రాల్లో నటించి నంది అవార్డు అందుకున్నా. మా అబ్బాయిని తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేస్తున్నా. నాపై చూపిన అభిమానాన్ని తనపైనా చూపిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘చక్కని ప్రేమకథతో పాటు పక్కా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుంది. తెలుగు, కన్నడలో ఒకేసారి తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు సాయి శివన్. ‘‘కుమారి 21ఎఫ్’ కన్నడ రీమేక్‌లో నటించా. ఆ చిత్రం హిట్ అయ్యి నన్ను హీరోగా నిలబెట్టింది. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడానికి శాయశక్తులా కృషిచేస్తా’’ అన్నారు దేవరాజ్. ‘‘సెప్టెంబర్ మొదటి వారం నుంచి మా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అన్నారు నిర్మాత జె.ఎం.కె. ఈ చిత్రానికి కెమెరా: గోపీనాథ్, సంగీత్: సాగర్ మహతి. -
మలేసియాలో మనోళ్ల పాట్లు
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌కు చెందిన 300 మంది వేతనం అడిగితే దాడులు చేస్తున్నారని ఆవేదన భీమ్‌గల్: ఏజెంట్ల చేతిలో మోసపోయిన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 300 మంది మలేసియాలో అష్టకష్టాలు పడుతున్నారు. ఏజెంటు ఇచ్చిన టూరిస్టు వీసా గడువు ముగిసి మలేసియా పోలీసులకు చిక్కి పరిహారం చెల్లించిన కొందరు స్వదేశం చేరుకోగా, మిగిలిన వారంతా అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. స్వదేశానికి వచ్చిన వారిలో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. వారి కథనం మేరకు.. భీమ్‌గల్‌కు చెందిన పొలాస నడ్పి భూమేశ్వర్, తొగర్ల గంగాధర్‌లను కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన గల్ఫ్ సబ్ ఏజెంట్ మధుగౌడ్.. వేములవాడకు చెందిన ప్రధాన ఏజెంట్ జోరిగ దేవరాజ్ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన ఒక్కొక్కరి వద్ద రూ. 1.20 లక్షలు తీసుకొని మలేసియా పంపించాడు. అక్కడ పవర్‌ప్లాంట్‌లో నెలకు రూ. 30 వేల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. తొలుత టూరిస్టు వీసాపై అక్కడికి వెళ్తే.. మూడు నెలల్లో కంపెనీ వీసా ఇప్పిస్తానని, లేనిపక్షంలో డబ్బులు తిరిగి ఇస్తానని హమీపత్రం రాసిచ్చాడు. దీంతో వీరు నమ్మి ఏజెంట్ చేతిలో పాస్‌పోర్టు పెట్టారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత వీరి కష్టాలు ప్రారంభమయ్యాయి. పవర్‌ప్లాంట్ నిర్మాణంలో ఉందని చెప్పి నెలరోజులు ఖాళీగా ఉంచాడు. ఓ చిన్న గదిలో 40 మందిని ఉంచారు. మరోనెలలో సిమెంట్ ప్యాక్టరీలో పనికి కుదిర్చాడు. అక్కడి నుంచి సూపర్ మార్కెట్లో పనికి కుదిర్చాడు. అందులో మూడు నెలలు పని చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో ఇదేమని అడిగితే.. ఏజెంటును తీసుకురమ్మని గదమాయించారు. ఏజెంటుకు ఫోన్ చేస్తే పత్తాలేకుండా పోవడంతో వారి పరిస్థితి దిక్కుతోచకుంది. వీసా గడువు ముగియడంతో ఇక్కట్లు ఇక్కడ ఏజెంట్ చెప్పినట్లుగా మూడు నెలల తర్వాత కంపెనీ వీసా ఇవ్వలేదు. విజిట్ వీసా గడువు ముగియడంతో ఏజెంట్‌ను ప్రశ్నించగా, కుదరదనడంతో పాటు ‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకో’మని బెదిరించాడు. దీంతో వీరు ఇక్కడి బంధువులను ఆశ్రయించగా, టికెట్లు కొనిపంపించారు. అక్కడి ప్రభుత్వం తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని దేశం విడిచి వెళ్లేందుకు అవకాశమిస్తూ గడువు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకొని బయటపడ్డారు. వీసా గడువు నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడి ప్రభుత్వం విధించిన రూ. 400 రింగిట్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 8 వేలు జరిమానా)ను ఇంటినుంచి పంపడంతో చెల్లించి బయటపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో చెన్నైవాసి దుర్మరణం
దువ్వ (తణుకు క్రైం) : తణుకు మండలం దువ్వ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నైకు చెందిన మోనిషా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అధినేత దేవరాజ్ సౌందర్‌రాజ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భార్యతో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నై ఎంఆర్ నగర్‌కు చెందిన మోనిషా ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అధినేత దేవరాజ్ సౌందర్‌రాజ్ (42) తన భార్య కష్ము, కుమార్తె మోనిషా, కుమారుడు యశ్వంత్రాజ్లతో కలిసి వ్యాపార లావాదేవీలతో పాటు రాజమండ్రిలో బంధువులను కలిసేందుకు వచ్చారు. బుధవారం కుటుంబంతో కలిసి చెన్నైకు కారులో తిరుగుప్రయాణమయ్యారు. కారును సౌందర్‌రాజ్ నడుపుతున్నారు. తణుకు మండలం దువ్వలో జెడ్పీ హైస్కూల్ ప్రాంతానికి వచ్చేసరికి ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాలుడిని ఢీకొంది. దీంతో అదుపుతప్పిన కారు మూడు పల్టీలు కొట్టి రోడ్డు మార్జిన్లో ఉన్న ఐరన్ స్తంభం, మైలురాయిని ఢీకొట్టి పది అడుగుల దూరంలో పడింది. వెంటనే అందుబాటులో ఉన్న హైవే పెట్రోల్ పోలీసులు స్థానికుడైన సూరిబాబు సహాయంతో బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవ్ చేస్తున్న సౌందర్‌రాజ్‌ను కారులోంచి బయటకు తీస్తుండగా మృతి చెందగా, అతని భార్య కష్ము రెండు కాళ్లు తుంటి భాగంలో ఎముకలు విరిగి లేవలేనిస్థితిలో ఉన్నారు. కాగా చిన్నారులు మోనిషా, యశ్వంత్రాజ్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు కారులోంచి క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనంలో తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కష్ము పరిస్థితి విషమంగా ఉందని రెండు కాళ్ల తుంటి ఎముకలు విరిగినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఉదయప్రకాష్‌రెడ్డి చెప్పారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లేక విజయవాడకు తీసుకువెళ్లాలని సూచించారు. రూరల్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి పరిశీలించి వివరాలు సేకరించారు. అన్నదానం చేసి బయలుదేరారు.. సౌందర్‌రాజ్ వ్యాపార లావాదేవీల నిమిత్తం వస్తూ బంధువులను కలిసి వెళ్లవచ్చనే ఉద్దేశంతో చెన్నై నుంచి కుటుంబసమేతంగా రాజమండ్రి వచ్చారు. తిరుగుప్రయాణం అయ్యేందుకు సిద్ధం కాగా, రాజమండ్రిలో తన వ్యాపార లావాదేవీలు చూస్తున్న గుమస్తా వెంకటేశ్వరరావు కోరిక మేరకు ఆ ప్రాంతంలో శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తయిన అనంతరం చెన్నైకి బయలుదేరారు. తన యజమాని సౌందర్‌రాజ్ ఎంతో మంచివారని, రాజమండ్రిలో ఆయన వ్యాపార లావాదేవీలన్నీ తానే చూస్తుంటానని వెంకటేశ్వరరావు విలపిస్తూ చెప్పాడు. రాజమండ్రిలో గంట క్రితమే తన యజమానిని సాగనంపానని, అంతలోనే ఆయన అందనంత దూరానికి వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యాడు. నా భర్త ఎలా ఉన్నారు? ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సౌందర్‌రాజ్ భార్య కష్ము చికిత్స పొందుతూనే తన భర్త పరిస్థితిపై ఆందోళనకు గురైంది. తన భర్త ఏమయ్యారని, ఎక్కడ ఉన్నారంటూ కంటతడిపెట్టింది. తన భర్తను చూడాలంటూ పట్టుబట్టడంతో సౌందర్రాజ్కు బాగానే ఉందని ఆసుపత్రి సిబ్బంది ఆమెను సముదాయించారు. అయోమయంలో చిన్నారులు ప్రమాదంలో తండ్రి చనిపోయి, తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఏమైందో తెలియక చిన్నారులు మోనిషా, యశ్వంత్‌రాజ్ బిత్తరచూపులు చూస్తుండటం స్థానికులను కలచివేసింది. గాయాలతో చికిత్స పొందుతూ ఏడుస్తూనే చిన్నారి