
మెరుగైన అవకాశాలు, ఆర్థిక భద్రత కోసం చాలామంది భారతీయులు విదేశాల బాటపడుతుంటారు. అందుకోసమే యువత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు పయనమవుతోంది. ఆ దేశాలు వారికి వృత్తిపరమైన అబివృద్ధితోపాటు ఆర్థిక స్థైర్యాన్ని కూడా అందిస్తున్నాయి. అయితే ఇది కాస్త సవాళ్లతో కూడినది కూడా. పైగా ఆ దేశాల సంస్కృతికి అనుగుణంగా బతకడం అనేది అంత ఈజీ కూడా కాదు. తమ వాళ్లను వదిలి ఆ కొత్త వాతావరణంలో నెగ్గుకురాక తప్పని స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఓవ్యక్తి మాత్రం పదేళ్లకు పైగా విదేశంలో ఉండి మరీ..తాను స్వదేశానికి వచ్చి మంచి పనిచేశానంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని చెప్పేస్తున్నాడు. విదేశాలకి వెళ్తేనే మంచి లైఫ్ అనుకునేవారి ఆలోచనకు అత్యంత విభిన్నంగా తన మనోభావాలను ఆన్‌లైన్ వేదికగా షేర్ చేసుకున్నాడు ఈ సీఈవో.
ఎందుకంటే..ఆర్క్‌అలైన్డ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అనిరుద్ధ అంజనా అమెరికాలో ఒక దశాబ్ద కాలం పాటు ఉన్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు భారతదేశానికి తిరిగి రావాలని గట్టిగా నిర్ణయించుకుని మరీ వచ్చేశారు. అయితే వాళ్లు వీసా సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి రీజన్లు కాకుండా బలమైన కారణాన్ని వివరిస్తూ నెటిజన్ల మనసును దోచుకున్నారు. ఇంతకీ ఎందువల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే..అనిరుద్ధ తన వృద్ధ తల్లిదండ్రులును చూసుకోవాలనే ఉద్దేశ్యంతో స్వదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు.
జాబ్ సెక్యూరిటీ, వలస అనిశ్చితులు, కెరీర్ సమస్యల వల్ల కాదని తేల్చి చెప్పేరు. కేవలం తన కెరీర్ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులకు తన అవసరం ఉన్నందున తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాడు. అయితే తన స్నేహితులు బంధువులు నుంచి తాను ఉద్యోగం కోల్పోవడం, వీసా సమస్యలు వల్ల ఇలా నిర్ణయం తీసుకున్నానంటూ పలు వ్యాఖ్యాలు వచ్చాయి.
కానీ అసలు రీజన్ మాత్రం తల్లిదండ్రులతో పూర్తి సమయం వెచ్చించేందుకే ఇలా చేశానంటూ తెలిపారు. వారు నన్ను తిరిగి వచ్చేయమని ఎప్పటికీ అడగరని తెలిసే ఇలా చేశానంటూ ఇన్‌స్టాగ్రాంలో వివరించారు సీఈవో అనిరుద్ధ. తాను జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం ఇదేనని చాలా నమ్మకంగా చెప్పారు.
అనిరుద్ధ పోస్ట్ సోషల్‌మీడియా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. అతని పోస్ట్‌పై స్పందిస్తూ..సవాలుతో కూడిన చక్కటి నిర్ణయం అని ఒకరు, బంధాల విలువను తెలిపేలా ఉంది, అందరూ ఇలా ఆలోచిస్తే బాగుండును అంటూ మరొకరు ఇలా అనిరుద్ధ నిరర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: 'గైనకాలజీ పితామహుడు': అనస్థీషియా లేకుండా నల్లజాతి మహిళలపై..!)
Comments
Please login to add a commentAdd a comment