Delhi Public School Gets Bomb Threat Via Email - Sakshi
Sakshi News home page

ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కి బాంబు బెదిరింపు!

Published Wed, Apr 26 2023 10:57 AM | Last Updated on Wed, Apr 26 2023 11:04 AM

Delhi Public School Gets Bomb Threat On Email - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌.. బాంబు బెదిరింపు మెయిల్‌తో ఉలిక్కిపడింది. పాఠశాల ఆవరణలో బాంబులు ఉన్నాయని పేర్కొంటూ ఈమెయిల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ఆ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. ఐతే అలాంటి దేమి కనుగొనలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఢిల్లీలోని మధుర రోడ్‌లో ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కి బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు తెలిపారు.

బుధవారం ఉదయం 8.10 గంటల ప్రాంతంలో పాఠశాల అధికారుల నుంచి ఈ విషయమై తమకు ఫోన్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో తాము హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని పాఠశాలను వెంటనే కాళీ చేయించామని చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు కనుగొనలేదన్నారు. 

ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని సాదిక్‌నగర్‌లో ది ఇండియన్‌ స్కూల్‌కి ఈమెయిల్‌ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపు మరువకు మునుపే అలాంటి ఘటనే మరోకటి చోసుకోవడం గమనార్హం. ఐతే ఆ ఘటనలో బాంబు స్క్వాడ్‌, ఇతర ఏజెన్సీలు తనిఖీలు చేపట్టడా అలాంటివేమీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఆ మెయిల్‌ బూటకమని ప్రకటించారు కూడా.

(చదవండి: వందే భారత్‌ రైలుపై కాంగ్రెస్‌ ఎంపీ పోస్టర్లు కలకలం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement