
గ్లాస్గో (స్కాట్లాండ్): స్వీడన్‌కు చెందిన పోల్‌వాల్టర్ అర్మాండ్ డుప్లాన్‌టిస్ వారం వ్యవధిలో రెండోసారి ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం జరిగిన మిల్లర్ ఇండోర్ గ్రాండ్‌ప్రి మీట్‌లో పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో డుప్లాన్‌టిస్ 6.18 మీటర్ల ఎత్తుకు ఎగిరి.... గతవారం 6.17 మీటర్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాశాడు. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాన్‌టిస్‌కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 46 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment