మల్కన్‌గిరి / చింతూరు (రంపచోడవరం) / చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఓ పౌరుడితో పాటు ఇద్దరు పోలీ సులు ప్రాణాలు కోల్పోయారు. సుక్మా జిల్లా భెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలో చింతగుçఫ–భెజ్జి రహదారి పనులు చేయిస్తున్న సూపర్‌వైజర్ అనిల్‌కుమార్‌ను మావోలు ఆదివారం కాల్చిచంపడంతో పాటు 12 వాహనాలను దహనం చేశా రు.
అక్కడ పనిచేస్తున్న 30 మంది కూలీలను తమవెంట తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తున్న భద్రతా దళాలే లక్ష్యంగా ఎల మగూడెం ప్రాంతంలో మావోలు మందుపాతర పేల్చటం తోపాటు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ పౌరుడితో పాటు జిల్లా రిజర్వ్ గార్డ్స్‌కు చెందిన జవాన్లు మడ్కమ్ హందా, ముకేశ్ కడ్తీ ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. అయితే, కూలీల జాడ తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment