chathisgarh
-
స్పైసీ స్పైసీ ఎర్ర చీమల చట్నీ: ఇక వరల్డ్ వైడ్‌గా మారు మోగనుంది
చీమల పచ్చడి గురించి ఎపుడైనా విన్నారా? ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్, ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోనూ ఇది ఫ్యామస్. రుచికరమైన చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌తో సహా జిల్లాలోని ప్రతి బ్లాక్ ఏరియాలోని అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి. ఒడిశాలోని మయూర్భంజ్ ప్రజలు దీన్ని విరివిగా వాడతారు. వీరు తయారు చేసే స్పైసీ స్పైసీ రెడ్ యాంట్ చట్నీకి ఇప్పటికే భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇపుడిక జీఐ ట్యాగ్ కూడా అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో రెడ్ యాంట్ చట్నీ ఇక వరల్డ్ వైడ్‌గా గుర్తింపును తెచ్చుకోనుంది. మయూర్భంజ్ రెడ్ యాంట్ చట్నీకి GI ట్యాగ్ మయూర్భంజ్లోని రెడ్ చట్నీపై చేసిన పరిశోధనలో, శాస్త్రవేత్తలు రెడ్ వీవర్ చీమలను విశ్లేషించారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. రెండ్ యాంట్ చట్నీ కేవలం రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని వైద్యపరమైన లక్షణాల కారణంగా ఇది స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసంతో పాటు, ఈ చట్నీలోని ఔషధ గుణాలను నిపుణులు ఇప్పటికే గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. స్థానికంగా చాప్ డా అని పిలిచే ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారంటే ఈ రెడ్ వీవర్ చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. దీని తరువాత, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కారం..కారంగా , పుల్లగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. స్థానిక గిరిజనులు తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులోని ప్రొటీన్, కాల్షియం, ఫామిక్ యాసిడ్, ఇతర పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మారుమూల గిరిజనవాసులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనుల విశ్వాసం. అలాగే కొలంబియా, మెక్సికో, బ్రెజిల్‌లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే OUAT బృందం 2020లో శాస్త్రీయ ఆధారాలతో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపుకోసం చేసిన ప్రయత్నం ఫలించింది. -
22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘మహదేవ్ బుక్’యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్‌యాప్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్‌ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) యూట్యూబ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దేవరాజ్ తన 'దిల్ సే బురా లగ్తా హై' అనే డైలాగ్‌తో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయనకు యూట్యూబ్‌లో అతనికి 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కమెడియన్ దేవ్‌రాజ్ పటేల్ పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. కాగా.. 2021లో భువన్ బామ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ధిండోరాలో దేవరాజ్ విద్యార్థి పాత్రలో కనిపించాడు. దేవ్‌రాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేశాడు. సీఎం ట్విటర్లో రాస్తూ.. ''దిల్ సే బురా లగ్తా హై'తో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) “दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए. इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है. ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v — Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023 View this post on Instagram A post shared by Devraj Patel (@imdevrajpatel) -
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం సాయం త్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయి స్టులు మృతి చెందారు. జిల్లాలోని అద్వాల్–కుంజేరాల్ అటవీప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో కట్టేకల్యాణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తారసపడిన మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపగా.. డీఆర్జీ బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. గంటపాటు జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెం దారని.. వారిని మావోయిస్టు మిలటరీ ఇంటె లిజెన్స్ చీఫ్ ముసికి రాజే, కట్టేకల్యాణ్ ఏరియా కమిటీ సభ్యురాలు మరకం గీత, నుప్పో జ్యోతిగా గుర్తించామన్నారు. వీరిలో రాజే, గీతపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు. ఘటనాస్థలంలో ఒక 12 బోర్ తుపాకీ, రెండు మందుపాతరలు, రెండు బర్మార్లను స్వాధీనం చేసుకున్నాట్టు వెల్లడించారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని, వారి కోసం కూంబింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. కాగా.. శనివారం రాత్రి 14 మావోయిస్టులు దంతెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఎదుట లొంగిపోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. పోలీసులపై దాడులు, రోడ్ల ధ్వంసం, మందుపాతరలు పెట్టడం వంటి కేసుల్లో వారంతా నిందితులుగా ఉన్నారని.. వారికి ప్రభుత్వ పాలసీ ప్రకారం పునరావాసం కల్పిస్తామని తెలిపారు. -
అజిత్ జోగి ఎస్టీ కాదు: తేల్చిచెప్పిన కమిటీ
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అజిత్ జోగి ఎస్టీ కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తేల్చి చెప్పింది. అజిత్ జోగి వద్దనున్న కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్టీ హోదాతో లభించిన ప్రయోజనాలను వెనక్కి తీసుకొని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిలాస్పూర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కేసు పూర్వాపరాలు : 2001లో బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నందకుమార్ సాయి, సంత్ కుమార్ నేతంలు కలిసి అజిత్ జోగి ఎస్టీ కాదంటూ హైకోర్టులో కేసు వేశారు. కానీ ఒక వ్యక్తి కులాన్ని ధృవీకరించడానికి జాతీయ కమిషన్‌కు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తీర్పును సంత్‌కుమార్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో సుప్రీం కోర్టు, ఒక హైపవర్ కమిటీ వేసి విచారించాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని 2011లో ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ 2017లో అజిత్ జోగి ఎస్టీ కాదంటూ నివేదిక ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అజిత్‌జోగి 2018లో హైకోర్టుకు వెళ్లగా, కోర్టు కమిటీ సభ్యులను మార్చింది. కొత్తగా ఏర్పాటైన కమిటీ కూడా మునుపటి నివేదికనే ఇవ్వడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అజిత్‌జోగి ప్రస్తుతం రిజర్వుడ్ అసెంబ్లీ స్థానం మార్వాహి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వ్యవహారంపై అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి స్పందిస్తూ.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతుందన్నారు. కమిటీ ఎలాంటి ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు ఆయన కోరుకున్న విధంగానే నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. నా తండ్రి కలెక్టర్‌గా సెలెక్ట్ అయినపుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. -
అమర జవానుకు అశ్రునివాళి
సాక్షి, రామచంద్రపురం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత కాంకేర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై ఈ నెల 3న మావోయిస్టులు జరిపిన దాడిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన శీలం రామకృష్ణ (30) వీరమరణం పొందారు. ఆయ న మృతదేహాన్ని బీఎస్ఎఫ్ నేతృత్వంలో విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పట్టణంలోని శీలంవారి సావరంలో ఉన్న ఆయన ఇంటికి శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన ఆయన మృతదేహాన్ని పట్టణ వాసులు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం ఇంటి నుంచి శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన సేవలకు గౌరవ సూచకంగా జవాన్లు గాలిలోకి తుపాకులతో కాల్పులు జరిపి, వందనం సమర్పించారు. విశాఖపట్నం, కాకినాడ నుంచి వచ్చిన బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు రామకృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు వీర జవాను రామకృష్ణ మృతదేహం ఇంటికి చేరుకోగానే భార్య సౌందర్య, ఆయన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బీఎస్ఎఫ్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న రామకృష్ణకు 2016లో సౌందర్యతో వివాహం జరిగింది. ఇటీవల ఇంటికి వచ్చిన రామకృష్ణ మాటల సందర్భంగా తన మామయ్యతో ‘‘నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దురుగాని’’ అని అన్నారు. రామకృష్ణ అంత్యక్రియల్లో వేలాదిగా పాల్గొన్న ప్రజల్ని చూసి.. ఆ మాటలే గుర్తుకు వచ్చి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ముని గిపోయారు. ఆర్డీఓ ఎన్.రాజశేఖర్, డీఎస్పీ జయంతి వాసవీ సంతోష్, సీఐ పెద్దిరెడ్డి శివగణేష్, ఎస్సై ఎస్.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. శ్మశాన వాటికలో రామకృష్ణ మృతదేహానికి వైఎస్సార్ సీపీ రామచంద్రపురం ఎమ్మె ల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణు శ్రద్ధాంజలి ఘటించి, ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పోలవరంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలవరం విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తమ వాదనలను త్రిసభ్య ధర్మాసనం ఎదుట వినిపించాయి. పోలవరం ప్రాజెక్టులో భాగంగా 50 మీటర్ల వెడల్పుతో 60 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మిస్తున్నారని, దీంతో చాలాప్రాంతం ముంప్పునకు గురవుతుందని ఒడిషా ప్రభుత్వం తన అభ్యంతరాలను సుప్రీం దృష్టికి తీసుకురాగా, ఈ విషయమై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ బాధ్యత రాష్ట్రాలదే అని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలంటే తమకు కొంత సమాచారం కావాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కోర్టును కోరాయి. తమకు ఏ సమాచారం కావాలో తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు కావాల్సిన సమాచారం ఇవ్వాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ మదన్ బీ లోకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం కేసు ఒక అంతు లేని కథ అని ఆయన వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను జనవరి మొదటివారానికి కోర్టు వాయిదా వేసింది. -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
రాయ్‌పూర్/చింతూరు (రంపచోడవరం)/చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సలైట్లు, భద్రతా దళాలకు మధ్య సోమవారం జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 9 మంది నక్సల్స్‌తోపాటు ఇద్దరు పోలీసులు మరణించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని సుక్మా జిల్లా దక్షిణ ప్రాంతమైన కిస్తారం, చింతగుహ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ‘ఆపరేషన్ ప్రహార్ – ఐV’ పేరిట 1,200 మంది సిబ్బంది మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) డీఎం అవస్థీ చెప్పారు. తెలంగాణ పోలీసులతో కలసి ఛత్తీస్‌గఢ్ ఎస్టీఎఫ్, డీఆర్జీ దళాలు, సీఆర్పీఎఫ్ అనుబంధ కోబ్రా బృందాలు ఆదివారం రాత్రి తొండమర్క, సలెతోంగ్ గ్రామాలు, సక్లేర్ అడవుల్లో కూంబింగ్ ప్రారంభించారని తెలిపారు. కిస్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సక్లేర్ గ్రామాన్ని డీఆర్జీ భద్రతా దళాలు సోమవారం ఉదయం 9.40 గంటలకు చుట్టుముట్టాయనీ, అక్కడ ఉన్న నక్సల్స్ కాల్పులకు దిగారన్నారు. అనంతరం డీఆర్జీ దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించగా ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్‌తోపాటు దిర్డో రామ, మడివి జోగా అనే ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు. మృతదేహాలను వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. చనిపోయిన నక్సల్స్‌లో ఇద్దరిని గుర్తించారు. వారిద్దరూ తాటి భీమ, పొడియం రాజే అనీ, వారిద్దరి తలలపై 8 లక్షల బహుమానం ఉందని అధికారులు తెలిపారు. చింతగుహ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్మగుండ గ్రామ సమీపంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కోబ్రా దళాలు ఓ నక్సల్‌ను అంతం చేశాయి. రెండు ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి పదికి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«ధీనం చేసుకున్నామని అవస్థీ చెప్పారు. ఆపరేషన్ ప్రహార్ మొదటి మూడు దశలు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. పక్కా సమాచారంతోనే దాడి... త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో సమావేశం జరుగుతోందన్న సమాచారంతో ఛత్తీస్ పోలీసులు దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 12న ఛత్తీస్‌లోని మావోప్రాబల్య ప్రాంతంలో ఎన్నికలు ముగియగా తెలంగాణలోని మావోయిస్టు ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో డిసెంబర్ 7న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు ఆజాద్ సరిహద్దుల్లో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమయానికి ఆజాద్ సమావేశానికి హాజరు కాలేదని, ఈలోపుగానే బలగాలు ఆ సమావేశంపై దాడి నిర్వహించడంతో 8 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌కు నరేంద్ర మోదీ సవాల్
అంబికాపూర్: ధైర్యముంటే గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ సవాలు విసిరారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన ప్రజాస్వామ్య విలువల వల్లే చాయ్‌వాలా కూడా ప్రధాని కాగలిగారన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. తాను ప్రధాని అయినందుకు ఆ క్రెడిట్‌ను కాంగ్రెస్.. ప్రజలకు కాకుండా నెహ్రూకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో జరిగిన మరో ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా’ పనితీరుకు, ‘నాలుగు తరాల నెహ్రూ–గాంధీ కుటుంబ’ పాలనకు మధ్య జరిగే పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘గాంధీ కుటుంబానికి చెందని, నిబద్ధత కలిగిన నాయకుడిని ఐదేళ్లు మీ పార్టీకి అధ్యక్షుడిగా నియమించండి. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే లాంటి ప్రజాస్వామ్యాన్ని నెహ్రూ నిర్మించారని అప్పుడు నేనూ నమ్ముతా’ అని అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో తుదివిడత పోలింగ్ ఈనెల 20న జరగనుంది. మధ్యప్రదేశ్‌లో ఒకేవిడతలో 28న జరగనుంది. నాలుగు తరాలా? నాలుగున్నరేళ్లా?.. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో సమకూర్చని విద్యుత్, ఎల్పీజీ, బ్యాంకు సేవలు వంటి సౌకర్యాల్ని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేరువచేసిందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ అన్నారు. ‘ నాలుగు తరాల కాంగ్రెస్ పాలన, నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా పాలన మధ్య పోటీ పెడదాం. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకుల్ని జాతీయం చేశారు. కానీ పేదలకు ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కానీ మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే అందరికీ బ్యాంకింగ్ సేవలు కల్పించింది అని పేర్కొన్నారు. -
మత మార్పిడికి వచ్చిన ‘ఇటలీ ఏజెంట్లు’
జాష్పూర్: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇటలీ నుంచి వచ్చిన ఏజెంట్లు గిరిజనులను మత మార్పిడులకు ప్రోత్సహించారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్పూర్లో గురువారం ప్రచార సభలో ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇటలీ ఏజెంట్లు’ అని పరోక్షంగా సోనియా గాంధీ మూలాల్ని ప్రస్తావించారు. ‘ఇటలీ ఏజెంట్లు..గిరిజనులు మతమార్పిడులకు పాల్పడాలని ఒత్తిడి పెంచి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు ఒడిగట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రోడ్లు, విద్య, విద్యుత్ వంటి సౌకర్యాలు లేకున్నా మతమార్పిడుల జాడ్యం మరింత ఎక్కువైంది. దివంగత బీజేపీ ఎంపీ దిలీప్‌సింగ్ జుదేవ్ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొని జాష్పూర్ మరో బస్తర్ కాకుండా అడ్డుకున్నారు. కరుస్తుందని తెలిసినా హిందువులు పాముకు పాలు పోస్తారు. త్యాగాల్ని విశ్వసించే హిందూ మతం ప్రపంచంలోనే చాలా అత్యంత గొప్పది. ఇతరుల మాదిరిగా బలవంతపు మతమార్పిడులను హిందువులు నమ్మరు. ఛత్తీస్‌గఢ్‌లో రామరాజ్యం నెలకొల్పే ప్రభుత్వం రావాలి’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వలసదారులు వెనక్కే: షా లోక్‌సభ ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో ప్రచార సభలో మాట్లా డుతూ 1971 నుంచి భారత్‌లోకి చొరబడిన వలసదారులు కాంగ్రెస్, తృణమూల్ లాంటి పార్టీలకు ఓటుబ్యాంకుగా మారారన్నారు. -
‘మోదీ, అంబానీ పేర్లు బయటకొస్తాయి’
కబీర్‌దాం/కోర్బా: రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిగితే ప్రధాని మోదీ, వ్యాపారవేత్త అంబానీల పేర్లు త్వరలో బయటకు వస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండవ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. ‘రఫేల్ కుంభకోణంపై సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ దర్యాప్తు ప్రారంభించారు. అయితే అర్థరాత్రి 12 గంటలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రధానమంత్రి ఆయనను తొలగించారు. ఒకరోజు తప్పకుండా ఆ రెండు పేర్లు బయటకు వస్తాయి. ఆ పేర్లు ప్రధాని నరేంద్రమోదీ, అనిల్ అంబానీ’’అని రాహుల్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. -
హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న సెమీఫైనల్ పోరు
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా విపక్షాలను ఏకం చేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, ఎన్నికల్లో విజయం సాధించి కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కుల సమీకరణాలు, చివరినిమిషంలో అభ్యర్థులు పార్టీలు మారడం, అధికార విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ ఎన్నికలు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు కీలక ఎన్నికలు కావడంతో విజయం కోసం బీజేపీ తరఫున ప్రధాని మోదీ, కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. బీఎస్పీతోనే తంటా.. ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రమణ్‌సింగ్ సర్కారు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా, ఎలాగైనా ఈసారి అధికారం చేపట్టాలన్న కాంగ్రెస్ పార్టీ గంపెడాశతో ఉంది. అయితే అజిత్ జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జేసీసీ)–బీఎస్పీ కూటమి ఈ ఆశలపై నీళ్లు చల్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటునే గెలుచుకున్నప్పటికీ 4.27 శాతం ఓట్లను చీల్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 1.57 శాతం ఓట్లను, గోండ్వానా గణతంత్ర పార్టీ 0.29 ఓట్లను పొందాయని తెలిపారు. దాదాపు 10 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై బీఎస్పీ–జేసీసీ కూటమి దృష్టిసారించినట్లు వెల్లడించారు. అయితే ఈ కూటమి వల్ల నష్టం మీకేనని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. 2013 ఎన్నికల్లో ఈ పదింటిలో బీజేపీ 9 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. శివరాజ్‌సింగ్‌కు వ్యతిరేక పవనాలు.. మధ్యప్రదేశ్‌లో గత 18 ఏళ్లుగా అధికారాన్ని నిలుపుకున్న శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. మంద్సౌర్ రైతులపై కాల్పులు, పంటలకు మద్దతు ధర సహా పలు అంశాల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలో విస్తృతంగా పర్యటించారు. భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం కృషి చేయాలని నేతలు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్, దిగ్విజయ్‌లకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఇక్కడ సైతం బీఎస్పీ గట్టి ప్రభావాన్ని చూపనుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 230 స్థానాలకు గానూ బీజేపీ 165 సీట్ల(44.88 శాతం ఓట్లు)తో అధికారాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ 58 స్థానాలకు(36.38 శాతం ఓట్లు) పరిమితమైంది. ఇక బీఎస్పీ 6.29 శాతం ఓట్లతో నాలుగు సీట్లను దక్కించుకోగా, స్వతంత్రులు మూడు చోట్ల గెలిచారు. ఇటీవల సీఎం శివరాజ్‌సింగ్ బావ సంజయ్ సింగ్, మరో నేత సర్తాజ్ సింగ్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరడం, దళిత నేత ప్రేమ్‌చంద్ గుడ్డు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో 28న జరగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. వసుంధర రాజేకు గుబులు.. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని విశ్లేషకులు అంటున్నారు. 119 స్థానాలున్న అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో 63 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అలాగే మిజోరంలో పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకత ఎదురుకానుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగించని రాజస్తాన్ ప్రజల మనస్తత్వం సీఎం వసుంధరా రాజేను కలవరపెడుతోంది. మొత్తం 200 సీట్లున్న రాజస్తాన్ అసెంబ్లీకి 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 163 చోట్ల ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లతో చతికిలపడింది. -
10 రోజుల్లో రైతు రుణమాఫీ
పఖన్‌జోర్/రాజ్‌నందన్‌గావ్: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకొస్తే 10 రోజుల్లోనే రైతుల రుణాలను మాఫీ చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పఖన్‌జోర్, సీఎం సొంత నియోజకవర్గం రాజ్‌నందన్‌గావ్‌లలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ ఈ హామీలిచ్చారు. ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం రమణ్ సింగ్‌కు పారిశ్రామిక వేత్తలే దగ్గరి స్నేహితులంటూ రాహుల్∙విమర్శించారు. ‘ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌లకు స్నేహితులైన బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలే ఈ ప్రాంతంలోని అపార సహజ వనరులతో లాభపడుతున్నారు’ అని ఆరోపించారు. ‘జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) అమలుతో బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. నల్లధనం వెలికి తీస్తామంటూ పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్యులు కష్టాలకు గురయ్యారు’ అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ, రమణ్‌సింగ్ ఇద్దరూ బహిరంగంగానే అవినీతిలో కూరుకుపోయారన్నారు. నానమ్మ ఎన్నో నేర్పారు ఈ సందర్భంగా రాహుల్ తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘ఇందిరాగాంధీజీ నాకు ఎన్నో విషయాలు నేర్పారు. సమాజంలోని పేదలు, బలహీన వర్గాల కోసం కృషి చేయాలనేది ఆమె కోరిక. ఆ మేరకు అణగారిన, బలహీన వర్గాల పక్షాన నిలబడతా. వారి హక్కుల కోసం పోరాడుతా. గిరిజనుల సంక్షేమం కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె కృషి వల్లనే బెంగాలీలు బస్తర్ ప్రాంతానికి వలస వచ్చారు’ అని తెలిపారు. ‘రాష్ట్రంలో జరిగిన రూ.5వేల కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణం ఫలితంగా ఎందరో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. అయినప్పటికీ, ఏ ఒక్కరిపైనా ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఎందుకు? ఆ చిట్‌ఫండ్ కంపెనీలన్నీ రమణ్‌సింగ్ స్నేహితులవి’ అని రాహుల్ ఆరోపించారు. పనామా పత్రాల కుంభకోణంతో సంబంధమున్న పాక్ మాజీ ప్రధాని షరీఫ్ జైలు శిక్ష అనుభవిస్తుండగా, అదే కేసులో ఆరోపణలున్న సీఎం కొడుకు అభిషేక్‌పై ఎలాంటి చర్యలు లేవు’ అని అన్నారు. మరోవైపు, రాహుల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘జన్ ఘోషణా పత్ర’ విడుదల చేశారు. ఇందులో రైతు రుణమాఫీతోపాటు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
మూడు రాష్ట్రాల్లో బీజేపీకి షాక్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ ఇచ్చేలా ఫలితాలు ఉండబోతున్నాయని తేలింది. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించబోతోందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లోనూ కాంగ్రెస్ వైపే మొగ్గు ఉందని తాజాగా వెల్లడైన రెండు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. అసెంబ్లీ పోరుకు సిద్ధమవుతున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో ఓటరు నాడిని పసిగట్టేందుకు ‘ఏబీపీ న్యూస్– సీఓటర్’, ‘సీ ఫోర్’ సంస్థలు వేర్వేరుగా సర్వేలు జరిపాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి పరాజయం దాదాపు ఖాయమేనని ఆ సర్వేల్లో తేలింది. ఏబీసీ– సీఓటర్ మూడు రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించగా, సీఫోర్ రాజస్తాన్‌లో మాత్రమే సర్వే చేసింది. అయితే, బీజేపీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఆ పార్టీకి, కాంగ్రెస్‌కు మధ్య గెలుచుకునే సీట్లలో ఓట్ల శాతంలో స్వల్ప తేడానే ఉండటం గమనార్హం. అందువల్ల ఎన్నికల నాటికి చోటు చేసుకునే ఏ స్వల్ప పరిణామమైనా, సీట్ల సంఖ్యలో గణనీయ మార్పును తీసుకువచ్చే అవకాశముంది. ఈ సర్వేలో సీఫోర్ రాజస్తాన్‌లో 5,788 మంది నుంచి, ఏబీపీ న్యూస్–సీ ఓటర్ మూడు రాష్ట్రాల్లో కలిపి 26, 196 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. రాజస్తాన్ రాజస్తాన్‌లోని మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్ 49.9 ఓట్ల శాతంతో 142 సీట్లలో గెలవబోతోందని ఏబీపీ సీఓటర్ సర్వే తేల్చింది. 34.3 ఓట్ల శాతంతో బీజేపీ కేవలం 56 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలోనూ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వైపే రాష్ట్ర ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. సీఎం అభ్యర్థిగా పైలట్‌కు 36%, ప్రస్తుత సీఎం వసుంధర రాజేకు 27%, కాంగ్రెస్ మరో నేత అశోక్ గెహ్లాట్‌కు 24% ఓటేశారు. సీఫోర్ సర్వే కూడా కాంగ్రెస్‌కు 124 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 50%, బీజేపీకి 43% ఓట్లు లభిస్తాయని తెలిపింది. ఈ సర్వే ఫలితాలే నిజమైతే.. ప్రతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోయే రాజస్తాన్ సంప్రదాయం కొనసాగినట్లవుతుంది. మధ్యప్రదేశ్ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి పరాజయం దిశగా వెళ్తోందని ఏబీపీ– సీ ఓటర్ సర్వే పేర్కొంది. అయితే, సీఎం అభ్యర్థిగా మాత్రం శివరాజ్‌సింగ్ చౌహాన్కే అత్యధికులు ఓటేశారు. 230 స్థానాలున్న అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 122 సీట్లను గెలుస్తుందని, బీజేపీ 108 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది. ఓట్ల శాతం విషయానికి వస్తే కాంగ్రెస్ 42.2%, బీజేపీ 41.5% సాధించనున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య కేవలం 0.7 శాతమే తేడా ఉండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్‌సింగ్‌కే ఛత్తీస్‌గఢ్ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. కానీ సీట్ల విషయానికి వస్తే మొత్తం 90 స్థానాల్లో కాంగ్రెస్ 38.9% ఓట్లతో 47 సీట్లలో, బీజేపీ 38.2% ఓట్లతో 40 సీట్లలో గెలవనుందని సర్వే తేల్చింది. ఇక్కడ కూడా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 0.7 మాత్రమే. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో వరుసగా 165, 142, 49 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుచుకున్న సీట్లు వరుసగా 58, 21, 39 కావడం గమనార్హం. -
ఛత్తీస్‌లో ముగ్గురు మావోల ఎన్కౌంటర్
పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుక్మా ఎస్పీ అభిషేక్‌మీనా కథనం ప్రకారం.. మావోలు సంచరిస్తున్నారనే సమాచారంతో ఫుల్బగ్డీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన డీఆర్జీ బలగాలు మల్కగూడ– ముల్లూరు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. మావోలు, పోలీసులు ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య గంటసేపు కాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు, నాలుగు తుపాకులు, పైప్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోలను ముల్లేర్‌కు చెందిన మడివి హిడ్మా, కర్తాటి మల్లా, హర్ది హరియాలుగా గుర్తించారు. పట్టుబడిన మావోయిస్టును రవ్వా భీమాగా గుర్తించారు. విద్యార్థి కిడ్నాప్?: సుక్మా జిల్లాలో మంగళవారం మావోయిస్టులు కళాశాల విద్యార్థిని అపహరించినట్లు తెలిసింది. కుంట సబ్ డివిజన్ పరిధిలోని ముర్లిగూడకు చెందిన పొడియం ముకేష్ స్థానిక ఆశ్రమ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. కుంటకు సమీపంలోని భెజ్జిలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలో కిడ్నాప్ చేసినట్టు సమాచారం. -
ఎమ్మెల్యే ఆదాయం 24.59 లక్షలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏడాదికి సరాసరి ఒక్కొక్కరు రూ. 24.59 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది. ఆ జాబితాలో కర్ణాటక ఎమ్మెల్యేలు సగటున రూ. కోటికి పైగా వార్షిక ఆదాయంతో ముందంజలో, ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు రూ. 5.4 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఎన్నికల సంస్కరణ కోసం కృషి చేస్తున్న అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ద నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ.. దేశవ్యాప్తంగా 4,086 మంది ఎమ్మెల్యేలకు గాను 3,145 మంది ఎన్నికల అఫిడవిట్ల వివరాల్ని విశ్లేషించి జాబితాను రూపొందించింది. 941 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లలో ఆదాయాన్ని ప్రకటించనందున వారిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నివేదిక అంశాల్ని పరిశీలిస్తే.. 1. దేశంలోని 3,145 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల వార్షిక సరాసరి ఆదాయం 24.59 లక్షలు.. 2. దక్షిణ భారతదేశంలో 711 మంది ఎమ్మెల్యేల గరిష్టంగా ఒక్కొక్కరు 51.99 లక్షలు ఆర్జిస్తున్నారు. 3. తూర్పు ప్రాంతంలోని 614 మంది ఎమ్మెల్యేలు సరాసరి ఒక్కొక్కరు 8.53 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నారు. 4. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలోని 203 మంది ఎమ్మెల్యేలు సరాసరిన ఏడాదికి రూ. 1.12 కోట్లు ఆర్జిస్తూ అగ్రస్థానంలో ఉన్నారు. 5. ఆ తర్వాతి స్థానంలో మహరాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 43.4 లక్షల సంపాదిస్తూ రెండో స్థానంలో ఉన్నారు. 6. ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలు అతితక్కువ ఆదాయం పొందుతున్నట్లు ఏడీఆర్ సర్వే విశ్లేషించింది. ఆ రాష్ట్రంలో 63 మంది ఎమ్మెల్యేల ఆదాయాల్ని విశ్లేషించగా.. ఒక్కొక్కరు సగటును రూ. 5.4 లక్షలు సంపాదిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేల ఆదాయం రూ. 7.4 లక్షలు. 7. ఆదాయార్జనలోను లింగ వివక్ష స్పష్టంగా కనిపించింది. మహిళా ఎమ్మెల్యేల కంటే పురుష ఎమ్మెల్యేల ఆదాయం రెండు రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. పురుష ఎమ్మెల్యేల వార్షికాదాయం 25.85 లక్షలుగా ఉండే మహిళా ప్రజాప్రతినిధుల ఆర్జన కేవలం రూ. 10. 53 లక్షలే. మొత్తం 3,145 మందికిగాను 55 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లో వృత్తి వివరాలు పేర్కొనలేదు. ఇక వ్యాపారాన్ని 777 మంది, వ్యవసాయాన్ని 758 మంది తమ వృత్తిగా పేర్కొన్నారు. 1,052 మంది విద్యార్హత 5 నుంచి 12వ తరగతి వరకూ పేర్కొనగా వారి వార్షికాదాయం 31 లక్షలుగా ఉంది. 1,997 మంది విద్యార్హతను డిగ్రీగా పేర్కొనగా వారి ఆదాయం 20.87 లక్షలు. 134 మంది ఎమ్మెల్యేల విద్యార్హత 8వ తరగతి కాగా.. వారి ఆదాయం 89.88 లక్షలు. -
సౌర సుజల యోజనతో..
రాయ్‌పూర్: అది మారుమూల గిరిజన కొండ ప్రాంతం. అక్కడి రైతులకు ఎలాంటి ఆదాయ మార్గాలులేవు. కనీసం విద్యుత్ కూడా ఉండేది కాదు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వారికి వరంలా మారింది. రెండేళ్లలో వారి దశ తిరిగింది. ఆదాయం లక్షల్లోకి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సౌర సుజల యోజన’ పుణ్యమే ఇదంతా. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఈ పథకం కింద మిరప వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించింది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లోని రైతులకు తక్కువ ధరకే సౌర విద్యుత్ పంప్సెట్లు సమకూర్చింది. కోపా గ్రామానికి చెందిన గుజ్‌నాథ్ రామ్ ఆహార పంటలను సాగుచేస్తూ సరైన దిగుబడులు రాక ఇబ్బందులు పడుతుండేవాడు. ఈ పథకం అమలు తర్వాత తనకున్న ఐదెకరాల్లో రెండేళ్లుగా ఆయన మిర్చితోపాటు, టమాటా, వరి కూడా సాగు చేస్తున్నారు. రామ్ ఏమంటున్నారంటే.. ‘ఇప్పటి వరకు వచ్చిన మిర్చి, టమాటాలను విక్రయించగా రూ.80వేలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా దిగుబడులు చేతికందుతాయి. ఇలా ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతాయి’. ‘సౌర్ సుజల యోజన’ ద్వారా లబ్ధి పొందుతున్న బగీచా, మనోరా ప్రాంతాల్లోని 50 గ్రామాలకు చెందిన 500 మంది రైతుల్లో రామ్ కూడా ఒకరు. ‘2016 వరకు జిల్లాలో కేవలం 300 ఎకరాల్లో మాత్రమే మిరప సాగు జరుగుతుండేది. ఇప్పుడు అది రెండువేల ఎకరాలకు పెరిగింది. దీంతో ఇక్కడి రైతుల జీవనప్రమాణాల్లో గణనీయ మార్పులు వచ్చాయి’ అని జష్పూర్ జాయింట్ కలెక్టర్ ప్రియాంక శుక్లా తెలిపారు. -
హింసకు ప్రగతే పరిష్కారం
భిలాయ్: అన్ని రకాల హింస, కుట్రలకు అభివృద్ధి మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న నక్సల్స్‌కు స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రారంభించాయని అన్నారు. యూపీఏ హయాంలో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భిలాయ్‌లో ఐఐటీ ఏర్పాటు చేశామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతకుముందు భిలాయ్ ఉక్కు కర్మాగారం ఆధునిక విస్తరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆధునిక భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల్ని, నయా రాయ్‌పూర్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ‘సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత స్థానిక గిరిజనుల కోసం ఖర్చుపెట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌కు అదనంగా రూ. 3 వేల కోట్లు అందాయి. వాటిని ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. గిరిజనులు, వెనకబడ్డ ప్రాంతాల్లో నివసించేవారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ.. ‘హవాయ్ జహజ్(విమానం)లో హవాయి చెప్పులు వేసుకుని ఎవరైనా ప్రయాణిస్తే చూడాలనేది నా కల. చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలు అందించడమే మేం ప్రారంభించిన ఉడాన్ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం రోడ్లు కూడా నిర్మించని ప్రాంతాల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాల్ని నిర్మిస్తోంది. ఇంతకముందు రాయ్‌పూర్ విమానాశ్రయంలో రోజుకు కేవలం ఆరు విమానాలు ఎగిరేందుకు అవకాశముందేది. ఇప్పుడు 50 విమానాల రాకపోకలకు సామర్థ్యం కల్పించాం’ అని మోదీ చెప్పారు. భిలాయ్ ఐఐటీని సాకారం చేశాం ఎప్పటి నుంచో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఐఐటీ కేటాయించమని సీఎం రమణ్ సింగ్ డిమాండ్ చేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దానిని సాకారం చేశామని చెప్పారు. గతంలో చత్తీస్‌గఢ్ అంటే అడవులు, గిరిజనులే గుర్తుకు వచ్చే వారని, ఇప్పుడు స్మార్ట్ సిటీ(నయా రాయ్‌పూర్)కి పేరుగాంచిందన్నారు. బస్తర్ అనగానే బాంబులు, తుపాకీల పేర్లు మాత్రమే వినిపించేదని, ఇప్పుడు జగదల్పూర్లో నిర్మించిన విమానాశ్రయం అందరికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నవ భారతానికి పునాదులు ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. నవ భారతానికి ఈ స్టీట్ ప్లాంట్ పునాదులు వేస్తుందని అన్నారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం వరకూ ఉక్కు పరిశ్రమ ఇబ్బందుల్ని ఎదుర్కొందని, ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు. రూ. 72 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమంలో భిలాయ్ ప్లాంట్ అభివృద్ధిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి ఏడాదికి 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 21 మిలియన్ టన్నులకు చేరుతుంది. బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు భిలాయ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగదల్పూర్ నుంచి రాయ్‌పూర్‌కు మొదటి విమానాన్ని మోదీ ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పేరుపడ్డ బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
ఘోర ప్రమాదం : నలుగురు మహిళల మృతి
జయపురం/మల్కన్‌గిరి : ఛత్తీస్‌గడ్‌లో మావో ప్రభావిత ప్రాంతం దంతేవాడ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. రైల్వే వంతెన పైనుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను రైలు ఢీకొట్టింది. ఈ సంఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. వివరాలు ఇలా వున్నాయి... దంతేవాడ ప్రాంతంలోని కుపేర్ గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు కర్రలు(వంట చెరకు) తెచ్చుకునేందుకు పరిసర ప్రాంతాలకు ఆదివారం వెళ్లారు. తిరిగి వీరు మధ్యాహ్నం వేళ కర్రలు పట్టుకుని సంకిని-డాంకిని నదిపై ఉన్న రైల్వే వంతెన పైనుంచి ట్రాక్‌పై నడుచుకుంటూ గ్రామానికి వస్తున్నారు. వీరు వంతెనకు మధ్యలో ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా గూడ్స్ రైలు వచ్చింది. ఆ సమయంలో వారు వెనక్కి వెళ్లాలో, ముందుకు వెళ్లాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. తప్పించుకునేందుకు వీలులేక రైలుకు దొరికిపోయారు. రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. అయితే మరో ఇద్దరు మహిళలు గూడ్స్ రైలును చూసి ప్రాణాలకు తెగించి నదిలోకి దూకేయడంతో వారి ప్రాణాలు దక్కాయి. దంతేవాడ నుంచి కరళీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, జవాన్లు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను రైల్వే ట్రాక్ మీద నుంచి వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే మహిళలు రైల్వే వంతెన మీదుగా నడుస్తున్న సమయంలో రైలు రావడంతో వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయారని పోలీసులు చెప్పారు. -
మావోయిస్టుల దాడిలో సబ్ ఇన్స్పెక్టర్ మృతి
సాక్షి, సుక్మా : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జేగురుకోండ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందారు. సుక్మా జిల్లా ఎస్పి మీనా తెలిపిన వివరాల ప్రకారం.. తమేలవాడ అటవీ ప్రాతంలో పోలీస్ కోబ్ర బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ సమయంలో పోలీసులే లక్ష్యంగా ఈఈడీ మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సబ్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్‌ను జగదల్పూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. రాజనంద్‌గావ్ జిల్లాలోని మాన్ పూరహల్ ప్రాంతంలో వెదురు డిపోను కూడా మావోయిస్టులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో సూమారు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. బీజాపూర్ జిల్లా కోహకి-కొర్‌కట్టా రహదారులపై చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. ఈ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా చేపట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని పోస్టర్లను రోడ్డుపై ప్రదర్శించారు. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఆరు రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టులు నేడు పిలుపునిచ్చారు. -
మావోయిస్టుల ఘాతుకం
చర్ల/పర్ణశాల : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. వరుస ఘటనల్లో తమ అనుచరులను కోల్పోతున్న మావోయిస్టులు మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. సీఏఎఫ్, డీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా పరిధిలోని చోల్నార్ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 10 గంటలకు జరిగింది. బచెలి నుంచి చోల్నార్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కూలీలకు రక్షణగా ఉండేందుకు బచెలి నుంచి ఒక బొలెరో వాహనంలో బచేలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంకుమార్ యాదవ్‌తో పాటు సీఏఎఫ్, డీఎఫ్లకు చెందిన మరో ఆరుగురు జవాన్లు బయలుదేరారు. జవాన్ల రాకను ముందుగానే గమనించిన మావోయిస్టులు మార్గమధ్యంలోని ఓ కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన శక్తివంతమైన మందుపాతరను పేల్చివేశారు. దీంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం సుమారు 20 అడుగుల మేర ఎత్తు ఎగిరి పడి తునాతునకలైంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంకుమార్ యాదవ్‌తో పాటు టీకేశ్వర్ బర్గ్, తాలిగ్రాం, విక్రమ్‌యాదవ్, రాజేష్‌సింగ్, వీరేందర్నాథ్లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అర్జున్రాజ్వరున్ అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం జవాన్లు మృతి చెందారని నిర్ధారించుకున్న మావోయిస్టులు రెండు ఏకే–47, రెండు ఎస్ఎల్ఆర్, రెండు ఐఎన్ఎస్ఏఎస్లు, రెండు గ్రెనేడ్లను అపహరించుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న బచేలి స్టేషన్ బలగాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ జవాన్‌ను అర్జున్ వరుణ్‌కు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ఘటనలో 200 మంది మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చిన సమయంలో ఘటనాస్థలం వద్ద దాదాపు 200మంది సాయిధులైన మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడికి కోసం సుమారు యాభై కేజీల ఐఈడీని మావోయిస్టులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు బలగాలు సంఘటన జరిగిన చుట్టూ గల అటవీప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. సంఘటన స్థలాన్ని బస్తర్ డీఐజీ రత్నల్ దాగ్ని పరిశీలించారు. ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు రానున్నారు. ఈ పర్యటనకు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ దుర్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మార్చిలో తొమ్మిది మంది ఈ ఏడాది మార్చి 13న సుక్మా జిల్లా క్రిష్టారాం పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో మావోయిస్టులు భారీ ఐఈడీ అమర్చి సీఆర్పీఎఫ్ జవాన్లను క్యాంపునకు తీసుకెళ్తున్న మైన్ ప్రొటెక్టెడ్ వాహనాన్ని పేల్చడంతో తొమ్మిది మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ దాడితో మావోయిస్టులు, పోలీసు బలాగాల మధ్య పరస్పర దాడులతో దండకారణ్య అట్టుడుకుతోంది. -
మావోయిస్టుల ఘాతుకం
ఐ.పోలవరం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో రోడ్డు పనుల కోసం వెళ్లిన ఐ.పోలవరానికి చెందిన కాంట్రాక్టర్ హత్యకు గురయ్యారు. బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టు చేస్తున్న తెలగరెడ్డి బాలనాగేశ్వరరావు (52) (కాసులు) మావోయిస్టుల ఆగ్రహానికి గురయ్యాడు. అ ప్రాంతంలో రోడ్లు నిర్మించవద్దన్న మావోయిస్టుల హెచ్చరికలు కాదని రోడ్డు నిర్మించిన బాల నాగేశ్వరావును మావోయిస్టులు లక్ష్యంగా చేసుకొని ఈ నెల 14న హతమార్చగా సోమవారం పని చేసే చోటనే మృత దేహం బయటపడింది. దీంతో ఐ.పోలవరంలో విషాదం చోటుచేసుకుది. బాలనాగేశ్వరరావు మరణ వార్త టీవీల్లో ప్రసారం కావడంతో జిల్లా వాసులు ముఖ్యంగా ఐ.పోలవరం మండలవాసులు ఉలిక్కి పడ్డారు. బాలనాగేశ్వరావుకు భార్య సత్యకుమారి, కుమార్తె రేవతి ఉన్నారు. కుమార్తెకు వివాహమై అదే గ్రామంలో ఎంపీటీసీ సభ్యురాలలిగా పనిచేస్తున్నారు. నాగేశ్వరరావు మరణించిన విషయాన్ని భార్యకు, కూతురికి తెలియకుండా గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. నాగేశ్వరరావు గత 20 సంవత్సరాలుగా ఐ.పోలవరం మండలంలోనే తాపీ మేస్త్రిగా పనిచేస్తూ మండలంలోనే కాంట్రాక్టరుగా ఎదిగాడు. ఇటీవల కాలంలో ఇతర కాంట్రా క్టర్లతో పరిచయాలు ఏర్పడి ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు నిర్మాణ పనులు కాంట్రాక్టు తీసుకొన్నాడు. రోడ్డు నిర్మాణానికి ముందే మావోయిస్టులు ‘ఇక్కడ రోడ్డు నిర్మించవద్దంటూ’ హెచ్చరించనట్టు సమాచారం. అతను మావోయిస్టులు హెచ్చరికల్ని తేలికగా తీసుకొని నిర్మాణ పనులు కొనసాగించాడు. దీంతో రెచ్చిపోయిన మావోయిస్టులు రోడ్డు పనుల్లో ఉన్న వాహనాలను తగుల పెట్టారు. అదే సమయంలో నాగేశ్వరరావును కిడ్నాప్ చేసి డీప్ ఫారెస్టులోకి తీసుకొని వెళ్లి రాళ్లతో కొట్టి చంపినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసిన ప్రాంతంలోనే నాగేశ్వరరావు మృత దేహాన్ని మావోయిస్టులు పడేసి వెళ్లారు. ఈ సమాచారం ఛత్తీస్‌గఢ్ నుంచి జిల్లా పోలీసులకు సమాచారం అందింది. తన పనేదో తాను చేసుకుంటూ వివాద రహితుడిగా ఉన్న నాగేశ్వరరావు మావోయిస్టుల చేతుల్లో హతమవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఇతని మృతదేహం మంగళవారం స్వగృహానికి చేరుకొంటుందని భావిస్తున్నారు. -
బలగాల బస్సును పేల్చేసిన మావోలు
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్న నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా రెండుచోట్ల మందుపాతరలను పేల్చి ఇద్దరు జవాన్లను బలిగొన్నారు. బీజాపూర్ జిల్లాలోని పుట్రు–నమ్మేడ్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న రహదారిని తనిఖీ చేసి తిరిగివస్తున్న భద్రతాబలగాల బస్సే లక్ష్యంగా సోమవారం మధ్యాహ్నం మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డుల(డీఆర్జీ)కు చెందిన ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రుల్ని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉన్నారన్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
మల్కన్‌గిరి / చింతూరు (రంపచోడవరం) / చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో ఓ పౌరుడితో పాటు ఇద్దరు పోలీ సులు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లా భెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలో చింతగుçఫ–భెజ్జి రహదారి పనులు చేయిస్తున్న సూపర్వైజర్ అనిల్‌కుమార్‌ను మావోలు ఆదివారం కాల్చిచంపడంతో పాటు 12 వాహనాలను దహనం చేశా రు. అక్కడ పనిచేస్తున్న 30 మంది కూలీలను తమవెంట తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తున్న భద్రతా దళాలే లక్ష్యంగా ఎల మగూడెం ప్రాంతంలో మావోలు మందుపాతర పేల్చటం తోపాటు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ పౌరుడితో పాటు జిల్లా రిజర్వ్ గార్డ్స్‌కు చెందిన జవాన్లు మడ్కమ్ హందా, ముకేశ్ కడ్తీ ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. అయితే, కూలీల జాడ తెలియరాలేదని పోలీసులు తెలిపారు. -
ఛత్తీస్‌ఘడ్‌లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లికి చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విజయ్‌భాస్కర్‌నాయుడు(28) ఛత్తీస్‌ఘడ్‌లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. 2006లో సీఆర్పీఫ్లో చేరిన విజయ్‌భాస్కర్‌నాయుడు ఈ నెల 5న ఛత్తీస్‌ఘడ్‌లో విధినిర్వహణలో ఉండగా ప్రమాదంబారిన పడ్డాడు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం గురువారం తెల్లవారుజామున గ్రామానికి చేరుకుంటుందన్నారు.