Struggle of Young Pole Vaulter Devraj: భారతదేశంలో క్రీడలంటే మొదటగా గుర్తుకువచ్చేది.. క్రికెట్. క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్, చెస్ లాంటి క్రీడలకు కాస్తో కూస్తో ప్రాధాన్యం ఉందని చెప్పొచ్చు. మనకు తెలియకుండా వివిధ రంగాల క్రీడల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను చూపెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఆ రంగంలో రాణించేలా ఆయా ప్రభుత్వాలు ఆటగాళ్లను ప్రోత్సహించడం లేదు. ఆ కోవకు చెందినవాడు దేవరాజ్.
రాజస్తాన్‌కు చెందిన దేవరాజ్‌కు గొప్ప పోల్‌వాల్టర్ కావాలనేది కల. చిన్నప్పటి నుంచే పోల్‌వాల్ట్‌పై మమకారం పెంచుకున్న అతను.. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లేనప్పటికి తన సొంతకాళ్లపై కష్టపడుతూనే పోల్‌వాల్ట్‌ను ఇష్టపడి నేర్చుకున్నాడు. 23 ఏళ్ల వయసు వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్‌వాల్ట్‌లో మెళుకువలు అందిపుచ్చుకున్న దేవరాజ్..తన శిక్షణలో మరింత రాటుదేలేందుకు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఎంచుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే దేవరాజ్ 2019లో ఢిల్లీలో అడుగుపెట్టాడు. నెహ్రూ స్డేడియానికి ఆనుకొని పక్కనే ఒక డ్రైనేజీ ఉంటుంది.. దానికి ఆనుకొని ఒక చిన్న గది ఉంటుంది. అందులోనే దేవరాజ్ అద్దెకు ఉండేవాడు. పోల్‌వాల్ట్ కర్ర తన రూమ్‌లో ఉంచడం సాధ్యం కాకపోవడంతో ఇంటి టెర్రస్‌కు తాడుతో కట్టేవాడు. ఉదయం నాలుగు గంటలకే లేచి మూడు గంటలపాటు నెహ్రూ స్డేడియంలో సాధన చేసేవాడు. అనంతరం పొట్టకూటి కోసం సైకిల్‌పై వెళ్లి ఎక్కడ ఏ పని దొరికినా ఇష్టంతో చేసేవాడు.
చదవండి: ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్
ఎలాగైనా పోల్‌వాల్టర్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపెట్టడంతో పాటు.. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కల గన్నాడు. అతను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. అతను వచ్చిన ఆరు నెలల్లోనే కరోనా మహమ్మారి ఉపద్రవం ముంచుకొచ్చింది. దీంతో తాను రోజు ప్రాక్టీస్ చేసే నెహ్రూ స్టేడియాన్ని మూసేశారు. దీంతో ఇంటికి తిరిగి వెళ్లలేక.. చేసేందుకు పనిలేక నానా అవస్థలు పడ్డాడు. అయితే తన ఆశయాన్ని మాత్రం దేవరాజ్ ఎన్నటికి విడవలేదు. పరిస్థితులు సద్దుమణిగాక నెహ్రూ స్డేడియాన్ని మళ్లీ తెరిచారు. ఈసారి దేవరాజ్ సరికొత్తగా సిద్ధమయ్యాడు. పొద్దంతా నెహ్రూ స్టేడియంలో పోల్‌వాల్ట్ సాధన చేస్తున్న దేవరాజ్..రాత్రుళ్లు నిర్మాణంలో ఉన్న భవనాలకు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ బతుకుతున్నాడు. ప్రస్తుతం తాను సంపాదిస్తున్న ప్రతీ రూపాయి అద్దెకు.. తిండికే సరిపోతున్నాయి. తన ఆటను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సహకారమందిస్తుందనే ఆశతో దేవరాజ్ ఎదురుచూస్తున్నాడు.
చదవండి: Neeraj Chopra: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తిగా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment