ఎంజీఎల్‌ఐ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలి | Blacklisting of of contractors mgli | Sakshi
Sakshi News home page

ఎంజీఎల్‌ఐ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలి

Published Fri, Sep 5 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

ఎంజీఎల్‌ఐ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలి

ఎంజీఎల్‌ఐ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలి

కొల్లాపూర్ రూరల్: మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథ కం (ఎంజీఎల్‌ఐ) ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా చేస్తున్న పటేల్ కంపెనీ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కొల్లాపూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం ట్రయల్న్‌ల్రో భాగంగా నీట మునిగిన ఎంజీ ఎల్‌ఐ మొద టి లిఫ్ట్‌ను గురువారం వా రు పరిశీలించా రు. అనంతరం ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ కాం ట్రాక్టర్లు, అధికారులు కాసులకు కక్కుర్తి పడడం వల్లే మోటార్లు నీట మునిగాయన్నారు.

ప్రాజెక్టు మొదటి నుంచి అధికారులు, కాంట్రాక్టరు ఆడిం దే ఆటగా, పాడిందే పాటగా నడుస్తుం దని మండిపడ్డారు. పటేల్ కంపెనీ కాం ట్రాక్టర్లకు పైస్థాయి నుంచే ఆశీర్వాదం ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. జూరాల వద్ద కూడా పవర్ ప్రాజెక్టు పనులు చేస్తున్న పటేల్ కంపెనీ నిర్వాకం వల్లే అక్కడ కూడా నీటి మునకకు గురయ్యాయన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఎంజీ ఎల్‌ఐ మోటార్లు నీట మునిగిన వెంటనే మంత్రి హరీష్‌రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ కి సమాచారం ఇచ్చినట్లు జూపల్లి వెల్లడించారు.

ఇలాంటి సంఘటనలు జరి గినప్పుడు అధికారులు, కంపెనీలపై తీ వ్ర చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గత ప్రభుత్వ కుట్రలో కు మ్మక్కు కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. వారం రోజుల్లో పంపుహౌస్‌లోని నీటిని ఎత్తిపోసి మోటార్లను సిద్ధం చేయాలన్నారు. మోటార్లు నీట మునగడం వల్ల రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన 25వేల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లనుందని వెల్లడించారు. పంటలకు నష్టం వాటిల్లితే ఎ కరాకు 40 నుంచి 50వేల నష్టపరిహా రం కంపెనీ నుంచి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

స్థానిక ప్రజాప్రతినిధిగా ఈ కంపెనీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయనున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అధికారులు డిజైన్ చేసిన ప్రాజెక్టును కాంట్రాక్టర్లు నిర్మిస్తారు కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు డిజైన్ చేసిన విధంగా ప్రాజెక్టులు చే పట్టారన్నారు. ఆంధ్రా ప్రాంతంలో పది ప్రాజెక్టులు కడితే తెలంగాణలో ఒకటి, రెండు మాత్రమే కట్టారని, ఆ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈ విధంగా ఉందన్నా రు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మ య్య, ప్రాజెక్టు ఎస్‌ఈగా పనిచేసిన ఆ యన తమ్ముడు  పొన్నాల రామయ్యలి ద్దరూ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు.

పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఇక్కడికి వచ్చి ప్రాజెక్టుపై మాట్లాడాలని డిమాం డ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాం ట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని, నిర్లక్ష్యం వహించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎమ్మె ల్యే జూపల్లి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తామని వెల్లడించారు. అంతకు ముందు నీట మునిగిన మోటార్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లోకి నీరు ఎలా వచ్చి చేరిందని సీఈ కవీందర్, ఎస్‌ఈ శ్రీరామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు.

పంప్‌హౌస్‌లోకి నీరు  ఎలా వచ్చిందన్న విషయం ఇంకా తేలడం లేదని అధికారు లు వివరించారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిం దని ఎమ్మెల్యే జూపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి వెంట టీఆర్‌ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, ఎంపీపీలు నిరంజన్‌రావు, రామ్మోహన్‌రావు, వెంకటేశ్వర్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ జూపల్లి రఘుపతిరావు, నాయకులు సు రేందర్‌రావు, రహీం, బాలస్వామి, లోకేష్‌యాదవ్, ఖలీల్, గోపాలమల్లయ్య, కృష్ణయాదవ్ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement