ఛత్తీస్‌ఘడ్‌లో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి | crpf constable dies of chathisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌ఘడ్‌లో సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి

Published Wed, Aug 16 2017 9:28 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

crpf constable dies of chathisgarh

పుట్టపర్తి అర్బన్‌: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని పెద్దకమ్మవారిపల్లికి చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌భాస్కర్‌నాయుడు(28) ఛత్తీస్‌ఘడ్‌లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. 2006లో సీఆర్పీఫ్‌లో చేరిన విజయ్‌భాస్కర్‌నాయుడు ఈ నెల 5న ఛత్తీస్‌ఘడ్‌లో విధినిర్వహణలో ఉండగా ప్రమాదంబారిన పడ్డాడు. అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ప్రధాన కార్యాలయం నుంచి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం గురువారం తెల్లవారుజామున గ్రామానికి చేరుకుంటుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement