ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్‌పీఎఫ్ పాఠశాల గోడపై పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత.. ఒకేసారి దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
సోమవారం రాత్రి పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు ఈ-మెయిల్స్‌ను దుండగులు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ తోపాటు హైదరాబాద్‌లోని అన్ని సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపుల సందేశాలు రావటంతో అన్ని స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్‌గా భద్రత అధికారులు భావిస్తున్నారు.
ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
మంగళవారం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్ ధృవీకరించింది. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది. గత వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న పలు భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. టార్గెట్ చేసిన ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా మరియు అకాసా ఎయిర్ ఉన్నాయి.
చదవండి: ‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’
Comments
Please login to add a commentAdd a comment