MGLI project
-
'వాటర్‌గ్రిడ్'కు స్థలాన్ని పరిశీలించిన కేటీఆర్
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ వాటర్‌గ్రిడ్ పనులను మంగళవారం పర్యవేక్షించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు సమీపంలో వాటర్‌గ్రిడ్ కోసం స్థలాన్ని కేటీఆర్ పరిశీలించారు. జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, నిరంజన్ రెడ్డి, తదితరులు కేటీఆర్‌కు జిల్లా పరిస్థితిని వివరించారు. అనంతరం కొల్లాపూర్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. వాటర్‌గ్రిడ్ పథకానికి సంబంధించిన అంశాలపై అధికారులతో పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ చర్చించారు. -
ఎంజీఎల్‌ఐ కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాలి
కొల్లాపూర్ రూరల్: మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథ కం (ఎంజీఎల్‌ఐ) ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా చేస్తున్న పటేల్ కంపెనీ కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని కొల్లాపూర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. బుధవారం ట్రయల్న్‌ల్రో భాగంగా నీట మునిగిన ఎంజీ ఎల్ఐ మొద టి లిఫ్ట్‌ను గురువారం వా రు పరిశీలించా రు. అనంతరం ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ కాం ట్రాక్టర్లు, అధికారులు కాసులకు కక్కుర్తి పడడం వల్లే మోటార్లు నీట మునిగాయన్నారు. ప్రాజెక్టు మొదటి నుంచి అధికారులు, కాంట్రాక్టరు ఆడిం దే ఆటగా, పాడిందే పాటగా నడుస్తుం దని మండిపడ్డారు. పటేల్ కంపెనీ కాం ట్రాక్టర్లకు పైస్థాయి నుంచే ఆశీర్వాదం ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. జూరాల వద్ద కూడా పవర్ ప్రాజెక్టు పనులు చేస్తున్న పటేల్ కంపెనీ నిర్వాకం వల్లే అక్కడ కూడా నీటి మునకకు గురయ్యాయన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. ఎంజీ ఎల్ఐ మోటార్లు నీట మునిగిన వెంటనే మంత్రి హరీష్‌రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ కి సమాచారం ఇచ్చినట్లు జూపల్లి వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు జరి గినప్పుడు అధికారులు, కంపెనీలపై తీ వ్ర చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గత ప్రభుత్వ కుట్రలో కు మ్మక్కు కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. వారం రోజుల్లో పంపుహౌస్‌లోని నీటిని ఎత్తిపోసి మోటార్లను సిద్ధం చేయాలన్నారు. మోటార్లు నీట మునగడం వల్ల రైతులు ఖరీఫ్‌లో సాగు చేసిన 25వేల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లనుందని వెల్లడించారు. పంటలకు నష్టం వాటిల్లితే ఎ కరాకు 40 నుంచి 50వేల నష్టపరిహా రం కంపెనీ నుంచి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధిగా ఈ కంపెనీపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయనున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అధికారులు డిజైన్ చేసిన ప్రాజెక్టును కాంట్రాక్టర్లు నిర్మిస్తారు కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టర్లు డిజైన్ చేసిన విధంగా ప్రాజెక్టులు చే పట్టారన్నారు. ఆంధ్రా ప్రాంతంలో పది ప్రాజెక్టులు కడితే తెలంగాణలో ఒకటి, రెండు మాత్రమే కట్టారని, ఆ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఈ విధంగా ఉందన్నా రు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మ య్య, ప్రాజెక్టు ఎస్ఈగా పనిచేసిన ఆ యన తమ్ముడు పొన్నాల రామయ్యలి ద్దరూ కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఇక్కడికి వచ్చి ప్రాజెక్టుపై మాట్లాడాలని డిమాం డ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాం ట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని, నిర్లక్ష్యం వహించిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎమ్మె ల్యే జూపల్లి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తామని వెల్లడించారు. అంతకు ముందు నీట మునిగిన మోటార్లపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లోకి నీరు ఎలా వచ్చి చేరిందని సీఈ కవీందర్, ఎస్ఈ శ్రీరామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌లోకి నీరు ఎలా వచ్చిందన్న విషయం ఇంకా తేలడం లేదని అధికారు లు వివరించారు. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిం దని ఎమ్మెల్యే జూపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరి వెంట టీఆర్ఎస్ నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు హన్మంతునాయక్, ఎంపీపీలు నిరంజన్‌రావు, రామ్మోహన్రావు, వెంకటేశ్వర్రావు, సింగిల్‌విండో చైర్మన్ జూపల్లి రఘుపతిరావు, నాయకులు సు రేందర్‌రావు, రహీం, బాలస్వామి, లోకేష్‌యాదవ్, ఖలీల్, గోపాలమల్లయ్య, కృష్ణయాదవ్ తదితరులున్నారు. -
హతవిధీ..!
కొల్లాపూర్ రూరల్: దిగువ జూరాల జెన్కో జలవిద్యుదుత్పత్తి కేంద్రం నీట మునిగిన సంఘటన మరిచిపోకముందే.. జిల్లాలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. జిల్లా వరప్రదాయిని, ఆరు నియోజకవర్గాల్లోని కరువు నేలలకు సాగునీరందించే అతిముఖ్యమైన ప్రాజెక్టుగా భావించే మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం(ఎంజీఎల్‌ఐ)లోని ఐదు మోటార్లు బుధవారం పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతం ఖరీఫ్‌కు నీరు విడుదల చేసే సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం రైతులకు మింగుడుపడని అంశమే. వివరాల్లోకెళ్తే.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్‌పై రూ.2995 కోట్ల వ్యయంతో ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే రూ.490 కోట్లతో ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్ నిర్మించారు. ఈ పనులు గతేడాది పూర్తయి.. ఇటీవలే ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఏర్పాటుచేసిన ఒకదాని తరువాత మరొకటి(స్టాండ్‌బైగా) ఐదు మోటార్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కాగా, ఇటీవల కృష్ణానదికి భారీస్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు నాలుగో మోటార్‌ను ట్రయల్న్ ్రచేయాలని భావించారు. ఇదివరకే విజయవంతంగా పనిచేసిన నాలుగో మోటార్‌ను కంప్యూటర్ బటన్ ద్వారా మరోసారి ప్రారంభించారు. ఆ తర్వాత రెండు నిమిషాలకే పంపుహౌస్‌లోకి నీరు వస్తుండటాన్ని గమనించిన కార్మికులు ఇంజనీరింగ్ నిపుణులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే మోటార్ ట్రయల్న్‌న్రు నిలిపివేశారు. సర్టిపూల్ నుంచి భారీస్థాయిలో వరదనీరు వస్తుండడంతో చేసేది లేక కార్మికులు, నిపుణులు పైకి చేరుకున్నారు. సర్జిపూల్ వద్ద నాలుగో గేట్‌ను పూర్తిగా కిందికి దించినా కూడా లీకేజీ ఆగలేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. పంప్‌హౌజ్‌లోకి నీరు చేరిన విషయం అధికారులు గోప్యంగా ఉంచారు. 60 మీటర్లున్న సర్జిపూల్లో 43 మీటర్లమేర నీరు చేరింది. పంప్‌హౌస్‌లో 18మీటర్ల మేర నీరు చేరింది. రాత్రి 9గంటల వరకు పంపుహౌస్‌లో 18మీటర్ల వరకు నీరు చేరింది. నీటిని ఎత్తిపోసేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి భారీ మోటార్లు, గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. విషయం తెలిసిన ప్రాజెక్టు ఈఈ సురేష్ అధికారులతో ప్రాజెక్టు వద్ద వివరాలు సేకరిస్తున్నారు. భారీస్థాయిలో నష్టం ఐదుమోటార్లు నీటిలో మునిగిపోవడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టు నుంచి రెండు మోటార్ల ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని ఎల్లూరు రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి సింగోటం రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. తద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుం ది. ఈ సమయంలో మోటార్లు నీట మునగడంతో నీటి పంపింగ్ నిలిచిపోయింది. మరమ్మతులు శరవేగంగా కొనసాగితేనే పంపింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోతున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిర్లక్ష్యమే నిండా ముంచింది ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టుపై అధికారుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాల్లోని 3.40లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు వద్ద ఐదు మోటార్లను ఏర్పాటుచేసి నీటిని ఎత్తిపోసేవిధంగా రూపొందించారు. పనులను పటేల్ కంపెనీ ఈపీసీ పద్ధతిలో పనులు చేస్తోంది. కాంట్రక్టర్లు ఆరునెలల తరువాత మోటార్లను తిరిగి ఏర్పాటుచేసి నీటివిడుదలను ఆరంభించారు. అయితే కృష్ణానది బ్యాక్‌వాటర్‌నుంచి సర్జిపూల్‌కు నీరు వచ్చే అప్రోచ్‌కెనాల్ సొరంగం వద్ద గేటు ఏర్పాటు చేయలేదు. దీంతో బ్యాక్‌వాటర్ వచ్చినప్పుడు నేరుగా నీరు సర్టిపూల్లోకి వస్తోంది. ఇక్కడి నుంచి పంప్‌హౌస్‌కు మధ్యలో ఉన్న గేట్లద్వారా మోటార్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పంప్‌హౌస్‌లోకి తరుచుగా నీరు లీకేజీ అవుతుంది. 2010లో కూడా మొదటి మోటార్ ట్రయల్న్ ్రనిర్వహించినప్పుడు బ్రెస్టువాల్ పగిలి పంప్‌హౌస్‌లోకి నీరు వచ్చి చేరింది. అయితే ఎప్పటినుంచో అప్రోచ్ కెనాల్‌వద్ద గేట్ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.