pole Vault
-
తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టాడు..
టోక్యో ఒలింపిక్స్ చాంపియన్ మోండో డుప్లాంటిస్ పోల్ వాల్ట్‌లో మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. బెల్గ్రేడ్ ఇండోర్ మీటింగ్ అథ్లెటిక్స్ టోర్నీలో 22 ఏళ్ల ఈ స్వీడన్ ప్లేయర్ 6.19 మీటర్ల ఎత్తుకు ఎగిరాడు. ఈ క్రమంలో 2020 ఫిబ్రవరిలో గ్లాస్గో టోర్నీలో 6.18 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా డుప్లాంటిస్కిది మూడో ప్రపంచ రికార్డు. ఈనెల 18 నుంచి బెల్‌గ్రేడ్‌లోనే జరగనున్న ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో డుప్లాంటిస్ బరిలోకి దిగనున్నాడు. -
'పోల్‌వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం
Struggle of Young Pole Vaulter Devraj: భారతదేశంలో క్రీడలంటే మొదటగా గుర్తుకువచ్చేది.. క్రికెట్. క్రికెట్ తర్వాత బ్యాడ్మింటన్, హాకీ, టెన్నిస్, చెస్ లాంటి క్రీడలకు కాస్తో కూస్తో ప్రాధాన్యం ఉందని చెప్పొచ్చు. మనకు తెలియకుండా వివిధ రంగాల క్రీడల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను చూపెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఆ రంగంలో రాణించేలా ఆయా ప్రభుత్వాలు ఆటగాళ్లను ప్రోత్సహించడం లేదు. ఆ కోవకు చెందినవాడు దేవరాజ్. రాజస్తాన్‌కు చెందిన దేవరాజ్‌కు గొప్ప పోల్‌వాల్టర్ కావాలనేది కల. చిన్నప్పటి నుంచే పోల్‌వాల్ట్‌పై మమకారం పెంచుకున్న అతను.. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లేనప్పటికి తన సొంతకాళ్లపై కష్టపడుతూనే పోల్‌వాల్ట్‌ను ఇష్టపడి నేర్చుకున్నాడు. 23 ఏళ్ల వయసు వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పోల్‌వాల్ట్‌లో మెళుకువలు అందిపుచ్చుకున్న దేవరాజ్..తన శిక్షణలో మరింత రాటుదేలేందుకు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఎంచుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే దేవరాజ్ 2019లో ఢిల్లీలో అడుగుపెట్టాడు. నెహ్రూ స్డేడియానికి ఆనుకొని పక్కనే ఒక డ్రైనేజీ ఉంటుంది.. దానికి ఆనుకొని ఒక చిన్న గది ఉంటుంది. అందులోనే దేవరాజ్ అద్దెకు ఉండేవాడు. పోల్‌వాల్ట్ కర్ర తన రూమ్‌లో ఉంచడం సాధ్యం కాకపోవడంతో ఇంటి టెర్రస్‌కు తాడుతో కట్టేవాడు. ఉదయం నాలుగు గంటలకే లేచి మూడు గంటలపాటు నెహ్రూ స్డేడియంలో సాధన చేసేవాడు. అనంతరం పొట్టకూటి కోసం సైకిల్‌పై వెళ్లి ఎక్కడ ఏ పని దొరికినా ఇష్టంతో చేసేవాడు. చదవండి: ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్ ఎలాగైనా పోల్‌వాల్టర్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపెట్టడంతో పాటు.. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కల గన్నాడు. అతను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. అతను వచ్చిన ఆరు నెలల్లోనే కరోనా మహమ్మారి ఉపద్రవం ముంచుకొచ్చింది. దీంతో తాను రోజు ప్రాక్టీస్ చేసే నెహ్రూ స్టేడియాన్ని మూసేశారు. దీంతో ఇంటికి తిరిగి వెళ్లలేక.. చేసేందుకు పనిలేక నానా అవస్థలు పడ్డాడు. అయితే తన ఆశయాన్ని మాత్రం దేవరాజ్ ఎన్నటికి విడవలేదు. పరిస్థితులు సద్దుమణిగాక నెహ్రూ స్డేడియాన్ని మళ్లీ తెరిచారు. ఈసారి దేవరాజ్ సరికొత్తగా సిద్ధమయ్యాడు. పొద్దంతా నెహ్రూ స్టేడియంలో పోల్‌వాల్ట్ సాధన చేస్తున్న దేవరాజ్..రాత్రుళ్లు నిర్మాణంలో ఉన్న భవనాలకు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తూ బతుకుతున్నాడు. ప్రస్తుతం తాను సంపాదిస్తున్న ప్రతీ రూపాయి అద్దెకు.. తిండికే సరిపోతున్నాయి. తన ఆటను ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి సహకారమందిస్తుందనే ఆశతో దేవరాజ్ ఎదురుచూస్తున్నాడు. చదవండి: Neeraj Chopra: గూగుల్‌లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తిగా రికార్డు -
మార్కెట్ల పోల్‌వాల్ట్- 835 పాయింట్లు అప్
ఆరు రోజుల వరుస నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్య బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీతోనూ, నిఫ్టీ సెంచరీతోనూ ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఆపై మరింత ఊపందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 835 పాయింట్లు దూసుకెళ్లి 37,389 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 245 పాయింట్లు జంప్‌చేసి 11,050 వద్ద స్థిరపడింది. వెరసి ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే మార్కెట్లు ముగిశాయి. ఆటో, ఐటీ జోరు ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 3.5-2 శాతం మధ్య బలపడ్డాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, బ్యాంకింగ్, ఫార్మా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ 3.5-2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్ ఫిన్, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా, ఎయిర్టెల్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, గ్రాసిమ్, అదానీ పోర్ట్స్, ఐషర్, టీసీఎస్, ఐసీఐసీఐ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, మారుతీ 6.7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బ్లూచిప్స్‌లో ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, యూపీఎల్ మాత్రమే అదికూడా 1-0.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. ఎఫ్‌అండ్‌వోలో డెరివేటివ్ కౌంటర్లలో అశోక్ లేలాండ్, ఐడియా, జీఎంఆర్, కోఫోర్జ్, ఐడీఎఫ్సీ ఫస్ట్, మణప్పురం, ముత్తూట్, జిందాల్ స్టీల్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, గ్లెన్‌మార్క్, ఎక్సైడ్, మదర్సన్, నాల్కో, టాటా పవర్, ఐబీ హౌసింగ్, బయోకాన్, ఎన్ఎండీసీ, కెనరా బ్యాంక్, బీవోబీ, శ్రీరామ్ ట్రాన్స్ 13.5- 4.7 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. ఈ విభాగంలో హావెల్స్, సీమెన్స్ మాత్రమే అదికూడా 1-0.4 శాతం చొప్పున డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 3-2.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,984 లాభపడగా.. కేవలం 664 నష్టాలతో ముగిశాయి. ఎఫ్‌పీఐల అమ్మకాలు నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1,886 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) స్వల్పంగా రూ. 189 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,912 కోట్లకు మించి అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 1,629 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. -
వారంలో రెండో ప్రపంచ రికార్డు
గ్లాస్గో (స్కాట్లాండ్): స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్టర్ అర్మాండ్ డుప్లాన్‌టిస్ వారం వ్యవధిలో రెండోసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం జరిగిన మిల్లర్ ఇండోర్ గ్రాండ్‌ప్రి మీట్లో పోల్‌వాల్ట్ ఈవెంట్లో డుప్లాన్‌టిస్ 6.18 మీటర్ల ఎత్తుకు ఎగిరి.... గతవారం 6.17 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాశాడు. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాన్టిస్కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 46 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు
టోరన్ (పోలాండ్): ఒర్లెన్ కోపెర్నికస్ కప్–2020 వరల్డ్ అథ్లెటిక్స్ ఇండోర్ మీట్లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్ డుప్లాన్‌టిస్ పోల్‌వాల్ట్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల డుప్లాన్‌టిస్ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి... 2014లో రెనాడ్ లావిలెని (ఫ్రాన్స్–6.16 మీటర్లు) నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.