మోనిషా తన కుటుంబ వివరాలు చెబుతున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతూ.. దువ్వ గ్రామానికి చెందిన బెల్లపుకొండ సుబ్బారావు కుమారుడు వరప్రసాదరాజు దువ్వ హైస్కూల్లో చేరే నిమిత్తం ప్రవేశ పరీక్ష రాసేందుకు సైకిల్‌పై స్కూల్‌కు వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అమ్మమ్మ ఊరైన తూర్పు విప్పర్రులో చదువుతున్న కొడుకును దువ్వ హైస్కూల్లో చేర్పించేందుకు తండ్రి సుబ్బారావు తన కుమారుడిని బుధవారం ఉదయం హైస్కూల్‌కు తీసుకువచ్చాడు. అయితే మధ్యాహ్నం జరిగే పరీక్షకు హాజరుకావాలని ఉపాధ్యాయులు చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం పరీక్షకు కుమారుడిని పంపి, తరువాత తాను వెళ్లవచ్చని భావించాడు. అలాగే కుమారుడిని ముందుగా స్కూల్‌కు పంపాడు. అయితే అనుకోని విధంగా ప్రమాదం జరిగి కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో తండ్రి సుబ్బారావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తండ్రి వచ్చేవరకు బాలుడి వివరాలు తెలియకపోవడంతో మాతరం సేవా సంఘం, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతో బాలుడికి వైద్యసేవలందించారు. దువ్వ గ్రామానికి చెందిన మాతరం సేవా సంఘం నాయకులు కొల్లూరి సూరిబాబు, సిర్రా ధనరాజు, గంటా మురళీ క్షతగాత్రులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టారు. -
వ్యాపారవేత్త హత్యకు కుట్ర
మైసూరు : సుపారీ (కిరాయి) తీసుకుని వ్యాపార వేత్తను హత్య చెయ్యడానికి యత్నించిన మహిళ సహ 8 మందిని మైసూరులోని ఉదయగిరి పోలీసులు అరెస్టు చేశారు. మైసూరులోని శక్తినగరలో నివాసం ఉంటున్న భాగ్య (30) అనేయువతితో పాటు రవికుమార్, శశికుమార్, శాంతకుమార్, మధు, సతీష్, దర్శన్, అక్షయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రెండు కార్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని బుధవారం పోలీసులు చెప్పారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు... మైసూరు తాలుకా మల్లహళ్లిలో ఉంటున్న శ్రీనివాస్ మద్యం వ్యాపారి. దేవరాజ్ అనే వ్యాపారికి కొన్నినెలల క్రితం వైన్‌షాప్, లెసైన్స్ రూ. 70 లక్షలకు విక్రయించాడు. అడ్వాన్స్‌గా రూ. 20 లక్షలు శ్రీనివాస్‌కు ఇచ్చారు. మిగిలిన రూ. 50 లక్షలు ఇవ్వకుండ దేవరాజ్ వేధిస్తున్నాడని సమాచారం. ఈ విషయంలో విసిగిపోయిన శ్రీనివాస్, శక్తి నగరలో నివాసం ఉంటున్న భాగ్యను కలిశాడు. దేవరాజ్‌ను హతమార్చడానికి కిరాయి కుదుర్చుకున్నారు. సోమవారం వేకువ జామున రెండు కార్లలో ఎనిమిది మంది దేవరాజ్‌ను హత్య చేయడానికి వేచి ఉన్నారు. ఆ సమయంలో గస్తీ పోలీసులు వీరిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న వేడకొడవళ్లు, కర్రలు, కారంపొడి స్వాధీనం చేసుకుని అందరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారణ చేయడంతో అసలు విషయం బయట పెట్టారు. హత్య చెయ్యడానికి కిరాయి ఇచ్చిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని బుధవారం ఉదయగిరి పోలీసులు తెలిపారు. -
బాబు అసమర్థత వల్లే ఈ దుస్థితి
సాక్షి, అనంతపురం : మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణవాదాన్ని తీసుకువచ్చారని, చంద్రబాబు అసమర్థతవల్లే వేర్పాటువాదం ఉద్యమం తీవ్రమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సాక్షి పత్రిక, టీవీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురంలోని రెవెన్యూ కమ్యూనిటీ హాలులో ‘ఎవరెటు?’ పేరుతో చైతన్యపథం సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాజ్ మాట్లాడుతూ సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, స్వార్థ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందన్నారు. జేఏన్టీయూ రిజిస్ట్రార్ ప్రొ. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ విభజనలో హైదరాబాద్‌ను కోల్పోతే ఆస్తులు తెలంగాణ వారికి, అప్పులు సీమాంధ్రులకు మిగులుతాయని వివరించారు. 60 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ శ్రమను హైదరాబాద్ అభివ ృద్ధికి వెచ్చించారని న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ విశ్వనాథరెడ్డి, సెంటిమెంటు పేరిట రాష్ట్రాన్ని విడగొట్టడం దుర దృష్టకరమని ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ నరసింహులు పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడంవల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇళ్ల చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్టు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: ఇళ్ల చోరీ కేసుల్లో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మొత్తం రూ. 24 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఈ.శంకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్డునెం.62లోని ప్లాట్నెం.1245లో ఇరవై రోజుల క్రితం చోరీ జరిగింది. ఇంటి యజమాని ఊరెళ్లగా.. వంట మనిషి దేవరాజ్ (23) ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో ఉన్న రూ.5.14 లక్షల నగదు, రూ.10 లక్షల విలువ చేసే బంగారు నగలు అపహరించకొని తన స్వస్థలం బీహార్‌లోని మధుమణి గ్రామానికి పారిపోయాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, డీఐ సుమన్‌కుమార్ కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించారు. వంట మనిషి దేవరాజ్ కుడిచేయికి ఆరు వేళ్లు ఉంటాయని యజమాని చెప్పడంతో పోలీసులు ఆ ఒక్క ఆధారంతో మిస్టరీ ఛేదించారు. నగరంలోని బీహార్ సెక్యూరిటీ గార్డుల సహాయంతో నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. నిందితుడు దేవరాజ్ చోరీ సొత్తును ఒరిస్సాలోని రూర్కెలాలో విక్రయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు దొరక్కుండా కారం పొడి చల్లి.. చోరీకి పాల్పడటం... ఘటన స్థలంలో కారం పొడి చల్లి పోలీసులకు ఆధారాలు దొరక్కుం డా చేసి తప్పించుకోవడం. ఇలా రెచ్చిపోతున్న పాతనేరస్తుడు తిప్పరాజు రామకృష్ణ అలియా స్ రాము అలియాస్ అభిరామ్ (24)తో పాటు అతని సోదరి బొట్టిపల్లి భాగ్యమ్మ అలియాస్ బేబీ(36)ని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 21 తులాల బంగారంతో పాటు వెండి ఆభరణాలు, 3 ల్యాప్‌టాప్‌లు, 3 సెల్ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శంకర్‌రెడ్డి కథనం ప్రకారం... ఫిలింనగర్ అంబేద్కర్‌నగర్ వాసి రామకృష్ణ గతంలో సనత్‌నగర్, గోల్కొండ, ఎస్సార్‌నగర్, రాయదుర్గం, బం జారాహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఇతను అర్ధరాత్రి పూట అపార్టుమెంట్‌లోని డ్రైనేజీ, వాటర్ పైపులైన్లపై పాకుతూ టార్గెట్ చేసిన ఫ్లాట్‌కు చేరుకుంటాడు. ఆ ఫ్లాట్ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడతాడు. డాగ్‌స్క్వాడ్ తనను పట్టుకోకుండా ఉండేం దుకు చోరీ చేసిన ప్రాంతంలో కారంపొడి చల్లుతాడు. చోరీ సొత్తును తన సోదరి భాగ్యమ్మ ద్వారా విక్రయిస్తాడు. ఇటీవల బంజారాహిల్స్ రోడ్డునెం.12లోని సాయిశారదా అపార్ట్మెంట్స్, ఫిలింనగర్‌లోని పోర్ట్వ్యూ అపార్ట్‌మెంట్స్‌లో చోరీలకు పాల్పడ్డాడు. ఈ కేసులు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామకృష్ణతో పాటు అతని సోదరి భాగ్యమ్మను అరెస్టు చేసి రూ.9 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. ఈ కేసుల మిస్టరీని ఛేదించిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.మురళీకృష్ణ, డీఐ కె.కిరణ్‌ను ఏసీపీ అభినందించారు.