భారత్‌పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్‌చేస్తే.. | Woman From Chicago Moved To Mumbai At 19 Without A Job Goes Viral, Know Interesting Details Inside | Sakshi
Sakshi News home page

భారత్‌పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్‌చేస్తే..

Jun 5 2025 9:29 AM | Updated on Jun 5 2025 11:21 AM

woman from Chicago moved to Mumbai at 19 without a job Goes Viral

ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్‌ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 

19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్‌–అమెరికన్‌ ఆర్టిస్ట్‌ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్‌ టీచర్‌గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.

కట్‌ చేస్తే....
ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్‌ మీడియాలో పంచుకుంది. 

‘హరకాత్‌’ ఫ్యాషన్‌ లేబుల్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్‌లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్‌లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. 

 

(చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement