Patel
-
డేరింగ్ దాది
బకుళాబెన్ పటేల్‌ను సూరత్‌లో అందరూ ‘డేరింగ్ దాదీ’ అని పిలుస్తారు. 80 ఏళ్ల వయసులో నదుల్లో, సముద్రంలో ఆమె చేపలా ఈదడమే కాదు ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించడమే కారణం. 57 ఏళ్ల వయసులో మొదలెట్టిన ఈత తనకు ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అంటోంది బకుళాబెన్. పెద్ద వయసు వారికి పెద్ద స్ఫూర్తి ఆమె.సూరత్‌లోని తాపి నది ఒడ్డున ఏ ఉదయాన ఐదు, ఆరు గంటల మధ్యన వెళ్లినా డేరింగ్ దాది అని ఆ ఊళ్లో పిలుచుకునే బకుళా బెన్ కనిపిస్తుంది. 80 ఏళ్ల వయసులో ఆమె దినచర్య గమనించదగ్గది. తెల్లవారు జామున 4 గంటలకు లేస్తుంది. ఒక గంటసేపు ఇంట్లో తేలికపాటి యోగా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్‌కు వీలైన దుస్తుల్లోకి మారి సూరత్ దారుల గుండా కనీసం గంటసేపు జాగింగ్ చేస్తుంది. ఆ తర్వాత తాపి ఒడ్డున ఈత దుస్తుల్లోకి మారి నదిలోకి దూరి దాదాపు రెండు గంటల సేపు ఈత కొడుతుంది. ఆ తర్వాతే ఆమె ఇంటికి చేరుతుంది. ‘నేను రోజులో ఒక పూట భోజనం అయినా లేకుండా ఉంటాను కాని ఏ రోజూ ఈత కొట్టకుండా ఉండలేను’ అంటుంది బకుళా బెన్.కొత్త జీవితంబకుళా బెన్ది అందరు సగటు ఆడవాళ్ల జీవితం వంటిదే. పెళ్లి, పిల్లలు... ఆమెకు నలుగురు సంతానం. వారిని పెంచి పెద్ద చేయడంలో జీవితం గడిచిపో యింది. ఆమెకు 50 ఏళ్లు ఉండగా భర్త మరణించాడు. కొన్నాళ్లకు ఆమెకు జీవితం బోరు కొట్టింది. ‘ఏదో ఒకటి చేయాలి’ అని క్రీడల వైపు ఆసక్తి కనపరిచింది. ‘నాకు చిన్నప్పుడు నీళ్లంటే భయం. ఈత నేర్చుకోలేదు. కాని ఎన్నాళ్లు నీళ్లకు దూరంగా జరుగుతాను. ఈత నేర్చుకుందాం అనుకున్నాను.ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నా వయసు 58’ అని తెలిపింది బకుళా బెన్. కాని ఆమె ఈత నేర్చుకోవడం అంత సులువు కాలేదు. బంధువులు, ఇరుగు పొరుగు వారు ‘హవ్వ’ అని నోరు నొక్కుకున్నారు. హేళన చేస్తూ వెనుక మాట్లాడుకున్నారు. ‘అవన్నీ నా చెవిన పడుతున్నా ఈత నేర్చుకోవడం మానలేదు’ అంటుంది బకుళ. ఇలా నవ్విన వారే తాపీనదిలో చేపలా ఈదుతున్న బకుళను చూసి ఆశ్చర్యపో యారు. హేళన స్థానంలో గౌరవం వచ్చింది.అన్నీ భిన్నమేపిల్లలు సెటిల్ కావడం వల్ల దొరికిన తీరుబడిని బకుళ సంపూర్ణంగా జీవించదలుచుకుంది. ‘నేను నా 60వ ఏట బి.ఏ. కట్టాను. పాఠాలు చదవడం గుర్తు పెట్టుకోవడం కష్టమైంది. రోజుకు 10 గంటలు చదివేదాన్ని. అలాగే ఎప్పుడో వదిలేసిన రాత కూడా ప్రాక్టీసు చేసి పరీక్షలు రాసి డిగ్రీ ΄పొందాను. అలాగే యోగా నేర్చుకున్నాను. 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేయగలను. 75 ఏళ్ల వయసులో నాకు భరతనాట్యం నేర్చుకోవాలనిపించింది. మన దేశంలో ఆ వయసులో భరతనాట్యం చేసి అరంగేట్రం చేసింది నేనొక్కదాన్నే. ఆ ఆరంగేట్రం చూసి చాలామంది మెచ్చుకున్నారు’ అంటుంది బకుళ.500 మెడల్స్‘నన్ను చూసి అందరూ స్ఫూర్తి పొందాలని ఇన్ని పనులు చేస్తున్నాను. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షను ఎదిరించాలంటే ఇలాంటి కృషి చేయాలి. నేను జాతీయ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ ఈత పో టీల్లో ఇప్పటివరకు 500 మెడల్స్ గెలుచుకున్నాను. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతాల్లో ఈత కొట్టాను. అమెరికా, ఆస్ట్రేలియా, కెనెడా, మలేసియా దేశాల్లో ఈతపో టీల్లో పాల్గొన్నాను. ఇంగ్లిష్ చానల్ ఈది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరాలని నా కోరిక. ఇప్పటికి 400 మందికి ఈత నేర్పాను. ఈతలో ఉన్న ఆరోగ్యం, ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది బకుళా బెన్. -
Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
వరల్డ్స్ మోస్ట్ ప్రిస్టీజియస్, గ్లామరస్ ఫ్యాషన్ ఈవెంట్ ‘మెట్ గాలా–2024’లో బ్రేక్ఔట్ స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది మోనా పటేల్. ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా చేసింది. వడోదర నుంచి అమెరికా వరకు ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మోనా ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకం. ఫిలాంత్రపిస్ట్‌గా ఎన్నో రకాల సేవాకార్యక్రమాలు చేపడుతోంది...గుజరాత్‌లోని వడోదరలో పుట్టి పెరిగిన మోనా పటేల్ చాలామంది అమ్మాయిలలాగే స్కూల్, కాలేజీ రోజుల్లో రకరకాల వివక్షలు, సవాళ్లు ఎదుర్కొంది. ‘ఆటలు మగవారి కోసమే’, ‘ఆడవారు ఇంట్లోనే క్షేమంగా ఉంటారు’ ‘లక్ష్యాలు అనేవి మగవారి కోసమే’ ఇలాంటి ఎన్నో పురుషాధిక్య భావజాల ధోరణులకు సంబంధించిన మాటలు విన్నది మోనా.అయితే అలాంటి మాటలకు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. సవాలుకు సై అనడం తప్ప వెనక్కి తిరిగి చూసింది లేదు. పన్నెండు సంవత్సరాల వయసు నుంచి బాయ్స్–స్టైల్ హెయిర్ కట్‌తో కనిపించడంప్రారంభించింది. వస్త్రధారణ కూడా అచ్చం అబ్బాయిలలాగే ఉండేది.‘ఏమిటీ వేషం’లాంటి వెక్కిరింపులకు ముఖం మీదే సమాధానం చెప్పి నోరు మూయించేది. ‘హెయిర్ కట్ అనేది రెబిలియన్ యాక్ట్. సెల్ఫ్–ఎంపవర్మెంట్కు సింబల్’ అంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటుంది మోనా. ఇంటి నుంచి బయటి వెళ్లడమే సాహసంగా భావించే రోజుల నుంచి చదువు కోసం గుజరాత్ యూనివర్శిటీలో అడుగు పెట్టింది. హోమ్టౌన్ తప్ప మరో టౌన్ తెలియని మోనా పైచదువుల కోసం న్యూజెర్సీలోని రాత్గర్స్ యూనివర్శిటీకి వెళ్లింది.‘ఔట్‌సైడ్ ఇండియా లైఫ్ గురించి ఎప్పటినుంచో ఆసక్తి ఉండేది. చదువుల రూపంలో అది నెరవేరింది. ఒంటరిగా బయలుదేరినప్పటికీ ఆ ఒంటరితనమే ధైర్యాన్ని ఇచ్చింది. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది’ అంటుంది మోనా. అమెరికాకు వెళ్లిన కొత్తలో అక్కడి వేషధారణ, ఆచార వ్యవహారాలు తనకు కొత్తగా అనిపించేవి.‘ఈ ప్రపంచంలో నేను ఇమడగలనా!’ అని కూడా సందేహించేది. అయితే ఆ ప్రపంచంలోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయధ్వజం ఎగరేసింది మోనా పటేల్. ఒక్కో మెట్టు ఎక్కుతూ హెల్త్‌కేర్, టెక్, రియల్ ఎస్టేట్... మొదలైన రంగాలలో ఎనిమిది కంపెనీలను నెలకొల్పింది. వ్యాపార విజయాలే కాదు సామాజిక సేవాకార్యక్రమాలు కూడా మోనాకు ఇష్టం. జెండర్ ఈక్వాలిటీ, అమ్మాయిల చదువు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని ‘కొచర్ ఫర్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థనుప్రారంభించింది.‘మూడు పెద్ద సూట్‌కేస్‌లతో తొలిసారిగా ఇండియా నుంచి డల్లాస్‌కు బయలుదేరాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మోనా.ఆ సూటుకేసులలో విలువైన వస్తువులు ఉండచ్చు. అయితే వాటి అన్నిటికంటే అత్యంత విలువైనది... ఆమెలోని ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే మోనా పటేల్‌ను తిరుగులేని ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చేలా చేస్తోంది.బంగారు రెక్కల సీతాకోకచిలక..ప్రతిష్ఠాత్మకమైన మెట్‌గాలా 2024 ఎడిషన్‌ను న్యూయార్క్‌లోని ‘మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ లోపెజ్, సారా జెస్సికా, ఆలియా భట్, ఇషా అంబానీ, నటాషా పూనావాలా... మొదలైన ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై కనిపించాలనేది ఎంతోమంది అమ్మాయిల కల.అయితే తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులు ‘వావ్’ అనుకునేలా చేసి, మెట్ గాలాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పటేల్. ‘ది గార్డెన్ ఆఫ్ టైమ్’ థీమ్‌తో రూపొందించిన సీతాకోకచిలక ఆకారంలో ఉన్న గౌనుకు ఎంతోమంది ఫిదా అయ్యారు. ‘నా వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునేలా నా డెబ్యూ లుక్ ఉండాలనుకున్నాను’ అంటుంది పటేల్. రెడ్ కార్పెట్‌పై పటేల్ బ్యూటీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్‌గా మారింది.ఇవి చదవండి: Rosa Shruti Abraham: సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనర్.. -
ఆప్‌కు భారుచా సీటు: ‘అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే.. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాలు కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా గురుజరాత్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆప్‌తో సీట్ల పంపకాన్ని ఫైనల్ చేసింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ పొత్తులో భాగంగా పోటీ చేయనున్నాయ. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు రెండు సీట్లను ఆఫర్ చేసింది. ఈ మేరకు ఇరు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి. అయితే కాంగ్రెస్, ఆప్ పొత్తుపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. Deeply apologize to Our district cadre for not being able to secure the Bharuch Lok Sabha seat in alliance.I share your disappointment.Together, we will regroup to make @INCIndia stronger .We won’t let @ahmedpatel 45 years of Legacy go in vain. #bharuchkibeti — Mumtaz Patel (@mumtazpatels) February 24, 2024 తాజాగా అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ఎక్స్ ‘ ట్విటర్’ వేదికగా స్పందించారు. ‘భారుచా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ కేడర్‌కు క్షమాపణలు తెలుపుతున్నా. కాంగ్రెస్, ఆప్ పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానం పొందలేకపోయాం. మీ నిరాశను నేను పంచుకుంటాను. మనమంతా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. 45 ఏళ్ల అహ్మద్ పటేల్ వారసత్వాన్ని వృథా కానివ్వం’ అని ఆమె తెలిపారు. గుజరాత్లో పొత్తులో భాగంగా భారుచా లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ.. ఆప్‌కు కేటాయించింది. ఈ క్రమంలో మంతాజ్ ఖాన్ ఆ స్థానంపై ఆశపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంనే ఆమె తన జిల్లా కేడర్‌కు క్షమాపణలు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. #WATCH | On seat-sharing between Congress and AAP and the Bharuch seat of Gujarat going to AAP, Faisal Ahmed Patel, Congress leader and son of Senior Congress leader late Ahmed Patel says, "...My party workers and I are not happy and we wanted this decision to not be taken but if… pic.twitter.com/QUCkOV8aIv — ANI (@ANI) February 24, 2024 మరోవైపు.. అహ్మద్ పటేల్ కుమారుడు ఫైసల్ కూడా స్పందించారు. ‘నేను మరోసారి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి మాట్లాడుతా. నామినేషన్ వేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. గాంధీ కుటుంబం నా కుటుంబంతో సమానం. భారుచా లోక్‌సభ స్థానానికి సంబంధించి.. అహ్మద్ పటేల్ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను అధిష్టానం అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా’అని తెలిపారు. ‘పార్టీ నిర్ణయంపై కార్యకర్తలు, నేను సంతోషంగా లేము. ఈ నిర్ణయం తీసుకోకూడదని మేము కోరుకున్నాము. కానీ.. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంది. కావున మేము దాన్ని అనుసరిస్తాం. పార్టీ నిర్ణయాన్ని నేను, కార్యకర్తలం అనుసరిస్తాం’ అని ఫైసల్ పేర్కొన్నారు. చదవండి: ఆప్, కాంగ్రెస్‌ల సీట్ షేరింగ్.. ఎవరికెన్ని సీట్లంటే.. -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. రాయ్‌పూర్‌లో షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. (ఇది చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) యూట్యూబ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దేవరాజ్ తన 'దిల్ సే బురా లగ్తా హై' అనే డైలాగ్‌తో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయనకు యూట్యూబ్‌లో అతనికి 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. కమెడియన్ దేవ్‌రాజ్ పటేల్ పట్ల ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సంతాపం ప్రకటించారు. కాగా.. 2021లో భువన్ బామ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ధిండోరాలో దేవరాజ్ విద్యార్థి పాత్రలో కనిపించాడు. దేవ్‌రాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేశాడు. సీఎం ట్విటర్లో రాస్తూ.. ''దిల్ సే బురా లగ్తా హై'తో మనందరినీ నవ్వించిన దేవరాజ్ పటేల్ ఈరోజు మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్న వయసులో తన అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. అతని ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించుగాక. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్వీట్ చేశారు. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) “दिल से बुरा लगता है” से करोड़ों लोगों के बीच अपनी जगह बनाने वाले, हम सबको हंसाने वाले देवराज पटेल आज हमारे बीच से चले गए. इस बाल उम्र में अद्भुत प्रतिभा की क्षति बहुत दुखदायी है. ईश्वर उनके परिवार और चाहने वालों को यह दुःख सहने की शक्ति दे. ओम् शांति: pic.twitter.com/6kRMQ94o4v — Bhupesh Baghel (@bhupeshbaghel) June 26, 2023 View this post on Instagram A post shared by Devraj Patel (@imdevrajpatel) -
స్త్రీలోక సంచారం
గుజరాత్ పదహారేళ్ల నీలాంశీ పటేల్ 5 అడుగల 7 అంగుళాల జుట్టుతో 2018 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. పశ్చిమ బెంగాల్ మిసెస్ ఎన్.సి.సేన్‌గా మాత్రమే వందేళ్ల క్రితం నాటి పాత రికార్డులలో ఉన్న మృణాళినీ దేవి భారతదేశంలో విమాన ప్రయాణం చేసిన తొలి మహిళగా ‘టైమ్స్’ పత్రిక చేసిన పరిశోధనలో నిర్థారణ అయింది. న్యూఢిల్లీ కొత్త విషయాలను కనిపెట్టిన మహిళల పేటెంట్ దరఖాస్తులను సత్వరం పరిశీలించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఈ ఏడాది కేబినెట్లో క్రిస్మస్ వేడుకల సమయాన్ని కుదించి, మిగతా సమయాన్ని పాలనా వ్యవహారాలకు కేటాయించారు. పుస్తకం నటి మనీషా కొయిరాలా రాసిన ‘హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ లైఫ్’ పుస్తకం ఈ నెల 28న మార్కెట్లోకి విడుదల అవుతోంది. -
హోటెల్.. మోటెల్.. పటేల్!
వాషింగ్టన్: హోటెల్, మోటెల్, పటేల్ వాలాస్.. అంటూ ప్రధాని నరేంద్రమోదీ గుజరాతీ పటేల్ వర్గం వారితో సరదా సంభాషణ జరిపారు. శుక్రవారం ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ‘సౌరాష్ట్ర పటేల్ కల్చరల్ సమాజ్’ సమావేశంలో పాల్గొన్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘హోటెల్, మోటెల్, పటేల్ వాలాలుగా మీరు ప్రసిద్ధులు కదా. మీ మోటెల్‌కు అతిథి ఎవరైనా వచ్చినప్పుడు భారత్ గురించి టీవీలో ఓ ఐదు నిమిషాల వీడియో క్లిప్పింగ్ చూపలేరా? అతిథులు టీవీ ఆన్ చేయగానే భారత్‌లో వారు చూడగలిగే ప్రదేశాలను తెలుసుకుంటారు. ఆ విధంగా ఒక్కొక్కరు ఐదుగురు విదేశీయులు భారత్‌ను సందర్శించేలా చేయండి. స్వదేశంలో మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకున్నా.. ఈ ఒక్క పని చేస్తే దేశానికి గొప్ప సేవ చేసిన వారవుతారు’ అని ప్రధాని మోదీ అన్నారు. ఒక్కొక్కరు ఐదుగురు విదేశీయులను భారత్‌కు వచ్చేలా ప్రోత్సహించటం ద్వారా దేశ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ‘భారతీయ సంతతి ప్రజలున్న చోట దేశాభివృద్ధి జరుగుతుందని పరిచయమున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. మన పిల్లలు, స్కూళ్లు, కాలేజీల్లో ఎక్కడున్నా టాపర్లుగానే నిలుస్తారని, మన డాక్టర్లు నిజాయతీ పరులనీ, కష్టపడే తత్వంగల వారని ఆయా దేశాల అధికారులు కూడా నమ్ముతారు’ అని అన్నారు. భారత్‌ను అపఖ్యాతి పాలు చేసేందుకు, ఉగ్రవాదంపై తన వైఖరే సరైందని అంతర్జాతీయంగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న పొరుగుదేశం (పాక్‌పై)పై విజయం సాధించటంలో ప్రవాస భారతీయులు ఎంతో తోడ్పాటు అందించారని కొనియాడారు. గుజరాత్‌కు చెందిన పటేల్‌లు అమెరికాలోని హోటెల్, మోటెల్ వ్యాపార రంగంలో మంచి పేరు సంపాదించారు. 2014లో ప్రఖ్యాత స్మిత్సోనియన్ మ్యాగజీన్ తన వ్యాసంలో.. ‘అమెరికాలోని మోటెళ్లలో సగం భారతీయ అమెరికన్ల యాజమాన్యంలో ఉన్నాయి’ అని పేర్కొంది. ‘అమెరికాలోని అంతర్ రాష్ట్ర రహదారుల పక్కన ఉండే మోటల్స్‌లో రాత్రిళ్లు బస చేయాలనుకునే వారికి తక్కువ ధరలోనే బెడ్లు దొరుకుతాయి. మరీ ముఖ్యంగా అది భారతీయులకు చెందిన మోటెల్ అయి ఉంటుంది’ అని న్యూయార్క్‌టైమ్స్ 1999లో తెలిపింది. యోర్క్ వర్సిటీ క్యాంపస్ డైరెక్టర్ రఘునాథన్ 2015 నాటి తన బ్లాగ్‌లో.. అమెరికాలో పటేళ్ల జనాభా 2.57లక్షలు. అమెరికాలోని టాప్ 500 కుటుంబాల్లో ‘పటేల్’ పేరు 174వ ర్యాంకులో ఉంది. అమెరికాలో 22వేల భారతీయుల హోటళ్లుండగా వాటి వ్యాపారం 8.80 లక్షల కోట్లు. వాటిలో 70శాతం గుజరాతీలవే అందుకే వారిని ‘పటేల్స్, అ లా మోటెల్స్’ అంటుంటారని పేర్కొన్నారు. నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని భేటీ న్యూఢిల్లీ: భూటాన్ ప్రధాని షెరింగ్ టాబ్గే శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వ్యూహాత్మక రంగాల్లో సహకారం బలోపేతంపై వారు చర్చించారు. భారత్, భూటా న్, చైనా సరిహద్దుల్లోని డోక్లాం అంశం కూడా చర్చకు వచ్చింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పర్యటనకు వచ్చిన త్సెరింగ్‌కు మోదీ ఘన స్వాగతం పలికారని విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. వారి చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయన్నారు. కాగా, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మోదీ నివాళులర్పించారు. -
ఒక్కరున్నా ప్రమాదమే!
తెలిసిన శత్రువులు వంద మంది ఉన్నా ఫర్వాలేదు కానీ తెలియని శత్రువు ఒక్కరున్నా ప్రమాదమే. చావే రావచ్చు. తస్మాత్ జాగ్రత అంటున్నారు కొత్త దర్శకుడు వాసు పరిమి. హీరోగా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న జగపతిబాబు ‘లెజెండ్’తో విలన్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత వరుసగా విలన్ పాత్రలు వేస్తూ వస్తున్న ఆయన మళ్లీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పటేల్’. వారాహి చలనచిత్రం పతాకంపై సాయిశివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సర్ (ఎస్.ఐ.ఆర్) అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి క్లాప్ ఇవ్వగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు స్టైలిష్‌గా కనిపిస్తారు. టీజర్‌ను విడుదల చేశాం. ఈ టీజర్‌ను దర్శకుడు వాసు రెండు రోజుల్లో తెరకెక్కించడం నన్ను షాక్‌కు గురి చేసింది. త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుపెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కెమేరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: డిజే వసంత్. -
భూటియాపై వేటు
కోల్‌కతా: రెండేళ్లపాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సలహాదారుగా పనిచేసిన భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియాను తప్పించారు. గత డిసెంబర్లోనే అతనితో ఒప్పందం గడువు పూర్తయిందని... మళ్లీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని ఏఐఎఫ్ఎఫ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్‌కు సాంకేతిక సలహాదారుడిగా కూడా పనిచేసిన భూటియా... ఆ సమయంలో స్టీఫెన్ కాన్స్టాంటైన్ భారత జట్టుకు మళ్లీ కోచ్‌గా రావడంలో కీలకపాత్ర పోషించారు. ఏఐఎఫ్ఎఫ్ ప్రముఖులతో అభిప్రాయబేధాలు రావడంతోనే భూటియా కాంట్రాక్ట్‌ను పొడిగించలేదని సమాచారం. భారత అండర్–17 కోచ్‌గా నికొలాయ్ ఆడమ్‌ను తప్పించాక... ఆయన స్థానంలో కామ్ టోయల్ను కోచ్‌గా తీసుకురావాలని భూటియా సూచించాడు. అయితే భూటియా సూచనలను పట్టించుకోకుండా ఏఐఎఫ్ఎఫ్ పోర్చుగల్‌కు చెందిన లూయిస్ నార్టన్ డి మాటోస్ను అండర్–17 జట్టుకు కోచ్‌గా నియమించింది. -
ఆ వ్యాఖ్యలు కుట్రపూరితం: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితమైనవని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. జాతి గర్వించదగ్గ దిగ్గజం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని, ఆయన్ను పొగుడుతూ నెహ్రూను నిందించటం అన్యాయమని తెలిపారు. ఇదంతా ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రేనని దుయ్యబట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే రూమర్స్ప్రెడింగ్ సొసైటీ అని ఎద్దేవా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. నెహ్రూ, పటేల్ ఇద్దరూ కలసి దాదాపు పదేళ్లు జైలు జీవితం గడిపినా ఇద్దరి మధ్యా ఏనాడూ అభిప్రాయ భేదాలు తలెత్తలేదని తెలిపారు. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు. కాశ్మీర్ విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తుందని జైపాల్‌రెడ్డి వివరించారు. -
ఇంతకీ కాబోయే ఆర్బీఐ గవర్నర్ ఎవరు?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పదవికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరిని ఎంపిక చేయనున్నారనే దానిపై భారీ అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు గతంలో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ప్రముఖుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినప్పటికీ ఈ ఉత్కంఠకు తెరపడలేదు. ఈ పదవికోసం పనాగరియా ఎంపిక దాదాపు ఖాయం అన్న వార్తలు ఇటీవల ప్రముఖంగా వినిపించాయి. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ప్రస్తుత ఆర్బీఐ రఘురామ్ రాజన్ స్థానంలో ఎంపికయ్యే అవకాశాలున్నవారిలో ఇద్దరి పేర్లు మరోసారి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ రేస్ లో టాప్ ప్లేస్ లో దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ పేర్లు ఉన్నాయి. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అరవింద్ సుబ్రహ్మణియన్ అహ్మదాబాద్ ఐఐఎం పూర్వ విద్యార్ధి. పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కోసం సీనియర్ ఫెలో గా ఉన్నారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థికవేత్తగా, గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ కు సీనియర్ ఫెలోగా పనిచేశారు. మరోవైపు, ఊర్జిత్ పటేల్ ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన 'ఫ్లెక్సిబుల్ ఇన్ ఫ్లేషన్ టార్గెటింగ్' కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థికవేత్తగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కి పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మాజీ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఉంది. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధికి కూడా కాగా ఇంతకుముందు, ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య , ఆర్థిక సలహదారు శక్తికాంత్ దాస్ పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపించాయ. కేంద్ర బ్యాంకు గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ 4 న ముగియనుంది. మరో టర్మ్ గవర్నర్‌గా కొనసాగదలుచుకోలేదని స్వయంగా ఆయనే ప్రకటించారు. ప్రభుత్వంతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్న అరవింద్ సుబ్రమణియన్, ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని విదేశీ మీడియా ఇటీవల పేర్కొనడం విశేషం. -
‘పాలమూరు’కు పోటాపోటీ
♦ రూ. 29,924 కోట్ల పనులకు టెండర్లు వేసిన పెద్ద సంస్థలు ♦ పోటీలో ఎల్అండ్టీ, నవయుగ, గాయత్రి, కేఎన్ఆర్, పటేల్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు ♦ సాంకేతిక కారణంతో తెరుచుకోని ప్యాకేజీ-4, ప్యాకేజీ-15 టెండర్లు ♦ చివరి నిమిషం వరకు టెండర్ల దాఖలుకు పోటీపడ్డ కాంట్రాక్టర్లు ♦ టెక్నికల్ బిడ్‌ను తెరిచిన అధికారులు.. ఈ నెల 29న ప్రైస్‌బిడ్ సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు భారీగా పోటీ నెలకొంది. ఈ పనులకు సాంకేతిక టెండర్లను శనివారం సాయంత్రం బహిర్గతం చేశారు. మొత్తంగా రూ.29,924.78 కోట్ల విలువైన 18 ప్యాకేజీల పనులు దక్కించుకునేందుకు పేరుపొందిన కాంట్రాక్టు సంస్థలు క్యూ కట్టాయి. సాంకేతిక కారణాలతో ప్యాకేజీ-4, ప్యాకేజీ-15ల టెండర్లను తెరవలేదు. మిగతా 16 ప్యాకేజీలకు ఎల్అండ్టీ, నవయుగ, గాయత్రి, మెగా, కేఎన్ఆర్, పటేల్ ఇంజనీరింగ్ వంటి సంస్థలు పోటీపడ్డాయి. ఆయా సంస్థలు సాంకేతిక నిబంధనల మేరకు అర్హత సాధించాయా, లేదా? అన్న అంశాలను పరిశీలిస్తామని... దీనికి సుమారు 9 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఈ నెల 29న ప్రైస్‌బిడ్‌ను తెరుస్తారు. అందులో తక్కువ ధర కోట్ చేసిన సంస్థను ఎల్-1గా గుర్తించి వారికి టెండర్ ఖరారు చేయనున్నారు. భారీగా పనులు.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 62 మండలాల్లోని 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులకు గత నెల 17న నీటి పారుదల శాఖ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించిన టెక్నికల్ బిడ్లను శనివారం సాయంత్రం ఆరున్నరకు తెరిచారు. బిడ్ సమయం ముగిసే కొద్ది నిమిషాల ముందు వరకూ కూడా టెండర్లు దాఖలు కావడం గమనార్హం. పెద్ద ప్యాకేజీల వైపే బడా సంస్థల మొగ్గు ప్రాజెక్టులోని పెద్ద ప్యాకేజీల పనులను దక్కించుకునేందుకు పటేల్, నవయుగ, ఎల్ అండ్‌టీ, మెగా వంటి సంస్థలు పోటీలో నిలిచాయి. రూ. 3,226.46 కోట్లు విలువైన పనులున్న ప్యాకేజీ-1 కోసం పటేల్, నవయుగ కంపెనీలు టెండర్ వేయగా... రూ. 5,027.90 కోట్ల విలువైన ప్యాకేజీ -5 పనులకు మెగా, ఎల్అండ్టీ, నవయుగ సంస్థలు టెండర్లు వేశాయి. ప్యాకేజీ-8లో ఉన్న రూ. 4,303.37 కోట్ల పనులకు, రూ. 2వేల కోట్ల పైచిలుకు విలువున్న ప్యాకేజీ-7, ప్యాకేజీ-16, ప్యాకేజీ-18ల పనులకు సైతం ఇవే సంస్థలు పోటీ పడుతున్నాయి. రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువ విలువైన ప్యాకేజీల పనులకు మాత్రం నాలుగు నుంచి ఐదేసి సంస్థలు పోటీ పడ్డాయి. రూ. 1,669.99 కోట్ల విలువైన ప్యాకేజీ-4, రూ. 838.30 కోట్ల విలువైన ప్యాకేజీ-15ల టెండర్లను ఆదివారం తెరిచే అవకాశముంది. -
గుజరాత్ పోలీసులు తప్పుచేశారు
అహ్మదాబాద్: గుజరాత్ పోలీసులు తప్పిదానికి పాల్పడ్డారు. అసలు దోషులకు కాకుండా ఎన్నారైలకు నోటీసులు పంపించారు. మొత్తం ముగ్గురు వ్యక్తులకు నోటీసులు పంపించగా వారిలో ఇద్దరు ఎన్నారైలే ఉన్నారు. ఆగస్టు 25న అహ్మదాబాద్‌లో కృష్ణానగర్ పటేళ్ల ఆందోళన సందర్భంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించే క్రమంలో పొరబడిన పోలీసులు ఎన్నారైలకు కూడా నోటీసులు ఇచ్చారు. దీంతో వేరే గత్యంతరం లేక వారు స్టేషన్‌కు హాజరుకావాల్సి వచ్చింది. వారు చేసిన తప్పిదం వీరేంద్ర పటేల్ అనే వ్యక్తి పోలీసుల ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం ద్వారా తెలిసింది. ఓబీసీల్లో రిజర్వేషన్ కల్పించాలని హార్దిక్ పటేల్ అనే యువకుడి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరిగిన విషయం తెలిసిందే. -
'కథ అడ్డం తిరుగుతోంది'
ముంబయి: పటేళ్లకు ఓబీసీల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఓ పక్క గుజరాత్లో తీవ్ర ఆందోళన జరుగుతుండగా ఆ ఆందోళనకు వ్యతిరేకంగా ఓ తాజా ఉద్యమం మహారాష్ట్రలో మొదలవుతుంది. పటేళ్లు ఇప్పటికే ఉన్నత వర్గానికి చెందినవారని వారికి ఎట్టి పరిస్థితిలో ఓబీసీల్లో చోటు ఇవ్వొద్దని మహారాష్ట్రకు చెందిన ఓబీసీ ఆర్గనైజేషన్ ముందుకు వెళుతోంది. పటేళ్లతోపాటు మరాఠా కమ్యునిటీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీళ్లేదని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఈ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ శ్రవణ్ డియోర్.. బీజేపీ ఎంపీ డాక్టర్ సుభాష్ భామ్రి కలిసి దీనిపై వినతిపత్రం సమర్పించారు. తప్పకుండా పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్ల అంశం లేవనెత్తాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని మరాఠా కమ్యునిటీ, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని జాట్లు, గుజరాత్‌లోని పటేళ్లు తమను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా, గుజరాత్లో ఈ ఉద్యమం హార్ధిక్ పటేల్ అనే యువకుడి నేతృత్వంలో ఉధృతంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపట్ల మహారాష్ట్ర ఓబీసీ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో మండల్ కమిషన్ కూడా పైన పేర్కొన్న వర్గాలు ఇప్పటికే ఉన్నత వర్గంగా ఉన్నాయని, అధికారం విషయంలోనూ, ఆర్థిక పరమైన అంశాల విషయంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్నందున వారిని ఓబీసీల్లో చేర్చవద్దని చెప్పిందని గుర్తుచేసింది. -
'ఇది రేస్ కాదు.. మారథాన్'
న్యూఢిల్లీ: తన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తానని గుజారాత్ యువకెరటం, పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న హార్దిక్ పటేల్ హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన ఉద్యమంలో మొత్తం తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారని, వారికి 48 గంటల్లోగా నష్టపరిహారం ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇక సూరత్ నుంచి ఒక ప్రకటన వెలువరుస్తానని హెచ్చరించారు. అవసరం అయితే, తన ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళతానని, జంతర్ మంతర్ వద్ద లక్నోలో కూడా నిరసనలు చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇది 100 మీటర్ల రేస్ కాదని, మారథాన్ అని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న హార్దిక్ పటేల్ ఇతర వర్గాల్లో కూడా రిజర్వేషన్లు డిమాండ్ చేసే నేతలతో గుజ్జర్లు, జాట్లు తదితరులతో మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ సమస్యను తేలిగ్గా చూస్తున్నారని, అదే ఒక ఉగ్రవాది సమస్య అయితే, అర్థరాత్రి అయినా సుప్రీంకోర్టు అయినా అర్థరాత్రి తలుపులు తెరవరా, కావాల్సిన పనులు చేయరా అంటూ నిలదీశారు. దేశంలో 85శాతంమంది పేదవారే ఉన్నారని వారందరికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో ఉద్యమం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అనడం పట్ల స్పందిస్తూ గాంధీ, సర్దార్ పటేల్ వంటి మహనీయులుపుట్టిన నేలపై ఏం జరిగినా దేశానికి దిగ్భ్రాంతిని కలిగిస్తుందని బాధ కలిగిస్తుందని చెప్పారు. -
విద్యార్థి ప్రాణం తీసిన ఈత సరదా
వరంగల్: స్నేహితులతో కలిసి ఈతకెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో సోమవారం జరిగింది. వివరాలు..తాళ్లపద్మావతి ఫార్మసీ కళాశాలలో పటేల్ కిషన్(22) ఫార్మా-డి చదువుతున్నాడు. కాగా, కాలేజీకి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. అయితే, ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. దీంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా, కిషన్, కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరీమాబాద్) -
ఎంజీఎల్‌ఐ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలి
కొల్లాపూర్ రూరల్: మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథ కం (ఎంజీఎల్‌ఐ) ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా చేస్తున్న పటేల్ కంపెనీ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కొల్లాపూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం ట్రయల్న్‌ల్రో భాగంగా నీట మునిగిన ఎంజీ ఎల్ఐ మొద టి లిఫ్ట్‌ను గురువారం వా రు పరిశీలించా రు. అనంతరం ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ కాం ట్రాక్టర్లు, అధికారులు కాసులకు కక్కుర్తి పడడం వల్లే మోటార్లు నీట మునిగాయన్నారు. ప్రాజెక్టు మొదటి నుంచి అధికారులు, కాంట్రాక్టరు ఆడిం దే ఆటగా, పాడిందే పాటగా నడుస్తుం దని మండిపడ్డారు. పటేల్ కంపెనీ కాం ట్రాక్టర్లకు పైస్థాయి నుంచే ఆశీర్వాదం ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. జూరాల వద్ద కూడా పవర్ ప్రాజెక్టు పనులు చేస్తున్న పటేల్ కంపెనీ నిర్వాకం వల్లే అక్కడ కూడా నీటి మునకకు గురయ్యాయన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఎంజీ ఎల్ఐ మోటార్లు నీట మునిగిన వెంటనే మంత్రి హరీష్‌రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ కి సమాచారం ఇచ్చినట్లు జూపల్లి వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరి గినప్పుడు అధికారులు, కంపెనీలపై తీ వ్ర చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గత ప్రభుత్వ కుట్రలో కు మ్మక్కు కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. వారం రోజుల్లో పంపుహౌస్‌లోని నీటిని ఎత్తిపోసి మోటార్లను సిద్ధం చేయాలన్నారు. మోటార్లు నీట మునగడం వల్ల రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన 25వేల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లనుందని వెల్లడించారు. పంటలకు నష్టం వాటిల్లితే ఎ కరాకు 40 నుంచి 50వేల నష్టపరిహా రం కంపెనీ నుంచి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధిగా ఈ కంపెనీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయనున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అధికారులు డిజైన్ చేసిన ప్రాజెక్టును కాంట్రాక్టర్లు నిర్మిస్తారు కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు డిజైన్ చేసిన విధంగా ప్రాజెక్టులు చే పట్టారన్నారు. ఆంధ్రా ప్రాంతంలో పది ప్రాజెక్టులు కడితే తెలంగాణలో ఒకటి, రెండు మాత్రమే కట్టారని, ఆ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈ విధంగా ఉందన్నా రు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మ య్య, ప్రాజెక్టు ఎస్ఈగా పనిచేసిన ఆ యన తమ్ముడు పొన్నాల రామయ్యలి ద్దరూ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఇక్కడికి వచ్చి ప్రాజెక్టుపై మాట్లాడాలని డిమాం డ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాం ట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని, నిర్లక్ష్యం వహించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎమ్మె ల్యే జూపల్లి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తామని వెల్లడించారు. అంతకు ముందు నీట మునిగిన మోటార్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లోకి నీరు ఎలా వచ్చి చేరిందని సీఈ కవీందర్, ఎస్ఈ శ్రీరామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లోకి నీరు ఎలా వచ్చిందన్న విషయం ఇంకా తేలడం లేదని అధికారు లు వివరించారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిం దని ఎమ్మెల్యే జూపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి వెంట టీఆర్ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, ఎంపీపీలు నిరంజన్‌రావు, రామ్మోహన్రావు, వెంకటేశ్వర్రావు, సింగిల్‌విండో చైర్మన్ జూపల్లి రఘుపతిరావు, నాయకులు సు రేందర్‌రావు, రహీం, బాలస్వామి, లోకేష్‌యాదవ్, ఖలీల్, గోపాలమల్లయ్య, కృష్ణయాదవ్ తదితరులున్నారు. -
ఎంప్లాయిన్ సంఘం అధ్యక్షులు పటేల్‌తో సాక్షి వేదిక