కటిక దారిద్య్రానికి తోడు నయం కానీ వ్యాధితో సహవాసం చేసింది ఆమె. అడగడుగున కఠినతరమైన కష్టాలు. అయినా వెరవక లక్ష్యం కోసం ఆహర్నిశలు పోరాటమే చేసింది. చివరికి అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచింది.
వివరాల్లోకెళ్తే..రాజస్తాన్‌కి చెందిన ఉమ్ముల్ ఖేర్ బాల్యం డిల్లీలోని నిజాముద్దీన్‌లో మురికివాడలో సాగింది. పైగా ఖేర్ పుట్టుకతో ఎముకలకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడుతోంది. అయినప్పటికి చదువును కొనసాగించింది. అలా ఆమె ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత జేఎన్‌యూ నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ చేసింది. అక్కడితో ఆగకుండా ఎంఫిల్ చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యింది. ఈక్రమంలో 2012లో చిన్న ప్రమాదానికి గురయ్యింది.
అయితే ఆమెకు ఉన్న బోన్ డిజార్డర్ కారణంగా శరీరంలో ఏకంగా 16 ఫ్రాక్చర్‌లు అయ్యాయి. దీంతో ఖేర్ దాదాపు ఎనిమిది సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇన్ని కష్టాల ఐఏఎస్ అవ్వాలనే అతి పెద్ద లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. అందుకోగలనా? అన్న సందేహానికి తావివ్వకుండా తన లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో సాగిపోయింది. ఓ పక్క ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి ఆరోగ్యం వరకు ఏవీ ఆమె గమ్యానికి సహకరించకపోయినా.. నిరాశ చెందలేదు.
పైగా అవే తనకు 'ఓర్చుకోవడం' అంటే ఏంటో నేర్పే పాఠాలుగా భావించింది. ప్రతి అడ్డంకిని తన లక్ష్యాన్ని అస్సలు మర్చిపోనివ్వకుండా చేసే సాధనాలుగా మలుచుకుంది. చివరికీ ఆ కష్టాలే ఆమె సంకల్ప బలానికి తలవంచాయేమో! అన్నట్లుగా ఉమ్ముల్ ఖేర్ సివిల్స్‌లో 420వ ర్యాంకు సాధించింది. తాను కోరుకున్నట్లుగానే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎందరికో ప్రేరణగా నిలిచింది. ద టీజ్ ఉమ్ముల్ ఖేర్ అని ప్రూవ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment