సాక్షి, సుక్మా : ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జేగురుకోండ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి చెందారు. సుక్మా జిల్లా ఎస్‌పి మీనా తెలిపిన వివరాల ప్రకారం.. తమేలవాడ అటవీ ప్రాతంలో పోలీస్ కోబ్ర బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ సమయంలో పోలీసులే లక్ష్యంగా ఈఈడీ మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సబ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్‌ను జగదల్‌పూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు.
రాజనంద్‌గావ్ జిల్లాలోని మాన్ పూరహల్ ప్రాంతంలో వెదురు డిపోను కూడా మావోయిస్టులు దగ్ధం చేశారు. ఈ ఘటనలో సూమారు రూ. 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. బీజాపూర్ జిల్లా కోహకి-కొర్‌కట్టా రహదారులపై చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా పడేశారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా చేపట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని పోస్టర్లను రోడ్డుపై ప్రదర్శించారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఆరు రాష్ట్రాల్లో బంద్‌కు మావోయిస్టులు నేడు పిలుపునిచ్చారు.
మావోయిస్టుల దాడిలో సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి
Published Fri, May 25 2018 6:43 PM | Last Updated on Tue, Oct 9 2018 2:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment