సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
(ఇది చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!)
యూట్యూబ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దేవరాజ్ తన 'దిల్ సే బురా లగ్తా హై' అనే డైలాగ్‌తో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయనకు యూట్యూబ్‌లో అతనికి 4 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కమెడియన్ దేవ్‌రాజ్ పటేల్ పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. కాగా.. 2021లో భువన్ బామ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ధిండోరాలో దేవరాజ్ విద్యార్థి పాత్రలో కనిపించాడు. దేవ్‌రాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేశాడు.
సీఎం ట్విటర్‌లో రాస్తూ.. ''దిల్ సే బురా లగ్తా హై'తో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?)
“दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए.
— Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023
इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है.
ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v
Comments
Please login to add a commentAdd a comment