
ట్రంప్ గెలుపుతో ఒక్కసారిగా..అమెరికా మహిళా లోకం భగ్గుమంటోంది. చూస్తుండగానే కార్చిచ్చులా మారనుంది. ఎందుకంటే మహిళలంతా ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ వినూత్న ఉద్యమానికి తెరలేపారు. అప్పుడే అక్కడ కాపురాల్లో కల్లోలాలు మొదలయ్యాయి. ఈ ఊహించని పరిణమానికి అక్కడి మగవాళ్లంతా తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ గెలుపు మా కాపురాలకు ఎసరుపెట్టిందంటూ లబోదిబోమంటున్నారు. అమెరికాలో కలకలం రేపుతున్నా ఆ ఉద్యమం కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..!
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ తరుణంలో అక్కడ మహిళా లోకం ఆయనపై కోపంతో అట్టుడుకిపోతూ.. ఉత్తరకొరియాకి చెందిన ఉద్యమానికి తెరలేపింది. అదికూడా ట్రంప్ గెలిచిన కొద్ది గంటల్లోనే ఇది జరగడం విశేషం. అందుకు ప్రధాన కారణం ట్రంప్ గర్భస్రావాన్ని వ్యతిరేకించే వ్యక్తి కావడమే.
గతంలో అయన అధ్యక్ష పదవీ కాలంలో (2017-2021) సుప్రీంకోర్టు గర్భస్రావం(అబార్షన్) చేయించుకోవడం చట్టవిరుద్ధం అంటూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. అదీగాక ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా అబార్షన్లకు వ్యతిరేకంగానే మాట్లాడారు. కానీ డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమాలా హారిస్ మాత్రం ప్రచారంలో మహిళా హక్కులకు రక్షణ కల్పిస్తానన్నారు. అబార్షన్లపై నిర్ణయాధికారాన్ని మహిళలకే ఇస్తానన్నారు. అంతేగాదు ముగిసిన ప్రజాస్వామిక పోల్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. మెజార్టీ శాతం మహిళా ఓటర్లలో 54% మంది హారిస్‌కి ఓటు వేయగా ట్రంప్‌కి మాత్రం 44% మాత్రమే పోలయ్యాయి.
కానీ అధ్యక్షుడిగా ట్రంప్‌నే అత్యధిక మెజార్టీతో గెలిచారు. అక్కడి ప్రజలు ట్రంప్‌కే పట్టం కట్టడం నచ్చని మహిళలు దక్షిణకొరియాకి సంబంధించిన "ఫోర్‌బీ ఉద్యమం"కి మద్దుతిచ్చారు. అంతేగాదు ట్రంప్‌ని గెలిపించిన మగవాళ్లను బాయ్‌కాట్ చేస్తామంటున్నారు అక్కడి మహిళలు. అంతేగాదు వారితో కలిసి ఉండం, పిల్లల్ని కనం, వారితో శారీరక సంబంధం పెట్టుకోం, అని తెగేసి చెబుతున్నారు మహళలు. ఈ ట్రంప్ గెలుపు మా కాపురాల్లో చిచ్చురేపిందంటూ మగవాళ్లంతా తలలుపట్టుకుంటున్నారు. అమెరికాలో అంతలా హాట్‌టాపిక్‌గా మారిన ఫోర్ బీ ఉద్యమం అంటే ఏంటి..?.
ఈ ఉద్యమం దక్షిణ కొరియా నుంచి వచ్చింది. 2019లో ప్రారంభమై కొరియన్ పదం "bi"తో ప్రారంభమయ్యే నాలుగు పదాలకు సంబంధించినది.
Bihon: పెళ్లి చేసుకోరు లేదా నో డేటింగ్
Bichulsan: : పిల్లల్ని కనరు
Biyeonae: డేటింగ్ లేదు
Bisekseu: శారీరక సంబంధం ఉండదు
దక్షిణ కొరియాలో లింగ అసమానతలు చాలా ఎక్కువ. అక్కడ కూడా మహిళలు పురుషుల కంటే 31% తక్కవ వేతనమే తీసుకుంటున్నారు. పైగా మహిళల మరణాలు ఎక్కువే. అందులో చాలావరకు భాగస్వామి గృహహింస కారణంగా చనిపోయిన కేసులే ఎక్కువ. ఆ నేపథ్యంలోనే పురుషాధిక్య పాలనపై విసుగుతో వచ్చిన వ్యతిరేకతకు నిదర్శనమే ఈ ఫోర్‌బీ ఉద్యమం.
ప్రస్తుతం ఈ ఉద్యమానికి అమెరికా మహిళలు మద్దతుల ఇస్తున్నారు. ప్రధానంగా అబార్షన్ చట్టంపై ఉన్న వ్యతిరేకతోనే అక్కడ మహిళలు ఈ ఉద్యమానికి తీవ్ర స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. అదీగాక ట్రంప్ గర్భస్రావం వ్యతిరేక అభిప్రాయాలు తోడవ్వడంతో ఇలా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగుతోంది అక్కడ. ఈ ఉద్యమంలో భాగంగా స్త్రీద్వేషపూరిత ఉత్పత్తులను కొనుగోలు చేయరు. అలాగే కొన్ని సాంస్కృతిక పద్దతులను కూడా వారంతా వ్యతిరేకిస్తారు. జపాన్‌లోని మహిళలు కూడా ఈ ఉద్యమాన్నే ఎంచుకుని అమెరికా బాటనే పడుతోంది.
మరీ భారత్‌లో అంటే..ఈ ఫోర్‌బీ ఉద్యమం విజయవంతం అవ్వడం అనేది పూర్తిగా మహిళ సాధికారతపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న పరిమిత వనరుల దృష్ట్యా ఇప్పటికీ ఇక్కడ మహిళలు చాలా వరకు పురుషులపై ఆధారపడే జీవిస్తున్నారు. అలాగే కొన్ని కుటుంబ సంప్రదాయాలకు తలంచక తప్పని స్థితి అందువల్ల ఈ ఉద్యమంతో భారతీయ మహిళలు ప్రభావమయ్యే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు.
american women it's time to learn from the koreans and adopt the 4b movement
as a matter of fact women from all over the world should adopt the 4b movement
i'm so serious pic.twitter.com/WxfqxouAn1— coleni. (@jungsooyawning) November 6, 2024
(చదవండి: బ్రిటన్ రాణి సైతం చాక్లెట్ టేస్ట్‌కీ ఫిదా..!)