ఢిల్లీలోని పాఠశాలకు మరోసారి బాంబు బెదిరింపు | Private School In Delhi Greater Kailash Evacuated After Bomb Threat Mail, Probe Declares Hoax | Sakshi
Sakshi News home page

ఢిల్లీలోని పాఠశాలకు మరోసారి బాంబు బెదిరింపు

Published Fri, Aug 2 2024 12:53 PM | Last Updated on Fri, Aug 2 2024 1:40 PM

Private School In Delhi Greater Kailash Evacuated After Bomb Threat

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా సౌత్‌ ఢిల్లీలోని ఓ పాఠశాలకు బెదిరింపులు అందడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్‌ కైలాష్‌లోని ప్రైవేటు పాఠశాలకు ఈమెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబు అమర్చినట్లు గురువారం  అర్థరాత్రి ఈ మెయిల్‌ రాగా.. పాఠశాల అధికారులు 10 నిమిషాల్లోనే విద్యార్థులను ఖాళీ చేయించారు.

బాంబు డిటెక్షన్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు పాఠశాల మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేయగా.. ఎలాంటి అనుమానాస్పదంగా ఏమీ కనుగొనలేదని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. అయితే ఈ బెదిరింపు బూటకమని అధికారులు ధృవీకరించారు. కాగా ఇటీవలే రాజధాని నగరంలోని పలు పాఠశాలలకు (వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement